4, జూన్ 2012, సోమవారం

విశేష వృత్తము - 22

మందాక్రాంతము -

ఇది 17వ ఛందమైన ‘అత్యష్టి’లో 10737వ వృత్తము.      

`శాంతాకారం భుజగశయనం పద్మనాభం సురేశం' - అనే ప్రసిద్ధమైన శ్లోకము మందాక్రాంతమే.  కాళిదాసు మహాకవి మేఘసందేశం అనే కావ్యమును కేవలము మందాక్రాంతములతోనే రచించెను.


లక్షణము -
గణములు - మ భ న త త గ గ 
యతి - 11వ అక్షరము 
ప్రాసనియమము కలదు.


ఉదా:
రామా రామా! వనజ నయనా! రాజ వంశాబ్ధి సోమా!
శ్యామా! శ్యామా! సరస వచనా! సాధు లోకైక రక్షా!
భూమీశేంద్రా! పరమ పురుషా! భూమిజా ప్రాణనాథా!
భూమానందా! విశ్రుత విభవా! మోక్షదా! భక్తపాలా!


మీరూ ప్రయత్నించండి.  స్వస్తి!


పండిత రామజోగి సన్యాసి రావు
               

9 కామెంట్‌లు:

 1. దేవా దేవా! భవ జలధియం దేనిదే ముంగుచుంటిన్
  నీవే నీవే గతివనుచు నే నిన్ను ప్రార్థించుచుంటిన్
  రావే రావే కరుణ గనవే రక్షవీవే కృపాబ్ధీ!
  వేవే రావే పరమపురుషా! విస్వనాథా! నమస్తే

  రిప్లయితొలగించండి
 2. చిన్న సవరణతో (విశ్వనాథా అనే పదము 4వ లైనులో)
  దేవా దేవా! భవ జలధియం దేనిదే ముంగుచుంటిన్
  నీవే నీవే గతివనుచు నే నిన్ను ప్రార్థించుచుంటిన్
  రావే రావే కరుణ గనవే రక్షవీవే కృపాబ్ధీ!
  వేవే రావే పరమపురుషా! విశ్వనాథా! నమస్తే

  రిప్లయితొలగించండి
 3. చిన్న సవరణతో...

  కృష్ణా! శ్యామాంగ!నిను యవలోకింపనేతెంచి, నేడే
  కృష్ణా! గోపాలుర కలిసి నీ కేళి నే వింటి నోయీ!
  కృష్ణా! రాధామణి విరహమే కెంపులన్ బూసెనోయీ!
  కృష్ణా! పూజింతును, దలతు నీ కీర్తనల్ కృష్ణకృష్ణా!

  రిప్లయితొలగించండి
 4. రామా రామా యనవె మనసా రాముడే రక్షకుండౌ
  ధీమంతుండై ముని సవనమున్ దీక్ష రక్షించె గాదా
  బాముంబాపన్ ముని పడతికిన్ పూర్వరూపమ్ము నిచ్చెన్
  ప్రేమన్ సాకెన్ శబర వనితన్ విష్ణు సాయుజ్య మిచ్చెన్.

  రిప్లయితొలగించండి
 5. పండిత నేమాని వారూ,
  లక్ష్యంగా వ్రాసిన రామస్తుతి, తరువాత వ్రాసిన పరబ్రహ్మ స్తుతి అద్భుతంగా ఉన్నాయి. అభినందనలు.
  టైపాటు వల్ల ‘మున్గు’ - ‘ముంగు’ అయింది. లేఖినిలో ‘మున్గు’ పదం కావాలంటే ‘mun&gu’ అని టైపు చేయాలి. ఈ విషయం గతంలో కూడా చెప్పినట్లు గుర్తు!
  *
  లక్ష్మీ దేవి గారూ,
  క్రమం తప్పకుండా ఈ శీర్షికలో చక్కని పద్యాలు వ్రాస్తున్నందుకు ధన్యవాదాలు. కృష్ణుని దయతో ప్రాస గట్టెక్కారు. బాగుంది. ‘నిను + అవలోకించి’ అన్నప్పుడు యడాగమం రాదు. ‘నిను నవలోకించి’ అందాం.

  రిప్లయితొలగించండి
 6. మిస్సన్న గారూ,
  మీ రామస్తుతి బాగుంది. అభినందనలు.
  మూడవ పాదంలో యతి తప్పింది. ‘భూమిన్ రాయౌ మునిపడతికిన్..." అందామా?

  రిప్లయితొలగించండి
 7. గురువు గారు,
  ధన్యవాదాలు.

  గోపాలా! గోకుల తిలక!హే గోపికాలోల! కృష్ణా!
  తాపమ్మేమో! మృదువచనమే తన్మయత్వమ్ము,నాథా!
  కోపమ్మేలా? ననుఁ గనుమ! నీ కోసమే వేచినానే!
  శాపమ్మౌ నాకిది, కినుకలే చాలురా! ముద్దు కృష్ణా!

  రిప్లయితొలగించండి
 8. గురువుగారూ దిద్దుబాటుకు ధన్యవాదాలు.

  రిప్లయితొలగించండి