9, జూన్ 2012, శనివారం

రవీంద్రుని గీతాంజలి - 38

రవీంద్రుని గీతాంజలి

తెనుఁగు సేత

శ్రీమాన్ చిలుకమఱ్ఱి రామానుజాచార్యులు

38

THAT I want thee, only thee let my
heart repeat without end. All desires
that distract me, day and night, are
false and empty to the core.

As the night keeps hidden in its
gloom the petition for light, even thus
in the depth of my unconsciousness
rings the cry I want thee, only thee.

As the storm still seeks its end in
peace when it strikes against peace
with all its might, even thus my rebel-
lion strikes against thy love and still its
cry is I want thee, only thee.

చిలుకమఱ్ఱి రామానుజాచార్యులు అనువాదము....

“ఏను వాంఛింతు నిన్నె, వాంఛింతు నిన్నె,
యోప్రభూ! నిన్నె వాంఛించుచుందు” నంచు
విరతి లేకయె నాయెద మొరయుచుండు ||

దినము రాతిరి యనక నన్ ద్రిప్పుచున్న
యన్యవాసన లెల్ల మిథ్యామయములు,
సార మిసుమంత లేని నిప్ఫలము లవ్వి,
*యేను మాత్రము నిన్నె వాంఛింతు స్వామి! ||

వెలుఁగు కోసము సలిపెడి విన్నపమును
చీఁకటులలోనె రేయి దాచినవిధాన,
లోతయిన పెను మోహములోనఁ బడియు
బిట్టు నిన్ గూర్చియే మొరపెట్టుచుందు,
నిన్నె వాంఛింతు, వాంఛింతు నిన్నె స్వామి! ||

ఎల్ల దన శక్తి యురవడి నేచి వీచి
జగముఁ గలఁచు ప్రచండ ఝంఝామరుత్తు
శాంతియే తన చరమలక్ష్యముగ నెంచు,
నట్లె నాద్రోహవృత్తి నీదైన ప్రేమఁ
గొట్టు పరచుచు మరి మొర వెట్టుచుండు
“నిన్నె వాంఛింతు, వాంఛింతు నిన్నె” యంచు ||

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి