కవిమిత్రులారా,
పై చిత్రాన్ని పరిశీలించి తగిన పద్యా(లను)న్ని వ్రాయండి.
కవిమిత్రుల పూరణలు
౧. పండిత నేమాని రామజోగి సన్యాసి రావు
మోసపోయెను ద్యూతమున మున్ను ధర్మమే
దౌర్భాగ్యము వరించె ధర్మమతుల
నంత దుష్టాత్ముల కవధులు లేనట్టి
యధికార మవకాశ మటుల నబ్బె
రారాజునకు ప్రతీకా రాంధకారమే
యంతరంగమ్మున నావహించె
దుశ్శాసనుండంత ద్రోవది కేశముల్
బట్టుచు సభలో వివస్త్రజేయు
దౌర్భాగ్యము వరించె ధర్మమతుల
నంత దుష్టాత్ముల కవధులు లేనట్టి
యధికార మవకాశ మటుల నబ్బె
రారాజునకు ప్రతీకా రాంధకారమే
యంతరంగమ్మున నావహించె
దుశ్శాసనుండంత ద్రోవది కేశముల్
బట్టుచు సభలో వివస్త్రజేయు
యత్నమున వలువ నూడ్చెడు నట్టివేళ
కృష్ణ “కృష్ణా!” యటంచు ప్రార్థించినంత
నక్షయమ్ముగ చీరె లయ్యబలకిచ్చి
మానసరంక్షణ మొనర్చె మాధవుండు.
కృష్ణ “కృష్ణా!” యటంచు ప్రార్థించినంత
నక్షయమ్ముగ చీరె లయ్యబలకిచ్చి
మానసరంక్షణ మొనర్చె మాధవుండు.
(కృష్ణ = ద్రౌపది, కృష్ణా యటంచు ప్రార్థన మొనరించెను అని అన్వయము)
౨. సుబ్బారావు
నిండు సభలోన ద్రౌపది నేకవస్త్ర
యనియు జూడక యొక దుష్టు డామె బట్టి
వలువ లూడ్వంగ కృష్ణుడు వలువ లిచ్చి
మానరక్షణ గావించె మానవతికి.
నిండు సభలోన ద్రౌపది నేకవస్త్ర
యనియు జూడక యొక దుష్టు డామె బట్టి
వలువ లూడ్వంగ కృష్ణుడు వలువ లిచ్చి
మానరక్షణ గావించె మానవతికి.
౩. గుండు మధుసూదన్
జూదములోన నోడె యమసూనుఁడు; పందెము గెల్చి తమ్మునిన్
మోదముతోడ ద్రోవదిని మూర్ఖసుయోధనుఁ డీడ్చి తెమ్మనన్;
బైదలి నీడ్చి తెచ్చి, సభవాకిట నిల్పియు వస్త్ర మూడ్చె, దా
మోదరుఁ డంత వస్త్రముల మోదముతో నిడి కాచె ద్రౌపదిన్!
౪. హరి వేంకట సత్యనారాయణ మూర్తి
వరమున జన్మనందినది, పాండవవీరుల ధర్మపత్నియై
నిరత పతివ్రతాచరణనిష్ఠనుఁ బూనుచు సద్గుణాఢ్యయై
వరలిన యాజ్ఞసేనిని సభాసదులందరుఁ జూచుచుండగా
కరుణ యొకింత చూపక కుకర్ముడు, దుర్మదుడౌచు నప్పుడున్.
దుస్ససేనుండు సభకీడ్చి దుష్టుడగుచు
వస్త్రహీననుఁ జేయ ద్రోవదినిఁ బట్టి
యత్నమొనరింప నబలయై యార్తితోడ
“దేవ! లోకైకరక్షక! కావు” మనుచు
మొర పెట్టగ వెనువెంటనె
కరుణాత్ముండైన శౌరి క్రమముగ చీరల్
తరగని రీతిగ నొసగుచు
మురహరు డా కృష్ణ మానమును కాపాడెన్.
* * * * *
౫. రవి
రాలె - సితయశము రారాజమకుటశో
భాయమానోజ్జ్వలితాప్తవరము,
తునిగె నల విపులఘనభుజావేష్టిత
శూరత - మార్తాండసుతుని గుణము,
ఈగె నిశ్శేషము రాగకల్మాషయు
తాక్షదృష్టి శకునిపక్షశక్తి,
పతనమడిగె నిజభ్రాతప్రబలపరి
ష్వంగిత్యురుతరదుశ్శాసనురము,
కౌరవాదులకుఁ దొడరె కాలవశము,
దమనమాయెనట ధరణి ధర్మ మెల్ల,
నిదురవోయె కొలువునందు నీతి నియతి,
కలియుగమ్మునకును నాంది కలిగె సుమ్ము.
(గుణము = character, అల్లెత్రాడు; అక్షము = కన్ను, పాచిక; శకుని = గాంధారరాజు, పక్షి; పక్షము = side, రెక్క)
శ్లేష కక్కురితితో కొంచెం సాహసించాను.తప్పులుంటే మన్నించి పెద్దలు సరిదిద్దాలి.
మోదముతోడ ద్రోవదిని మూర్ఖసుయోధనుఁ డీడ్చి తెమ్మనన్;
బైదలి నీడ్చి తెచ్చి, సభవాకిట నిల్పియు వస్త్ర మూడ్చె, దా
మోదరుఁ డంత వస్త్రముల మోదముతో నిడి కాచె ద్రౌపదిన్!
౪. హరి వేంకట సత్యనారాయణ మూర్తి
వరమున జన్మనందినది, పాండవవీరుల ధర్మపత్నియై
నిరత పతివ్రతాచరణనిష్ఠనుఁ బూనుచు సద్గుణాఢ్యయై
వరలిన యాజ్ఞసేనిని సభాసదులందరుఁ జూచుచుండగా
కరుణ యొకింత చూపక కుకర్ముడు, దుర్మదుడౌచు నప్పుడున్.
దుస్ససేనుండు సభకీడ్చి దుష్టుడగుచు
వస్త్రహీననుఁ జేయ ద్రోవదినిఁ బట్టి
యత్నమొనరింప నబలయై యార్తితోడ
“దేవ! లోకైకరక్షక! కావు” మనుచు
మొర పెట్టగ వెనువెంటనె
కరుణాత్ముండైన శౌరి క్రమముగ చీరల్
తరగని రీతిగ నొసగుచు
మురహరు డా కృష్ణ మానమును కాపాడెన్.
* * * * *
౫. రవి
రాలె - సితయశము రారాజమకుటశో
భాయమానోజ్జ్వలితాప్తవరము,
తునిగె నల విపులఘనభుజావేష్టిత
శూరత - మార్తాండసుతుని గుణము,
ఈగె నిశ్శేషము రాగకల్మాషయు
తాక్షదృష్టి శకునిపక్షశక్తి,
పతనమడిగె నిజభ్రాతప్రబలపరి
ష్వంగిత్యురుతరదుశ్శాసనురము,
కౌరవాదులకుఁ దొడరె కాలవశము,
దమనమాయెనట ధరణి ధర్మ మెల్ల,
నిదురవోయె కొలువునందు నీతి నియతి,
కలియుగమ్మునకును నాంది కలిగె సుమ్ము.
(గుణము = character, అల్లెత్రాడు; అక్షము = కన్ను, పాచిక; శకుని = గాంధారరాజు, పక్షి; పక్షము = side, రెక్క)
శ్లేష కక్కురితితో కొంచెం సాహసించాను.తప్పులుంటే మన్నించి పెద్దలు సరిదిద్దాలి.
మోసపోయెను ద్యూతమున మున్ను ధర్మమే
రిప్లయితొలగించండిదౌర్భాగ్యము వరించె ధర్మమతుల
నంత దుష్టాత్ముల కవధులు లేనట్టి
అధికార మవకాశ మటుల నబ్బె
రారాజునకు ప్రతీకా రాంధకారమే
యంతరంగమ్మున నావహించె
దుశ్శాసనుండంత ద్రోవది కేశమ్ము
బట్టుచు సభలో వివస్త్రజేయు
యత్నమున వలువ నూడ్చెడు నట్టివేళ
కృష్ణ కృష్ణా! యటంచు ప్రార్థించినంత
నక్షయమ్ముగ చీరె లయ్యబలకిచ్చి
మానసరంక్షణ మొనర్చె మాధవుండు
(కృష్ణ = ద్రౌపది, కృష్ణా యటంచు ప్రార్థన మొనరించెను అని అన్వయము)
పండిత నేమాని వారూ,
రిప్లయితొలగించండిచక్కని సీస పద్యం చెప్పి మమ్మలరించారు. ధన్యవాదాలు.
‘అధికార’మునకు యడాగమం చేర్చి, కేశమ్మును ‘కేశముల్’గా మార్చాను. అన్యధా భావించవద్దని మనవి.
నిండు సభ లోన ద్రౌపది నేక వస్త్ర
రిప్లయితొలగించండిననియు జూడక దుష్టుడు నామె వట్టి
వలువ లూ డ్వం గ కృష్ణుడు వలువ లిచ్చి
మాన రక్షణ గావించె మాన వ తి కి .
సుబ్బారావు గారూ,
రిప్లయితొలగించండిబాగుంది మీ పద్యరచన.. అభినందనలు.
రెండవ పాదాన్ని ఇలా సవరించాను...
‘యనియు జూడక యొక దుష్టు డామె బట్టి’
గుండు మధుసూదన్ గారి పద్యము....
రిప్లయితొలగించండిజూదములోన నోడె యమసూనుఁడు; పందెము గెల్చి తమ్మునిన్
మోదముతోడ ద్రోవదిని మూర్ఖసుయోధనుఁ డీడ్చి తెమ్మనన్;
బైదలి నీడ్చి తెచ్చి, సభవాకిట నిల్పియు వస్త్ర మూడ్చె, దా
మోదరుఁ డంత వస్త్రముల మోదముతో నిడి కాచె ద్రౌపదిన్!
వరమున జన్మనందినది, పాండవవీరుల ధర్మపత్నియై
రిప్లయితొలగించండినిరత పతివ్రతాచరణనిష్ఠనుఁ బూనుచు సద్గుణాఢ్యయై
వరలిన(పరగిన) యాజ్ఞసేనిని సభాసదులందరుఁ జూచుచుండగా
కరుణ యొకింత చూపక కుకర్ముడు, దుర్మదుడౌచు నప్పుడున్.
దుస్ససేనుండు సభకీడ్చి దుష్టుడగుచు
వస్త్రహీననుఁ జేయ ద్రోవదినిఁ బట్టి
యత్నమొనరింప నబలయై యార్తితోడ
దేవ! లోకైకరక్షక! కావు మనుచు
మొర పెట్టగ వెనువెంటనె
కరుణాత్ముండైన శౌరి క్రమముగ చీరల్
తరగని రీతిగ నొసగుచు
మురహరు డా కృష్ణ మానమును కాపాడెన్.
గుండు మధుసూదన్ గారూ,
రిప్లయితొలగించండిమీ పద్యం చాలా బాగుంది. అభినందనలు.
*
సత్యనారాయణ మూర్తి గారూ,
‘ద్రౌపదీ మానసంరక్షణం’ అంశంపై మీ పద్యాలు అలరిస్తున్నాయి. అభినందనలు.
ఈ కామెంట్‌ను రచయిత తీసివేశారు.
రిప్లయితొలగించండిపేరోలగమున కీడ్చెను పెంపు మీఱ
రిప్లయితొలగించండినాధు లోడిన పణతి క నాద వలెను
దిక్కు తోచక రోదించ పిక్క టిల్లె
వలువ లీయగ రక్షించె వైష్ణ వుండు .!
రవి గారూ,
రిప్లయితొలగించండిఅద్భుతమైన సీసపద్యాన్ని చెప్పారు. అభినందనలు.
*
రాజేశ్వరి అక్కయ్యా,
మీ పద్యంలో చాలా సవరణలు చేయవలసి ఉంది.
రవిగారూ అభినందనలు!
రిప్లయితొలగించండిక్షమించాలి. ఎత్తుగీతిలో నాలుగవ లైనులో - యతిభంగమున్నది. క్రింది విధంగా సవరించాను.
రిప్లయితొలగించండిరాలె - సితయశము రారాజమకుటశో
భాయమానోజ్జ్వలితాప్తవరము,
తునిగె నల విపులఘనభుజావేష్టిత
శూరత - మార్తాండసుతుని గుణము,
ఈగె నిశ్శేషము రాగకల్మాషయు
తాక్షదృష్టి శకునిపక్షశక్తి,
పతనమడిగె నిజభ్రాతప్రబలపరి
ష్వంగిత్యురుతరదుశ్శాసనురము,
కౌరవాదులకుఁ దొడరె కాలవశము,
దమనమాయెనట ధరణి ధర్మ మెల్ల,
నిదురవోయె కొలువునందు నీతి నియతి,
కలియుగమ్మునకును నాంది కలిగె సుమ్ము.
రవి గారూ,
రిప్లయితొలగించండినేనూ గమనించలేదు. సవరిస్తాను.
అన్నట్టు అది సీసంలో నాలుగవ పాదమే.(నిజానికి రెండవపాదంలో ఉత్తరార్ధం అనాలనుకోండి!) ఎత్తుగీతి అంటే సీసపద్యం చివర చేర్చే ఆటవెలది లేదా తేటగీతి.