27, జూన్ 2012, బుధవారం

సమస్యాపూరణం - 747 (రణ మది శాంతిసౌఖ్యముల)

కవిమిత్రులారా...

ఈరోజు పూరించవలససిన సమస్య ఇది...

రణ మది శాంతిసౌఖ్యముల రాజిలఁ జేయుచుఁ గూర్చు శ్రేయముల్.

ఈ సమస్యను పంపిన కవిమిత్రునకు ధన్యవాదాలు.

పూరణలు 

౧.  హరి వేంకట సత్యనారాయణ మూర్తి
(1)
గణుతిని బెంచు సంఘమున, కావ్యములన్ రచియించు శక్తి, స
ద్గుణముల రాశులిచ్చు, కవికోవిద నామము దెచ్చిపెట్టు స
న్మణినిభమైన పద్యకుసుమాలకు నిష్ఠను బూని చేయు పూ
రణమది శాంతిసౌఖ్యముల రాజిలఁ జేయుచుఁ గూర్చు శ్రేయముల్.

(2)
క్షణికములైన భోగములు కాంతలు, పుత్రులు గాన ముక్తికై
    గణపతిఁ గన్నతల్లి పదకంజయుగంబున కెల్లవేళలన్
    ప్రణతులు చేసి యంబికను భక్తిఁ స్మరించగ జేయునట్టి ప్రే
    రణమది శాంతిసౌఖ్యముల రాజిలఁ జేయుచుఁ గూర్చు శ్రేయముల్.
 
౨. పండిత నేమాని రామజోగి సన్యాసి రావు
ప్రణతులు దేవదేవ! సురరాజనుతా! గిరిజాతనూజ! వా
రణముఖ! సత్కవి ప్రకర రంజక వాగ్విభవాఢ్య! నీ శుభే
క్షణము శుభంకరంబని జగమ్ముల గాంచె ప్రశస్తి యోగ కా
రణమది శాంతి సౌఖ్యముల రాజిలజేయుచు గూర్చు శ్రేయముల్. 

౩. లక్ష్మీదేవి
(1)
అనుదిన మన్నదమ్ములయి హార్దిక సఖ్యముఁ బెంచుకోవలెన్.
మనమిటు భారతీయతను మానసమందునఁ నిల్పుకోవలెన్.
వినుమిక సింధుదేశమున వీడుము ద్వేషపు ధోరణుల్; నివా
రణ మది శాంతిసౌఖ్యముల రాజిలఁ జేయుచుఁ గూర్చు శ్రేయముల్. 

(2)
ఝణఝణ మంచు నందియలు, ఝంకృతిఁ జేసెడు భృంగ నాదముల్,
గణగణ మ్రోగు గంటలును, గంగ నుఱుంగులు సేయు సవ్వడుల్,
రణనముఁ చిన్న పిల్లలును లౌక్యమెఱుంగక జేయ; తాప వా
రణమది శాంతిసౌఖ్యముల రాజిలఁ జేయుచుఁ గూర్చు శ్రేయముల్. 

౪. రవి
    గణగణ వేదమంత్రములు కర్ణములన్ రసపూరితం బొన
    ర్ప నయనముల్ విధూపముల పట్టున భాష్పములందు వేళలోన్
    మెణకరితండ్రి గూర్చునొక మెండగు పండుగ - జన్నిదంపు ధా
    రణ మది శాంతిసౌఖ్యముల రాజిలఁ జేయుచుఁ గూర్చు శ్రేయముల్.
(మెణకరి = బ్రహ్మచారి)

౫. సహదేవుడు
    (శ్రీకృష్ణ భగవానుడు సంధి జేయుటకు సుయోధనునితో పలికిన పలుకులు)
వినుము సుయోధనా! తమరు పెట్టిన బాధల నోర్చి పాండవుల్
నను నిటు దూతగన్ బనుప నాశము గోరక సంధి జేయగన్
కనుగొన వచ్చితిన్ జనుల గావగ యుద్ధము మాన్పగ న్నివా
రణమది శాంతిసౌఖ్యముల రాజిలఁ జేయుచుఁ గూర్చు శ్రేయముల్.
    
౬. చంద్రమౌళి
    అణువది కారణం బదియె ఆప్తుల-వైరుల కల్గజేయు మా
    రణమగు- భోగవంత మగు రాజిల పల్కుల భావధాటి తా
    రణమగు- మృత్యుఘోర మగు రంజిల తద్రసనాగ్ర శబ్ద తో
    రణమది శాంతిసౌఖ్యముల రాజిలఁ జేయుచుఁ గూర్చు శ్రేయముల్.
 
౭. రాజేశ్వరి నేదునూరి...
    గణనము చేసి చూడగను కారణ మేమియు గాన రాదిలన్
    మణిమయ మైన జీవితపు మారుని బోలిన భర్త చెంతనే
    అణకువ లేక నాగరికతాతిశయంబును వీడి మానుమా
    రణమది శాంతి సౌఖ్యము లరాజిలఁ జెయుచుఁగూర్చు శ్రెయముల్ !
 
౮. గుండు మధుసూదన్
(1)
ప్రణతు లొనర్చి విఘ్నపతిఁ బ్రార్థన సేయఁగ విద్య లిచ్చి, ష
డ్గుణముల డుల్చి సన్మతినిఁ గూర్చి, ముదమ్ములఁ బేర్చి, స
త్ఫణితి నొనర్చి, వేగ ననుఁ బాలన సేసెడి నాదు జన్మతా
రణమది శాంతిసౌఖ్యముల రాజిలఁ జేయుచుఁ గూర్చు శ్రేయముల్.
(2)
గణపతి, విఘ్నహారియు, నగాత్మజకున్ తొలి పుత్రకుండు, స
ద్గుణములఁ బెంచు వేలుపునుఁ, గుంజరశీర్షుఁడు, వక్రతుండుఁ డీ
ప్రణతుల స్వీకరించఁగను బ్రార్థన సేయఁగ నన్ను దేర్చు కా
రణమది శాంతిసౌఖ్యముల రాజిలఁ జేయుచుఁ గూర్చు శ్రేయముల్.

౯. మిస్సన్న(1) 
పణముగ బెట్టి దేశ హిత భాగ్యములన్ తన బాగుకోసమై
    గనులను, కొండలన్, వనుల, కాల్వల, చెర్వుల, బీడుభూములన్
    తనవిగ నెంచి దోచుకొను త్రాష్టుల శిక్షల జేయ వృద్ధి కా-
    రణమది శాంతిసౌఖ్యముల రాజిలఁ జేయుచుఁ గూర్చు శ్రేయముల్
(2)
ధనములు ధాన్యముల్ సిరులు దారయు బిడ్డలు నన్ని సౌఖ్యముల్
    క్షణికము లన్న సత్యమును చక్కగ నమ్మి మనమ్మునందు ల-
    క్షణముగ సర్వ కర్మముల శంభున కర్పణ జేయ మోక్షతో-
    రణమది శాంతిసౌఖ్యముల రాజిలఁ జేయుచుఁ గూర్చు శ్రేయముల్.

౧౦. ‘మన తెలుగు’ చంద్రశేఖర్    
అణుగుచు నాత్మగౌరవము ‘అంతొనియా’కు పణంబుగానిడెన్
    కణకణ మండగా ధరలు కట్టడి జేయక నూరకుండె నా
    ప్రణబుని కాంగ్రెసాత్మజుని రాష్ట్రపతిత్వము క్షేమమా? విచా
    రణ మది శాంతిసౌఖ్యముల రాజిలఁ జేయుచుఁ గూర్చు శ్రేయముల్.
(గమనిక: సోనియా అసలు పేరు అంతొనియా. )

౧౧. కమనీయం
గుణనిధి,నాదు మాటలను గూరిమితో విను రాఘవేంద్రుతో
రణమన సర్వ నాశనకరంబగు,లంకకు జేటు దెచ్చు,రా
వణ! తగుసంధి కియ్యకొనవయ్య , మహోద్ధత యుద్ధమున్ నివా
రణమది శాంతి సౌఖ్యముల రాజిల జేయుచు గూర్చు శ్రేయముల్ .

30 కామెంట్‌లు:

  1. అనుదిన మన్నదమ్ములయి హార్దిక స్నేహముఁ బెంచుకోవలెన్.
    మనమిటు భారతీయతను మానసమందునఁ నిల్పుకోవలెన్.
    వినుమిక సింధుదేశమున వీడుము ద్వేషపు ధోరణుల్; నివా
    రణ మది శాంతిసౌఖ్యముల రాజిలఁ జేయుచుఁ గూర్చు శ్రేయముల్.

    రిప్లయితొలగించండి
  2. గణుతిని బెంచు సంఘమున, కావ్యములన్ రచియించు శక్తి, స
    ద్గుణముల రాశులిచ్చు, కవికోవిద నామము దెచ్చిపెట్టెడున్
    మణినిభమైన పద్యకుసుమాలకు నిష్ఠను బూని చేయు పూ
    రణమది శాంతిసౌఖ్యముల రాజిలఁ జేయుచుఁ గూర్చు శ్రేయముల్.

    రిప్లయితొలగించండి
  3. లక్ష్మీదేవి గారూ,
    బాగుంది మీ పూరణ. అభినందనలు.
    ‘హార్దిక స్నేహము’ అన్నప్పుడు ‘క’గురువై గణదోషం ఏర్పడుతున్నది. ‘హార్దిక సఖ్యము’ అంటే సరి!

    రిప్లయితొలగించండి
  4. ప్రణతులు దేవదేవ! సురరాజనుతా! గిరిజాతనూజ! వా
    రణముఖ! సత్కవి ప్రకర రంజక వాగ్విభవాఢ్య! నీ శుభే
    క్షణము శుభంకరంబని జగమ్ముల గాంచె ప్రశస్తి యోగ కా
    రణమది శాంతి సౌఖ్యముల రాజిలజేయుచు గూర్చు శ్రేయముల్

    రిప్లయితొలగించండి
  5. అయ్యా! శ్రీ మూర్తి గారూ! శుభాశీస్సులు.
    మీ పూరణ చాల బాగున్నది. 2వ పాదము చివరలో తెచ్చి బెట్టెడున్ అన్నారు - అంటే తెచ్చి బెట్టగా అని అర్థము. అందుచేత ఆ పదమును కాస్త సవరించండి. స్వస్తి.

    రిప్లయితొలగించండి
  6. మూర్తి గారూ,
    సందర్భోచితంగా ప్రశస్తంగా ఉంది మీ పూరణ. అభినందనలు.
    నేమాని వారి వ్యాఖ్య ననుసరించి...
    ‘తెచ్చిపెట్టు స
    న్మణినిభమైన....’ అంటే ఎలా ఉంటుందంటారు?
    *
    పండిత నేమాని వారూ,
    అద్భుతమైన పూరణ చెప్పారు. అభినందనలు.

    రిప్లయితొలగించండి
  7. ఈ సమస్య కూడా పునరుక్తిగానే కనుపిస్తోంది.

    రిప్లయితొలగించండి
  8. ఆర్యా!
    ధన్యవాదములు.
    నమస్కారములు.
    నాపద్యం రెండవ పాదం చివరి పదాన్ని "పెట్టుచున్" గా సవరించ ప్రార్థన.

    రిప్లయితొలగించండి
  9. ఆర్యా!
    నమస్కారములు.
    మీ సవరణను చూచుకోలేదు. అలాగే సవరించగలరు.

    రిప్లయితొలగించండి
  10. మిస్సన్న గారూ,
    సమస్య కాదు కాని భావపునరుక్తి అయింది. గతంలో ఇచ్చిన సమస్యలు ఇవి...
    ‘రణము హర్షంబు గూర్చు విశ్రాంతి వేళ’
    ‘రణమె మనల కిఁక శరణము గాదె’
    ధన్యవాదాలు.

    రిప్లయితొలగించండి
  11. గణగణ వేదమంత్రములు కర్ణములన్ రసపూరితంబొన
    ర్ప నయనముల్ విధూపముల పట్టున భాష్పములందు వేళలోన్
    మెణకరితండ్రి గూర్చునొక మెండగు పండుగ - జన్నిదంపు ధా
    రణ మది శాంతిసౌఖ్యముల రాజిలఁ జేయుచుఁ గూర్చు శ్రేయముల్.

    రిప్లయితొలగించండి
  12. శ్రీకృష్ణ భగవానుడు సంధి జేయుటకు సుయోధనునితో పలికిన పలుకులు :

    వినుము సుయోధనా! తమరి వికృత కార్యముల్ దలంపకన్
    ననుయిటు దూతగన్ బనుప నాశము గోరక సంధి జేయగన్
    కనుగొన వచ్చితిన్ జనుల గావగ యుద్ధము మాన్పగ న్నివా
    రణమది శాంతిసౌఖ్యముల రాజిలఁ జేయుచుఁ గూర్చు శ్రేయముల్.

    రిప్లయితొలగించండి
  13. క్షణికములైన భోగములు కాంతలు, పుత్రులు గాన ముక్తికై
    గణపతిఁ గన్నతల్లి పదకంజయుగంబున కెల్లవేళలన్
    ప్రణతులు చేసి యంబికను భక్తిఁ స్మరించగ జేయునట్టి ప్రే
    రణమది శాంతిసౌఖ్యముల రాజిలఁ జేయుచుఁ గూర్చు శ్రేయముల్.

    రిప్లయితొలగించండి
  14. అణువది కారణంబదియె ఆప్తుల-వైరుల కల్గజేయు మా
    రణమగు-భోగవంతమగు రాజిల పల్కులభావధాటి తా
    రణమగు-మృత్యుఘోరమగు రంజిల తద్రసనాగ్ర శబ్ద తో
    రణమది శాంతిసౌఖ్యముల రాజిలఁ జేయుచుఁ గూర్చు శ్రేయముల్.

    రిప్లయితొలగించండి
  15. అయ్యా శ్రీ సహదేవుడు గారూ!
    శుభాభినందనలు. మీ పద్యము బాగున్నది. కొన్ని సవరణలు సూచించుచున్నాను.
    (1) వికృత: అనే పదములో కృ అనేది సంయుక్తాక్షరము కాదు. అందుచేత వి గురువు కాదు. క్రు అనే అక్షరము అయితే దాని ముందు అక్షరము గురువు అవుతుంది.
    (2) తలంపకన్: అనే ప్రయోగము సాధువు కాదు. తలంపక అనేది వ్యతిరేకార్థక పదము కాబట్టి దాని తరువాత "న్" పొల్లు రాదు. తలంపకే అని మార్చ వచ్చును.
    (3) ననుయిటు : యడాగమము చేయరాదు. నుగాగమము చేసి నను నిటు అనాలి. స్వస్తి.

    రిప్లయితొలగించండి
  16. శ్రిగురుభ్యోనమః
    శ్రీ పండిత నేమని గురువర్యులకు ప్రణామములు.
    తమరి విలువైన సూచనలకు ధన్యవాదములు.
    సవరించిన పద్యం:

    వినుము సుయోధనా! తమరు పెట్టిన బాధలనోర్చిపాండవుల్
    ననునిటు దూతగన్ బనుప నాశము గోరక సంధి జేయగన్
    కనుగొన వచ్చితిన్ జనుల గావగ యుద్ధము మాన్పగ న్నివా
    రణమది శాంతిసౌఖ్యముల రాజిలఁ జేయుచుఁ గూర్చు శ్రేయముల్.

    రిప్లయితొలగించండి
  17. గణనము చేసి చూడగను కారణ మేమియు గాన రాదిలన్
    మణి మయమైన జీవితపు మారుని బోలిన భర్త చెంతనే
    అణకువ లేక నాగరి కతంచు దురాశను వీడి మానుమా
    రణమది శాంతి సౌఖ్యము లరాజిలఁ జెయుచుఁగూర్చు శ్రెయముల్ !

    రిప్లయితొలగించండి
  18. గుండు మధుసూదన్ గారి పూరణలు....
    (1)
    ప్రణతు లొనర్చి విఘ్నపతిఁ బ్రార్థన సేయఁగ విద్య లిచ్చి, ష
    డ్గుణముల డుల్చి సన్మతినిఁ గూర్చి, ముదమ్ములఁ బేర్చి, స
    త్ఫణితి నొనర్చి, వేగ ననుఁ బాలన సేసెడి నాదు జన్మతా
    రణమది శాంతిసౌఖ్యముల రాజిలఁ జేయుచుఁ గూర్చు శ్రేయముల్.
    (2)
    గణపతి, విఘ్నహారియు, నగాత్మజకున్ తొలి పుత్రకుండు, స
    ద్గుణములఁ బెంచు వేలుపునుఁ, గుంజరశీర్షుఁడు, వక్రతుండుఁ డీ
    ప్రణతుల స్వీకరించఁగను బ్రార్థన సేయఁగ నన్ను దేర్చు కా
    రణమది శాంతిసౌఖ్యముల రాజిలఁ జేయుచుఁ గూర్చు శ్రేయముల్.

    రిప్లయితొలగించండి
  19. ఝణఝణ మంచు నందియలు, ఝుంకృతిఁ జేసెడు భృంగ నాదముల్,
    గణగణ మ్రోగు గంటలును, గంగ నుఱుంగులుఁ జేయు సవ్వడుల్,
    రణనముఁ చిన్న పిల్లలును లౌక్యమెఱుంగక జేయ; తాప వా
    రణమది శాంతిసౌఖ్యముల రాజిలఁ జేయుచుఁ గూర్చు శ్రేయముల్.

    రిప్లయితొలగించండి
  20. గురువుగారూ ధన్యవాదాలు.

    పణముగ బెట్టి దేశ హిత భాగ్యములన్ తన బాగుకోసమై
    గనులను, కొండలన్, వనుల, కాల్వల, చెర్వుల, బీడుభూములన్
    తనవిగ నెంచి దోచుకొను త్రాష్టుల శిక్షల జేయ వృద్ధి కా-
    రణమది శాంతిసౌఖ్యముల రాజిలఁ జేయుచుఁ గూర్చు శ్రేయముల్

    రిప్లయితొలగించండి
  21. ధనములు దాన్యముల్ సిరులు దారయు బిడ్డలు నన్ని సౌఖ్యముల్
    క్షణికము లన్న సత్యమును చక్కగ నమ్మి మనమ్మునందు ల-
    క్షణముగ సర్వ కర్మముల శంభున కర్పణ జేయ మోక్షతో-
    రణమది శాంతిసౌఖ్యముల రాజిలఁ జేయుచుఁ గూర్చు శ్రేయముల్.

    రిప్లయితొలగించండి
  22. అణుగుచు నాత్మగౌరవము అంతొనియాకు పణంబుగానిడెన్
    కణకణ మండగా ధరలు కట్టడి జేయక నూరకుండె నా
    ప్రణబుని కాంగ్రెసాత్మజుని రాష్ట్రపతిత్వము క్షేమమా? విచా
    రణ మది శాంతిసౌఖ్యముల రాజిలఁ జేయుచుఁ గూర్చు శ్రేయముల్.

    రిప్లయితొలగించండి
  23. సర్వజనానుమోదంగా పూరణలు పంపిన కవిమిత్రులు...
    హరి వేంకట సత్యనారాయణ మూర్తి గారికి,
    పండిత నేమాని రామజోగి సన్యాసి రావు గారికి,
    లక్ష్మీదేవి గారికి,
    రవి గారికి,
    సహదేవుడు గారికి,
    చంద్రమౌళి గారికి,
    నేదునూరి రాజేశ్వరి అక్కయ్య గారికి,
    గుండు మధుసూదన్ గారికి,
    మిస్సన్న గారికి,
    ‘మనతెలుగు’ చంద్రశేఖర్ గారికి,
    ......... అభినందనలు, ధన్యవాదాలు.

    రిప్లయితొలగించండి
  24. గుణనిధి,నాదు మాటలను గూరిమితో విను రాఘవేంద్రుతో
    రణమన సర్వ నాశనకరంబగు,లంకకుజేటుదెచ్చు,రా
    వణ,తగుసంధికియ్యకొనవయ్య , మహోద్ధత యుద్ధమున్ నివా
    రణమది శాంతి సౌఖ్యముల రాజిల జేయుచు గూర్చు శ్రేయముల్ .

    రిప్లయితొలగించండి
  25. కమనీయం గారూ,
    మనోహరంగా ఉంది మీ పూరణ. అభినందనలు.

    రిప్లయితొలగించండి
  26. పుణుకులు మిర్చి బజ్జిలును పూర్ణపు బూరెలు కజ్జికాయలన్
    పణమును బెట్టి శుంఠవలె పంతము బట్టుచు రోజుకైదుగా
    గణములు పేర్చి పూరణలు కమ్మగ కూర్చెడి కైపదంపుతో
    రణమది శాంతిసౌఖ్యముల రాజిలఁ జేయుచుఁ గూర్చు శ్రేయముల్

    రిప్లయితొలగించండి