22, జూన్ 2012, శుక్రవారం

పద్య రచన - 29


కవిమిత్రులారా,

పై చిత్రాన్ని పరిశీలించి తగిన పద్యా(లను)న్ని వ్రాయండి.

20 కామెంట్‌లు:

  1. కుప్పించి యెగసిన
    అద్భుతమైన పద్యపు చిత్రము ఉంచినందుకు మరీ మరీ ధన్యవాదాలు మీకు గురువుగారు.

    నిన్న పూర్తి సంతృప్తి గలుగనందున
    మరొక ప్రయత్నము

    తెల్లటి ఱెక్కలన్ గలిగి తీయగఁ బల్కెడు రాజహంసమా!
    యెల్లరి మానసమ్మలర యిచ్చటికిప్పుడు వచ్చినావటే!
    వెల్లువ లయ్యె నా మదిని వింతగ సంతసమో మరాళమా!
    యుల్లము పాడె, నా సఖుని యొద్దకు చేరుచు మానసమ్మిదే!

    రిప్లయితొలగించండి
  2. తప్పని దెలిసియు మరియిక
    తప్పని తరుణమున ముప్పు తన భక్తులకున్
    తప్పింపగ తన మాటను
    తప్పుటకున్ సిద్ధ పడిన త్రాతకు జేజే.

    రిప్లయితొలగించండి
  3. నా పద్యములో తెల్లటి బదులు తెల్లని సరిగ్గా ఉంటుంది.
    హనుమచ్ఛాస్త్రిగారు,
    బహు చక్కటి పద్యము, భావము చెప్పారుగా. అభినందనలు.

    రిప్లయితొలగించండి
  4. నీవే దిక్కవు ధర్మ రక్షణపరా! నీలాభ్ర సంకాశ! యి
    ట్లీవే యాయుధమూని వచ్చితిగదే శ్రీకృష్ణ! నీ భృత్యుడన్
    దేవా! చక్రధరా! ధరాధరధరా! తేజోనిధానా! కృపా
    భావా! పాహి! నమశ్శతమ్ములివె! నన్ బాలింపుమా శ్రీధరా!

    అని భీష్ముడు నతిసేయగ
    నని నా యాయుధము దించి యబ్జాక్షుడు నె
    మ్మనమున శాంతము మెండుగ
    దనరగ స్యందనము నెక్కె దరహాసముతో

    రిప్లయితొలగించండి
  5. కుప్పించి యెగసి కృష్ణుం
    “డిప్పుడె పరిమార్తు భీష్ము నిదె” యన నరుఁడున్
    దప్పని పాదము వట్టఁగ
    నప్పుణ్యసరిత్కుమారుఁ డబ్బురపడియెన్.

    రిప్లయితొలగించండి
  6. "పట్టనటంచుఁ బల్కితివి, పట్టకుమాయుధమిట్లు శ్రీ హరీ!
    పట్టినచో ననుం జనులు బల్కుల హేళనజేతురయ్యహో!"
    పట్టుచు నర్జునుండు తన పాదమునప్పుడు వేడినంత, జే
    బట్టిన చక్రమున్ విడిచి పాలనజేసె మఱింది మాటలన్.

    రిప్లయితొలగించండి
  7. నీలము నాకసమ్ములను నింపగ నుగ్రత తోడనప్పుడా
    లీలనుఁ జూపె చక్రి యవలీలగఁ జంపెద భీష్మునంచు; నన్
    బేలనుఁ జేయబోకుమనె భీరువు నంచు జగమ్మనున్, హరీ!
    మాలిమి తో కిరీటి బలుమారులు వేడెను కృష్ణదేవునిన్.

    రిప్లయితొలగించండి
  8. వరుస ఇలా ఉండాలి.

    నీలము నాకసమ్ములను నింపగ నుగ్రత తోడనప్పుడా
    లీలనుఁ జూపె చక్రి యవలీలగఁ జంపెద భీష్మునంచు; నన్
    బేలనుఁ జేయబోకుమనె భీరువు నంచు జగమ్మనున్, హరీ!
    మాలిమి తో కిరీటి బలుమారులు వేడెను కృష్ణదేవునిన్.
    "పట్టనటంచుఁ బల్కితివి, పట్టకుమాయుధమిట్లు శ్రీ హరీ!
    పట్టినచో ననుం జనులు బల్కుల హేళనజేతురయ్యహో!"
    పట్టుచు నర్జునుండు తన పాదమునప్పుడు వేడినంత, జే
    బట్టిన చక్రమున్ విడిచి పాలనజేసె మఱింది మాటలన్.

    రిప్లయితొలగించండి
  9. శ్రీపతిశాస్త్రిశుక్రవారం, జూన్ 22, 2012 9:40:00 AM

    శ్రీగురుభ్యోనమ:

    భీకర యుద్దరంగమున భీష్ముని ధాటికి తాళలేక నే
    కాకిగనిల్చె ఫల్గుణుడు గంగసుతుండటు రెచ్చిపోవగా
    దూకెను కృష్ణుడంతట ప్రదోషపుకాలమునందు రుద్రుడై
    చేకొని చక్రమున్ నిజము జేయగ భక్తుని పల్కు ధాత్రిపై

    రిప్లయితొలగించండి
  10. ప్రతిన నీ యది యిప్పుడు భంగ పఱు చ
    నాయుధం బూ ని వత్తువ? యాది దేవ !
    పలుక భీ ష్ము డు బాణ ముం బా ఱ వైచె
    కృష్ణ భగవాను డ య్యెడ గరుణ తోడ .

    రిప్లయితొలగించండి
  11. ఈ చిత్రానికి పోతనగారి ప్రసిద్ధమైన పద్యాలకన్న వేరే వ్యాఖ్య చేయడానికి మనసు ఒప్పుకోవటం లేదు.

    రిప్లయితొలగించండి
  12. సీ.
    ఆయుధంబును బూన నర్జున! నేనంచు
    పల్కి యుండియు నాదు భాగ్యమేమొ,
    నన్నుఁ జంపగఁ బూని నవనవోత్సాహియై
    యీరీతి భగవాను డేగుదెంచె
    విశ్వభారకుడౌచు వెలుగొందు చుండెడి
    దేవాధిదేవుడీ దివ్యమూర్తి
    నీలమేఘాభుడై నిఖిలావనుండౌచు
    చక్రంబు చేపట్టి విక్రమించి
    తే.గీ.
    వేగ మిదెవచ్చెనంచును భీష్ముడపుడు
    తన్మయత్వాన కృష్ణునిఁ తలచుచుండి
    ఆయుధంబులు త్యజియించి యవనతుడయి
    ప్రణతులర్పించి నిలిచెను భక్తితోడ.
    కం.
    ఒకభక్తునిఁ గాచుటకై
    యొకభక్తుని మీదకురికె నుత్సాహముతో
    సకలము తానగు దేవుం
    డకటా! యని చూచి రమరు లాదృశ్యంబున్.

    రిప్లయితొలగించండి
  13. భీష్ముని బాణ పరంపర
    గ్రీష్మర్తిన తాపమట్లు క్రీడిని తాకన్
    భీష్ముని చంపుదు నేనని
    గ్రీష్మర్తిన బింబమట్లు కృష్ణుడు లేచెన్.

    కుప్పించి దుముక శ్రీహరి
    కప్పెను కుండలపు కాంతి గగనము నెల్లన్
    గప్పున జారెను పటలము
    ముప్పాయెను కడుపులోని ముజ్జగములకున్.

    నిలువుము ఫల్గుణ చంపుదు
    సలిలసుతుని తక్షణంబె చక్రము తోడన్
    పలుకుచు శౌరి చనంగా
    కలవర పడె నర్జునుండు ఘన విభ్రాంతిన్.

    నమ్మితి నా భుజబలమును
    నెమ్మది నగుబాటు గల్గు నీరజ నయనా
    రమ్మిక మ్రొక్కెద నీకని
    గమ్మున బ్రతిమాలె నపుడు గాండీవి హరిన్.

    ఆయుధ మంటని హరి నా
    యాయువులన్ దీయనెంచె నాహా ధన్యం-
    బాయెను జన్మంబని గాం-
    గేయుడు తలవంచి మ్రొక్కె క్రీడామయునిన్.

    రిప్లయితొలగించండి
  14. అయ్యా! శ్రీ మిస్సన్న గారూ!
    మీ పద్యాలు బాగున్నవి. అభినందనలు. గ్రీష్మర్తిన అని 2 సారులు వాడేరు. ఆ సమాసమునకు అర్థము వివరించ గలరా? స్వస్తి.

    రిప్లయితొలగించండి
  15. శ్రీపతిశాస్త్రిశుక్రవారం, జూన్ 22, 2012 2:41:00 PM

    శ్రీగురుభ్యోనమ:

    పట్టబోననె యస్త్రము పద్మనాభు
    డతని చేతనె పట్టింతు నాయుధమ్ము
    ననుచు పల్కెను భీష్ముడు యద్భుతముగ
    దైవశక్తిని నమ్మిన ధన్యుడతడు.

    తన మాట చెల్లకున్నను
    తనభక్తుని మాటనిలుప తానే దిగుచున్
    గుణవంతుడైన కృష్ణుడు
    ఘనమగు చక్రంబు పట్టె గాంగేయునిపై

    రిప్లయితొలగించండి
  16. నేమాని పండితార్యా మీ వ్యాఖ్య కోసం ఎదురు చూస్తున్నాను. ధన్యవాదములు.
    గ్రీష్మర్తు ఇన అను సమాసంగా వాడేను. దుష్టమైన చెప్పవలసిందిగా ప్రార్థన.

    రిప్లయితొలగించండి
  17. అయ్యా! శ్రీ మిస్సన్న గారూ! శుభాశీస్సులు.
    గ్రీష్మర్తు + ఇన = ? ఇవి 2 సంస్కృత పదములే. యణాదేశ సంధి చెయ్యాలి అనుకొంటాను. అప్పుడు గ్రీష్మర్త్విన కావచ్చు. నేను చెప్పలేను. శ్రీ శంకరయ్య గారో లేక డా. ఏల్చూరి వారో చెప్పవలసి యుంటుంది. స్వస్తి.

    రిప్లయితొలగించండి
  18. వలపులు విరియగ మనమున
    పులకింతల మేని విరుపు పుష్ప శరమ్ముల్
    నలునకు తెలుపుము మనవిని
    కులుకుల వయ్యారి వరట కూరిమి విరియన్ !

    క్షమించాలి .నిన్న నేను లేనందున వ్రాయలేక పోయాను .

    రిప్లయితొలగించండి
  19. లక్ష్మీదేవి గారూ,
    గోలి హనుమచ్ఛాస్త్రి గారూ,
    పండిత నేమాని వారూ,
    శ్రీపతి శాస్త్రి గారూ,
    సుబ్బారావు గారూ,
    సత్యనారాయణ మూర్తి గారూ,
    మిస్సన్న గారూ,
    రాజేశ్వరి అక్కయ్యా,

    అహహ! యేమందు నాదు భాగ్యమ్ము నేడు
    మేటి పద్యమ్ములను కవిమిత్రు లెల్ల
    వ్రాసి ‘శంకరాభరణము’ బ్లాగు శోభ
    నినుమడింపఁ జేసిరి, వారి కివియె నతులు!

    తనువా రోగగ్రస్థము,
    మననమునకున్ శాంతి లేదు; మఱి మీరలు వ్రా
    సిన పద్యములకు విశ్లే
    షణముల వ్రాయంగనైతి; క్షమియింపు డిఁకన్.

    రిప్లయితొలగించండి
  20. తనువుకు రోగము సాజము
    మనమున కునశాంతి కూడ మనిషికి సాజం-
    బనెదరు పెద్దలు భగవం-
    తుని వేడిన శుభమనండ్రు స్తుతిమతి వినరే?

    రిప్లయితొలగించండి