5, జూన్ 2012, మంగళవారం

విశేష వృత్తము - 23

శాలిని -

ఇది 11వ ఛందమైన ‘త్రిష్టుప్పు’లో 289వ వృత్తము. 

లక్షణము -
గణములు - మ త త గ గ
యతి - 7వ అక్షరము
ప్రాస నియమము కలదు.


ఉదా:
రామా రామా! రార రారా కుమారా!
రామా రామా! వేగ రారా సుపుత్రా!
రామా రామా! చూడరా రామభద్రా!
రామా రామా! రార రారా సుధీరా! 

గమనిక:  మందాక్రాంత వృత్తమును చూచేము కదా.  అందులోని 5వ అక్షరము నుండి 10వ అక్షరము వరకు గల అక్షరములను ప్రతి పాదమునుండి తీసివేయగా శాలిని వృత్తము మిగులును.  ఒక మారు మీరూ ప్రయత్నించండి.  స్వస్తి!

పండిత నేమాని రామజోగి సన్యాసి రావు   
               

3 కామెంట్‌లు:

  1. నావారంచున్ యోచనల్ లేక యున్నన్,
    సేవా దృష్టిన్ నేను జీవించుచున్నన్,
    భావమ్మందున్ మంచి భాసించుచున్నన్,
    దైవమ్మే తోడై సదా నిల్చు నాకై.

    రిప్లయితొలగించండి
  2. ధ్యేయంబీవే దేవ! ధీసాక్షి రూపా!
    జ్ఞేయంబీవే సర్వ జీవైక రక్షా!
    సాయంబీవే మాకు సాంబా! మహేశా!
    ఓ యజ్ఞేశా! దివ్య యోగప్రదాతా!

    రిప్లయితొలగించండి
  3. లక్ష్మీదేవి గారూ,
    చక్కని పద్యం వ్రాసారు. అభినందనలు.
    *
    పండిత నేమాని వారూ,
    పైన రామస్తుతి, క్రింద సాంబశివ స్తుతి అద్భుతంగా ఉన్నాయి. ధన్యవాదాలు.

    రిప్లయితొలగించండి