18, జూన్ 2012, సోమవారం

రవీంద్రుని గీతాంజలి - 47

రవీంద్రుని గీతాంజలి

తెనుఁగు సేత

శ్రీమాన్ చిలుకమఱ్ఱి రామానుజాచార్యులు

47

THE night is nearly spent waiting for
him in vain. I fear lest in the morning
he suddenly come to my door when I
have fallen asleep wearied out Oh
friends, leave the way open to him
forbid him not

If the sound of his steps does not
wake me, do not try to rouse me, I
pray. I wish not to be called from my
sleep by the clamorous choir of birds,
by the riot of wind at the festival of
morning light. Let me sleep undis-
turbed even if my lord comes of a
sudden to my door.

Ah, my sleep, precious sleep, which
only waits for his touch to vanish.
Ah, .my closed eyes that would open
their lids only to the light of his smile
when he stands before me like a dream
emerging from darkness of sleep.

Let him appear before my sight as
the first of all lights and all forms.
The first thrill of joy to my awakened
soul let it come from his glance. And
let my return to myself be immediate
return to him.


చిలుకమఱ్ఱి రామానుజాచార్యుల అనువాదము....

ఏ నతని రాక కొరకని యెదురుచూడ,
రాత్రియంతయు గడచె నిరర్థకముగ
ఈ యుషోవేళ బడలి నిద్రింతు నేని
తాను చప్పున మామకద్వారసీమ
కేగుదెంచునొ యేమొ? నా కిదియె భయము,
మీ రతనిదారి విడువుఁడీ! మిత్రులార,
అడ్డుచెప్పఁగఁ బోకుఁడీ యతని కెవరు ||

తత్పదధ్వని నానిద్ర తరలదేని
ప్రార్థనం బిదె మీరు లేపకుఁడు నన్ను,
పులుఁగుటరపుల మేళమువలనగాని,
వేగు వెల్గుల వేడుక వేళ వీచు
చలుగగాడ్పుల మ్రోతల వలనగాని,
యేను నిద్దుర మేల్కొను టిచ్చగింప,
వచ్చెనేనియు స్వామి నావాకిలికిని
నిదురపోవఁగనిండు నెమ్మదిగ నన్ను ||

అహహ! నానిద్ర నా ప్రియమైన నిద్ర!
తన్ను గరఁగించు నాతని తాకిడి కని
యిదియెకా కేవలమ్ముగ నెదురుచూచు,
నా ముకుళితమ్ములౌ నయనమ్ము లహహ!
నిదురచీఁకటిలోఁ *గమ్మని కలవోలె
నా యెదుట నిల్చు ప్రియుని మందస్మితంపు
వెలుఁగునకు మాత్రమే రెప్ప విప్పఁగలవు
అన్ని విధముల వెలుఁగులకన్న ముందు,
అన్ని తెరఁగుల రూపులకన్న ముందు,
నా కనులమ్రోల నతఁడె కన్పట్టవలయు
మేలుకొనెడి మదీయాత్మమీద నతని
చూపు విసరిన యంతన సుఖమయంపు
మొదటి పులకలు ఝల్లున మొలవవలయు,
మరలుటయు నాకు నేనయి మరలియుండ
వలయుఁ దత్క్షణ మాతనిఁ గలిసికొనఁగ ||

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి