26, జూన్ 2012, మంగళవారం

పద్య రచన - 33


కవిమిత్రులారా,

పై చిత్రాన్ని పరిశీలించి తగిన పద్యా(లను)న్ని వ్రాయండి.

కవిమిత్రుల పద్యములు


 ౧. పండిత నేమాని రామజోగి సన్యాసి రావు
శరతల్పంబున వ్రాలి భీష్ముడు పిపాసన్ బొందగా క్రీడి చె
 చ్చెర భూగర్భ పవిత్ర నీరముల దెచ్చెన్ దాహమున్ దీర్చగా
కురువంశాగ్రణి కిచ్చె సాదరముగా కూర్మిన్ తదాశీఃపరం
పరలం బొందెను పుణ్యపూరుషుల సేవల్ గూర్చు సద్యోగముల్.

౨. సుబ్బారావు
బాణ నిర్మిత శయ్య పై బవ్వళించు
భీష్ము దరి జేరి కవ్వడి ప్రియము తోడ
గరిమ బాణాన పాతాళ గంగ దెచ్చి
తీర్చి దాహము దీవనల్ దీసికొనెను.


౩. హరి వేంకట సత్యనారాయణ మూర్తి

శరముల శయ్యపై పడిన శంతనుపుత్రుడు దాహపీడతో
నరయగ నీటికోసమపు డర్జునుడాదర మొప్పగా వడిన్
వరమగు బాణయోగమున భవ్యములౌ క్షితిగర్భనీరముల్
ధరణికిఁ దెచ్చె నందరును ధన్యుడటంచుఁ దలంచ ఖేచరుల్.

సవ్యసాచి మరియు సాక్షాత్తు విష్ణువౌ
చక్రధరుని ప్రాణసఖుడె గాక
సత్యదీపితుండు శక్తియుక్తుండౌట
జగతిలో నతని కసాధ్యమేది?

పరవశించి యంత వాత్సల్యపూర్ణుడై
పిలిచి చేరదీసి భీష్ము డెంతొ
తుష్టి చెంది యొసగె నిష్టార్థసిద్ధికై
ఆశిషంబు లప్పు డర్జునునకు.

వృద్ధజనుల సేవ శ్రద్ధతో జేసిన
వారి కబ్బు సకల వైభవములు
విజయసిద్ధి గలిగి విజ్ఞత చేకూరు
సందియంబు లేదికెందుఁ జూడ.

౪. లక్ష్మీదేవి

"విష్ణువంతట వ్యాపించె విశ్వమందు
వాని సన్నిధి పెన్నిధి, భాగ్యమం"చు
దివ్యసందేశమునొసంగె దేవవ్రతుఁడు
నామ మహిమను లోకము నమ్ము రీతి

అంపశయ్యపై శయనించి యాత్మలోన
పరమ పురుషుని ధ్యానించు భాగవతుని
యార్తి దీరంగ నవ్వేళ నర్జునుండు
గంగ నందించె విలువిద్య ఘనతఁ జూపి

౫. గుండు మధుసూదన్

భారతయుద్ధమందుఁ గురువర్యుఁడు భీష్ముఁడు నేలఁగూల, దు
ర్వారనిషంగుఁ డర్జునుఁడు వచ్చి, పితామహుఁ డంపశయ్యనుం
గోరఁగ నేర్పరించి, తన కోరిన గంగ జలమ్ము నిచ్చెఁ గం
సారియు ధర్మజుండు ననిలాత్మజుఁడున్ గవ లెల్ల మెచ్చఁగన్.


౬. ఫణి ప్రసన్న కుమార్

    ఘోర రణంబునన్ బెనగి కోటువమూకల గూల్చి నిల్చి కం
    జారుని భంగి మించి యిక చాలని వాలితివంపశయ్యపై
    వీరుడవయ్య శాంతనవ! వేసట తీరగ గంగ తెచ్చె నీ
    కోరిక మేర ఫల్గునుడు గ్రోలుము జాహ్నవి ప్రేమ ధారలన్


౭. డా. విష్ణు నందన్
    శర సంధాన పరాక్రమాకలన దీక్షా తంత్రమేపార దు
    ర్భర శోకమ్ము నడంచి యర్జునుడు దివ్యాస్త్ర ప్రభావమ్ముతో
    ధరణిన్ జీల్చి సృజించె స్వచ్ఛతర పాతాళాపగా తీర్థమున్
    శర తల్పంబుననున్న భీష్ముని పిపాసన్ దీర్ప బేర్మిన్ ; మహా
    తిరథుల్ కౌరవ పాండవుల్ వగవ నార్తిన్ ; కృష్ణుడీక్షింపగా !!!
   
౮. రాజేశ్వరి నేదునూరి
    బ్రహ్మ చారిగ మిగిలెను ప్రతిన బూని
    వరము పొందెను స్వచ్చంద మరణ మనుచు
    అష్ట వసువుగ ముక్తుడై కష్ట పడగ
    అంప శయ్యను కోరినా డాత్మ విదుడు


 
 



15 కామెంట్‌లు:

  1. శరతల్పంబున వ్రాలి భీష్ముడు పిపాసన్ బొందగా క్రీడి చె
    చ్చెర భూగర్భ పవిత్ర నీరముల దెచ్చెన్ దాహమున్ దీర్చగా
    కురువంశాగ్రణి కిచ్చె సాదరముగా కూర్మిన్ తదాశీఃపరం
    పరలం బొందెను పుణ్యపూరుషుల సేవల్ గూర్చు సద్యోగముల్

    రిప్లయితొలగించండి
  2. బాణ నిర్మిత శయ్య పై బవ్వ ళించు
    భీ ష్ము ద రి జేరి కవ్వడి ప్రియము తోడ
    గరిమ బా ణా న పాతాళ గంగ దెచ్చి
    తీ ర్చి దాహము నాశిసుల్ దీ సి కొనియె .

    రిప్లయితొలగించండి
  3. అయ్యా! శ్రీ శంకరయ్య గారూ! నమస్కారములు.
    శీర్షికలో పెద్ద అక్షరములతో "నామాని" అని కనిపించుచున్నది. దానిని సరిజేయండి.

    అయ్యా శ్రీ సుబ్బారావు గారూ! శుభాశీస్సులు.
    మీ పద్యములో చివర పాదమును ఇలా మార్చితే బాగుంటుంది:
    "తీర్చి దాహము దీవనల్ దీసికొనెను"
    స్వస్తి.

    రిప్లయితొలగించండి
  4. శరముల శయ్యపై పడిన శంతనుపుత్రుడు దాహపీడతో
    నరయగ నీటికోసమపు డర్జునుడాదర మొప్పగా వడిన్
    వరమగు బాణయోగమున భవ్యములౌ క్షితిగర్భనీరముల్
    ధరణికిఁ దెచ్చె నందరును ధన్యుడటంచుఁ దలంచ ఖేచరుల్.

    సవ్యసాచి మరియు సాక్షాత్తు విష్ణువౌ
    చక్రధరుని ప్రాణసఖుడె గాక
    సత్యదీపితుండు శక్తియుక్తుండౌట
    జగతి లోన నతని కసాధ్యమేది?

    పరవశించి యంత వాత్సల్యపూర్ణుడై
    పిలిచి చేరదీసి భీష్ము డెంతొ
    తుష్టి చెంది యొసగె నిష్టార్థసిద్ధికై
    ఆశిషంబు లప్పు డర్జునునకు.

    వృద్ధజనుల సేవ శ్రద్ధతో జేసిన
    వారి కబ్బు సకల వైభవములు
    విజయసిద్ధి గలిగి విజ్ఞత చేకూరు
    సందియంబు లేదికెందుఁ జూడ.

    రిప్లయితొలగించండి
  5. "విష్ణువంతట వ్యాపించె విశ్వమందు
    వాని సన్నిధి పెన్నిధి, భాగ్యమం"చు
    దివ్యసందేశమునొసంగె దేవవ్రతుఁడు
    నామ మహిమను లోకము నమ్ము రీతి

    అంపశయ్యపై శయనించి యాత్మలోన
    పరమ పురుషుని ధ్యానించు భాగవతుని
    యార్తి దీరంగ నవ్వేళ నర్జునుండు
    గంగ నందించె విలువిద్య ఘనతఁ జూపి

    రిప్లయితొలగించండి
  6. గుండు మధుసూదన్ గారి పద్యము....

    భారతయుద్ధమందుఁ గురువర్యుఁడు భీష్ముఁడు నేలఁగూల, దు
    ర్వారనిషంగుఁ డర్జునుఁడు వచ్చి, పితామహుఁ డంపశయ్యనుం
    గోరఁగ నేర్పరించి, తన కోరిన గంగ జలమ్ము నిచ్చెఁ గం
    సారియు ధర్మజుండు ననిలాత్మజుఁడున్ గవ లెల్ల మెచ్చఁగన్.

    రిప్లయితొలగించండి
  7. సత్యనారాయణ మూర్తి గారూ,
    ‘జగతి లోన నతని కసాధ్యమేది’ పాదంలో గణదోషం. సవరించాను.

    రిప్లయితొలగించండి
  8. ఘోర రణంబునన్ బెనగి కోటువమూకల గూల్చి నిల్చి కం
    జారుని భంగి మించి యిక చాలని వాలితివంపశయ్యపై
    వీరుడవయ్య శాంతనవ! వేసట తీరగ గంగ తెచ్చె నీ
    కోరిక మేర ఫల్గునుడు గ్రోలుము జాహ్నవి ప్రేమ ధారలన్

    రిప్లయితొలగించండి
  9. శర సంధాన పరాక్రమాకలన దీక్షా తంత్రమేపార దు
    ర్భర శోకమ్ము నడంచి యర్జునుడు దివ్యాస్త్ర ప్రభావమ్ముతో
    ధరణిన్ జీల్చి సృజించె స్వచ్ఛతర పాతాళాపగా తీర్థమున్
    శర తల్పంబుననున్న భీష్ముని పిపాసన్ దీర్ప బేర్మిన్ ; మహా
    తిరథుల్ కౌరవ పాండవుల్ వగవ నార్తిన్ ; కృష్ణుడీక్షింపగా !!!

    రిప్లయితొలగించండి
  10. బ్రహ్మ చారిగ మిగిలెను ప్రతిన బూని
    వరము పొందెను స్వచ్చంద మరణ మనుచు
    అష్ట వసువుగ ముక్తుడై కష్ట పడగ
    అంప శయ్యను కోరగ నాత్మ విదుడు

    రిప్లయితొలగించండి
  11. http://te.newikis.com/source_%E0%B0%86_%E0%B0%AD%E0%B0%BE_7_2_211_to_7_2_240.html

    గురువు గారు,
    వెతికితే పై లంకెలో మొన్నెపుడో మీరడిగిన ఈ పద్యం పూర్తిపాఠం దొరికింది.
    అచ్చు తప్పులేమైనా ఉన్నాయేమో తెలీదండి.

    అక్కట మందభాగ్యునకు నట్టి సూభవరత్న మెవ్విధిన్
    డక్కు విధాత నిర్దయుఁ డొడంబడునే కడు మేలి వస్తువుల్
    పెక్కుదినంబు లున్కి యరి బృందము పిల్చినఁ బోటు బంట నై
    యక్కడ కేల పోయితి మహాగుణ భూషణుఁ గోలు పోయితిన్.

    రిప్లయితొలగించండి
  12. లక్ష్మీదేవి గారూ,
    ధన్యవాదాలు.
    ‘అట్టి తనూభవ’ ఇందులో ‘త’ తప్పిపోయింది అంతే!

    రిప్లయితొలగించండి
  13. లక్ష్మీదేవి గారూ,
    మీరిచ్చిన లింక్‌కు వెళ్ళి అక్కడ కూడా సవరించాను.

    రిప్లయితొలగించండి