రవీంద్రుని గీతాంజలి
తెనుఁగు సేత
శ్రీమాన్ చిలుకమఱ్ఱి రామానుజాచార్యులు
49
You came down from your throne and
stood at my cottage door.
I was singing all alone in a corner,
and the melody caught your ear. You
came down and stood at my cottage
door.
Masters are many in your hall, and
songs are sung there at all hours. But
the simple carol of this novice struck
at your love. One plaintive little strain
mingled with the great music of the
world, and with a flower for a prize you
came down and stopped at my cottage
door.
తెనుఁగు సేత
శ్రీమాన్ చిలుకమఱ్ఱి రామానుజాచార్యులు
49
You came down from your throne and
stood at my cottage door.
I was singing all alone in a corner,
and the melody caught your ear. You
came down and stood at my cottage
door.
Masters are many in your hall, and
songs are sung there at all hours. But
the simple carol of this novice struck
at your love. One plaintive little strain
mingled with the great music of the
world, and with a flower for a prize you
came down and stopped at my cottage
door.
చిలుకమఱ్ఱి రామానుజాచార్యుల అనువాదము.....
నాథ! నీ దివ్యసింహాసనంబు డిగ్గి
యేకతఁపు నా కుటీరము వాకిలికడ
నీవు వచ్చి తటాలున నిల్చినావు ||
ఒంటిగా పాడుకొనుచుంటి నొక్క మూలఁ
చేరె నీచెవి మెల్లని సారము లవి,
క్రిందికిం దిగి తత్క్షణమందె స్వామి!
యేకతము నాకుటీరఁపు వాకిలికడ
నీవు వచ్చి తటాలున నిల్చినావు ||
సంతతము పాడుచుంద్రు నీ సభను గాయ
కాగ్రగణ్యులు లెక్కలేనంత మంది,
కాని యెట్టి యాడంబరమేని లేని
వచ్చిరాని నా గానమె నచ్చె నీకు,
చేరె నొక జాలిగొల్పెడి చిన్ని పాట
ఖ్యాతి కెక్కిన విశ్వసంగీతమందు,
కేల వరమాల దాలిచి క్రిందికి దిగి
యేకతఁపు నా కుటీరము వాకిలికడ
నిల్చినావు తటాలున నీవు వచ్చి ||
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి