29, జూన్ 2012, శుక్రవారం

పద్య రచన - 36


కవిమిత్రులారా,

పై చిత్రాన్ని పరిశీలించి తగిన పద్యా(లను)న్ని వ్రాయండి.

కవిమిత్రుల పద్యములు

౧. లక్ష్మీదేవి 
    దీనజనులను కాపాడు దేవుని కృప
    నెల్లవారల దుఃఖము లిట్టె సమసి
    పోవుననుచును నమ్మిన పూనికగను
    కర్మఫలముననుభవించు కష్టమేల?


    తనదు పరివారమించుక తరలి వచ్చి
    తనకు చేయూత నీయని తరుణమునను
    సాటి వారి నాదుకొనగ సజ్జనుండు
    సర్వవేళల సిద్ధము సహజమిదియె.
 
*     *     *     *     *
౨. మిస్సన్న 
    తిండికి గుడ్డకున్ కరవు తీరుగ లేదు శరీర భాగ్యము-
    న్నుండగ నిల్లు లేదు కనులున్నవి చుట్టును జాలి లేదహో
    గండము నిత్యమున్ బ్రతుకు కాలునికిన్ కృప లేదు దేవుడా
    దండము వేగ నీ దరికి తాళగ లేనిక జేర్చుకో గదే.

*     *     *     *     *
౩. సుబ్బారావు
    తిండి లేదయ్య ! ముప్పది దినము లయ్యె
    కావరాలే దెవారును గరుణ తోడ
    తీసుకొని పొమ్ము నన్నిక దేవ దేవ!
    యనుచు సాయిని బ్రార్ధించె యాచకుండు .


    తిండి నే దిని ముప్పది దినము లయ్యె
    దేహ మంతయు శుష్కించె దైన్యముగను
    వేడుచుంటిని మిమ్ముల వేయు డింత
    కబళ మో యమ్మ ! దీనుని గనికరించి .

*     *     *     *     *
౪. పండిత నేమాని రామజోగి సన్యాసి రావు
    బిచ్చమెత్తుకొనెడు వృత్తి నీచము కాదు
    పెద్దవారలేని బిచ్చగాండ్రె
    ఉన్నవారలన్న నుండు చింతలు చాల
    బెంగలేని వాడు బిచ్చగాడె

*     *     *     *     *
౫. హరి వేంకట సత్యనారాయణ .మూర్తి

    కట్ట బట్టలు లేవు కరువయ్యె మెతుకులు
            పలుకాలకించెడి వారు లేరు,
    రోజున కొకటిగా రుగ్మతల్ వ్యాపించె
            బ్రతికియుండుటె నేడు భారమయ్యె,
    దీనబాంధవుడైన దేవాధిదేవుడే
            పాషాణరూపియై పలుకనపుడు
    సాటివారలమంచు జగతిలో నడయాడు
            శ్రీమంతులనుగూర్చి చెప్పనేల?
    జన్మ మంది నాడ జనులంద రేరీతి
    పుట్టి యుండి రట్లె పుడమిమీద
    తిండి బట్ట లేక తిరుగుచు నుండెడి
    పేదవాని నగుట కేది కతము?

    పూర్వజన్మమందు పుణ్యంబు చేయనో?
    సంచరించ లేదొ సవ్యగతిని?
    తెలియకుండె చెప్పవలయును దేవుడే
    పేదవాని నగుట కేది కతము?

    సుఖములేక సతము సూర్యోదయాదిగా
    గుడులు, వీధులందు, బడులవద్ద
    చేరి దాన మింత చేయుడన్ననుగాని
    దుడ్డు కొంచెమైన దొరకదయ్యె.

    భవమునొసగునట్టి భగవానుడే రక్ష
    యందు రెందుఁ బోయె నాఘనుండు
    బాధ లిట్లు గూర్చు, భవబంధ మోచనం
    బీయ రాడదేమి? ఈశ్వరుండు.

    అనుచు మనసులోన నత్యంతవేదన
    నందు పేదవారి ననవరతము
    నిర్మలాత్ములౌచు, నిస్స్వార్థచిత్తులై
    చేరి సాయ మంద జేయ వలయు.

    సాటివారి కింత సాయంబు చేయుటే
    ధరణిలోన గొప్ప ధర్మ మికను
    మంచి మనసుతోడ మానవసేవయే
    మాన్యమైన పూజ మాధవునకు.

*     *     *     *     * 
౬. కళ్యాణ్

    కులమొ యాదిభిక్షువుది నా గోత్రమనిన
    సాయినాధు గోత్రమునాది, జన్మ యెట్టి
    దనిన నాదియు నంతమ్ము గనగరాదు,
    మతము క్షుద్బాధ నెరిగిన మనుజు మతము.

*     *     *     *     * 
౭. గుండు మధుసూదన్
బ్రతికితి మున్ను డబ్బు గలవానిగ; గర్వముతో దరిద్రులన్
మెతుకు విదుల్చకుండ మఱి మిక్కిలి పాఱఁగఁ ద్రోలి, నవ్వితిన్
హితము గనంగలేక మద మెక్కియు నెన్నఁడు దానధర్మముల్
మతిఁ దలఁపన్ సహింపకను మాన్యత వీడితి పుణ్యదూరునై.

బిచ్చగాండ్రను రాకుండ వెడలఁగొట్టి
పిసినితనమున ధనమును విరివిగాను
కూడఁబెట్టితి నేనును గుడువకుండ
దానహీనుఁడ నయ్యును ధనికుఁ డైతి.

ఇటుల రాత్రి పగలు హెచ్చగు మోహాన
తిండి తినక ధనము దీక్షతోడఁ
గాయుచుంటి మిగులఁ గాపలదారుగా
నొక్కనా డలసితి మిక్కుటముగ.

నిదురించ నొక్క చోరుం
డది గమనించియును నచటి నా ధనమంతన్
వెదకి వెదకి మొత్తము తన
మది మెచ్చగ దోచుకొనెను; మట్టియె మిగిలెన్.

నాటినుండియు నేఁ బేదనైతి వినుఁడు
ధనము, గర్వము తొలగించె దైవ మపుడు!
దానధర్మాలు సేయక ధనము నెపుడు
కూడఁబెట్టి, కావలదు భిక్షుకులుగాను!!

*     *     *     *     *
౮. రాజేశ్వరి నేదునూరి చెప్పారు... 
    నడువ లేను బాబు నడిరోడ్డుపై నేను
    దైవ మిటుల వ్రాసె దయను వీడి
    పెద్ద మనసు జేసి బిచ్చ మిడిన చాలు
    నేను బ్రతుకగలను నీదు కృపను.
 

23 కామెంట్‌లు:

  1. దీనజనులను కాపాడు దేవుని కృప
    నెల్లవారల దుఃఖము లిట్టె సమసి
    పోవుననుచును నమ్మిన పూనికగను
    కర్మఫలముననుభవించు కష్టమేల?

    రిప్లయితొలగించండి
  2. లక్ష్మీదేవి గారూ,
    వేగంగా స్పందించినందుకు అభినందనలు, ధన్యవాదాలు.
    ‘పూనికగును’... ‘పూనిక + అగును’? లేదా ‘పూనికగా’ అనే అర్థంలో ప్రయోగించారా? యడాగమం వచ్చి ‘పూనిక యగును’ అవుతుంది.
    అక్కడ ‘పూనిక యగు’ లేదా ‘పూన్కితోడ’ ఏది ఉండాలి?

    రిప్లయితొలగించండి
  3. గురువు గారు,
    పూనికతోడ అనే నా ఉద్దేశ్యం . ఇక్కడ పూనిక అగును అనే మాట రానేరాదు కదా!

    రిప్లయితొలగించండి
  4. తనదు పరివారమించుక తరలి వచ్చి
    తనకు చేయూత నీయని తరుణమునను
    సాటి వారి నాదుకొనగ సజ్జనుండు
    సర్వవేళల సిద్ధము సహజమిదియె.

    రిప్లయితొలగించండి
  5. తిండికి గుడ్డకున్ కరవు తీరుగ లేదు శరీర భాగ్యము-
    న్నుండగ నిల్లు లేదు కనులున్నవి చుట్టును జాలి లేదహో
    గండము నిత్యమున్ బ్రతుకు కాలునికిన్ కృప లేదు దేవుడా
    దండము వేగ నీ దరికి తాళగ లేనిక జేర్చుకో గదే.

    రిప్లయితొలగించండి
  6. లక్ష్మీదేవి గారూ,
    మీ రెండు పద్యాలూ చాలా బాగున్నవి. అభినందనలు.
    *
    మిస్సన్న గారూ,
    మీ పద్యం కరుణరసప్రధానమై చక్కగా ఉంది. అభినందనలు.

    రిప్లయితొలగించండి
  7. గురువుగారూ ధన్యవాదాలు.
    శ్రీ ఏల్చూరి వారి సూచనను పరిశీలించవచ్చు ననుకొంటున్నాను.
    మీ తీరిక, ఆరోగ్యము, మనస్సు సహకరిస్తే.

    రిప్లయితొలగించండి
  8. ఈ కామెంట్‌ను రచయిత తీసివేశారు.

    రిప్లయితొలగించండి
  9. మిస్సన్న గారూ,
    ఏల్చూరి వారి సూచనను పరిశీలిస్తున్నాను. త్వరలోనే ప్రకటిస్తాను. ధన్యవాదాలు.
    *
    సుబ్బారావు గారూ,
    మీ పద్యంలో ‘దినము లుండి’ అనేది ‘దినముల నుండి’ అనాలి. ‘రాలేదు నెవరను’... ‘రాలేదెవరును’ అనాలి. ‘తీస్కుపోవు’ అనడమూ దోషమే... నా సవరణలతో మీ పద్యం....

    తిండి లేదయ్య ! ముప్పది దినము లయ్యె
    కావరాలే దెవారును గరుణ తోడ
    తీసుకొని పొమ్ము నన్నిక దేవ దేవ!
    యనుచు సాయిని బ్రార్ధించె యాచకుండు .

    ఈ సవరణలు మీకు నచ్చితే టపాలో ప్రకటిస్తాను.

    రిప్లయితొలగించండి
  10. బిచ్చమెత్తుకొనెడు వృత్తి నీచము కాదు
    పెద్దవారలేని బిచ్చగాండ్రె
    ఉన్నవారలన్న నుండు చింతలు చాల
    బెంగలేని వాడు బిచ్చగాడె

    రిప్లయితొలగించండి
  11. తిండి నే దిని ముప్పది దినము లయ్యె
    దేహ మంతయు శుష్కిం చె దైన్య ముగను
    వేడు చుంటిని మిమ్ముల వేయు డిం త
    కబళ మో యమ్మ ! దీ నుని గని కరించె .

    రిప్లయితొలగించండి
  12. తిండి లేదయ్య ! ముప్పది దినము లయ్యె
    కావ రాలేదె వారును గరుణ తోడ
    తీ సి కొని పొమ్ము నన్నిక దేవ ! దేవ !
    యనుచు సాయిని బ్రార్ధించె యా చ కుండు .

    రిప్లయితొలగించండి
  13. కట్ట బట్టలు లేవు కరువయ్యె మెతుకులు
    పలుకాలకించెడి వారు లేరు,
    రోజున కొకటిగా రుగ్మతల్ వ్యాపించె
    బ్రతికియుండుటె నేడు భారమయ్యె,
    దీనబాంధవుడైన దేవాధిదేవుడే
    పాషాణరూపియై పలుకనపుడు
    సాటివారలమంచు జగతిలో నడయాడు
    శ్రీమంతులనుగూర్చి చెప్పనేల?
    జన్మ మంది నాడ జనులంద రేరీతి
    పుట్టి యుండి రట్లె పుడమిమీద
    తిండి బట్ట లేక తిరుగుచు నుండెడి
    పేదవాని నగుట కేది కతము?

    పూర్వజన్మమందు పుణ్యంబు చేయనో?
    సంచరించ లేదొ సవ్యగతిని?
    తెలియకుండె చెప్పవలయును దేవుడే
    పేదవాని నగుట కేది కతము?

    సుఖములేక సతము సూర్యోదయాదిగా
    గుడులు, వీధులందు, బడులవద్ద
    చేరి దాన మింత చేయుడన్ననుగాని
    దుడ్డు కొంచెమైన దొరకదయ్యె.

    భవమునొసగునట్టి భగవానుడే రక్ష
    యందు రెందుఁ బోయె నాఘనుండు
    బాధ లిట్లు గూర్చు, భవబంధ మోచనం
    బీయ రాడదేమి? ఈశ్వరుండు.

    అనుచు మనసులోన నత్యంతవేదన
    నందు పేదవారి ననవరతము
    నిర్మలాత్ములౌచు, నిస్స్వార్థచిత్తులై
    చేరి సాయ మంద జేయ వలయు.

    సాటివారి కింత సాయంబు చేయుటే
    ధరణిలోన గొప్ప ధర్మ మికను
    మంచి మనసుతోడ మానవసేవయే
    మాన్యమైన పూజ మాధవునకు.

    రిప్లయితొలగించండి
  14. కులము యాదిభిక్షువునది , గోత్రమనిన
    సాయినాధు గోత్రమునాది, జన్మ యెట్టి
    దనిన యాదియంతములేని వాని బోలు,
    మతము క్షుద్బాధ నెరిగిన మనిషి మతము

    రిప్లయితొలగించండి
  15. గుండు మధుసూదన్ గారి పద్యాలు....

    బ్రతికితి మున్ను డబ్బు గలవానిగ; గర్వముతో దరిద్రులన్
    మెతుకు విదుల్చకుండ మఱి మిక్కిలి పాఱఁగఁ ద్రోలి, నవ్వితిన్
    హితము గనంగలేక మద మెక్కియు నెన్నఁడు దానధర్మముల్
    మతిఁ దలఁపన్ సహింపకను మాన్యత వీడితి పుణ్యదూరునై.

    బిచ్చగాండ్రను రాకుండ వెడలఁగొట్టి
    పిసినితనమున ధనమును విరివిగాను
    కూడఁబెట్టితి నేనును గుడువకుండ
    దానహీనుఁడ నయ్యును ధనికుఁ డైతి.

    ఇటుల రాత్రి పగలు హెచ్చగు మోహాన
    తిండి తినక ధనము దీక్షతోడఁ
    గాయుచుంటి మిగులఁ గాపలదారుగా
    నొక్కనా డలసితి మిక్కుటముగ.

    నిదురించ నొక్క చోరుం
    డది గమనించియును నచటి నా ధనమంతన్
    వెదకి వెదకి మొత్తము తన
    మది మెచ్చగ దోచుకొనెను; మట్టియె మిగిలెన్.

    నాటినుండియు నేఁ బేదనైతి వినుఁడు
    ధనము, గర్వము తొలగించె దైవ మపుడు!
    దానధర్మాలు సేయక ధనము నెపుడు
    కూడఁబెట్టి, కావలదు భిక్షుకులుగాను!!

    రిప్లయితొలగించండి
  16. పండిత నేమాని వారూ,
    ‘బెంగలేని వాడు బిచ్చగా’ డని చాలా చక్కగా చెప్పారు. మంచి పద్యం. అభినందనలు.
    *
    సుబ్బారావు గారూ,
    మీ రెండవ పద్యం బాగుంది. అభినందనలు.
    *
    సత్యనారాయణ మూర్తి గారూ,
    బిచ్చగాని స్వగతంగా మీ ఖండిక కరుణరసాత్మకమై అలరిస్తున్నది. అభినందనలు, ధన్యవాదాలు.
    ఏల్చూరి వారి సూచనను కార్యరూపంలో పెడుతున్నారా?
    *
    కళ్యాణ్ గారూ,
    ప్రశంసనీయమైన ప్రయత్నం చేసారు. అభినందనలు.
    ‘కులము + ఆది’, ‘ఆది + అంతము’ అన్నచోట యడాగమం రాదు. మూడవ పాదంలో ప్రాసయతి తప్పింది. ప్రాసాక్షరానికి ముందు గురులఘువుల సామ్యం ఉండాలి. మీ పద్యంలో నా సవరణలను పైన ‘పోస్ట్’లో చూడండి.
    *
    గుండు మధుసూదన్ గారూ,
    మీ ఖండిక బాగుంది. అభినందనలు.
    నాళం కృష్ణారావు గారి ‘పిసినిగొట్టు’ ఖండిక గుర్తుకు వచ్చింది.

    రిప్లయితొలగించండి
  17. నడువ లేను బాబు నడి రోడ్డుపై నేను
    దైవ మిటుల వ్రాసె దయను వీడి
    పెద్ద మనసు జేసి బిచ్చ మిడిన చాలు
    బ్రతుక గోరు చుంటి నీదు కృపను

    రిప్లయితొలగించండి
  18. రాజేశ్వరి అక్కయ్యా,
    మీ పద్యం బాగుంది. అభినందనలు.
    కాని చివరి పాదంలో యతి తప్పింది. సవరించాను.

    రిప్లయితొలగించండి
  19. గుడిశ లేదయ్య నాకింత కుడువ లేదు
    కాలు కదపగ లేనయ్య కాలునెడకు
    దారి లేదయ్య యడిగితి దారి లేక
    దారి బోవుచు చేయుము ధర్మమంటి.

    రిప్లయితొలగించండి