8, జూన్ 2012, శుక్రవారం

సమస్యాపూరణం - 729 (పతిపైనన్ బరమసాధ్వి)

కవిమిత్రులారా...

ఈరోజు పూరించవలససిన సమస్య ఇది...

పతిపైనన్ బరమసాధ్వి పాదము మోపెన్.

ఈ సమస్యను పంపిన కవిమిత్రునకు ధన్యవాదాలు.

31 కామెంట్‌లు:

 1. సుతునకు విద్యలు గఱుపను
  గతిలేక ఋణమును కోఱ, కఠినాత్ముండై
  పతినిన్ సాధించెడు ధన
  పతిపైనన్ బరమసాధ్వి పాదము మోపెన్.

  రిప్లయితొలగించండి
 2. శంకరాభరణ సమస్యా పూరణము చేయుచు
  పతి బద్దకమున నిదుర పోయే
  పతి పాటి చేయలేమా అని వదిలిన పాద
  పతిపైనన్ బరమసాధ్వి పాదము మోపెన్.

  చీర్స్
  జిలేబి.

  రిప్లయితొలగించండి
 3. అతిగర్వితమతి భయదా
  కృతితో యుద్ధమునను జెలరేగుచునుండన్
  క్షితి మహిషుండా దానవ
  పతిపైనన్ పరమ సాధ్వి పాదము మోపెన్

  రిప్లయితొలగించండి
 4. పతియే మహిషాసురుడయె
  సతియా రాక్షసుని జంపు ' సతి ' లా మారెన్
  అతి లేదు, నాటకంబది
  పతిపైనన్ బరమసాధ్వి పాదము మోపెన్.

  రిప్లయితొలగించండి
 5. జిలేబీ గారి భావానికి పద్యరూపం.....

  పతియె సమస్యాపూర్తికి
  నతి బద్ధకమున త్యజించె నఁట యొక పాదం
  బతివయుఁ దక్కువ కాదఁట!
  పతిపైనన్ పరమసాధ్వి పాదము మోపెన్.

  రిప్లయితొలగించండి
 6. లక్ష్మీదేవి గారూ,
  పాపం! అప్పు ఇవ్వనంత మాత్రాన తన్నులు తిన్నాడా ఆ ధనవంతుడు? బాగుంది మీ పూరణ. అభినందనలు.
  *
  పండిత నేమాని వారూ,
  అద్భుతమైన పూరణ. అభినందనలు.
  *
  గోలి హనుమచ్ఛాస్త్రి గారూ,
  బాగుంది మీ పూరణ. అభినందనలు.
  సతి ‘లా’ .. సతి ‘వలె’ అంటే?
  మూడవ పాదాన్ని ఇలా చెప్తే ఇంకా బాగుంటుందేమో... ‘స్తుతమైన నాటకమ్మున’

  రిప్లయితొలగించండి
 7. శ్రీపతిశాస్త్రిశుక్రవారం, జూన్ 08, 2012 8:35:00 AM

  శ్రీగురుభ్యోనమ:

  అతి వేగమునన్ జనుచున్
  గతి తప్పుచు క్రిందపడగ కలవరబడుచున్
  గతుకుల బాటన మతిచెడి
  పతిపైనన్ బరమసాధ్వి పాదము మోపెన్

  మతిచెడి = తెలివితప్పి

  రిప్లయితొలగించండి
 8. సతియౌ రుక్మిణి కొరకని
  పతియగు శ్రీ కృష్ణు డిచ్చె పరిజత పూవున్
  పతి చేష్టకు నాసత్యయు
  పతిపైనన్ బరమ సాధ్వి పాదము మోపెన్ .

  రిప్లయితొలగించండి
 9. శ్రీపతి శాస్త్రి గారూ,
  మీ పూరణ చాలా బాగుంది. అభినందనలు.
  *
  సుబ్బారావు గారూ,
  మంచి విషయాన్నే ఎన్నుకొన్నారు పూరణకు. బాగుంది.
  కాని కొన్ని పునరుక్తులున్నాయి. ‘పారిజాతము’ను ‘పరిజత’ అనడం దోషమే!
  మీ పద్యం స్ఫూర్తితో....

  అతికోపమున మతి సెడి
  పతిపైనన్ బరమసాధ్వి పాదము మోపెన్
  సతిని ప్రసన్నము జేయగ
  పతి కృష్ణుఁడు దెచ్చెఁ బారిభద్రపు పువ్వున్.
  (పారిభద్రము = పారిజాతము)

  రిప్లయితొలగించండి
 10. 1.చతురుండగు శ్రీ కృష్ణుడు
  సతి రుక్మిణి కిచ్చె పారిజాత సుమమ్మున్
  మతిచెడి కుపితగ సత్యయు
  పతిపైనన్ బరమ సాధ్వి పాదము మోపెన్.

  2.అతిమద్య పాన పరుడయి,
  సతినెప్పుడు శంక తోడ సాధింపంగా
  నతని యెడ నోర్మి గోల్పడి
  పతి పైనన్ బరమ సాధ్వి పాదము మోపెన్.

  రిప్లయితొలగించండి
 11. శృతిమించినట్టి రాక్షస

  పతి పైనన్ బరమ సాధ్వి పాదము మోపెన్.
  సతతము భక్తుల గాచెడి
  దృతి, నొకదినము రణమందు ధీరత్వమునన్

  రిప్లయితొలగించండి
 12. గుండు మధుసూదన్ గారి పూరణ.....

  సతి ప్రేమ యెవరిపైనన్?
  పతినే సేవించు నెవరు భక్తిని? బలి స
  మ్మతి హరి యెది మోపెఁ దలను?
  పతిపైనన్; పరమసాధ్వి; పాదము మోపెన్.

  రిప్లయితొలగించండి
 13. కమనీయం గారూ,
  మీ రెండు పూరణలూ మనోజ్ఞంగా ఉన్నాయి. అభినందనలు.
  *
  వరప్రసాద్ గారూ,
  మీ పూరణ బాగుంది. అభినందనలు.
  *
  గుండు మధుసూదన్ గారూ,
  క్రమాలంకారంలో మీ పూరణ ప్రశస్తంగా ఉంది. అభినందనలు.

  రిప్లయితొలగించండి
 14. కందానికి ఐదు పాదాలు ఒప్పుకోరు గానీ, మరి...
  సతిపతుల యాట పాటలు
  రతిపతి ఆనన నగునట రమణీ యంబై
  మితిమీరగ నందొకచో
  పతిపైనన్ బరమసాధ్వి పాదము మోపెన్.
  అతిగా యోచింపకు మది యతిసహజమురా!)

  రిప్లయితొలగించండి
 15. బ్రతుకీడ్చగ దొమ్మరి దం
  పతులే విన్యాసమెంచి పటిమనుజూపన్
  అతి క్లిష్టంబుగ నిలువన్
  పతిపైనన్ బరమసాధ్విపాదము మోపెన్!

  రిప్లయితొలగించండి
 16. అయ్యా! శ్రీ చంద్రశేఖర్ గారూ! అభినందనలు.
  మీ పద్యము బాగున్నది. 5వ పాదము వ్రాయకున్నా అన్వయము సరిపోతోంది. అందుచేత 5వ పాదము గురించి తలపవద్దు. స్వస్తి.

  అయ్యా సహదేవుడు గారూ! అభినందనలు.
  మీ పద్యములో అతి + క్లిష్టము అనే సమాసము వలన గణభంగము అవుతోంది. అతి కష్టము అంటే సరిపోతుంది. స్వస్తి.

  రిప్లయితొలగించండి
 17. మతిచెడిన మనుజుల నడుమ నుద్యోగమున
  కతిపయ దినములు గడుపుటెట్టొ యంచు
  నతిభయమున రమణి రయమున దిగుచు
  పతిపైనన్ బరమసాధ్వి పాదము మోపెన్

  రిప్లయితొలగించండి
 18. శంకరార్యా! చక్కని సవరణలను సూచించారు.ధన్యవాదములు.
  మీ సూచనతో...

  పతియే మహిషాసురుడయె
  సతియా రాక్షసుని జంపు ' సతి ' వలె మారెన్
  స్తుతమైన నాటకమ్మున
  పతిపైనన్ బరమసాధ్వి పాదము మోపెన్.

  రిప్లయితొలగించండి
 19. శ్రీనేమని గురువర్యులకు నమస్సులు.తమరిసవరణకు కృతఙ్ఞతలు.దయతో నా రెండవపూరణను పరిశీలించ ప్రార్థన:
  పితరులసద్గతికొరకై
  క్షితిపైగంగాస్రవంతిచిందులనోపన్
  నుతియించభగీరధుఁడుఁయా
  పతిపైనన్ బరమసాధ్విపాదము మోపెన్!

  రిప్లయితొలగించండి
 20. మతి మరపు మగని తోడను
  గతి తప్పిన సరసమందు కలహిం పంగన్ !
  శృతి మించగ పొరబాటున
  పతి పైనన్ బరమ సాద్వ్హి పాదము మోపెన్ !

  రిప్లయితొలగించండి
 21. శ్రీగురుభ్యోనమః
  రేండవ పూరణ మూడవ పాద సవరణ:

  'నుతియించ భగీరధుఁడా'

  రిప్లయితొలగించండి
 22. గోలి హనుమచ్ఛాస్త్రి గారూ మీ పూరణ బాగుంది.

  పతియే మహిషాసురుడయె
  సతియా రాక్షసుని జంపు ' సతి ' వలె మారెన్

  రిప్లయితొలగించండి
 23. రాజేశ్వరి నేదునూరి గారూ

  మతి మరపు మగని తోడను
  గతి తప్పిన సరసమందు కలహిం పంగన్ !
  --------
  పూరణ వావ్. ఎంత నిజం.

  రిప్లయితొలగించండి
 24. లక్కరాజు గారూ ! ధన్యవాదములు.
  మీ పూరణలకై ఎదురు చూస్తున్నాను..రుచి చూపండీ...

  రిప్లయితొలగించండి
 25. అయ్యా శ్రీ సహదేవుడు గారూ! శుభాశీస్సులు. మీ భావము ఉత్తమముగా నున్నది. 3వ పాదములో సంధి దోషము అక్కడ యడాగమము సరికాదు. ఇలా సవరించండి. నుతియించ భగీరథుండా - అని. స్వస్తి.

  రిప్లయితొలగించండి
 26. అయ్యా శ్రీ సహదేవుడు గారూ! శుభాశీస్సులు. మీ భావము ఉత్తమముగా నున్నది. 3వ పాదములో సంధి దోషము అక్కడ యడాగమము సరికాదు. ఇలా సవరించండి. నుతియించ భగీరథుండా - అని. స్వస్తి.

  రిప్లయితొలగించండి
 27. అయ్యా శ్రీ సహదేవుడు గారూ! శుభాశీస్సులు.
  నా సవరణకే చిన్న సవరణ - టైపు పొరపాటు వలన. మరొక పొరపాటు వలన.
  మీ భావము ఉత్తమముగా నున్నది. 3వ పాదములో సంధి దోషము అక్కడ యడాగమము సరికాదు. ఇలా సవరించండి. నుతియించ భగీరథుడా - అని. స్వస్తి.

  రిప్లయితొలగించండి
 28. గోలి హనుమచ్ఛాస్త్రి గారూ

  ఒకప్పుడు పద్యాలు వ్రాశా కానీ ఇప్పుడు చదివి ఆనందించ టము వరకే. థాంక్స్.

  రిప్లయితొలగించండి
 29. అతి కోపంబున వనితలు
  మితి మీరుచు మీదబడుట మెండుగ కద్దౌ
  సతి కలకత్తా కాళియె
  పతిపైనన్ బరమసాధ్వి పాదము మోపెన్

  రిప్లయితొలగించండి
 30. అతిగా బంగరు కలిగిన
  జత కోటుల నత్తగారు చంపుకు తినగా
  మతిబోవగ గతి తోచక
  పతిపైనన్ బరమసాధ్వి పాదము మోపెన్

  రిప్లయితొలగించండి