22, జూన్ 2012, శుక్రవారం

సమస్యాపూరణం - 743 (ఆలిని ద్యజియించెడి పతి)

కవిమిత్రులారా...

ఈరోజు పూరించవలససిన సమస్య ఇది...

ఆలినిఁ ద్యజియించెడి పతి హాయిగ నుండున్.

ఈ సమస్యను పంపిన కవిమిత్రునకు ధన్యవాదాలు.

16 కామెంట్‌లు:

 1. ఆలును బిడ్డల గూడుచు
  మేలుగ సంసార మింక మేదిని జేయన్
  చాలని, చాలని యా వెల
  యాలినిఁ ద్యజియించెడి పతి హాయిగ నుండున్.

  రిప్లయితొలగించండి
 2. మేలిమి బంగరు గుణముల
  శీలము గలిగిన పడతిని చేపట్టి సదా
  కాలుని దలపించెడు తన
  యాలినిఁ ద్యజియించెడి పతి హాయిగ నుండున్.

  రిప్లయితొలగించండి
 3. చాలించక పతిదూషణ
  మాలించక వృద్ధసేవ లతినిష్ఠురయై(చోరిణియై)
  మేలని జగడములాడెడి
  యాలిని త్యజియించెడి పతి హాయిగ నుండున్.

  రిప్లయితొలగించండి
 4. శ్రీపతిశాస్త్రిశుక్రవారం, జూన్ 22, 2012 8:24:00 AM

  శ్రీగురుభ్యోనమ:

  కాలికి వేలికి వేయుచు
  గోలలు చేయుచు సతతము కోపము తోడన్
  కాలుని తలిపెడు యా గ
  య్యాలినిఁ ద్యజియించెడి పతి హాయిగ నుండున్

  రిప్లయితొలగించండి
 5. లాలింపక తనయులను
  న్మూలింపక దుష్టవర్తనోద్ధతగతులన్,
  మేలించుక చేయని గ
  య్యాలిని ద్యజియించెడి పతి హాయిగనుండున్.

  గయ్యాళి = గయ్యాలి ( మాండలిక పదము )

  రిప్లయితొలగించండి
 6. గుండు మధుసూదన్ గారి పూరణ.....

  మేలగు బహువిధ క్రతువుల
  లీలం దగఁ జేయుచుఁ, దులలేని విధముగా
  నేలుచు, సత మరిషట్సం
  ఖ్యాలినిఁ ద్యజియించెడి పతి హాయిగ నుండున్.

  రిప్లయితొలగించండి
 7. వేలుగ నవ్వుల బాలగు
  నాలిని ద్యజియించె డి పతి, హాయిగ నుండున్
  నాలుం బిడ్డల తోడన
  మే లగు నాకాపురంబు మేదిని జూడన్ .

  రిప్లయితొలగించండి
 8. 1.మేలగు కాపుర మెట్టులొ
  లాలించుచు సతిని,బుత్రులన్ సహనముతో
  కాలము గడపిన;నెట్టుల
  యాలిని ద్యజియించెడు పతి హాయిగనుండున్?

  2.మేలెంత యెంచక పతితో
  వాలాయము ధూర్త వచన వాగ్ధోరణితో
  గోలగ కాలము గడిపెడి
  యాలిని ద్యజియించెడు పతి హాయిగనుండున్

  రిప్లయితొలగించండి
 9. ఆలిని జనవాదని చూ-
  లాలిని కనికరము మాని యటవికి మఱదీ
  లీలగ పంపెనె యౌలే
  ఆలినిఁ ద్యజియించెడి పతి హాయిగ నుండున్.

  రిప్లయితొలగించండి
 10. గుండా సహదేవుడు గారి పూరణ....

  గోలీ లాటలనుండే
  జాలీ తిరుగుడు,జులాయి, జారిణి సుఖముల్
  గ్రోలియు నేడట్టి విలా
  సాలిని ద్యజియించెడి పతి హాయిగ నుండున్.

  రిప్లయితొలగించండి
 11. మేలని పరిణయ మాడగ
  ఎలీలను పతిని చెనకు యేలిక సానిన్ !
  ఏలుకొని విసిగి పోవగ
  ఆలిని త్యజియించెడి పతి హాయిగ నుండున్ !

  ఏలిక సాని = రాజ్ఞి , దొరసాని , యజమాను రాలు .

  రిప్లయితొలగించండి
 12. గోలి హనుమచ్ఛాస్త్రి గారూ,
  లక్ష్మీదేవి గారూ,
  సత్యనారాయణ మూర్తి గారూ,
  శ్రీపతి శాస్త్రి గారూ,
  సంపత్ కుమార్ శాస్త్రి గారూ,
  గుండు మధుసూదన్ గారూ,
  సుబ్బారావు గారూ,
  కమనీయం గారూ,
  మిస్సన్న గారూ,
  గుండా సహదేవుడు గారూ,

  ఆలినిఁ బరిత్యజించెడి
  వారలకే హాయి యనుచు వైవిధ్యముగాఁ
  బూరణములఁ జేసిన మీ
  సారోదాత్తరచనలఁ బ్రశంసింతు నిఁకన్.

  తనువా రోగగ్రస్థము,
  మననమునకున్ శాంతి లేదు; మఱి మీరలు వ్రా
  సిన పద్యములకు విశ్లే
  షణముల వ్రాయంగనైతి; క్షమియింపు డిఁకన్.

  రిప్లయితొలగించండి
 13. తనువుకు రోగము సాజము
  మనమున కునశాంతి కూడ మనిషికి సాజం-
  బనెదరు పెద్దలు భగవం-
  తుని వేడిన శుభమనండ్రు స్తుతిమతి వినరే?

  రిప్లయితొలగించండి
 14. "నాలుగు ముఖమ్ములాటను
  వీలుగ విడిచెదను నేడు వినుమా! కోపము
  చాలిక" నని బ్రతిమాలుచు
  నాలినిఁ; ద్యజియించెడి పతి హాయిగ నుండున్

  రిప్లయితొలగించండి
 15. చాలించుము టైపాటులు:
  "ఆలినిఁ ద్యజియించెడి పతి హాయిగ నుండున్";...
  బోలెడు సంతోషముతో
  "ఆలునుఁ ద్యజియించెడి పతి హాయిగ నుండున్"

  రిప్లయితొలగించండి