2, జూన్ 2012, శనివారం

రవీంద్రుని గీతాంజలి - 31

రవీంద్రుని గీతాంజలి

తెనుఁగు సేత

శ్రీమాన్ చిలుకమఱ్ఱి రామానుజాచార్యులు

31

"PRISONER, tell me, who was it that
bound you ? "

" It was my master," said the prisoner.
" I thought I could outdo everybody in
the world in wealth and power, and I
amassed in my own treasure-house the
money due to my king. When sleep
overcame me I lay upon the bed that
was for my lord, and on waking up I
found I was a prisoner in my own
treasure-house."

"Prisoner, tell me who was it that
wrought this unbreakable chain ? "

" It was I," said the prisoner, " who
forged this chain very carefully.
I thought my invincible power would
hold the world captive leaving me in a
freedom undisturbed. Thus night and
day I worked at the chain with huge
fires and cruel hard strokes. When at
last the work was done and the links
were complete and unbreakable, I
found that it held me in its grip." 


“ఇంతగట్టిగ బంధించె నెవఁడు నిన్ను?
బద్ధుఁడా! తెల్పు మీ” వన బంది పల్కె
“నా ప్రభువె నన్ను బంధించినాఁ” డఁటంచు ||

“నేనె ధనమున బలమున నెల్లవారి
మించి ముందున కేగ నూహించుకొంటి,
స్వామిపాలిటి ధనమును సైత మేనె
కల్పుకొంటిని సొంత బొక్కసమునందు,
క్రమ్మె నిద్దుర, ప్రభువు తల్పమ్ము పైనె
పవ్వళించితి మెలకువ వచ్చి చూడ
బందిగా నుంటి బొక్కసమందె” యంచు ||

“ఇంత కఠినఁపు గొలుసిది యెవఁడు చేసె?
బద్ధుఁడా! తెల్పు మీ” వన బంది పల్కె,
“ఈ గొలుసు తొల్లి స్వయముగ నేనె సిద్ధ
పరచుకొంటిఁ బ్రయత్నతత్పరుఁడ నౌచు,
తలఁచుకొంటి నజేయప్రతాప మూని
గొలుసు దగిలించి విశ్వశక్తులు సమస్త
మేన బంధింతు నడ్డొక యింత లేక,
స్వవశమం దుండి నాకునే, సకలసృష్టి
బందిగొని సేవ చేయించుకొందు నంచు,
దీనికై రేబవ ళ్ళతి తీవ్రమైన
యత్నమున నగ్గి జిమ్ము లోహమ్ము గరఁచి,
గాటఁపు న్మేటి సంపెట వ్రేటు లిచ్చి,
గొలు సిటుల్ సిద్ధముం జేసికొంటి నేనె,
కాని కొక్కెము లొక్కటొక్కటిగ దాన
నదుకుకొని త్రెంపరానిది యైనవేళ
నట్టె చూతుఁగదా! గొలు సదియె తగిలి
స్వయముగా నేనె బద్ధుఁడ నయితి” నంచు ||

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి