28, జూన్ 2012, గురువారం

నిషిద్ధాక్షరి - 4


టవర్గ (ట,ఠ,డ,ఢ,ణ) అక్షరాలను ఉపయోగించకుండా
టంగుటూరి ప్రకాశం పంతులు గురించి
మీకు నచ్చిన ఛందంలో
పద్యం వ్రాయండి.

కవిమిత్రుల పద్యములు

౧. ‘మనతెలుగు’ చంద్రశేఖర్
ఆ ధీరాంధ్ర సుకేసరి
మేధాకాశము తెలుగుల మేరు నగంబై
క్రోధించి నిలపె సైమను
యోధుల దుశ్చర్యలెల్ల నోయనఁగ సుధీ!

ఇత నెదిరి తుపాకి కెదురు నిలచె తెల్ల
వారి వైరి తెలుగు వారి కెల్ల
గర్వ కారణము ప్రకాశము పంతులు
ఆంధ్ర కేసరి సరి యాంధ్రులకును! 
*     *     *     *     *

౨. హరి వేంకట సత్యనారాయణ మూర్తి
సీ.
స్వాతంత్ర్య సిద్ధికై సర్వసంపద లన్ని
            సౌఖ్యముల్ త్యజియించి సంతసమున
నిస్స్వార్థబుద్ధితో నిత్యదీక్షను బూని
            స్వారాజ్య సమరమ్ము జరుపువాని,
ప్రజలక్షేమము గోరి బహుబాధలకునోర్చి
            పత్రికల్ ప్రచురించు భాగ్యశాలి
నాంధ్రకేసరి యౌచు నాంగ్లేయులకు భీతి
            గల్గించి నిలిచిన ఘనుని మరియు
తే.గీ.
ధీరగంభీరవిగ్రహు, దివ్యతేజు
నమల చరితుఁ బ్రకాశము నాంధ్రజనులు
విశ్వసించిన వానిని, విజ్ఞవరుని
ధన్యజీవిని స్మరియింప దగును సతము.
*     *     *     *     *

౩. సుబ్బారావు
    ఆంద్ర కేసరి బిరుదున కర్హతఁ గనుఁ
    గొన్న తేజస్సు గలిగిన గొప్ప ధీర!
    ఆంగ్ల పాలన నీవల్ల నంత మయ్యె
    వందనములు ప్రకాశము పంతులయ్య ! 
*     *     *     *     *

౪. పండిత నేమాని రామజోగి సన్యాసి రావు
ధీ ప్రకాశ నిధానమా! దివ్య భావ!
ఆంధ్ర కేసరి బిరుదాంచితా! సుధీర!
తెలుగు తేజమ! ముఖ్యమంత్రివర! ధాత్రి
నీదు కీర్తి శాశ్వతముగ నిలుచు గాదె! 
*     *     *     *     *

౫. గుండు మధుసూదన్
పేదరికాన జన్మ, గురువే ఘనదైవము, తల్లి వేదనే
ఖేదము, విద్యలే విజయకేతనముల్, తన దేశభక్తియే
మోదము, దేశసాధనయె ముఖ్యము, దిక్కయె లేనివారి, కే
భేదము లాంధ్రకేసరిగఁ బెద్దను జేసిన వీ ప్రకాశమున్? 

(ఆంధ్రకే - సరిగ, ఆంధ్ర - కేసరిగ) 
*     *     *     *     *

౬. గోలి హనుమచ్ఛాస్త్రి
రొమ్ము జూపుచు చావును రమ్మనుచును
తెలుగు తెగువను తెలిపెను 'వెలుగు యొజ్జ'
కేసరి యను నామ మతనికే సరి యని
ఆంధ్ర మాతయె పలికిన యాప్త మూర్తి.
 
*     *     *     *     * 


౭. సహదేవుడు 
 
సుప్రకాశ భరత దేశ శోభ గోరి
రోషమున తుపాకి నెదరి రొమ్ము జూపి
శ్వేత గజముల స్వప్నాల సింగ మవ్వ
ఆంధ్ర కేసరి బిరుదమ్ము నతికె సుమ్ము!

28 కామెంట్‌లు:

  1. ఆ ధీరాంధ్ర కేసరి
    మేధాకాశము, తెలుగుల మేరు నగంబై
    క్రోధించి నిలపె నాంగ్ల
    యోధుల దుశ్చర్యలెల్ల నోయనఁగ సుధీ!

    రిప్లయితొలగించండి
  2. చంద్రశేఖర్ గారూ,
    మంచి భావంతో పద్యం వ్రాసారు. అభినందనలు.
    అయితే 1,3వ పాదాల్లో గణదోషం.
    ‘ఆ ధీరాంధ్ర సుకేసరి (మృగేంద్రము)...’
    ‘క్రోధించి నిలిపె నాంగ్లపు (నింగ్లీష్)...’ అని నా సవరిస్తే బాగుంటుందని నా సూచన. లేక మీరే సవరణలను చేయండి...

    రిప్లయితొలగించండి
  3. మాస్టారూ, మొదట ప్రకాశము-పంతులు అనే శబ్దాలు వేయటానికి ప్రయత్నించి, మార్చిన తాలూకూ ప్రభావము వల్ల వచ్చిన దోషాలవి. సవరణకు ధన్యవాదాలు. మూడో పాదం ఇలా వేద్దాము.
    ఆ ధీరాంధ్ర సుకేసరి
    మేధాకాశము తెలుగుల మేరు నగంబై
    క్రోధించి నిలపె సైమను
    యోధుల దుశ్చర్యలెల్ల నోయనఁగ సుధీ!

    రిప్లయితొలగించండి
  4. సీ.
    స్వాతంత్ర్య సిద్ధికై సర్వసంపద లన్ని
    సౌఖ్యముల్ త్యజియించి సంతసమున
    నిస్స్వార్థబుద్ధితో నిత్యదీక్షను బూని
    స్వారాజ్య సమరమ్ము జరుపువాని,
    ప్రజలక్షేమము గోరి బహుబాధలకునోర్చి
    పత్రికల్ ప్రచురించు భాగ్యశాలి
    నాంధ్రకేసరి యౌచు నాంగ్లేయులకు భీతి
    గల్గించి నిలిచిన ఘనుని మరియు
    తే.గీ.
    ధీరగంభీరవిగ్రహు, దివ్యతేజు
    నమల చరితుఁ బ్రకాశము నాంధ్రజనులు
    విశ్వసించిన వానిని, విజ్ఞవరుని
    ధన్యజీవిని స్మరియింప దగును సతము.

    రిప్లయితొలగించండి
  5. ఆంద్ర కేసరి బిరుదున కర్హ తాను
    గుణము తేజస్సు గలిగిన గొప్ప ధీ ర !
    ఆంగ్ల పాలన నీ వ ల్ల నంత మయ్యె
    వంద నంబులు నీ కివె పం తు ల య్య !

    రిప్లయితొలగించండి
  6. ఇత నెదిరి తుపాకి కెదురు నిలచె తెల్ల
    వారి వైరి తెలుగు వారి కెల్ల
    గర్వ కారణము ప్రకాశము పంతులు
    ఆంధ్ర కేసరి సరి యాంధ్రులకును!

    రిప్లయితొలగించండి
  7. సత్యనారాయణ మూర్తి గారూ,
    మీ పూరణ చాలా బాగుంది. అభినందనలు.
    *
    సుబ్బారావు గారూ,
    చక్కని పూరణ చేసారు. అభినందనలు.
    చివరిపాదాన్ని దోషంలేకున్నా కొద్దిగా సవరించాను. మన్నించండి.
    *
    చంద్రశేఖర్ గారూ,
    మీ రెండవ పూరణకూడా బాగుంది. అభినందనలు.

    రిప్లయితొలగించండి
  8. శ్రీ శంకరయ్య గారికి క్షమాపణలతో
    మీ సవరణ బాగుంది .మన్నించండి అన్నారు
    అలా అనిపించు కొన్నందులకు మీ రే నన్ను
    క్షమిం చాలి .

    రిప్లయితొలగించండి
  9. ధీ ప్రకాశ నిధానమా! దివ్య భావ!
    ఆంధ్ర కేసరి బిరుదాంచితా! సుధీర!
    తెలుగు తేజమ! ముఖ్యమంత్రివర! ధాత్రి
    నీదు కీర్తి శాశ్వతముగ నిలుచు గాదె

    రిప్లయితొలగించండి
  10. ఆర్యా!
    నమస్కారములు.
    శ్రీయుతులు సుబ్బారావు గారి పద్యం రెండవ పాదంలో "గుణము" అన్నారు. నేడు "ణ" నిషిద్ధం కనుక సవరించవలసి ఉంది.
    ధన్యవాదములు.

    రిప్లయితొలగించండి
  11. సత్యనారాయణ మూర్తి గారూ,
    ధన్యవాదాలు. సవరిస్తాను.

    రిప్లయితొలగించండి
  12. పండిత నేమాని వారూ,
    చక్కని పూరణ చేసారు. అభినందనలు.

    రిప్లయితొలగించండి
  13. గుండు మధుసూదన్ గారి పూరణ....

    పేదరికాన జన్మ, గురువే ఘనదైవము, తల్లి వేదనే
    ఖేదము, విద్యలే విజయకేతనముల్, తన దేశభక్తియే
    మోదము, దేశసాధనయె ముఖ్యము, దిక్కయె లేనివారి, కే
    భేదము లాంధ్రకేసరిగఁ బెద్దను జేసెను మీ ప్రకాశమున్?

    రిప్లయితొలగించండి
  14. గుండు మధుసూదన్ గారూ,
    మీ పూరణ ప్రశస్తంగా ఉంది. అభినందనలు.

    రిప్లయితొలగించండి
  15. రొమ్ము జూపుచు చావును రమ్మననుచు
    తెలుగు తెగువ తెలిపె 'వెలుగు యొజ్జ '
    కేసరనుచు కేసరతనికే సరనుచు
    ఆంధ్ర మాత యనిన యాప్త మూర్తి.

    రిప్లయితొలగించండి
  16. గోలి హనుమచ్ఛాస్త్రి గారుపూరణ బాగుంది.
    "రొమ్ము జూపుచు చావును రమ్మననుచు

    "రమ్మమనచు" లేక "రమ్మమనుచు" అంటే ఇంకా బాగుంటుందేమో.

    రిప్లయితొలగించండి
  17. లక్కరాజు వారూ,
    ధన్యవాదాలు.
    *
    గోలి హనుమచ్ఛాస్త్రి గారూ,
    చక్కని పూరణ. అభినందనలు.
    ‘రమ్మననుచు, సరనుచు’ ప్రయోగాలు వ్యాకరణ విరుద్ధాలు. ‘రమ్మనుచును, సరి యని’ అంటే సరి!

    రిప్లయితొలగించండి
  18. సుప్రకాశ భరత దేశ శోభ గోరి
    రోషమున తుపాకి నెదరి రొమ్ము జూపి
    శ్వేత గజముల స్వప్నాల సింగ మవ్వ
    ఆంధ్ర కేసరి బిరుదమ్ము నతికె సుమ్ము!

    రిప్లయితొలగించండి
  19. పెద్ద లందఱికీ ప్రణామం!

    చాలా రోజుల తర్వాత మళ్ళీ శంకరాభరణాన్ని దర్శించే అవకాశం కలిగి, వెనక్కి వెళ్ళి కొన్నాళ్ళ రచనలన్నీ చదువుకొన్నాను.

    శ్రీ హరి వేంకట సత్యనారాయణమూర్తి గారికొక విన్నపం:

    అయ్యా! ఇప్పటికే ఆలస్యమైనట్లుంది. మీరు వెంటనే శ్రీ గురువుల, పెద్దల ఆశీస్సులను పొంది, శ్రీకారం చుట్టి, కావ్యరచనకు ఉపక్రమించాలి. జయోస్తు.

    మాన్యులు శ్రీ శంకరయ్య గారిచే ప్రదత్తమైన ఒక మకుటాన్ని గ్రహించి, శంకరాభరణ మిత్రమండలి ముందే ఎంచుకొన్న ఒక మంచిరోజున ముందుగా నమోదయిన పేర్లతో - ఒక వంద మంది సుకవులతో ఒక్క రోజులో ఒక శతకాన్ని రూపొందిస్తే సాహిత్యంలో విశిష్టమైన ప్రయోగం కాగలదని అనిపించింది.

    అందఱికీ ప్రణతిపురస్సరంగా

    భవదీయుడు,
    ఏల్చూరి మురళీధరరావు

    రిప్లయితొలగించండి
  20. శ్రీ ఏల్చూరి మురళీధరరావు గారికి,
    ఆర్యా!
    నమస్కారములు.
    మీ అభిమానానికి ధన్యవాదములు.
    ప్రయత్నిస్తాను.

    రిప్లయితొలగించండి
  21. శంకరార్యా! దోషములను సవరించినందులకు ధన్యవాదములు.
    లక్కరాజు గారూ! ధన్యవాదములు.

    రిప్లయితొలగించండి
  22. శంకరార్యా! మీరు చేసిన సవరణలకు ధన్యవాదములు.నా పూరణలోని గణ దోషములను సరిచేయుచున్నాను.
    లక్కరాజు గారూ! ధన్యవాదములు.

    రొమ్ము జూపుచు చావును రమ్మనుచును
    తెలుగు తెగువను తెలిపెను 'వెలుగు యొజ్జ'
    కేసరి యను నామ మతనికే సరి యని
    ఆంధ్ర మాతయె పలికిన యాప్త మూర్తి.

    రిప్లయితొలగించండి
  23. గోలి హనుమచ్ఛాస్త్రి గారూ,
    మీ పూరణలో మొదటి పాదం తేటగీతి. మూడవ పాదం తేటగీతి అనుకుంటే యతి సరిపోతున్నది. ఆటవెలది అనుకుంటే యతి కుదరదు. నేను మొదటి పాదాన్ని చూసి తేటగీతి అనే అభిప్రాయంలో ఉండి అలా సవరించాను. నా తాజా సవరణ (ఆటవెలదిలో)

    రొమ్ము జూపి పలికె రమ్మని చావును
    తెలుగు తెగువ తెలిపె 'వెలుగు యొజ్జ '
    కేసరి యని చెప్ప కేసరికే సరి
    ఆంధ్ర మాత యనిన నాప్త మూర్తి.

    రిప్లయితొలగించండి
  24. హనుమచ్ఛాస్త్రి గారూ,
    నేను ఆటవెలదిలో సవరించి వ్యాఖ్య పెట్టేలోగా మీరు తేటగీతిలో సవరించి పెట్టారు. మీ సవరణ చాలా బాగుంది. అభినందనలు.

    రిప్లయితొలగించండి
  25. శంకరార్యా!నిజమే తేతగీతి, ఆటవెలదిని కలిపి వ్రాశాను. నాపొరపాటుకు మన్నించండి.నా సవరణతో పాటు మీ సవరణలతో రెండు ఛందములలో పూరణలు వచ్చునట్లు జేసిన మీకు ధన్యవాదములు.

    రిప్లయితొలగించండి
  26. ఏల్చూరి మురళీధరరావు గారూ,
    మీ అభిమానానికి ధన్యవాదాలు. మీ సూచన అవశ్యాచరణీయం. దానిని కార్యరూపానికి తెచ్చే ప్రయత్నం త్వరలోనే చేస్తాను.

    రిప్లయితొలగించండి