12, జూన్ 2012, మంగళవారం

రవీంద్రుని గీతాంజలి - 41

రవీంద్రుని గీతాంజలి

తెనుఁగు సేత

శ్రీమాన్ చిలుకమఱ్ఱి రామానుజాచార్యులు

41

WHERE dost thou stand behind them
all, my lover, hiding thyself in the
shadows? They push thee and pass
thee by on the dusty road, taking thee
for naught. I wait here weary hours
spreading my offerings for thee, while
passers by come and take my flowers,
one by one, and my basket is nearly
empty.

The morning time is past, and the
noon. In the shade of evening my
eyes are drowsy with sleep. Men going
home glance at me and smile and fill
me with shame. I sit like a beggar
maid, drawing my skirt over my face,
and when they ask me, what it is I
want, I drop my eyes and answer them
not

Oh, how, indeed, could I tell them
that for thee I wait, and that thou hast
promised to come. How could I utter
for shame that I keep for my dowry
this poverty. Ah, I hug this pride in
the secret of my heart.

I sit on the grass and gaze upon the
sky and dream of the sudden splendour
of thy coming all the lights ablaze,
golden pennons flying over thy car,
and they at the roadside standing
agape, when they see thee come
down from thy seat to raise me from
the dust, and set at thy side this
ragged beggar girl a -tremble with
shame and pride, like a creeper in a
summer breeze.

But time glides on and still no sound
of the wheels of thy chariot. Many a
procession passes by with noise and
shouts and glamour of glory. Is it only
thou who wouldst stand in the shadow
silent and behind them all ? And only I
who would wait and weep and wear out
my heart in vain longing ?


చిలుకమఱ్ఱి రామానుజాచార్యుల అనువాదము.....

ప్రియతమా! వారలందరి వెనుక నీడ
నీడలం డాగి యెచ్చట నిలిచి తీవు?
దు మ్మెగయు బాటలో నిన్ను ద్రోసుకొనుచు
వా రదిగొ! దాటి పోవుచున్నారు చూడు,
అరరె! ని న్నించుకంతయు సరకు గొనరు!
ఎంతసేపాయె నీకొర కేను పూల
కానుకల్ దెచ్చి యిచ్చటఁ గాచియుంటి,
బాటసారు లొక్కొక్క పుష్పమ్ము గొంచుఁ
బోవ దాదాపు శూన్యమై పోయె బుట్టి ||

వేకువ గతించె, మధ్యాహ్నవేళ దాటె,
సందెమసకన చీఁకటి క్రందుకొనియె,
కనులపై నిద్రమైకము గ్రమ్ముచుండె,
ఇండ్ల కేగెడు తెరువరు లెల్ల నన్ను
గనుచు నవఁగ సిగ్గున మునిఁగిపోతి,
మోముపైఁ గట్టుగుడ్డనె ముసుఁగు పెట్టి
ముడుచుకొనియుంటి బిచ్చఁపుఁబడుచు వోలె,
“ఏమి కావలె?” నంచు నన్నెదుటివార
లడిగినప్పు డొకింత మారాడ లేక
వాలుతున్ రెండుకన్నులు నేల వైపు ||

నిక్క మరసిన నయ్యయో! నేను వారి
కేమనందు? “నీకోసమ యిచట నెదురు
చూతు” ననికాని, “నీవు వచ్చుటకు మాట
యిచ్చినా” వని కాని నే నెట్లు చెప్ప?
ఓ మహారాజవిభవ! “నీయొద్ద కిట్టు
లరణముగఁ దెచ్చుకొంటిఁ బేదరిక” మనుచు
సిగ్గుచేటుగ నేనెటు చెప్పుకొందు?
అహహ! యీ యభిమానమె యస్మదంత
రంగఁపు నిగూఢతలమున హత్తుకొనియె ||

కొమరు పచ్చిక తిన్నెపైఁ గూరుచుండి
యాకసముపైకి రెప్ప వేయకయ నేను
కాంచుచుం గాంచు చట్లె యాకస్మికముగ
నీవు వచ్చెడి దివ్యకాంతిఁ గలగంటి,
ప్రజ్వరిల్లుచునుండె దీపంబు లెల్ల,
పైడిసిడెములు రథముపై నాడుచుండె,
అల వసంతఁపు లేగాలి కల్లలాడు
లతికవలె గరువంబుతో లజ్జతోడ
వణికిపోయెడి యీజీర్ణవస్త్రభిక్షు
బాలికను ధూళిలోనుండి పైకిఁ దీసి
నీదు వామాంకతలమున నిల్పుకొనఁగఁ
గ్రిందికిం దిగివచ్చు నీచంద మెల్ల
దారిప్రక్క నిలంబడి నోరు తెరచి
యరయుచుండిరి పథికు లచ్చెరువుతోడ ||

కల కరఁగిపోయె, కాలము కదలుచుండె,
లేదు నీరథచక్రనినాద మెచట ||
లలితవిశ్రుతకోలాహలస్వనమ్ము
లొలయ నెన్ని యూరేగింపు టుత్సవములొ
కడచిపోవుచునుండె, నొక్కఁడవు నీవె
నీరవంబుగ నీడల నిలిచె దొక్కొ?
ఒక్క నీవ యిటుల్ వెను జిక్కె యేడ్చి
వట్టి యాస మదిం బిగఁబట్టి పట్టి
యొక్క నేన యిటం బడియుందు నొక్కొ? ||

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి