9, జూన్ 2012, శనివారం

సంయుక్తాక్షర కందము - ఒక వివరణ

మిత్రులారా!
సంయుక్తాక్షర కందము:
          డా. ఏల్చూరి వారి ప్రయోగము అనుపమానము.  వారి కందములో అన్ని అక్షరములు సంయుక్తాక్షరములు కావు కదా అనే అనుమానము వచ్చిన వారి కొరకు ఈ వివరణ.  కంద పద్యము యొక్క లక్షణములు ప్రకారము 6వ గణము జగణము కానీ నలము కానీ అయి ఉండవలెను.  అందుచేత ఆయా ప్రదేశములలో మాత్రము సంయుక్తము కాని అక్షరములను వాడుట జరిగినది.  ఈ విషయమును శ్రీ శంకరయ్య గారు వివరించినప్పటికినీ, నేను మరికొంచెము సులభ శైలిలో వివరించుటకు ప్రయత్నించేను.  అందరికీ ఈ విషయము అవగాహన అయినది అనుకొనుచున్నాను.  డా. ఏల్చూరి వారు నాకు ప్రత్యేకముగా  ఫోనులో తెలిపేరు.  వారి కంప్యూటరులో లోపము వలన వారే స్వయముగా వ్రాయలేకపోయేరని నాతో చెప్పేరు.
          ఆలాగుననే సర్వ లఘు కందమును కూడా ఉదహరించ వచ్చును.  సర్వ లఘు కందము అని చెప్పినా అందులో 2, 4 పాదముల చివరలో గురువు ఉండక తప్పదు.  స్వస్తి.  

పండిత నేమాని రామజోగి సన్యాసి రావు

3 కామెంట్‌లు:

  1. శ్రీ శంకరయా గారూ! ధన్యవాదములు - డా. ఏల్చూరి వారి తరఫున నా తరఫున మా నమస్కారములు. స్వస్తి.

    రిప్లయితొలగించండి
  2. అయ్యా నమస్కారాలు . ఏల్చూరి మురళీధరరావు గారి పాండిత్య శక్తికి ప్రణామాలు అర్పిస్తూనే శ్రీ పండిత నేమాని వారి వివరణ వల్ల పూర్తి సందేహ నివృత్తి జరుగుట లేదని అనిపించుచున్నది.

    పండిత నేమాని వారి వివరణ ప్రకారం 6వ గణము జగణము కాని , నల కాని అయ్యుండవలెనని అందుకని సంయుక్తాక్షరము వాడలేదని తెలిపినారు.

    కానీ ఒకటో పాదంలో త్యత్ క్ష్మాభృత్ అనేచోట భృ బదులుగా సంయుక్తాక్షరము వాడే అవకాశం ఏమైనా ఉందా ,

    అట్లే రెండో పాదంలో త్మ్యత్ క్ష్మా భృత్ అనే చోట భృ కు బదులుగా సంయుక్తాక్షరం వాడే వెసులుబాటు ఛందస్సు ప్రకారం ఉంది కదా -
    ఏదేమైనా ఒక అనితరసాధ్యమైన ప్రయోగం చేసినందుకు ఏల్చూరి వారికి సాష్టాంగ వందనాలు .

    రిప్లయితొలగించండి
  3. డాక్టర్ ఏల్చూరి మురళీధరరావుగారి సంయుక్తాక్షర కందము అత్యద్భుతము. వారి పాదారవిందములకు నా సాష్టంగనమస్కారములు.

    రిప్లయితొలగించండి