30, జూన్ 2012, శనివారం

సమస్యాపూరణం - 749 (తులను పట్టునెడల)

కవిమిత్రులారా...

ఈరోజు పూరించవలససిన సమస్య ఇది...

తులను పట్టునెడలఁ గలుగు సుఖము.

ఈ సమస్యను పంపిన కవిమిత్రునకు ధన్యవాదాలు.

కవిమిత్రుల పూరణలు
౧. లక్ష్మీదేవి

    చక్కజేయు మదిని సత్సంగమనునది
    మంచి వారితోడ మసలుకొమ్ము;
    భక్తి గలిగి మెలగు భక్తుల, భాగవ
    తులను పట్టునెడల గలుగు సుఖము.


    విషయ వాంఛ దలచి వెంట బడెడు దుర్మ
    తులను పట్టునెడల, గలుగు సుఖము
    శాశ్వతమది సుమ్ము; సచ్చిదానందము
    కలిగి చింతలెల్ల తొలగు నిజము.

*     *     *     *     *
౨. గుండు మధుసూదన్
    ఆపదలు తొలంగు, నంతరించును బాధ,
    గొనము లెసఁగు, ధాన్యధనము వృద్ధి
    యగు నెటుల? హరునకు నతిభక్తితోఁ బ్రణ
    తులను పట్టునెడల గలుగు సుఖము.

*     *     *     *     *
౩. చంద్రమౌళి 
    ఏది సుఖమొ జీవి కేయది పథ్యమొ
    తానె తెలియ లేడు తత్త్వదృష్టి
    నాశ్రయించి మ్రొక్కి యార్య వేదాంత శాం
    తులను పట్టునెడల గలుగు సుఖము.

*     *     *     *     *
౪. హరి వేంకట సత్యనారాయణ మూర్తి
    నిర్మలాత్ములౌచు నిత్యము జగదంబ
    నఖిలభక్తకోటి ననవరతము
    కాచు తల్లి నిలను గాంచి మంగళహార
    తులను పట్టునెడల గలుగు సుఖము.
*     *     *     *     *
౫. సుబ్బారావు
    జ్ఞాన మనగ నెరిగి మానవంతుల పద్ధ
    తులను పట్టు నెడల గలుగు సుఖము
    భక్తి కలిగి యుండి భగవంతు సేవించ
    ముక్తి కలుగు సత్యముగను నిలను .
*     *     *     *     *
౬. ‘మన తెలుగు’ చంద్రశేఖర్
    పట్టు పట్ట నేల పట్టిన విడువంగ
    నేల? మొండిపట్టు లెపుడు వలదు
    మంచి పట్టు పట్టు మనిషికి తగు సుగ
    తులను పట్టునెడలఁ గలుగు సుఖము!

*     *     *     *     *
౭. పండిత నేమాని
భౌతికమగు సిరులు భావ్యముల్ కావంచు
జ్ఞానయోగ సాధనముల నెంచి
యాదరమున శాశ్వతానంద మిడు సద్గ
తులను బట్టు నెడల గలుగు సుఖము 

*     *     *     *     *
౮. మిస్సన్న 
(1) 
మంచి చెడుల మధ్య మంచి మార్గము జూపి 
పాప పుణ్యములను చూపి హితము 
మంచి నడత నీయ మనిషి మనస్సున  
తులను పట్టునెడలఁ గలుగు సుఖము. 
(తుల=త్రాసు, కొలమానము) 
(2) 
వ్యధను క్రుంగ నేల మధుమేహ మంచును 
మందు లేని రోగ మెందు గలదు 
కలత మరచి పోయి కాకరకాయ, మెం- 
తులను పట్టునెడలఁ గలుగు సుఖము.  
(3) 
సిరుల నిచ్చి బ్రోచు శ్రీదేవి చదువుల 
నిచ్చు వాణి శుభము లిచ్చు గౌరి 
జగము లేలు నట్టి ముగురు దేవతల యిం
తులను పట్టునెడలఁ గలుగు సుఖము. 
*     *     *     *     * 
౯. శ్రీపతిశాస్త్రి
మనసునందు కలుగు మంచిభావములను
వ్రాయగల్గినట్టి పండితుండు
లలితమైన భాష, ప్రాస,పద్య, గణ,య 
తులను పట్టునెడలఁ గలుగు సుఖము. 
*     *     *     *     *
౧౦. రాజేశ్వరి నేదునూరి 
ఇంటి దీపము గద యిల్లాలి సుగుణమ్ము,
కంటి వెలుగు గాదె కన్న సంతు;
మంచి ముత్యము వలె మాటను పలుకు హి
తులను పట్టు నెడలఁ గలుగు సుఖము !
*     *     *     *     *
౧౧. గోలి హనుమచ్ఛాస్త్రి
    తులను దూగు సిరులు కలిగియున్నను గాని
    హితుల గతుల నిడు మహిత వరుల
    మతుల జెరచ కుండ మన్నింపుగల స్నేహి
    తులను పట్టు నెడలఁ గలుగు సుఖము.
*     *     *     *     *     *
౧౨. గుండా సహదేవుడు
ధనము గలిగెనేని యనుభవించగవచ్చు
నన్ని రంగములను నదియె పోటి
వృత్తి యందు నేర్పు పెంచి యుత్తమ సంగ
తులను పట్టు నెడల కలుగు సుఖము.

 


  

25 కామెంట్‌లు:

 1. చక్కజేయు మదిని సత్సంగమనునది
  మంచి వారితోడ మసలుకొమ్ము;
  భక్తి గలిగి మెలగు భక్తుల, భాగవ
  తులను పట్టునెడల గలుగు సుఖము

  రిప్లయితొలగించండి
 2. లక్ష్మీదేవి గారూ,
  వేగంగా స్పందించినందుకు అభినందనలు, ధన్యవాదాలు.
  కాని పూరణలో విరుద్ధార్థం గోచరిస్తున్నది. దుర్మతులను పట్టుకుంటే శాశ్వత సుఖం కలుగుతుందా? దయచేసి వివరించండి.

  రిప్లయితొలగించండి
 3. లక్ష్మీదేవి గారూ,
  మీ రెండవ పూరణ అన్నివిధాల ఉత్తమంగా ఉంది. అభినందనలు.

  రిప్లయితొలగించండి
 4. గురువుగారు,
  పట్టునెడల అన్న పదానికి పట్టుకొనిన యెడల అని అర్థము. అటువంటప్పుడు భాగవతుల స్నేహాన్ని పట్టుకొనడం ఒక అర్థమైతే, దుర్మతులను గట్టిగా పట్టి, (విచ్చలవిడిగా చరించకుండా) కట్టి ఉంచుట అనేది ఇంకొక అర్థము.కాదంటారా?

  రిప్లయితొలగించండి
 5. గుండు మధుసూదన్ గారి పూరణ....

  ఆపదలు తొలంగు, నంతరించును బాధ,
  గొనము లెసఁగు, ధాన్యధనము వృద్ధి
  యగు నెటుల? హరునకు నతిభక్తితోఁ బ్రణ
  తులను పట్టునెడల గలుగు సుఖము.

  రిప్లయితొలగించండి
 6. ఏది సుఖమొ జీవి కేయది పథ్యమొ
  తానె తెలియ లేరు తత్త్వమంద
  ఆశ్రయించి మ్రోక్కి ఆర్య వేదాంత శాం
  తులను పట్టునెడల గలుగు సుఖము.

  రిప్లయితొలగించండి
 7. చంద్రమౌళి గారూ,
  మీ పూరణ చాలా బాగుంది. అభినందనలు.
  రెండు టైపు దోషాలను (తానె అన్నప్పుడు లేడు అనాలి కదా! అలాగే ‘మ్రోక్కి’) , ఔచిత్యం కోసం రెండు మార్పులను చేసాను. మన్నించండి.

  రిప్లయితొలగించండి
 8. లక్ష్మీదేవి గారూ,
  మీ వివరణ ఎందుకో సంతృప్తికరంగా లేదు.

  రిప్లయితొలగించండి
 9. నిర్మలాత్ములౌచు నిత్యము జగదంబ
  నఖిలభక్తకోటి ననవరతము
  కాచు తల్లి నిలను గాంచి మంగళహార
  తులను పట్టునెడల గలుగు సుఖము.

  రిప్లయితొలగించండి
 10. జ్ఞాన మనగ నెరిగి మాన వంతుల పధ్ధ
  తులను పట్టు నెడల గలుగు సుఖము
  భక్తి కలిగి యుండి భ గ వంతు సేవించ
  ముక్తి కలుగు సత్య ముగను నిలను .

  రిప్లయితొలగించండి
 11. పట్టు పట్ట నేల పట్టిన విడువంగ
  నేల? మొండిపట్టు లెపుడు వలదు
  మంచి పట్టు పట్టు మనిషికి తగు సుగ
  తులను పట్టునెడలఁ గలుగు సుఖము!

  రిప్లయితొలగించండి
 12. భౌతికమగు సిరులు భావ్యముల్ కావంచు
  జ్ఞానయోగ సాధనముల నెంచి
  యాదరమున శాశ్వతానంద మిడు సద్గ
  తులను బట్టు నెడల గలుగు సుఖము

  రిప్లయితొలగించండి
 13. గురువుగారు,
  మన్నించండి. నా పూరణ తొలగిస్తాను. అన్వయం లో చదివే వారికి తప్పు తోచిన పక్షంలో నాకూ సంతృప్తి ఉండదు. మీ వ్యాఖ్య ఇప్పుడే చూశాను.

  రిప్లయితొలగించండి
 14. శంకరయ్యగారూ, సవరణలకు నమోవాకములు. కాని, ఈ సమస్యాపూరణానికి నేను ఉద్దేశించిన కీలకపదం, “ఆర్యవేదాంతశాంతులు”.. అంటే, అపార అనుభవంతో, ఉపనిషత్తుల నిధిధ్యాసనజే శాంతత్వాన్ని పొందిన మహానుభావులు, వారిని సేవించి రహస్యాలని తెలుసుకొన్నయెడల, నిజమైన సుఖమేదోతెలిసి దానిని అనుభవింతురు అనే భావం. మూడవపాదాంత్యంలో మీరువేసిన ’నీ’ తిసి, ’శాం” వేసిన సరిపోవును. మీకు శ్రమకలిగించినందుకు మన్నించ ప్రార్థన.

  రిప్లయితొలగించండి
 15. చంద్రమౌళి గారూ,
  మన్నించాలి. మీ భావాన్ని సరిగా అవగాహన చేసికోలేక తొందరపడి సవరించాను. ఇప్పుడు మీరు చెప్పినట్లే చేసాను.
  *
  లక్ష్మీదేవి గారూ,
  ఉండనిద్దాం. మీ మనోగతాభిప్రాయాన్ని అర్థం చేసికొనక పోవడం నా లోపమే నేమో?

  రిప్లయితొలగించండి
 16. మంచి చెడుల మధ్య మంచి మార్గము జూపి
  పాప పుణ్యములను చూపి హితము
  మంచి నడత నీయ మనిషి మనస్సున
  తులను పట్టునెడలఁ గలుగు సుఖము.

  (తుల=త్రాసు, కొలమానము)

  రిప్లయితొలగించండి
 17. సరదాగా ఇంకోటి.

  వ్యధను క్రుంగ నేల మధుమేహ మంచును
  మందు లేని రోగ మెందు గలదు
  కలత మరచి పోయి కాకరకాయ, మెం-
  తులను పట్టునెడలఁ గలుగు సుఖము.

  రిప్లయితొలగించండి
 18. ముచ్చటగా మూడోది.

  సిరుల నిచ్చి బ్రోచు శ్రీదేవి చదువుల
  నిచ్చు వాణి శుభము లిచ్చు గౌరి
  జగము లేలు నట్టి ముగురు దేవతల యిం-
  తులను పట్టునెడలఁ గలుగు సుఖము.

  రిప్లయితొలగించండి
 19. శ్రీపతిశాస్త్రిశనివారం, జూన్ 30, 2012 11:05:00 PM

  శ్రీగురుభ్యోనమ:

  మనసునందు కలుగు మంచిభావములను
  వ్రాయగల్గినట్టి పండితుండు
  లలితమైన భాష, ప్రాస,పద్య, గణ,య
  తులను పట్టునెడలఁ గలుగు సుఖము

  రిప్లయితొలగించండి
 20. ఇంటి దీపమైన ఇల్లాలి సుగుణమ్ము
  కంటి వెలుగు గాదె కన్న సంతు
  మంచి ముత్య మంటి మాటను పలుకుహి
  తులను పట్టు నెడలఁ గలుగు సుఖము !

  రిప్లయితొలగించండి
 21. తులను దూగు సిరులు కలిగియున్నను గాని
  హితుల గతుల నిడు మహిత వరుల
  మతుల జెరచ కుండ మన్నింపుగల స్నేహి
  తులను పట్టు నెడలఁ గలుగు సుఖము

  రిప్లయితొలగించండి