17, జూన్ 2012, ఆదివారం

సమస్యాపూరణం - 738 (తమ్ము గొలిచిన యెడల)

కవిమిత్రులారా...

ఈరోజు పూరించవలససిన సమస్య ఇది...

తమ్ము గొలిచిన యెడల స్వాంతమ్ము లలరు.

ఈ సమస్యను పంపిన కవిమిత్రునకు ధన్యవాదాలు.

19 కామెంట్‌లు:

  1. చింత యేల నాదు మనమ్మె, శ్రీ హరి మన
    చెంత నుండ, నామ జపము చేయ కల్గు
    శుభము, నాగలి పట్టిన శూరవరుని
    తమ్ము గొలిచిన యెడల స్వాంతమ్ము లలరు.

    రిప్లయితొలగించండి
  2. సకలలోకైక మాతయై సర్వజనుల
    కమిత వాత్సల్యపూర్ణయై యనవరతము
    వరములొసగెడి గౌరిని భక్తితో స
    తమ్ము గొలిచిన యెడల స్వాంతమ్ము లలరు.

    రిప్లయితొలగించండి
  3. విశ్వమంగళ సంచయ విలసితమ్ము
    రసవిశేష నిధాన విరాజితమ్ము
    అమ్మ పదవారిజాతమ్ము నమర పూజి
    తమ్ము గొలిచిన యెడల స్వాంతమ్ము లలరు

    రిప్లయితొలగించండి
  4. బ్రహ్మ కడిగిన పాదమ్ము బలిని త్రొక్కి
    యణచి వేసిన పాదమ్ము హనుమ భక్తి
    పట్టి వదలని పాదమ్ము గట్టిగ సత
    తమ్ము గొలిచిన యెడల స్వాంతమ్ము లలరు.

    రిప్లయితొలగించండి
  5. శ్రీపతిశాస్త్రిఆదివారం, జూన్ 17, 2012 8:43:00 AM

    శ్రీగురుభ్యోనమ:

    కావ్యములకెల్ల కాంచగ కన్న తల్లి
    వ్యాసకవిరాజు వ్రాసిన పరమ భార
    తమ్ము, గొలిచిన యెడల స్వాంతమ్ము లలరు
    నీతి ధర్మంబు తెలియును ఖ్యాతి కలుగు

    రిప్లయితొలగించండి
  6. ఆయు రారోగ్య సంపద లన్ని యిచ్చు
    భవ్య చరితుని శంభుని భవుని మృడుని
    సకల శుభకరు డభయుని శంకరు సత
    తమ్ము గొలిచిన యెడల స్వాంతమ్ము లలరు.

    రిప్లయితొలగించండి
  7. గుండు మధుసూదన్ గారి పూరణలు.....
    (1)
    స్మరణతోడనె శివుఁడిచ్చు సకలశుభము
    లీశు స్మరియింప దరిఁజేర వేభయాలు
    నట్టి పరమేశు పదములు పట్టియు నిర
    తమ్ము గొలిచిన యెడల స్వాంతమ్ము లలరు.
    (2)
    భరతమాతకు వేవేల ప్రణతుల నిడి
    ఘనత స్వాతంత్ర్య మందిరి కాంక్షతోడ
    నట్టి ఘననాయకులు గల్గినట్టి భార
    తమ్ము గొలిచిన యెడల స్వాంతమ్ము లలరు.

    రిప్లయితొలగించండి
  8. వివిధ రాక్షస సేనలనవని యందు
    సంహరించిన దైవాంశ సంభవుండు
    హనుమ, నాతని పదముల యందున నిర
    తమ్ము గొలచినయెడల స్వాంతమ్ము లలరు.

    రిప్లయితొలగించండి
  9. శ్రీ సంపత్ కుమార శాస్త్రి గారు:
    శుభాశీస్సులు.
    మీ పద్యములో భావము బాగున్నది. 3వ పాదములో హనుమ పిదప నుగాగమముకి బదులుగా యడాగమము చేయవలెను. అలాగే అన్వయ సౌలభ్యము కొరకు 3వ పాదమును ఇలా సవరించితే బాగుంటుంది:
    "హనుమ యాతని పదముల నాదృతి నిర"
    తమ్ము గొలిచిన యెడల స్వాంతమ్ము లలరు.

    రిప్లయితొలగించండి
  10. కొలువ నెవ్వాని? దేనిని? కులమె? ధనెమె?
    పదవి? జేజేల? సౌఖ్యాల? పరిణయాల?
    ధరణి శాస్త్రాలు ఘోషించు ధర్మసమ్మ-
    తమ్ము గొలిచిన యెడల స్వాంతమ్ము లలరు

    రిప్లయితొలగించండి
  11. శ్రీ పండితనేమాని గారికి నమస్సులు.
    మంచి సవరణ సూచించినందుకు ధన్యవాదములు.

    రిప్లయితొలగించండి
  12. వేంక టేశుని సేవించ విమల యశము
    రామ కధలను వినగ రంజిల్లు మనము
    వ్యాస విరచిత కావ్యము భావి భార
    తమ్ము గొలిచిన యెడల స్వాం తమ్ము లలరు !

    రిప్లయితొలగించండి
  13. శ్రీ సరస్వత్యై నమః :
    మిత్రులారా! శుభాభినందనలు.
    ఈనాటి పూరణలు భక్తిరసముతోను నిండి యున్నవి.

    1. శ్రీమతి లక్ష్మీ దేవి గారు : హలి తమ్ముని తలచేరు. మంచి భావము, చక్కని పూరణ - చాల బాగున్నది.
    2. శ్రీ హ.వె.స.నా.మూర్తి గారు - వరములొసగెడి గౌరీదేవిని స్తుతించేరు. ఉత్తమముగా నున్నది.
    3. శ్రీ గోలి హనుమఛ్ఛాస్త్రి గారు: బ్రహ్మ కడిగిన పాదమును ఉట్టంకించేరు. ప్రశస్తముగా నున్నది.
    4. శ్రీ శ్రీపతి శాస్త్రి గారు: నీతి ధర్మములకు నిలయమైన భారతమ్మును నుతించేరు. చక్కగా నున్నది.
    5. శ్రీ సుబ్బా రావు గారు: ఆయురారోగ్య సంపదలిచ్చే శంకరుని స్తుతించేరు. చాల బాగున్నది.
    6. శ్రీ గుండు మధుసూదన్ గారు 2 విధాలుగ పూరించేరు.
    (1) ఈశ్వరుని పదములను నిరతమ్మును కొలవవలెనని
    (2) ఘన నాయకులు కల భారతమ్మును కొలవలెనని. మంచి భావములు - చాల బాగున్నవి.
    7. శ్రీ సంపత్ కుమార శాస్త్రి గారు: హనుమంతుని పాదములు నిరతమ్మును కొలవమన్నారు. ప్రశంసనీయముగా నున్నది.
    8. శ్రీ చంద్రమౌళి గారు: ధర్మ సమ్మతమైన విధానమ్మును ప్రస్తావించేరు - భావము వినూత్నమ్ముగా నున్నది. ఉత్తమముగా నున్నది.
    స్వస్తి.

    రిప్లయితొలగించండి
  14. అమ్మా రాజేశ్వరి గారు: మీ పూరణ చాల బాగున్నది. మొదటి పాదములో అన్వయ సౌలభ్యము కొరకు ఇలా మారుద్దాము:
    "వేంకటేశుని సేవింప వెలయు యశము".
    స్వస్తి.

    రిప్లయితొలగించండి
  15. దైవ పూజలే మనకిచ్చు ధర్మగుణము

    ఆ నవవిధ భక్తిమార్గంబులబ్బు టన్న

    తనదు గతజన్మ పుణ్యంబు,దైవ ప్రేరి

    తమ్ము, గొలచినయెడల స్వాంతమ్ము లలరు.

    రిప్లయితొలగించండి
  16. అయ్యా! సహదేవుడు గారూ!
    అభినందనలు. మీ పూరణ ప్రశస్తముగా నున్నది. 2వ పాదములో గణభంగము కలదు. ఇలా ఆ పాదమును మారుద్దాము:
    "వివిధ భక్తి మార్గములు ప్రాప్తించుటన్న"
    స్వస్తి.

    రిప్లయితొలగించండి
  17. కవిమిత్రులారా,
    నమస్కృతులు.
    అందరూ ఉత్సాహంగా, వైవిధ్యంగా అద్భుతమైన పూరణలు చెప్తున్నందుకు ఆనందంగా ఉంది. అందరికీ అభినందనలు.
    నా ఆరోగ్య పరిస్థితి ఇంకా మెరుగు పడలేదు.
    శ్రీ పండిత నేమాని వారు సహృదయంతో దయతో మిత్రుల పూరణలను విశ్లేషిస్తూ నాకెంతో ఉపకారం చేస్తున్నారు. వారికి ఎంతో ఋణపడి ఉన్నాను. వారికి హృదయపూర్వక కృతజ్ఞతాంజలి!

    రిప్లయితొలగించండి
  18. శ్రిగురుభ్యోనమః
    ఆర్యా, ధన్య వాదములు తమరి సూచన మేరకు సవరణ:

    దైవ పూజలే మనకిచ్చు ధర్మగుణము

    వివిధ భక్తి మార్గములు ప్రాప్తించుటన్న

    తనదు గతజన్మ పుణ్యంబు,దైవ ప్రేరి

    తమ్ము, గొలచినయెడల స్వాంతమ్ము లలరు.

    రిప్లయితొలగించండి