27, జూన్ 2012, బుధవారం

పద్య రచన - 34


కవిమిత్రులారా,

పై చిత్రాన్ని పరిశీలించి తగిన పద్యా(లను)న్ని వ్రాయండి.

కవిమిత్రుల పద్యములు

౧. పండిత నేమాని
వనమయూరము:
ఆకసమునందు జలదాళి విలసిల్లెన్
శ్రీకరముగా ప్రకృతి చిత్ప్రభల నీనెన్
కేకిజత మైమరచి క్రీడలను దేలెన్
ప్రాకటముగా గొలుపు వర్షములు వేడ్కల్.


౨. లక్ష్మీదేవి
నీలపు కన్నుల సోయగ
మేలనొ నన్నిటుల లాగె; నీ విధి నన్నున్
బేలగ జేయుచు నాడెద
వేలనొ? యిరువురము కూడి యిక నాడుదమా!

నీలిమ నాకస మ్మొసఁగ నీ సొబగుల్ మరి యింతలయ్యెనో!
చా లనిపించకున్న దది చక్కని నాట్యముఁ జూచుచుండ; నీ
మ్రోలను వాలితిన్ దయను మ్రొక్కులు చేకొని నన్నుఁ జేరుమా!
మేలము లాడబోకు, నిను మించిన పింఛము లేదటంచు నన్.


౩. సుబ్బారావు

    ఆకసంబున మేఘంబు లావరించి
    వాన కురియంగ సంతోష మూన కేకి
    జంట పింఛము లాడించి జతను గలిసి
    కామ కేళిని విహరించ కాంక్ష నొందె.

౪. హరి వేంకట సత్యనారాయణ మూర్తి
    అద్భుతంబుగ పురివిప్పి యాడబూని
    వనమయూరంబు భాసిల్లు వైభవముగ
    భావములు పొంగు మదినుండి భవ్యమైన
    కవిత లేర్పడు దానిని గాంతు మేని.

    పింఛమునఁ జూడ కన్నులు విస్తృతముగ
    నమర నందంబు లొలుకుచు నా మయూర
    మెదురుగా నున్న సకియతో నీ విధముగ
    ముచ్చటించుచు నుండె ప్రమోదమునను.

    హృదయ మలరెను, యొడలెల్ల ముదముతోడ
    పులకరించెను, జలదంబు పలుకరించె
    మందమారుత మదివీచె సుందరముగ
    రమ్ము విహరింతు మోసఖి! రమ్యభూమి.


౫. గుండు మధుసూదన్
(శ్రీ పండిత నేమాని వారి స్ఫూర్తితో, వారికి ధన్యవాదాలతో)
వనమయూరము
ఓ కవియఁగా వనమయూరము కలాపిన్
గోక పురివిప్పి జతఁగోరి మనువాడన్
గేకిసలు గొట్టుచును కేకి నిటఁ గూడన్
లోకమున వర్షములు లోలతను జూపెన్.
(ఓ = మేఘము)    


౬. రాజేశ్వరి నేదునూరి
నెమలి పురివిప్పి యాడగ నీటి దొలువు
గగన మందుండి మురియుచు కనుల విందు
పరవశించిన చెలి కేకి పులకరించి
అశ్రు బిందువు గ్రోలగ నాశ పడియె.
(నీటి దొలువు = మేఘము , జలదరము )

11 కామెంట్‌లు:

  1. వనమయూరము:
    ఆకసమునందు జలదాళి విలసిల్లెన్
    శ్రీకరముగా ప్రకృతి చిత్ప్రభల నీనెన్
    కేకిజత మైమరచి క్రీడలను దేలెన్
    ప్రాకటముగా గొలుపు వర్షములు వేడ్కల్

    రిప్లయితొలగించండి
  2. నీలపు కన్నుల సోయగ
    మేలనొ నన్నిటుల లాగె; యీ విధి నన్నున్
    బేలగ జేయుచు నాడెద
    వేల? మనమిరువురు కూడి యిక నాడుదమా!

    రిప్లయితొలగించండి
  3. పండిత నేమాని వారూ,
    చిత్రానికి తగిన ఛందాన్ని ఎన్నుకొని మనోజ్జమైన పద్యం చెప్పి అలరించారు. అభినందనలు.
    *
    లక్ష్మీదేవి గారూ,
    ‘లాగె నీ విధి’ అనవలసి ఉంటుంది.
    నాలుగవ పాదం నడక తడుబడుతున్నట్లు ఉంది. ‘ఇరువురము’ అనాలికదా! ‘ఏలనొ? మన మిరువురము కూడి యిక నాడుదమా!" అందామా?

    రిప్లయితొలగించండి
  4. గురువుగారు,
    ధన్యవాదములు. ఇరువురము అంటే గణభంగమయింది. అలా ఉంచేశాను.
    సరి , మరియొక పద్యము వ్రాస్తున్నాను.

    నీలిమనాకసమ్మొసగ నీ సొబగుల్ మరి యింతలయ్యెనో!
    చాలనిపించకున్నదది చక్కని నాట్యము చూచుచుండ; నీ
    మ్రోలనుఁ వాలితిన్ దయను మ్రొక్కులు చేకొని నన్నుజేరుమా!
    మేలములాడబోకు, నిను మించిన పింఛము లేదటంచునున్.

    రిప్లయితొలగించండి
  5. ఆకసంబున మేఘంబు లావ రించి
    వాన కు రి యం గ సంతోష మూ న కేకి
    జంట పించము లాడించి జతను గలిసి
    కామ కేళి ని విహ రించ కాంక్ష నొం దె .

    రిప్లయితొలగించండి
  6. అద్భుతంబుగ పురివిప్పి యాడబూని
    వనమయూరంబు భాసిల్లు వైభవముగ
    భావములు పొంగు మదినుండి భవ్యమైన
    కవిత లేర్పడు దానిని గాంతు మేని.

    పింఛమునఁ జూడ కన్నులు విస్తృతముగ
    నమర నందంబు లొలుకుచు నా మయూర
    మెదురుగా నున్న సకియతో నీ విధముగ
    ముచ్చటించుచు నుండె ప్రమోదమునను.

    హృదయ మలరెను, యొడలెల్ల ముదముతోడ
    పులకరించెను, జలదంబు పలుకరించె
    మందమారుత మదివీచె సుందరముగ
    రమ్ము విహరింతు మోసఖి! రమ్యభూమి.

    రిప్లయితొలగించండి
  7. లక్ష్మీదేవి గారూ,
    నేను సవరించిన మీ కందపద్యంలో గణదోషం... ఇప్పుడు మళ్ళీ సవరించాను.

    రిప్లయితొలగించండి
  8. గుండు మధుసూదన్ గారి గారి పద్యం....
    శ్రీ పండిత నేమాని వారి స్ఫూర్తితో, వారికి ధన్యవాదాలతో....

    వనమయూరము
    ఓ కవియఁగా వనమయూరము కలాపిన్
    గోక పురివిప్పి జతఁగోరి మనువాడన్
    గేకిసలు గొట్టుచును కేకి నిఁటఁ గూడన్
    లోకమున వర్షములు లోలతను జూపెన్.
    (ఓ = మేఘము)

    రిప్లయితొలగించండి
  9. నెమలి పురివిప్పి యాడగ నీటి దొలువు
    గగన మందుండి మురియుచు కనుల విందు
    పరవ శించిన చెలికేకి పులక రించి
    అశ్రు బిందువు గ్రోలగ నాశ పడియె

    నీటి దొలువు = మేఘము , జలదరము

    రిప్లయితొలగించండి
  10. మనోహరమైన పద్యాలు చెప్పిన...
    పండిత నేమాని వారికి,
    లక్ష్మీదేవి గారికి,
    సుబ్బారావు గారికి,
    హరి వేంకట సత్యనారాయణ మూర్తి గారికి,
    గుండు మధుసూదన్ గారికి,
    రాజేశ్చరి అక్కయ్యకు,
    ...... అభినందనలు, ధన్యవాదాలు.

    రిప్లయితొలగించండి