లక్ష్మీదేవి గారూ, వెంటనే స్పందించి చక్కని పద్యం వ్రాసినందుకు అభినందనలు, ధన్యవాదాలు. వరమిచ్చింది ‘దేశమాతకు’ అనే అపార్థం వచ్చే అవకాశం ఉంది. దానిని ‘దేశమాత దాస్యమ్మును దీర్చునట్టి’ అంటే ఎలా ఉంటుందంటారు?
నీ సందర్శన భాగ్యమొందితి భవానీమాత! నీ యండతో నే సంగ్రామములన్ జయప్రతతితోన్ వెల్గొందగా జేయుమా నే సాధించెద ధర్మ రక్షణమునెంతే దీక్షతో నీ కృపన్ భాసింపదగు నీ కృపాణము సదా భద్రప్రదా! శాంభవీ!
లక్ష్మీదేవి గారూ, సంతోషం! మీ ఉత్పలమాల కొద్దిగా తడబడ్డా బాగుంది. అభినందనలు. ‘చేసినంతన్ + ఆ = చేసినంత నా’ ఇక్కడ యడాగమం రాదు. ‘కృపాళువై + ఒసగె = కృపాళువై యొసగె’ ఇక్కడ యడాగమం వస్తుంది. ‘.... జేసినంత నా / గౌరి కృపాళువై యొసగె....’ అంటే సరి! మీ చంపకమాల ధారాశుద్దితో శోభిల్లుతూ అలరించింది. బాగుంది. చివరి భుజంగప్రయాతం గురించి ఏమని చెప్పను? ‘సూ... ప.... ర్!’ * పండిత నేమాని వారూ, కృపాణమును ప్రసాదించిన భవానిని శివాజీ స్తుతించిన విధానం చాలా బాగుంది. అభినందనలు. * సుబ్బారావు గారూ, మీ పద్యం చక్కగా ఉంది. అభినందనలు. * సత్యనారాయణ మూర్తి గారూ, మీ ఖండికలోని ప్రతిపాదం కవితావిలువలు గలవే. అద్భుతంగా ఉంది. ముఖ్యంగా ‘జగతికాధారమౌ మగువకు దైవత్వ/మందజేసిన యట్టి యనఘుడతడు’ అనడం ఉదాత్తంగా ఉంది. అభినందనలు, ధన్యవాదాలు. * సంపత్ కుమార్ శాస్త్రి గారూ, మీ పద్యం అద్భుతంగా ఉంది. అభినందనలు. ‘కౄర’ కాదు... అది ‘క్రూర’ కదా!
దేశమాతకు దాస్యము తీర్చునట్టి
రిప్లయితొలగించండిగొప్ప వరమిచ్చి ధన్యత కూర్చితీవు,
నీకు ప్రణమిల్లి నెఱవేర్చనెంచినాడ
నాదు ప్రతినను, దీవించు నమ్మియుంటి.
లక్ష్మీదేవి గారూ,
రిప్లయితొలగించండివెంటనే స్పందించి చక్కని పద్యం వ్రాసినందుకు అభినందనలు, ధన్యవాదాలు.
వరమిచ్చింది ‘దేశమాతకు’ అనే అపార్థం వచ్చే అవకాశం ఉంది. దానిని ‘దేశమాత దాస్యమ్మును దీర్చునట్టి’ అంటే ఎలా ఉంటుందంటారు?
నీ సందర్శన భాగ్యమొందితి భవానీమాత! నీ యండతో
రిప్లయితొలగించండినే సంగ్రామములన్ జయప్రతతితోన్ వెల్గొందగా జేయుమా
నే సాధించెద ధర్మ రక్షణమునెంతే దీక్షతో నీ కృపన్
భాసింపదగు నీ కృపాణము సదా భద్రప్రదా! శాంభవీ!
గురువు గారు,
రిప్లయితొలగించండిమంచి సవరణ. అలాగే చేస్తాను.
మీ ఆరోగ్యము జాగ్రత్త.
దేశమాత దాస్యమ్మునుఁ దీర్చునట్టి
గొప్ప వరమిచ్చి ధన్యత కూర్చితీవు,
నీకు ప్రణమిల్లి నెఱవేర్చనెంచినాడ
నాదు ప్రతినను, దీవించు నమ్మియుంటి.
వీర శివాజి దేవినిట వేడి తపమ్మునుఁ జేసినంత యా
రిప్లయితొలగించండిగౌరి కృపాళువై నొసగె ఖడ్గము నప్డు జయమ్మునొందగా!
ధీరత తోడ నాతడిక దేశము నేలగ నుత్తముండుగా,
దారినిఁ జూపె నిశ్చయము, ధర్మము వీడక నుండునట్టుగా!
దేశ రక్షణ గావింతు దేవి! యనుచు
రిప్లయితొలగించండిఅందు కొనియెను ఖడ్గము హైమ నుండి
శత్రు మూకల దునుమాడి క్షాత్ర మొప్ప
దేశ భక్తిని జాటెను ధీ శి వాజి.
సీ.
రిప్లయితొలగించండిస్వారాజ్యనిర్మాణ భవ్యయజ్ఞమునందు
కర్మఠుడైనట్టి ఘనుడతండు,
కొదమసింగమువోలె ఘోరాహవములందు
క్రూరుల నణచిన వీరుడతడు,
భారతావనిపట్ల భక్తిభావంబును
తనువున నింపిన ధన్యుడతడు,
జగతికాధారమౌ మగువకు దైవత్వ
మందజేసిన యట్టి యనఘుడతడు
తే.గీ.
"భోన్సలేశుడు" "శివరాజు" పూజ్యుడతడు
"జైభవాని"యటంచును సర్వగతుల
దేశరక్షణ మొనరించి దీప్తిఁ బెంచ
బద్ధకంకణు డైనట్టి భాగ్యశాలి.
కం.
ఒకనా డేకాంతంబున
సకలామరవంద్య యైన జగదంబిక తా
నకలంక చరితుడు శివా
జికి దర్శన మొసగి పల్కె చేతం బలరన్.
కం.
వత్సా! విను మీఖడ్గము
నుత్సాహముతోడఁ బూను ముండెద నిందున్
మత్సన్నిధి నీ కొసగును
సత్సౌఖ్యజయంబు లింక స్వారాజ్యంబున్.
కం.
పరమాదరమున శివరా
జరమర లేకుండ మ్రొక్కి యంబిక యెదుటన్
స్థిరమతియై దివ్యాసిని
ధరియించెను దీక్షబూని ధన్యుండగుచున్.
అనయము వీరగాథల ననన్యపు భంగిని తల్లి జెప్పగా,
రిప్లయితొలగించండివినయముతో శివాజి విన వెల్గె మహాబలశాలి దానుగా,
జనపదమెల్ల నాతని యశమ్మును కీర్తన జేసినారహో!
కనికరదృష్టితోడ గిరికన్యయె దీవనలిచ్చె చూడుమా!
మహావీరుడైనట్టి మాఱేని నీవే,
సుహాసమ్ముతో శ్రీ యశోమూర్తి వోలెన్,
మహోగ్రుండుగా జేయుమమ్మా భవానీ!
సహాయమ్ము వేడెన్, ప్రసాదించుమమ్మా!
తల్లీ శాంభవి! నీదు దర్శన మహత్భాగ్యంబునన్ ధన్యుడై
రిప్లయితొలగించండియుల్లంబందున నిశ్చయించితిని దుష్టోద్యుక్తులౌ జాతి భీ
తిల్లన్ జేసెద, కౄరశక్తుల బలాధిక్యంబులన్ కూల్చి, సం
ధిల్లన్ జేతును శాంతి దేశమున వర్ధిల్లన్ నితాంతంబుగాన్.
దుష్టోద్యుక్తులౌ జాతి = తురుష్కులు,
లక్ష్మీదేవి గారూ,
రిప్లయితొలగించండిసంతోషం!
మీ ఉత్పలమాల కొద్దిగా తడబడ్డా బాగుంది. అభినందనలు.
‘చేసినంతన్ + ఆ = చేసినంత నా’ ఇక్కడ యడాగమం రాదు. ‘కృపాళువై + ఒసగె = కృపాళువై యొసగె’ ఇక్కడ యడాగమం వస్తుంది. ‘.... జేసినంత నా / గౌరి కృపాళువై యొసగె....’ అంటే సరి!
మీ చంపకమాల ధారాశుద్దితో శోభిల్లుతూ అలరించింది. బాగుంది.
చివరి భుజంగప్రయాతం గురించి ఏమని చెప్పను? ‘సూ... ప.... ర్!’
*
పండిత నేమాని వారూ,
కృపాణమును ప్రసాదించిన భవానిని శివాజీ స్తుతించిన విధానం చాలా బాగుంది. అభినందనలు.
*
సుబ్బారావు గారూ,
మీ పద్యం చక్కగా ఉంది. అభినందనలు.
*
సత్యనారాయణ మూర్తి గారూ,
మీ ఖండికలోని ప్రతిపాదం కవితావిలువలు గలవే. అద్భుతంగా ఉంది. ముఖ్యంగా ‘జగతికాధారమౌ మగువకు దైవత్వ/మందజేసిన యట్టి యనఘుడతడు’ అనడం ఉదాత్తంగా ఉంది. అభినందనలు, ధన్యవాదాలు.
*
సంపత్ కుమార్ శాస్త్రి గారూ,
మీ పద్యం అద్భుతంగా ఉంది. అభినందనలు.
‘కౄర’ కాదు... అది ‘క్రూర’ కదా!
దుర్గనుఁ గొల్చి ముష్కరుల త్రుంచగ శక్తిని పొందినాడవే!
రిప్లయితొలగించండిమార్గముఁ జూపినావనెద మమ్ముల బోలిన వారికెల్ల, నా
దుర్గముఁ గావగా కదలి, దుష్కరమూకల జీల్చువేళలన్
స్వర్గముఁ బొంద వీరుడుగ సంగరమందున పోరినాడవే!
చంద్ర హాసము నొసగిన చండి వరము
రిప్లయితొలగించండితల్లి నేర్పిన బుద్ధులు వల్లె యనుచు
ప్రజల క్షేమము గోరిన ప్రభువు గాన
సకల విద్యలు నేర్చిన సవిత యనగ !
మాజీ! దీవించు నను శి
రిప్లయితొలగించండివాజీ! ముష్కరుల జంపి భరతావని లో
తేజంబును పొందు మనుచు
వాజీ, వాజీ యనుచును పదుగురు మెచ్చన్.
నీవిడు ఖడ్గ రాజమును నేర్పుగ దేశ విరోధ భావనా
రిప్లయితొలగించండిజీవుల ఖండ ఖండముల జీల్చ బ్రయుక్తమొనర్చుచున్, సదా
పావన భారతావనికి భద్రము గూర్చెద! నీదు బిడ్డకున్
దేవి! భవాని మాత! ఇదె దీవన లిచ్చి జయమ్ము గూర్చుమా!
ఈ కామెంట్‌ను రచయిత తీసివేశారు.
రిప్లయితొలగించండిగురువుగారూ, ధన్యవాదాలు.
రిప్లయితొలగించండిక్రూర..... ఎన్ని సార్లు క్రూర అని వ్రాద్దామనుకొన్నా కౄర అనే వస్తుంది. ఇక మీద ఈ తప్పు రాకుడా ధృడనిశ్చయము తీసుకున్నాను.