4, జూన్ 2012, సోమవారం

రవీంద్రుని గీతాంజలి - 33

రవీంద్రుని గీతాంజలి

తెనుఁగు సేత

శ్రీమాన్ చిలుకమఱ్ఱి రామానుజాచార్యులు

33

WHEN it was day they came into my
house and said, "We shall only take
the smallest room here."

They said, " We shall help you in the
worship of your God and humbly accept
only our own share of his grace " ; and
then they took their seat in a corner
and they sat quiet and meek.

But in the darkness of night I find
they break into my sacred shrine, strong
and turbulent, and snatch with unholy
greed the offerings from God's altar. 


చిలుకమఱ్ఱి రామానుజాచార్యుల అనువాదము....

వారు పగటనె మాయిల్లు చేరి వేడి
“రొక్కచోట రవంత మే ముందు” మంచు ||

అనిరి మఱియిట్లు “మీ దేవతార్చనమునఁ
దోడుపడి, పూజ ముగిసినతోన యేదొ
యిడు ప్రసాదంబుతో తృప్తిపడెద” మంచు ||

*పేలికల్ గట్టు మలిన వేషాలతోడి
యలకటిక పేద లీరీతి నణఁగి మణఁగి
యొదిగి యుండిరి మాయింట నొక్కమూల ||

కాని యారేయి చీఁకటిలోన వారు
ప్రబలి, పొగ రెక్కి, లేచి, పావనము నాదు
దేవళము సొచ్చి, పూజగద్దెపయి నున్న
స్వామి నైవేద్యముం దురాశాపరులయి
దొంగిలించిరి మురికి చేతులనె బల్మి ||

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి