శివుని నమ్మి కొలిచి శివభక్తులై శివ క్షేత్రదర్శనమ్ముఁ జేయునట్టి వార లెల్లరకు సుభద్రముగ జలధి బాణు రాజ్య మొసగు పరమ సుఖము.
(పర్యాయపద నిఘంటువు శివుణ్ణి ‘జలధి/అర్ణవ బాణుడు’ అని పేర్కొన్నది. శివుడు సముద్రాన్ని బాణంగా ప్రయోగించిన ప్రస్తావన ‘పూర్వగాథాలహరి’లో కూడా లేదు. తెలిసినవా రెవరైనా సందేహ నివృత్తి చేయవలసిందిగా మనవి)
యువతి మనసు దోచు యువకుల చూపులు
రిప్లయితొలగించండితనదు శరములంచు దనరుఁజూపు
నా వసంతు సఖు డనంగుడయిన పంచ
బాణురాజ్యమొసగు పరమసుఖము.
రామరాజ్య మవని ప్రస్తుతి గాంచెను
రిప్లయితొలగించండిధర్మమూర్తి జనుల కన్నతండ్రి
యట్లు నేలెనంచు నా మహీశు నమోఘ
బాణు రాజ్యమొసగు పరమ సుఖము
అమ్మా! శ్రీమతి లక్ష్మీ దేవి గారూ!
రిప్లయితొలగించండిమన్మథుడైపై వాత్సల్యమును బాగుగనే చూపించేరు. బాగున్నది మీ పూరణ. తొలి పలుకు మీదే. అభినందనలు. స్వస్తి.
ధన్యురాలను.
రిప్లయితొలగించండిమీ పూరణ రెండవపాదంలో స్వరయతి వేశారనుకుంటున్నాను.
అమ్మా! లక్ష్మీ దేవి గారూ! తప్పును చూపించేరు. సంతోషము. నేనే తొందరలో గమనించలేదు. సవరించిన పద్యము మళ్ళీ వ్రాస్తున్నాను.
రిప్లయితొలగించండిరామరాజ్య మవని ప్రస్తుతి గాంచెను
ధర్మమూర్తి కన్నతండ్రి వోలె
నేలె జనుల ననుచు నిలనా విభు నమోఘ
బాణు రాజ్య మొసగు పరమ సుఖము
శ్రీగురుభ్యోనమ:
రిప్లయితొలగించండిఅసురుడైన నేమి యద్భుతరీతిగా
శివునికొలచి తాను శిస్టుడగుచు
ధర్మపథము విడని ధార్మికుడైనచోన్
బాణు రాజ్యమొసగు పరమ సుఖము
(బాణాసురుడు మంచివాడై రాజ్యపాలనచేస్తే బాణుని రాజ్యములోనైనా సుఖముగానే ఉండవచ్చుననే ఊహతో)
కవన కళల నెల్ల కన్నతల్లి మనది
రిప్లయితొలగించండిపసిడివోలె మెఱుగు భారతమ్ము
ఘనత గల్గినట్టి కాదంబరికి కర్త
బాణురాజ్యమొసగు పరమసుఖము.
కావ్యపఠనము పరమ సుఖమని నా ఉద్దేశ్యము.
పడతి ప్రాణ మాన భంగముల్ మొదలుగా
రిప్లయితొలగించండిబాణు రాజ్య మొసగు , పరమ సుఖము
రామ రాజ్య మొస గె రాజ్యమం దరికి ని
హారతు లివె రామ ! యందు కొనుము .
గుండు మధుసూదన్ గారి పూరణ.....
రిప్లయితొలగించండిదశరథాత్మజుండు దశకంఠలుంఠనుఁ
డినకుల తిలకుండు ఘనవ్రతుఁ డగు
నేకవాక్యుఁ డెలమి నేకైకసతుఁ డేక
బాణు రాజ్య మొసఁగు పరమసుఖము.
శోణపురమునందు శోభిల్లె నెవ్వాని
రిప్లయితొలగించండిరాజ్య?మింక, దాని రక్షసేయు
శివుని భక్తితోడ సేవింప నేమిచ్చు?
బాణురాజ్య మొసగు పరమసుఖము
(బాణురాజ్యము, ఒసగు పరమసుఖము)
ఆర్యా!
రిప్లయితొలగించండినమస్కారములు.
రెండు రోజులు నెట్ అందుబాటులో లేని కారణంగా పూరణలు చేయలేక పోయాను.
నిన్న, మొన్నటి సమస్యలకు నా పూరణలు.
ఆలలనామణి యాలం
బేలా, పసివాని కిప్పు డింపుగను గుణిం
తాలన్ దిద్దించగ బల
పాలిమ్మని సుతుని భర్త పాలికి బంపెన్.
ఎల్లవేళలందు నింద్రాది దిక్పాలు
రిలకు శుభము(సుఖము) గూర్తు రింపుగాను,
నమ్మి గొల్తుమేని నైరృతి కధిపతి
రక్షణమ్ము నొసగు రాక్షసుండు.
దనుజ బాదలేక ద్వారక నిర్మించి
రిప్లయితొలగించండిపదవి పీఠమన్నపాలికిచ్చి
యాదవాన్వయంబు మోదమై త్రిపురారి
బాణురాజ్య మొసగు పరమసుఖము
దుష్టులకు దూరంగా తనవారిని స్థాపించి, పదవీవ్యామోహవర్జితమైన ప్రవర్తన ఎలా ఉండాలో చూపి, బలరాముని రాజుజేసి, యాదవులకు సదా మోదమొసగు, శివునికి సహాయంగా బాణమైన సాక్షాత్ నారాయణడు శ్రీకృష్ణని రాజ్యమే పరమసుఖదాయకుముగదా !
దనుజ బాధ..బాద కాదు. టైపుప్రామాదానికి క్షమింతురు.
రిప్లయితొలగించండిమగువ మనసు దోచి మాయలే కల్పించి
రిప్లయితొలగించండిరాస క్రీడ లందు రాధ గాంచి
గోకులమ్ము నందు గోపకాంత లపుష్ప
బాణు రాజ్య మొసగు పరమ సుఖము !
యౌవనమ్మునందు నత్యనురాగాన
రిప్లయితొలగించండిబద్ధు డైనవాడు,వలపు మీర
ప్రియను గూడి యున్న వేళలో నాపుష్ప
బాణురాజ్య మొసగు పరమ సుఖము.
బాణు డనగ నతడు బాణ భట్టాచార్యు
రిప్లయితొలగించండికాదంబరిని వ్రాసె కాత్యాయనీ పెండ్లి
చండి శతము నొసగి చరితార్దు డైనట్టి
బాణు రాజ్య మొసగు పరమ సుఖము
అన్యదేశపొదిననణ్వాస్త్రమొదిగిన
రిప్లయితొలగించండిపొరుగువానిమదినిఁబుట్టుభయము
తెప్పఱిల్లిపొందఁ ధీటైనతద్దణు
బాణు,రాజ్యమొసగుపరమసుఖము
శ్రీ సరస్వత్యై నమః:
రిప్లయితొలగించండిమిత్రులారా! శుభాభినందనలు.
ఈనాటి సమస్య బాగున్నది - పూరణలు ముచ్చటగా నున్నవి.
1. శ్రీమతి లక్ష్మీ దేవి గారు 2 విధాలుగా పూరించేరు. (1) పంచబాణుడు (2) భట్టభాణుడు. మంచి భావములు - ఉత్తమముగా నున్నవి.
2. శ్రీ శ్రీపతి శాస్త్రి గారు: ధార్మికుడైతే బాణుడు వాని రాజ్యము బాగుంటుంది అని చక్కగా తన ఉద్దేశమును వెలిబుచ్చేరు. ఉత్తమముగా నున్నది.
3. శ్రీ సుబ్బారావు గారు: ఆసురీ రాజ్యమును రామ రాజ్యమును వర్ణించేరు - భావము బాగున్నది.
4. శ్రీ గుండు మధుసూదన రావు గారు: ఒకే మాట, ఒకే భార్య,ఒకే బాణమున్న రాముని రాజ్యమును వర్ణించేరు. ప్రశంసనీయముగా నున్నది.
5. శ్రీ హ.వే.స.నా.మూర్తి గారు: క్రమాలంకారమును ఎన్నుకొనినారు. చాల బాగున్నది.
6. శ్రీ చంద్రమౌళి గారు: త్రిపురారి బాణమైన శ్రీ కృష్ణుని రాజ్యమును వర్ణించేరు. ప్రశంసనీయము.
7. శ్రీమతి రాజేశ్వరి గారు: (1) పుష్పబాణుడు - బృందావనములో రాసక్రీడలు వర్ణించేరు. ఉత్తమముగా నున్నది.
(2) భట్టబాణుని కావ్యములను వర్ణించేరు. 2వ పాదములో గణ భంగము. ఈ విధముగా మార్చుకొనవచ్చును:
"రచనలెన్నొ చేసె రసమయముగ"
8. డా. కమనీయము గారి పూరణ ప్రశంసనీయము - పుష్పబాణుని రాజ్యమును వర్ణించేరు.
9. శ్రీ సహదేవుడు గారు: అణు బాణములను వర్ణించేరు. అన్యదేశ పొది అనే సమాసము సాధువు కాదు. భావము వినూత్నముగా నున్నది.
స్వస్తి.
గురువుగారూ ధన్యవాదములు.
రిప్లయితొలగించండినా పూరణ....
రిప్లయితొలగించండిశివుని నమ్మి కొలిచి శివభక్తులై శివ
క్షేత్రదర్శనమ్ముఁ జేయునట్టి
వార లెల్లరకు సుభద్రముగ జలధి
బాణు రాజ్య మొసగు పరమ సుఖము.
(పర్యాయపద నిఘంటువు శివుణ్ణి ‘జలధి/అర్ణవ బాణుడు’ అని పేర్కొన్నది. శివుడు సముద్రాన్ని బాణంగా ప్రయోగించిన ప్రస్తావన ‘పూర్వగాథాలహరి’లో కూడా లేదు. తెలిసినవా రెవరైనా సందేహ నివృత్తి చేయవలసిందిగా మనవి)
శ్రిగురుభ్యోనమః ,ఆర్యా, తమరి సూచన మేరకు సవరణ:
రిప్లయితొలగించండిఅమరిన పొదినందు నన్వాస్త్రమొకటైన
పొరుగువానిమదినిఁబుట్టుభయము
తెప్పఱిల్లిపొందఁ ధీటైనతద్దణు
బాణు,రాజ్యమొసగుపరమసుఖము