19, జూన్ 2012, మంగళవారం

సమస్యాపూరణం - 740 (బిడ్డడా వాడు?)

కవిమిత్రులారా...

ఈరోజు పూరించవలససిన సమస్య ఇది...

బిడ్డడా వాడు? రణరంగ భీకరుండు.

ఈ సమస్యను పంపిన కవిమిత్రునకు ధన్యవాదాలు.

36 కామెంట్‌లు:

  1. వందే సుబ్రహ్మణ్యం
    వందే సేనాన్య మఖిల భక్తశరణ్యం
    వందే బుధాగ్రగణ్యం
    వందే షాణ్మాతురం శివాతనయమహం

    ఆరు దినముల శిశువు చండాగ్నిముఖుడు
    ఆరు మోముల వేల్పు మహాహవమున
    జీల్చె దనుజుల దారకు గూల్చె నౌర!
    బిడ్డడా వాడు? రణరంగ భీకరుండు

    రిప్లయితొలగించండి
  2. లేత ప్రాయంపు ముచ్చటలీను ముద్దు
    బిడ్డఁడా వాఁడు? రణరంగ భీకరుండు,
    వైరి గణములఁ ద్రుంచెడు బలుఁడు, పార్థు
    సుతుఁడు, వీఁడిక చెలరేగుచున్నవాఁడు.

    రిప్లయితొలగించండి
  3. స్కందు శౌర్యము జూడుమా యిందు వదన
    శూలి శక్తిని మించిన జోదు కనగ
    తారకాసురు జంపును తాట దీయు
    బిడ్డడా వాడు? రణరంగ భీకరుండు.

    రిప్లయితొలగించండి
  4. దీప్తు లొలుకంగ స్వారాజ్యదీక్ష బూని
    బాల్యదశయందె ఘనుడు శివాజి యవుర!
    చీల్చి చెండాడె మ్లేచ్ఛుల సేన నపుడు
    బిడ్డడా వాడు? రణరంగభీకరుండు.

    రిప్లయితొలగించండి
  5. అన్నిటికవినీతియె బలమెన్నగయను
    తండ్రి గుణములు పొందిన తల్లి చాటు
    బిడ్డడా వాడు? రణరంగ భీకరుండు
    ఎన్నికలనెగ్గి భయపెట్టె నెదిరిజనుల!

    రిప్లయితొలగించండి
  6. రెల్లు గడ్డిన బుట్టిన పిల్లవాడు
    దుష్ట రాక్షసు దారకు దునిమె న త డు
    స్కందు డా త డు పార్వతీ నంద నుండు
    బిడ్డడా వాడు ? రణరంగ భీ క రుండు .

    రిప్లయితొలగించండి
  7. శ్రీపతిశాస్త్రిమంగళవారం, జూన్ 19, 2012 9:10:00 AM

    శ్రీగురుభ్యోనమ:

    బ్రహ్మనాయుని పుత్రుడు బాలుడతడు
    నాటి పల్నాటి రణమున నాయకుండు
    వీరస్వర్గము పొందియు విజయుడాయె
    బిడ్డడా వాడు? రణరంగ భీకరుండు

    రిప్లయితొలగించండి
  8. గుండు కెదురుగ చూపించె గుండె నండ్రు
    తెల్ల దొరలంత మ్రాన్ పడి తెల్లబోవ
    టంగుటూరియా? యెవడు? తెలుంగు తల్లి
    బిడ్డడా వాడు? రణరంగ భీకరుండు.

    రిప్లయితొలగించండి
  9. మిస్సన్న గారు,
    నా మనసులో ప్రకాశంగారి గురించి అనుకున్నాను. మీరు వ్రాసింది చూసి సంతోషం కలిగింది.
    మిత్రులందరి పూరణలూ వైవిధ్యంగా ఉంటున్నాయి. అందరికీ అభినందనలు.

    జంకు నీకేలనయ్య దశరథ భూప!
    చిన్నవాడని యెంచకు చింత విడుము
    హవ్యవాటిక కావగ నంపవేల?
    బిడ్డడా వాడు? రణరంగ భీకరుండు.

    రిప్లయితొలగించండి
  10. అర్జునుడు కృష్ణుడితో పలికిన పలుకులు:

    నీదు వాత్సల్య బలమున నీరజాక్ష !
    బిడ్డడా వాడు? రణరంగ భీకరుండు
    శత్రువుల ద్రుంచ వంచించి చంపినారు
    ధర్మ సంరక్షణము వీడి దాగనేల?

    రిప్లయితొలగించండి
  11. లక్ష్మీ దేవి గారూ ధన్యవాదాలు.
    బాల రాముని శౌర్యాన్ని ఆవిష్కరించిన మీ పద్యం మనోహరం.


    పూతనను జంపి దనుజుల పొగరు బాపి
    పర్వతము నెత్తి శక్రుని గర్వమణచి
    కంసు దునిమిన గండర గండ డితడు
    బిడ్డడా వాడు? రణరంగ భీకరుండు.

    రిప్లయితొలగించండి
  12. గుండు మధుసూదన్ గారి పూరణ....

    చూడఁగను నా సుభద్రాత్మజుండు పోర
    గెలువఁగాను పద్మవ్యూహ మెలమిఁ జొచ్చి,
    కురుమహావీరులనుఁ జీల్చి, కూలెఁ దుదకు!
    బిడ్డఁడా వాఁడు? రణరంగభీకరుండు!

    రిప్లయితొలగించండి
  13. భారతీయుల తేజమా! పరువు మాయు
    దొరల పాలి దుస్స్వప్నమా! భరత మాత
    బిడ్డడా! వాడు రణరంగ భీకరుండు!
    భగతు సింగన విప్లవ జ్వాల! వినుడు.

    రిప్లయితొలగించండి
  14. సంజయుండనె ధృతరాష్ట్ర! సత్య మిదియె
    బాలు డెంతని కౌరవుల్ పరిహసింప
    బిడ్డడా? వాడు రణరంగ భీకరుండు!
    పార్థ సుతుడన్న నీ సంతు పాలి యముడు!

    రిప్లయితొలగించండి
  15. వనము భంజించి యసురుల బట్టి జంపి
    లంక నగ్నికి నర్పించి లవణ జలధి
    నొక్క గెంతున లంఘించె నోయి, గాలి
    బిడ్డడా? వాడు రణరంగ భీకరుండు!

    రిప్లయితొలగించండి
  16. బాలుడా యభిమన్యుడు? వట్టిది! పసి
    బిడ్డడా వాడు? రణరంగ భీకరుండు
    వాని తండ్రి నెరుంగవె పార్థు డవని?
    తండ్రి మించిన ఘనుడైన తనయు డతడు!

    రిప్లయితొలగించండి
  17. అడ్డువచ్చిన శాత్రవ హతమొనర్చి
    అంతుతెలియని పద్మవ్యూహమ్ము చీల్చి
    వీరమరణమ్మునొందెనా విజయసుతుడు
    బిడ్డడా వాడు? రణరంగ భీకరుండు.

    రిప్లయితొలగించండి
  18. శ్రీ మిస్సన్న గారి 3 భావములు 6 పద్యములతో ఈనాటి సమస్యా పూరణమునకు వన్నె హెచ్చినది. అభినందనలు.

    సమస్యలను అందరూ బాగుగనే పూరించేరు. పిండి కొద్దీ రొట్టె అంటారు కదా. చాలా చక్కగా వచ్చేయి అందరి పూరణలు. అందరికీ అభినందనలు. స్వస్తి.

    రిప్లయితొలగించండి
  19. నేమాని పండితార్యా! ధన్యవాదములు. మీ ఆశీస్సులు.

    నందుడిట్లని చెప్పెను నందనునకు
    కంసుడన దయ నేరని కాలు డంద్రు
    బిడ్డడా! వాడు రణరంగ భీకరుండు
    వాని జోలికి పోబోకు వత్స! వినుము.

    వెన్నుడిట్లని పల్కెను వినవె తండ్రి!
    కంసుడన కాలుడా లేక కాలునకును
    బిడ్డడా? వాడు రణరంగ భీకరుండు
    గాగ నోపిక నేవాని కాలుడగుదు
    మాని చింతలు పోనిండు మధుర కిపుడు.

    రిప్లయితొలగించండి
  20. ఆహా! ఈ విఱుపులో రెండు అర్థాలతో చెప్పారే! భలే!!
    చప్పట్లు!!

    రిప్లయితొలగించండి
  21. మిస్సన్నగారూ!
    చాలా చక్కని పూరణలు చెప్పారు. అభినందనలు.

    రిప్లయితొలగించండి
  22. మిస్సనార్యులు గురువులు మేలనంగ
    "బిడ్డడా వాడు రణరంగ భీకరుండ"
    నెడు సమస్యకు నిష్ఠతో నేడికెన్నొ
    పూరణంబులు పల్కిరి పూజ్యులగుచు.

    రిప్లయితొలగించండి
  23. కుంతి భీముని చేకొని గుడికి బోవ
    పులిని గనినంత భీతిలి బాలు నొదిలె
    బండ రాళ్ళన్ని పగిలెను పిండి పిండి
    బిడ్డ డావాడు ? రణరంగ భీకరుండు

    రిప్లయితొలగించండి
  24. మధుర శబ్దార్థ భావాల మహిమ లలరు
    హృద్యమౌ పద్యముల నల్లు విద్య యందు
    మేటియై యొప్పు ధీనిధి మిత్రుడితడు
    మూర్తిగారి పొగడ్తన ముద్దు నాకు.

    రిప్లయితొలగించండి
  25. పండిత నేమాని వారూ,

    షణ్ముఖుఁడు బిడ్డఁడే, యీ
    షణ్మాత్రము జంకకుండ సాధుహృదయ స
    మ్రాణ్మాన్యులు పొగడంగ ద్వి
    షణ్ముఖ్యుని జంపె ననిన సత్కవి వయ్యా!

    వందనము పండితాగ్రిమ! వాక్సతీ ద
    యామృతాభిషిక్త! సుధీ! సన్యాసిరావు!
    రామజోగి మందును గొని రమ్యకావ్య
    రచనఁ జేసెడు నీకు నా ప్రణతు లివియె!
    *
    లక్ష్మీదేవి గారూ,

    అభిమన్యునిపై, సుజన హృ
    దభిరాముఁడు రాముని పయి యందముగా నీ
    వభిమానముఁ బూరణముల
    శుభకరముగఁ జెప్పినావు; శోభిలు! లక్ష్మీ!

    మందాకినీతరంగము
    లం దలపించెడి కవితల లక్ష్మీదేవీ!
    యందముగఁ జెప్పుచును మ
    మ్మందఱ మెప్పించుచుందు వభినందనముల్.
    *
    గోలి హనుమచ్ఛాస్త్రి గారూ,

    తారకాసురుఁ జంపిన శూరుఁ డైన
    స్కందుని గురించి పూరణ సత్కవివరు
    లెల్ల మెచ్చఁగఁ జేసితి విదియె నా ప్ర
    శంసఁ గొనుము, గోలి హనుమచ్ఛాస్త్రి! సుయశ!
    *
    సత్యనారాయణ మూర్తి గారూ,

    వే విధముల వ్రాయఁ దొడఁగి
    నావే సత్కవిత, సత్యనారాయణమూ
    ర్తీ! వీరుఁడై చెలంగిన
    శివాజిని పొగడితివి నీవు చేసెద నుతులన్.
    *
    చంద్రశేఖర్ గారూ,

    ‘మనతెలుగు’ చంద్రశేఖర!
    జనసామాన్యం బయిన విషయమే యైనన్
    ఘనముగ పూరణమునఁ జె
    ప్పిన మీ కభినందనముల వేడుక నిత్తున్.
    *
    సుబ్బారావు గారూ,

    రెల్లునఁ బుట్టిన యా పసి
    పిల్లఁడు రాక్షసులఁ జంపు వీరుం డని మా
    యుల్లం బలరగ పూరణ
    శుల్లముఁ గట్టితివి మేలు! సుబ్బారావూ!
    (శుల్లము = త్రాడు.... ఏం చేయను? యతి ప్రాసల కోసం పాట్లు!)
    *
    శ్రీపతి శాస్త్రి గారూ,

    పలనాటి యుద్ధమున వై
    రుల నెల్లరఁ జంపి వారి రుధిరాపగముం
    జలజల పారించుచుఁ దాఁ
    జెలఁగిన బాలునిఁ బొగడితె, శ్రీపతి శాస్త్రీ!
    *

    మిస్సన్న గారూ,

    టంగుటూరి ప్రకాశమున్, టైగరైన
    భగతుసిం, గభిమన్యులన్, బాలకృష్ణు
    వాయునందను, కంససంవాదములను
    పూరణమ్ములఁ బేర్కొన్న సారమతివి!

    మిస్సన్నా! బహువిధముల
    లెస్సగఁ బూరణము లెన్నొ లిఖియింప జనుల్
    ‘యె’స్సని తల లూపెదరు మ
    నస్సాక్షిగఁ జెప్పి వందనమ్ముల నిడుదున్.
    *
    సహదేవుడు గారూ,

    సహదేవుడా సెబాసని
    యహమహమిక లేక మెత్తు రందరు నీ ఖే
    దహరమ్మగు పూరణమును,
    మహనీయుఁడు పార్థసుతుఁడు మన కెల్లరకున్.
    *
    గుండు మధుసూదన్ గారూ,

    గుండు మధుసూదనా! ప్రీతి మెండుగాను
    కలుగఁ జేసిన పూరణగా నుతింతు
    ఫల్గుణుని కుమారుఁడు పసిబాలుఁ డయ్యు
    సమరశూరుఁ డనుచుఁ జెప్పు సత్కవివర!
    *
    ఫణిప్రసన్న కుమార్ గారూ,

    విజయుని కుమారుఁ డాతఁడు వీరవరుఁ డ
    టంచు చక్కని పూరణ నందఁ జేసి
    మెచ్చు వడసితి విప్పుడు మేలుగా ఫ
    ణిప్రసన్నకుమార! నిన్నెంతు నిపుడు.
    *
    రాజేశ్వరి అక్కయ్యా,

    బండల ముక్కలు జేసిన
    భండనభీముని గురించి వరపూరణఁ గై
    కొండని యిచ్చెను; సుజనులు
    రండు పొగడ, నేదునూరి రాజేశ్వరినిన్.

    రిప్లయితొలగించండి
  26. పూరణ చేసిన మము మన-
    సారగ నుతియించినట్టి శంకర! ఆర్యా!
    తీరుగ పద్యము లల్లుట
    మీరిడిన వరమ్ము కాదె! మేలు గురువరా!

    రిప్లయితొలగించండి
  27. నిరతము సూచనలిచ్చుచు
    సరియగు పద్యంబులల్లు సౌభాగ్యంబున్
    కరుణను మాకందించిన
    సరసాత్మక! వందనములు శంకరవర్యా!

    రిప్లయితొలగించండి
  28. అయ్యా! శ్రీ శంకరయ్య గారూ! నమస్కారములు.
    శ్రీ ఎచ్.వి.ఎస్.ఎన్.మూర్తి గారి గారిని ప్రశంసించుచూ మీరు చెప్పిన పద్యము (వేవిధములతో మొదలిడిన పద్యము) 4వ పాదములో మీరు ప్రాస నియమమును పాటించలేదు. సవరించండి. స్వస్తి.

    రిప్లయితొలగించండి
  29. పరుగులు తీసెను నేడే
    సురనదులై కలములెల్ల సుకవిత్వంబే
    తరలతరముగ జెలంగెను
    సరసగుణా! శంకరార్య! సత్కృతులివియే

    రిప్లయితొలగించండి
  30. మాస్టారూ, మీ పద్యరచనా శైలి, వేగమూ సదా ప్రశంశనీయము. మీ వ్యాఖ్యలు పద్య రూపంలో ప్రకటించటం మాకు ఒక చక్కని చెప్పక చెప్పిన పాఠము. ధన్యవాదాలతో, చంద్రశేఖర్.
    మిస్సన్న గారు తిరిగి కనిపించారు కానీ వసంతకిశోర్ గారు చాలా కాలంగా తప్పించుకొంటున్నారు.

    రిప్లయితొలగించండి
  31. తమ్ముని యాదరమ్మున తనివి జెంది
    పద్య రచనలు నేర్చితి హృద్య ముగను
    మిమ్ము దీవింతు వేయేండ్లు నెమ్మి సుఖము
    తమ్ముడా వర్ధిల్లు చిరకాల తనరు ప్రీతి .

    తమ్ముడూ ! అన్ని పద్యాలు ఎంత బాగున్నాయో . పేరు పేరునా ఓపిగ్గా వ్రాసి అలసి పోయి ఉంటారు. ఆరోగ్యం జాగ్రత్త. వైద్యం చేయించుకుని తొందరగా కోలుకోవాలని ఆ ఏడు కొండల వానికి వేవేల నమస్కృతులు

    రిప్లయితొలగించండి
  32. గురువుగారు,
    ధన్యులము.
    చాలా రోజులకు మీ రచన చదివి సంతోషమైనది.

    రిప్లయితొలగించండి
  33. పండిత నేమాని వారూ,
    నిజమే. పొరపాటే! ధన్యవాదాలు.
    *
    సత్యనారాయణ మూర్తి గారూ,
    మన్నించాలి! నా పద్యంలో దోషాన్ని నేమాని వారు చెప్పేదాకా గమనించలేదు. సవరించిన పద్యం...


    వే విధముల వ్రాయఁ దొడఁగి
    నావే సత్కవిత, సత్యనారాయణమూ
    ర్తీ! వీరుఁడౌ శివాజీ
    నే వర్ణించి పొగడితి వివే నతు లందున్.

    రిప్లయితొలగించండి
  34. శంకరార్యా! ధన్యవాదములు.

    పద్యములను కడు మెచ్చుచు
    పద్యములే చెప్పినారు పరమాచార్యా!
    హృద్యముగా నున్నవిలే
    ఉద్యమమిది పద్యములకె యునికిని బెంచన్.

    రిప్లయితొలగించండి
  35. శ్రీ శంకర గురువులకు సహస్ర వందనములు . పద్యములతో కూడిన మీ
    వ్యాఖ్యానములమోఘములు .ఆ శంకరుడు మిమ్ముల చల్లగ చూచు గాక !

    రిప్లయితొలగించండి