3, జూన్ 2012, ఆదివారం

రవీంద్రుని గీతాంజలి - 32

రవీంద్రుని గీతాంజలి

తెనుఁగు సేత

శ్రీమాన్ చిలుకమఱ్ఱి రామానుజాచార్యులు

32

BY all means they try to hold me
secure who love me in this world. But
it is otherwise with thy love which is
greater than theirs, and thou keepest
me free.

Lest I forget them they never venture
to leave me alone. But day passes by
after day and thou art not seen.

If I call not thee in my prayers, if I
keep not thee in my heart, thy love for
me still waits for my love.


చిలుకమఱ్ఱి రామానుజాచార్యుల అనువాదము...


ఎవరు ప్రేమింత్రు నన్ను, వా రెల్ల కఠిన
బంధనమ్ముల బిగియించువారె సుమ్ము!
ప్రియతమా! లోకమందలి రీతి యిదియె,
కాని యివియెల్ల మించు నీదైన ప్రేమ
కడు నపూర్వము దాని మార్గమ్మె క్రొత్త
ప్రేమపాశాన బంధించి పెట్టకుండ
సర్వథా నను ముక్తుని సలిపె దీవు ||

తమ్ము మరచెద నన్న భయంబుతోడ
నొంటిగాఁ బెరవారు న న్నుంచలేరు,
కాని యొకనీవ దినములపైని దినము
లెన్ని గడచిన దర్శన మేని యిడవు,
జగతి నీ ప్రేమ కెద్దియు సాటి లేదు ||

పిలిచినం బ్రార్థనావేళఁ బిలువకున్నఁ,
దలఁచినన్ డెండమందునఁ దలఁపకున్న,
స్వామి! నీ చిరప్రేమ నా ప్రేమకొరకె
యెదుతు సూచుచునుండుఁ దా నెప్పుడేని ||

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి