కవిమిత్రులారా...
ఈరోజు పూరించవలససిన సమస్య ఇది...
యముఁ గని ముచ్చటంబడి మహాకవి మెచ్చెను గూర్చె సత్కృతిన్.
ఈ సమస్యను పంపిన కవిమిత్రునకు ధన్యవాదాలు.
రమయమునై సువర్ణ సమలంకృతమై శుభ లక్షణాఢ్యమై
కమలదళాక్షు లీలలను కమ్రగతిన్ వివరించు పద్యకా
వ్యము గని ముచ్చటంబడి మహాకవి మెచ్చెను గూర్చె సత్కృతిన్.
౨. హరి వేంకట సత్యనారాయణ మూర్తి
ఈరోజు పూరించవలససిన సమస్య ఇది...
యముఁ గని ముచ్చటంబడి మహాకవి మెచ్చెను గూర్చె సత్కృతిన్.
ఈ సమస్యను పంపిన కవిమిత్రునకు ధన్యవాదాలు.
పూరణలు....
౧. పండిత నేమాని
సుమధుర భక్తి భావ రస శోభితమై పరమార్థ తత్వసారమయమునై సువర్ణ సమలంకృతమై శుభ లక్షణాఢ్యమై
కమలదళాక్షు లీలలను కమ్రగతిన్ వివరించు పద్యకా
వ్యము గని ముచ్చటంబడి మహాకవి మెచ్చెను గూర్చె సత్కృతిన్.
౨. హరి వేంకట సత్యనారాయణ మూర్తి
సమరమునందు తానచట శస్త్రముఁ బట్టనటంచుఁ దెల్పి న్యా
యమునిక ధర్మమున్ నిలుప నర్జునసారథియౌచు నెల్లెడన్
భ్రమలను ద్రుంచి కృష్ణుడు శుభంబులు గూర్చగ గోరి చేయు సా
యముఁ గని ముచ్చటంబడి మహాకవి మెచ్చెను గూర్చె సత్కృతిన్.
౩. గుండు మధుసూదన్
మమత విరాజిలంగ నసమాన విశేష పునీతమైన ధ్యే
యముఁగని ముచ్చటం బడి మహాకవి మెచ్చెను; శారికా నికా
యముఁగని ముచ్చటం బడి మహాకవి మెచ్చెను; జాహ్నవీయ తో
యముఁగని ముచ్చటం బడి మహాకవి మెచ్చెను గూర్చె సత్కృతిన్.
౪. ‘మన తెలుగు’ చంద్రశేఖర్
క్షమి యయి తిక్కనార్యు డిరు కైతల మిత్రుడు ధర్మరూప సా
రమతి విరాటపర్వమున రమ్య విశేష పదార్థ భావనా
దమిత పుమాంస సంవరణ ధారి బృహన్నలఁ పాండుసూన మ
ధ్యముఁ గని ముచ్చటంబడి మహాకవి మెచ్చెను గూర్చె సత్కృతిన్
౬. లక్ష్మీదేవి
అమల గుణాళిచే జగతి నంతట కీర్తినిఁ, బొంది నిల్చుచున్,
సమరస శోభలన్ కలిగి సద్గతి నిచ్చెడు కావ్యసృష్టిలో
నుమ తనయుండు విఘ్నపతి యొద్దిక తోడను జేయు వ్రాత సా

౭. సంపత్ కుమార్ శాస్త్రి
లోకకల్యాణమైన సీతారాముల వివాహముతో, దశరథులకు, జనక మహారాజుకు కలిగినటువంటి వియ్యము గాంచి ఒక మహాకవి సత్కృతి చేసినాడని.........
సుమధుర సుప్రసన్నుడగు సుందరమూర్తి రఘూత్తముండు శ్రీ
కమలదళేక్షణనన్ ముదితఁ గన్నియ సీతను పెండ్లియాడగా
నమరిన సర్వలక్షణ సమంచితమై వెలుగొందుచున్న వి
య్యముగని ముచ్చటంబడి మహాకవి మెచ్చెను గూర్చె సత్కృతిన్.
౮. రవి
శ్రమపడి వచ్చెనంచుఁ గడు సమ్మతి తోడ ప్రశస్తభోజ్యశా
కములును నావఠేవ, పెరుగన్నము, సూపము లుంచఁ బ్రీతిగా -
తమకము మీరగా మెసవి తన్మయ మందుచు త్రేన్చి, తృప్తితోన్
గమగమ వాసనల్ చెలగు కమ్మని వంటను, గేస్తు యాతిథే

౯. డా. విష్ణు నందన్
యమ నియమానువర్తులయి , ధ్యాన తపః పరికల్పిత ప్రభా
వమున జరించు తాపసులు పావన సత్య మహద్వచో విలా
సములు స్ఫురింప నొక్కెడ ప్రసన్న మనస్స్థితి జేయు వాజపే
యముఁ గని ముచ్చటంబడి మహాకవి మెచ్చెను గూర్చె సత్కృతిన్ !
౧౦. రాజేశ్వరి నేదునూరి
తమిగొని సుందరంబగు సుతారపు చంద్రిక నీలి నీడలన్
యమునను గాంచి నంత హృదయమ్మున పొంగెడు కావ్య కంజముల్
కమల భవుండు మమ్ము గని కన్నుల విందొనరించు రామణీ
యముఁగని ముచ్చటం బడి మహాకవి మెచ్చెను గూర్చె సత్కృతిన్ !
౧౧. సహదేవుడు
(అభిజ్ఞాన శాకుంతలం భూమికగా)
సుమశరు తూపు కౌశికుని, సుందరి మేనకఁ గూడఁ జేయఁగన్
సుమసుకుమార పుత్రిఁగని చూడక గానల వీడ, కణ్వు నా
శ్రమపు శకుంతలాఖ్య యయె,రాజొకఁ డామెను జూచు, నాటకీ
యము గని ముచ్చటంబడి మహాకవి మెచ్చెను గూర్చె సత్కృతిన్ !
౧౨ శ్రీపతిశాస్త్రి
విమలయశోభిభూషణుడు విప్రకుమారుడు తల్లిదండ్రుల
న్నమలిన భక్తిభావమున యాత్రలు త్రిప్పుచు పుణ్యతీర్థముల్
క్రమముగ జూపుచుండెనట కావడి మ్రోసెడు లేత ప్రా

కొమరుగ గద్యపద్యముల గోమలశైలి రచించి చూపగన్
సమమగురీతి దానిని విశాలహృదిన్ సువిమర్శ జేసి కా
వ్యముగని ముచ్చటంబడి మహాకవి మెచ్చెను గూర్చె ,సత్కృతిన్ .

౧౩. కమనీయం
అమలమనస్కుడైన సఖు డత్యనురక్తి కళావిశేషతన్ కొమరుగ గద్యపద్యముల గోమలశైలి రచించి చూపగన్
సమమగురీతి దానిని విశాలహృదిన్ సువిమర్శ జేసి కా
వ్యముగని ముచ్చటంబడి మహాకవి మెచ్చెను గూర్చె ,సత్కృతిన్ .
అయ్యా! శ్రీ మూర్తి గారూ! శుభాశీస్సులు.
రిప్లయితొలగించండిమీ పద్యము చాలా బాగుగనున్నది. చిన్న సవరణ చేస్తే బాగుంటుంది అనిపించుచున్నది. "శస్త్రమును చక్కగ బట్టను" అనే పదములలో "చక్కగ" అనే విశేషణము వలన అన్వయము దెబ్బ తినుచున్నది. అది యతికొరకు మీరు వేసిన ఒక వ్యర్థ పదము. శస్త్రము బట్టను అని వేసి ముందుగా వేరే ఏదేని సముచితమైన పదమును వేస్తే బాగుంటుంది అని నా అభిప్రాయము. స్వస్తి.
అమలుఁడు తిక్కనార్యు డిరు కైతల మిత్రుడు ధర్మరూప సా
రిప్లయితొలగించండిరమతి విరాటపర్వమున రమ్య విశేష పదార్థ భావనా
దమిత పురూష సంవరణ ధారి బృహన్నలఁ పాండుసూన మ
ధ్యముఁ గని ముచ్చటంబడి మహాకవి మెచ్చెను గూర్చె సత్కృతిన్
చంద్రశేఖర్ గారూ,
రిప్లయితొలగించండిమీ పద్యంలో ‘పురూష’ శబ్దప్రయోగం సందేహాస్పదంగా ఉంది. అలాగే ‘భావనా దమిత’ ...?
దమితపురుష సంవరణధారి=అణచబడిన పురుషుని మారువేషరూపి (పేడివాడు, అయితే మగలక్షణాలు కలిగిన నపుంసకుడు) అనే అర్థంలో ప్రయోగించాను. గణభంగం గాకుండా పురూష అని మార్చాను. నాకుకూడా అక్కడ సందేహం కలిగింది. ఇక నిద్రబోయే సమయం అవటంతో పోస్టు చేశేశాను. సవరించే ప్రయత్నం చేస్తాను. సలహాలివ్వగలరు.
రిప్లయితొలగించండిఅయ్యా చంద్రశేఖర్ గారూ! శుభాశీస్సులు. మీ పద్యము చాల బాగుగనున్నది. చిన్న సవరణ యతికొరకు అవసరము ఉన్నది. మొదటి పాదములో "అ" కు "కై" కు యతి మైత్రిలేదు. సవరించండి. స్వస్తి.
రిప్లయితొలగించండిఆర్యా!
రిప్లయితొలగించండిగురుతుల్యులు శ్రీ నేమాని వారు చేసిన సూచనకు సర్వథా కృతజ్ఞుడను.
వారి మార్గదర్శన ప్రకారము నాపూరణలో మొదటి పాదమును క్రింది విధముగా మార్చుచున్నాను.
సమరమునందు తానచట శస్త్రముఁ బట్టనటంచుఁ దెల్పి న్యా
యమునిక ధర్మమున్ నిలుప నర్జునసారథియౌచు నెల్లెడన్
భ్రమలను ద్రుంచి కృష్ణుడు శుభంబులు గూర్చగ గోరి చేయు సా
యముఁ గని ముచ్చటంబడి మహాకవి మెచ్చెను గూర్చె సత్కృతిన్.
ధన్యవాదములు.
అమలిన ఖ్యాతినిన్, జగతి యంతట కీర్తినిఁ, బొంది నిల్చుచున్,
రిప్లయితొలగించండిసమరస శోభలన్ కలిగి సద్గతి నిచ్చెడు కావ్యసృష్టిలో
యుమ కొమరుండు విఘ్నపతి యొద్దిక తోడను జేయు వ్రాత సా
యముఁ గని ముచ్చటంబడి మహాకవి మెచ్చెను గూర్చె సత్కృతిన్.
ఈ కామెంట్‌ను రచయిత తీసివేశారు.
రిప్లయితొలగించండిలోకకల్యాణమైన సీతారాముల వివాహముతో, దశరథులకు, జనక మహారాజుకు కలిగినటువంటి వియ్యము గాంచి ఒక మహాకవి సత్కృతి చేసినాడని.........
రిప్లయితొలగించండిసుమధుర సుప్రసన్నుడగు సుందరమూర్తి రఘూత్తముండు యా
కమలదళేక్షణాడ్య యగు కన్నియ సీతను పెండ్లియాడగా
యమరిన సర్వలక్షణ సమాధికమై వెలుగొందుచున్న వి
య్యముగని ముచ్చటంబడి మహాకవి మెచ్చెను గూర్చె సత్కృతిన్.
ఈ కామెంట్‌ను రచయిత తీసివేశారు.
రిప్లయితొలగించండిచంద్రశేఖర్ గారూ,
రిప్లయితొలగించండినేమాని వారి సూచన మేరకు మొదటి పాదంలో యతిని సవరించాను. అలాగే ‘పురూష’ శబ్దానికి పదులు ‘పుమాంస’ శబ్దాన్ని వేసాను.
యమ నియమానువర్తులయి , ధ్యాన తపః పరికల్పిత ప్రభా
రిప్లయితొలగించండివమున జరించు తాపసులు పావన సత్య మహద్వచో విలా
సములు స్ఫురింప నొక్కెడ ప్రసన్న మనస్స్థితి జేయు వాజపే
యముఁ గని ముచ్చటంబడి మహాకవి మెచ్చెను గూర్చె సత్కృతిన్ !!!
శ్రమపడి వచ్చెనంచుఁ గడు సమ్మతి తోడ ప్రశస్తభోజ్యముల్,
రిప్లయితొలగించండిఅమరగ నావఠేవ, పెరుగన్నము, సూపము ల్వెట్ట ప్రీతిగా -
తమకము మీరగా మెసవి తన్మయ మందుచు త్రేన్చి, తృప్తితోన్
గమగమ వాసనల్ యెసగు కమ్మని వంటను, గేస్తు యాతిథే
యముఁ గని ముచ్చటంబడి మహాకవి మెచ్చెను గూర్చె సత్కృతిన్.
శ్రీ సంపత్కుమార శాస్త్రి గారి పద్యములో ఈ క్రింది సవరణలను సూచించుచున్నాను:
రిప్లయితొలగించండి(1) 1వ పాదము చివరలో "యా" (యడాగమము ఇచ్చట రాదు) కాబట్టి "శ్రీ" అని మార్చండి.
(2) 3వ పాదములో"యమరిన" (ఇక్కడా యడాగమము రాదు) నుగాగమము చేసి "నమరిన" అనాలి.
(3) 3వ పాదములో "సమాధిక"కి బదులుగా "సమంచిత" అని మార్చితే బాగుంటుండి.
స్వస్తి.
రవి గారూ,
రిప్లయితొలగించండిపద్యంలో వాక్యారంభంలో అచ్చు రావచ్చు. ‘భోజ్యముల్ అమరగ’ అని విసంధిగా వ్రాయరాదు కదా! ‘సూపము ల్వెట్ట’ అన్నప్పుడు గణదోషం. సవరించాను.
శ్రీ రవి గారి పద్యములో ఈ క్రింది సవరణలు చేయాలి:
రిప్లయితొలగించండి(1) 2వ పాదములో: సూపముల్ వెట్టగా అనేచోట గణభంగము. కాబట్టి సూపములుంచగా అనండి.
(2) 4వ పాదములో వాసనల్ యెసగ అనేచోట యడాగమము రాదు. వాసనల్ చెలగ అనండి.
స్వస్తి.
శ్రీమతి లక్ష్మీదేవి గారి పద్యములో ఈ క్రింది సవరణలు చేయాలి:
రిప్లయితొలగించండి(1) 1వ పాదములో జగతి యంతటకి బదులుగా జగతినంతట అని నుగాగమము చేయాలి.
(2) 3వ పాదములో: యుమ కొమరుండుకి బదులుగా నుమ తనయుండు అంటే బాగుంటుంది.
స్వస్తి.
గురుతుల్యులు శ్రీ నేమాని గారికి,
రిప్లయితొలగించండిశిరసాభివందనములు. మంచి సవరణలను సూచించినందుకు శతథా ధన్యవాదములు. ఈ తప్పులు ( యడాగమ, నుగాగమ ) పునరావృతము కాకుండా జాగ్రత్త వహిస్తాను గురువుగారు.
మాస్టారూ, మొదటి పాదంలో అ కి యతి మైత్రి సవరణ యెలా చేశారో చెప్పలేదు. "పుమాంస" కు ధన్యవాదాలు.
రిప్లయితొలగించండిఅయ్యా! శ్రీ చంద్రశేఖర్ గారూ! శుభాశీస్సులు.
రిప్లయితొలగించండిమీ పద్యము మొదటి పాదములో "క్షమియయి" అని మొదలు పెట్టేరు (సవరణలో) అందుచేత కైత కు యతి సరిపోతున్నది. క్షమ కలవాడు క్షమి. స్వస్తి.
నేమాని పండితులకు, శ్రీ శంకరయ్య గారికి ప్రణామాలు.
రిప్లయితొలగించండిఈ కామెంట్‌ను రచయిత తీసివేశారు.
రిప్లయితొలగించండితమిగొని సుందరంబగు సుతారపు చంద్రిక నీలి నీడలన్
రిప్లయితొలగించండియమునను గాంచి నంత హృదయమ్మున పొంగెడు కావ్య కంజముల్
కమల భవుండు మమ్ము గని కన్నుల విందొనరించు రామణీ
యముఁగని ముచ్చటం బడి మహకవి మెచ్చెను గూర్చె సత్కృతిన్ !
కంజము = పద్మము .
క్షమించాలి
రిప్లయితొలగించండిచివరి పాదంలో " మహాకవి " కి బదులుగా పొరబడి " మహకవి " అని పడింది .
అభిజ్ఞాన శాకుంతలం భూమికగా:
రిప్లయితొలగించండిసుమశరు తూపు కౌశికుని, సుందరి మేనక గూడ జేయగన్
సుమసుకుమార పుత్రిగని చూడక గానల వీడ, కణ్వు నా
శ్రమపు శకుంతలై పెరుగు,రాజొక డామెను జూచు, నాటకీ
యము గని ముచ్చటంబడి మహాకవి మెచ్చెను గూర్చె సత్కృతిన్ !
సహదేవుడు గారూ,
రిప్లయితొలగించండిచక్కని ఊహ... కాని ‘శకుంతల + ఐ’ అన్నప్పుడు సంధి లేదు. యడాగమం వస్తుంది. ‘శకుంతలాఖ్య యయె..’ అందామా?
అక్కయ్యా,
రిప్లయితొలగించండిసవరించాను.
శ్రిగురుభ్యోనమః
రిప్లయితొలగించండిగురువుగారికి ధన్యవాదములు. తమరి సవరణ ఉత్తమంగా ఉన్నది.
సుమశరు తూపు కౌశికుని, సుందరి మేనకఁ గూడఁ జేయఁగన్
సుమసుకుమార పుత్రిఁగని చూడక గానల వీడ, కణ్వు నా
శ్రమపు శకుంతలాఖ్య యయె,రాజొకఁ డామెను జూచు, నాటకీ
యము గని ముచ్చటంబడి మహాకవి మెచ్చెను గూర్చె సత్కృతిన్ !
శ్రీగురుభ్యోనమ:
రిప్లయితొలగించండివిమలయశోబిభూషణుడు విప్రకుమారుడు తల్లిదండ్రులన్
అమలిన భక్తిభావమున యాత్రలు త్రిప్పుచు పుణ్యతీర్థముల్
క్రమముగ జూపుచుండెనట కావడి మ్రోసెడు లేత ప్రా
యముఁ గని ముచ్చటంబడి మహాకవి మెచ్చెను గూర్చె సత్కృతిన్.
అమలమనస్కుడైన సఖు డత్యనురక్తి కళావిశేషతన్
రిప్లయితొలగించండికొమరుగ గద్యపద్యముల గోమలశైలి రచించి చూపగన్
సమమగురీతి దానిని విశాలహృదిన్ సువిమర్శ జేసి కా
వ్యముగని ముచ్చటంబడి మహాకవి మెచ్చెను గూర్చె ,సత్కృతిన్ .
శ్రీపతి శాస్త్రి గారూ,
రిప్లయితొలగించండిశ్రవణకుమారుని ప్రస్తావనతో మీ పూరణ బాగుంది. అభినందనలు.
మూడవ పాదం చివర గణదోషం. సవరించాను.
*
కమనీయం గారూ,
మీ పూరణ ప్రశస్తంగా ఉంది. అభినందనలు.
టూరిస్టు మహాకవి:
రిప్లయితొలగించండికొమరుని, పెండ్లమున్, గొనుచు కోఠికి పోవగ నింటిదారినిన్
సమరము జేసి బస్సునను సంకట మొందుచు దూరి వచ్చుచున్
చెమటలు దీర్చు గాలుల హుసేనుని సాగరమందునున్న తో
యముఁ గని ముచ్చటంబడి మహాకవి మెచ్చెను గూర్చె సత్కృతిన్ 😊