21, జూన్ 2012, గురువారం

రవీంద్రుని గీతాంజలి - 50

రవీంద్రుని గీతాంజలి

తెనుఁగు సేత

శ్రీమాన్ చిలుకమఱ్ఱి రామానుజాచార్యులు

50

I HAD gone a-begging from door to
door in the village path, when thy
golden chariot appeared in the distance
like a gorgeous dream and I wondered
who was this King of all kings !

My hopes rose high and methought
my evil days were at an end, and I
stood waiting for alms to be given
unasked and for wealth scattered on
all sides in the dust.

The chariot stopped where I stood.
Thy glance fell on me and thou earnest
down with a smile. I felt that the luck
of my life had come at last. Then of
a sudden thou didst hold out thy right
hand and say " What hast thou to give
tome?"

Ah, what a kingly jest was it to open
thy palm to a beggar to beg ? I was
confused and stood undecided, and then
from my wallet I slowly took out the least
little grain of corn and gave it to thee.

But how great my surprise when at
the day's end I emptied my bag on the
floor to find a least little grain of gold
among the poor heap. I bitterly wept
and wished that I had had the heart to
give thee my all.


చిలుకమఱ్ఱి రామానుజాచార్యుల అనువాదము.....

పల్లెవీధిని వాకిలివాకిలికిని
తిరిప మెత్తుచు నెత్తుచుఁ దిరుగు నాకు
నొక యపూర్వఁపు గలవోలె నుజ్జ్వలముగ
దూరమునఁ దోచె నీదు బంగారు తేరు,
‘ఎవరొ రాజాధిరా’ జని యేను మిగుల
విస్మయమున మునింగి భావించుకొంటి ||

‘నేడు శుభవేళ మేల్కంటి నే’ నటంచుఁ
గలిగె నమ్మిక, చెడుదినమ్ములు సమాప్త
మైన యట్టులు దోచె నా మానసమున,
అడుగకయె యిచ్చు భిక్షము నందుకొనఁగ,
నెల్లెడం జల్లిన ధనమ్ము లేరుకొనఁగ
దలఁచుచుం గాచుకొని యట నిలిచియుంటి ||

ఆగె రథ మది నా పురోభాగమందె,
నా పయిన్ సత్వరమ్ము నీ చూపు వ్రాలె,
మందహాసాన దిగితివి క్రింది కీవు,
బ్రదుకులోపలి భాగ్యము పక్వదశకు
వచ్చినట్లు మదిం గనవచ్చె నాకు,
కాని చప్పున దక్షిణకరము చాపి
యడిగితివి నన్నె “నాకేమి యిడెద” వంచు ||

“ఏమొకో రాచఠీవిగ నీ వొనర్చు
నట్టి పరిహాసమో యిది యకట! నీవె
హస్తముం జాచి భిక్షకు నడిగికొనుట!”
నేను తబ్బిబ్బుతో నేది నిశ్చయింపఁ
జాలక క్షణమ్ము నిలిచి నా జోలెనుండి
యల్లనల్లనఁ జిన్ని ధాన్యకణ మొకటి
వెలుపలికి దీసి నీచేతఁ బెట్టినాను ||

కాని యిది యెంత యచ్చెరు వైనమాట!
పగటి తుదివేళ నా యున్కిపట్టు డాసి,
నేలపైఁ గ్రుమ్మరించితి జోలె దీసి
ఆ దరిద్రఁపు రాసిలో నవుర నాకుఁ
గానఁబడె నొక చిన్ని బంగారు గింజ
అప్డు నా సకలమ్ము నీ కర్పితమ్ము
సలుపుకొర కని మనమునఁ దలఁచి తలఁచి
మించు వగతోడఁ బశ్చాత్తపించినాఁడ ||

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి