19, జూన్ 2012, మంగళవారం

రవీంద్రుని గీతాంజలి - 48

రవీంద్రుని గీతాంజలి

తెనుఁగు సేత

శ్రీమాన్ చిలుకమఱ్ఱి రామానుజాచార్యులు


48

THE morning sea of silence broke into
ripples of bird songs ; and the flowers
were all merry by the roadside ; and
the wealth of gold was scattered
through the rift of the clouds while
we busily went on our way and paid no
heed.

We sang no glad songs nor played ;
we went not to the village for barter ;
we spoke not a word nor smiled ;
we lingered not on the way. We
quickened our pace more and more as
the time sped by.

The sun rose to the mid sky and
doves cooed in the shade. Withered
leaves danced and whirled in the hot
ah* of noon. The shepherd boy drowsed
and dreamed in the shadow of the
banyan tree, and I laid myself down
by the water and stretched my tired
limbs on the grass.

My companions laughed at me in
scorn ; they held their heads high and
hurried on ; they never looked back nor
rested ; they vanished in the distant
blue haze. They crossed many meadows
and hills, and passed through strange,
far - away countries. All honour to
you, heroic host of the interminable
path ! Mockery and reproach pricked
me to rise, but found no response in
me. I gave myself up for lost in the
depth of a glad humiliation in the
shadow of a dim delight.

The repose of the sun-embroidered
green gloom slowly spread over my
heart. I forgot for what I had travelled,
and I surrendered my mind without
struggle to the maze of shadows and
songs.

At last, when I woke from my
slumber and opened my eyes, I saw
thee standing by me, flooding my sleep
with thy smile. How I had feared
that the path was long and wearisome,
and the struggle to reach thee was
hard !


చిలుకమఱ్ఱి రామానుజాచార్యుల అనువాదము....

ప్రత్యుషఃకాల నిశ్శబ్ద వారిరాశి
పులుఁగు టెలుఁగుల చిరుతరగలయి విరిసె,
నుల్లసిలె దారి ప్రక్కల నెల్లపూలు,
మేఘమండలి రేవుల మీదినుండి
స్వర్ణసంపదలున్ వెదఁజల్లఁ బడియె,
నపుడు మాత్రోవపట్టి మే మదియె పనిగ
నెచట లక్ష్యమె నిల్పక యేగినాము ||

బాటలో సంబరంబుగ పాటలేవి
పాడలే, దాటలేవియు నాడలేదు,
గ్రామమున కేగలేదు బేరమ్ములాడ,
పలుకలే దేరితో నొక్క పలుకు గూడ,
కొనకుఁ జిరునవ్వుగూడా నవ్వినది లేదు,
నడుమ రవ్వంతయుం జా గొనర్పలేదు
వడిగ నంతంతకుం బ్రొద్దు గడచుకొలఁది
వేగ మెక్కించి నడువఁగ సాగినాము ||

రవియు నడుమింటిపై కెగఁబ్రాకె, నీడ
పట్టునం గూయఁ దొడఁగెను పావురాలు,
ఎండుటాకులు మిడిమిడియెండగాలి
దేలియాడి సుడింబడి తిరుగఁ దొడఁగె,
మఱ్ఱినీడను గోపకుమారకుండు,
కునికిపాటునఁ గలలను గనుచుచుండె,
నీటిచేరువఁ బచ్చిక నేలమీద
బడలువడి యున్న నా యొడల్ వాల్చుకొంటి ||

నన్ను గని హేళనమ్ముగ నవ్వి తోడి
తెరువరుల్ తలలెత్తి సత్వరమ చనిరి,
వెనుక జూడరు, విశ్రాంతి గొనరు వారు,
నీలి పొగమబ్బువోలెఁ గన్పించు దూర
భూమిలోన విలీనమై పోయినారు,
ఎన్ని పచ్చికబయళులో, యెన్ని యెన్ని
కొండలో, దాటి వారలు క్రొత్తక్రొత్త
దూరదూరదేశమ్ములు దూరి చనిరి,
*దుర్గమంబగు తుదిలేని మార్గమందు
పయనమౌ సాహసిక వీరపథికులార!
గౌరవార్హులు ధన్యులు మీర లెల్ల
నవ్వుబాట్లును తిట్లును నాటుకొనఁగ
నేను *సిగ్గున లేవ నుంకింతుఁ గాని
కానరా దొప్పుకోలు నాలోన నాకె,
అల్పసుఖముల క్రీనీడ, నధికపరిభ
వాస్పదంబగు హర్షఁపు టడుగునందు
నన్ను నే నప్పన మొనర్చుకొన్నవాఁడ ||

ఎండతళుకులతో రచియించు కుట్టు
పని చెలఁగు నీలిపచ్చికపట్టు మీది
విశ్రమము ప్రాకె మెలమెల్ల హృదయమెల్ల
మరపు దట్టెను పయనము జరుపు పనియె,
చొక్కి నీడలపాటలఁ జిక్కుకొనఁగఁ
బెనకువయె లేక డెంద మర్పించుకొంటి ||

కునికిపాటున నుండి నేఁ గనులు విప్పఁ
జెంత నిల్చుంటి వీవు, నీ చిన్ని నవ్వు
తోనఁ బ్రవహిలిపోయె నిద్దురయ నాకు,
“పొడవయిన దారి యది మిగుల్వడియె” నంచు
“కడు ప్రయాసము ని న్నందఁ గాంచు” టంచు,
ప్రభువ! నే నెంతగా భయపడితి నయ్య! ||

3 కామెంట్‌లు:

  1. శ్రీపతిశాస్త్రిమంగళవారం, జూన్ 19, 2012 8:34:00 AM

    ఎంతో మధురమైన భావమును, సుదీర్ఘ ప్రయాణమును కొన్ని పద్యపాదాలలో వర్ణించినారు మహాకవులు. నాచిన్ననాటి పాఠశాల జీవితము నుండీ నేటివరకు జరిగిన అనుభవములన్నియూ పదినిమిషములలో గుర్తుకు తెచ్చినవి. గీతాంజలి చదువగల్గిన అదృష్టం కల్గించిన గురువుగారికి సాష్టాంగ నమస్కారములు.

    రిప్లయితొలగించండి
  2. Sir, your Telugu translation is excellent.understood Tagore heart well and have taken out for telugu people in a lucid style.

    రిప్లయితొలగించండి
  3. శ్రీపతి శాస్త్రి గారూ,
    ధన్యవాదాలు.
    *
    మూర్తి గారూ,
    ధన్యవాదాలు.
    ఆ అనువాదం మా గురుదేవులు ‘చిలుకమఱ్ఱి’ వారు చేసినది...

    రిప్లయితొలగించండి