16, జూన్ 2012, శనివారం

రవీంద్రుని గీతాంజలి - 45

రవీంద్రుని గీతాంజలి

తెనుఁగు సేత

శ్రీమాన్ చిలుకమఱ్ఱి రామానుజాచార్యులు

45

HAVE you not heard his silent steps ?
He comes, comes, ever comes.

Every moment and every age, every
day and every night he comes, comes,
ever comes.

Many a song have I sung in many a
mood of mind, but all their notes have
always proclaimed, " He comes, comes,
ever comes."

In the fragrant days of sunny April
through the forest path he comes,
comes, ever comes.

In the rainy gloom of July nights on
the thundering chariot of clouds he
comes, comes, ever comes.

In sorrow after sorrow it is his steps
that press upon my heart, and it is
the golden touch of his feet that
makes my joy to shine.


చిలుకమఱ్ఱి రామానుజాచార్యుల అనువాదము....

అడుగు సవ్వడి వినవొకో యతని దీవు?
వచ్చు వచ్చు సదా యిటు వచ్చు నతఁడు ||

ప్రతియుగము ప్రతిక్షణమును పవలు రేయి
వచ్చు వచ్చు సదా యిటు వచ్చు నతఁడు ||

*పిచ్చిగా పాట లెన్నెన్నొ యిచ్చకొలఁది
బహుమనోవృత్తులందేను పాడుకొంటి,
తత్స్వరమ్ముల నెల్ల నీధ్వనియె మ్రోగు
వచ్చు వచ్చు సదా యిటు వచ్చు నతఁడు ||

అల వసంతము గమగమలాడునాడు
వనతలమ్ముల తెరువున వచ్చు నతఁడు ||

శ్రావణఁపుఁ జిమ్మచీకఁటి రాత్రులందు
నురుము మ్రోతల కార్మబ్బు టరద మెక్కి
వచ్చు వచ్చు సదా యిటు వచ్చు నతఁడు ||

క్రమ్మి దుఃఖముపైని దుఃఖమ్ము వచ్చు
నపుడు దుఃఖమె కాదది, యతని యడుగు
లెడదపైఁ బడుచుండు తాకిడియె కాని||

సుఖపు మెరపుల యొరపులు చూడ, నతని
మృదుపదస్పర్శవేథి తా నెదకు సోక
పులక లెత్తెడి బంగరు తళుకు లవియె ||

*గుండె తటతట యెపుడును గొట్టుకొనుట
యిడెడి యాతని యడుగు సవ్వడిన కాదె?
వచ్చు వచ్చు సదా యిటు వచ్చు నతఁడు ||

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి