25, జూన్ 2012, సోమవారం

దత్తపది - 21 (అక్క, అన్న, వదిన, మామ)

కవిమిత్రులారా,

‘అక్క - అన్న - వదిన - మామ’

పై పదాలను ఉపయోగించి

రావణునకు మండోదరి చేసిన హితబోధను తెలుపుతూ

మీకు నచ్చిన ఛందస్సులో పద్యం వ్రాయండి.

పూరణలు -

౧. హరి వేంకట సత్యనారాయణ మూర్తి 
అక్కట! నాశనకారణ
మిక్కాంతను దెచ్చుటన్న నీయమ నీకున్
దక్కదు నీ వది నమ్మిన
నక్కఱపడు మామకీనమౌ వాక్యంబుల్.


౨. మిస్సన్న 

పర పురుషుని భార్యన్నను
వరుసకు నక్కనియొ లేక వదిననొ యనుచున్
చరియింప నెరుగమా మరి
మరియాదయె సీత గోర మహిత గుణాఢ్యా?


౩. గోలి హనుమచ్ఛాస్త్రి  

అక్కటా రాముని సతి పై యాశ వదలు
మన్న మామాట వినవెట్టి మాయ గ్రమ్మె
క్షేమ మా మనుజ పతి యనిని జేయకున్న
వినవ దినకర కులజుని వేడు శరణు.


౪. లక్ష్మీదేవి 

సతినను యక్కర తో విని,
పతియన్నను దేవుడనెడు పడతిని విడుమా!
పతిసేవ దినదినమ్మది
క్షతి నీకగు, మా మనమ్ము కాంచెను దనలో.
 

(పతిసేవ అనునది పతివ్రతా లక్షణము. అది యాయుధమై నీకు క్షతి కలుగునని చెప్పుట.)

౫. గుండు మధుసూదన్  
నాథ! య క్కపివరు మాట నాలకించి,
య న్నరుని భార్య సీతను మన్నన లిడి
నీవ దినమణి కుల ఘను నికటమునకుఁ
జేరఁగాఁ బంపుమా మనసార నిపుడ!


 
౬. సుబ్బారావు 
మామ మాటను విని నీవు మగఁడ ! యిపుడు 
వదిన సీతను రామన్న వశము జేసి
మమ్ము కాపాడు నిన్ను నే నమ్మినాము
కాని యెడలన నక్కట ! కాలు గతియె .


౭. ‘మన తెలుగు’ చంద్రశేఖర్  
నీ విపు డక్కడ కేగుము
కావుము రామన్న! సీతఁ గైకొను మనుమా!
బ్రోవ దినకర కులోన్నతు
డావం తైనను కొదకొనడన విను మామా!


౮. రవి 
అక్కరకు రాని మోహము
నిక్కటులన్ దెచ్చు యొలియు నింద్యము, విడుమా,
క్కువ యన్నది లేదా?
ఇక్కువ దినకరకులజుడు నెఱుగడె నాథా!
 
 ౯. నేదునురి రాజేశ్వరి
మిక్కుటముగ జేయుటన్న మిన్నతి గాదే ! 
చక్కగ వదినగ నెంచుచు 
మ్రొక్కెదను శపించకుమా మము దేవుడవై !
 
౧౦. సహదేవుడు
 
అక్కడి పతియే మదిలో
నిక్కడ కలడన్న సీతనిక నీవిడక
న్నిక్కిన చావది నక్కును
జక్కగ వినుమా! మముగని జాతిని నిలుపన్!
 
౧౧. చింతా రామకృష్ణారావు

అక్కమలాయతాక్షిఁ గని హద్దులు మీరుచు తెచ్చినాడవే!
నిక్కము,దోషమిద్ది!ధరణీపతి తప్పక వచ్చు, నన్నతో
నిక్కము వచ్చు లక్ష్మణుఁడు నేర్పున తా వదినమ్మ రక్షకై.
మక్కువ వీడు మింక. విడుమా మహితాత్మను రావణ ప్రభూ!

౧౨. కమనీయం

అక్కటా, నా పలుకు చెవి కెక్క కుండ ,
సీత విడుమన్న విడువవు చెరుపు చాల
దెచ్చు మనకెల్లరకు నీవ దినకులవరు
నకుసమర్పించు మామనవి నమ్ము నిజము.
13. గరికిపాటి నరసింహ రావు 
అక్కట భార్య లిందరు మహాసుగుణాఢ్యలు సుందరీమణుల్
జక్కఁగ నిన్ను గొల్వఁగ విచారణ మన్నది లేక జానకిన్
గ్రక్కున దెచ్చి కొంపలను గాలిచి మామక బోధ నెట్లు నే
దిక్కునఁ ద్రోసినా వది నదిన్ జలధిన్ బడఁద్రోసినావొకో!   

19 కామెంట్‌లు:

 1. అక్కట! నాశనకారణ
  మిక్కాంతను దెచ్చుటన్న నీయమ నీకున్
  దక్కదు నీవదినమ్ముము
  మన్నించుము మామకీనమౌ వాక్యంబుల్.

  రిప్లయితొలగించండి
 2. పర పురుషుని భార్యన్నను
  వరుసకు నక్కనియొ లేక వదిననొ యనుచున్
  చరియింప నెరుగమా మరి
  మరియాదయె సీత గోర మహిత గుణాఢ్యా?

  రిప్లయితొలగించండి
 3. అక్కటా రాముని సతి పై యాశ వదలు
  మన్న మామాట వినవెట్టి మాయ గ్రమ్మె
  క్షేమమామనుజ పతి యనిని జేయకున్న
  వినవ దినకర కులజుని వేడు శరణు.

  రిప్లయితొలగించండి
 4. సతినను యక్కర తో విని,
  పతియన్నను దేవుడనెడు పడతిని విడుమా!
  పతిసేవ దినదినమ్మది
  క్షతి నీకగు, మా మనమ్ము కాంచెను దనలో.

  పతిసేవ అనునది పతివ్రతా లక్షణము. అది యాయుధమై నీకు క్షతి కలుగునని చెప్పుట.

  రిప్లయితొలగించండి
 5. మామ మాటను విని నీ వు మగ డ ! నిపుడు
  వదిన సీ తను రామన్న వశము జేసి
  మమ్ము కాపాడు నిన్ను నే నమ్మినాము
  కాని యె డ ల న నక్కట ! కాలు గతి యె .

  రిప్లయితొలగించండి
 6. గుండు మధుసూదన్ గారి పూరణలు....
  (1)
  నాథ! య క్కపివరు మాట నాలకించి,
  య న్నరుని భార్య సీతను మన్నన లిడి
  నీవ దినమణి కుల ఘను నికటమునకుఁ
  జేరఁగాఁ బంపుమా మనసార నిపుడ!
  (2)
  నాథ! య క్కపివరుఁడన్న పగిది నీవ
  దినమణి కుల తిలకుని సతి, జనక సుత
  సీత నాదరమున రాముఁ జెంతఁ జేర్చి
  మామక సుతపతి హతమ్ము మాన్పుమయ్య!

  రిప్లయితొలగించండి
 7. సత్యనారాయణ మూర్తి గారూ,
  గుండు మధుసుదన్ గారు ఫోన్ చేసి చెప్పేదాకా గమనించలేదు. మీ పూరణ నాల్గవ పాదం ప్రాస తప్పింది. దానిని
  ‘.... నీవది నమ్మిన
  నక్కఱపడు మామకీన మౌ వాక్యంబుల్’
  అని సవరించ వచ్చా?
  లేక... మీరే ఏదైనా సవరణను సూచిస్తారా?
  *
  గుండు మధుసూదన్ గారి రెండవ పూరణ నాల్గవ పాదంలో ‘సుతపతి’ని ‘సుతతతి’గా చదువుకొన వలసిందిగా మనవి.

  రిప్లయితొలగించండి
 8. ఆర్యా!
  నమస్కారములు.
  పొరపాటు జరిగింది. క్షమించ ప్రార్థన. "నీవది నమ్మిన నక్కఱపడు మామకీనమౌ వాక్యంబుల్" అన్న మీ సవరణ ఉత్తమంగా ఉంది. అలాగే సరిచేయ ప్రార్థన.

  రిప్లయితొలగించండి
 9. అజ్ఞాత చెప్పారు.....
  ఇంటర్ తెలుగు పుస్తకం లో కళ పాఠం లో "పోట బంటునై అచ్చటి కేల పోయితి మహాగుణ భూషణు గోలు పొయితిన్" అభిమన్యుని కోల్పోయిన అర్జునుని బాధను తెలిపే పద్యం కొంత భాగం ఇచ్చారు. దానిపూర్తి పాఠం కావాలి తిక్కన భారతం అందుబాటులో లేదు. తెలిసినవాళ్ళు దయచేసి సహకరించండి.

  రిప్లయితొలగించండి
 10. నీ వెస నక్కడ కేగుము
  కావుము రామన్న! సీతఁ గైకొను మనుమా!
  బ్రోవ దినకర కులోన్నతు
  డావం తైనను కొదకొనడన విను మామా!

  రిప్లయితొలగించండి
 11. అక్కరకు రాని మోహము
  నిక్కటులన్ దెచ్చు యొలియు నింద్యము, విడుమా,
  క్కువ యన్నది లేదా?
  ఇక్కువ దినకరకులజుడు నెఱుగడె నాథా!

  ఒలి = అపహరణ
  ఇక్కువ = జీవస్థానము

  రిప్లయితొలగించండి
 12. అక్కఱకు రాని పనులను
  మిక్కుటముగ జేయుటన్న మిన్నతి గాదే !
  చక్కగ వదినగ నెంచుచు
  మ్రొక్కిడి శపియించ కుమామము మహ దేవుడవై !

  రిప్లయితొలగించండి
 13. చంద్రశేఖర్ గారూ,
  అది ‘నీవు వెస’ కదా! ‘నీవు + ఎస’ అని విభాగం చేస్తే అర్థం కుదరడం లేదు. అందువల్ల ‘నీ విపు డక్కడ....’ అని సవరించాను.
  *
  రాజేశ్వరి అక్కయ్యా,
  చివరి పాదంలో గణదోషం ఉంది. అందువల్ల సవరించాను. సవరించిన పాఠం పైన మెయిన్ పోస్ట్‌లో చూడండి.

  రిప్లయితొలగించండి
 14. శ్రిగురుభ్యోనమః

  అక్కడి పతియే మదిలో
  నిక్కడ కలడన్న సీతనిక నీవిడక
  న్నిక్కిన చావది నక్కును
  జక్కగ వినుమా! మముగని జాతిని నిలుపన్!

  (గురువుగారూ నా సమస్యను మీరు పట్టేశారు, నేను నా బ్లాగులో పోస్ట్ అన్న దానిలో (గూగుల్) టైపు చేసి శంకరాభరణం లో పేస్టు చేస్త్తున్నాను. దయతో నాకు మార్గము చూప
  ప్రార్థన (అరసున్నా గురించి ) )

  రిప్లయితొలగించండి
 15. అక్కమలాయతాక్షిఁ గని హద్దులు మీరుచు తెచ్చినాడవే!
  నిక్కము,దోషమిద్ది!ధరణీపతి తప్పక వచ్చు, నన్నతో
  నిక్కము వచ్చు లక్ష్మణుఁడు నేర్పున తా వదినమ్మ రక్షకై.
  మక్కువ వీడు మింక. విడుమా మహితాత్మను రావణ ప్రభూ!

  రిప్లయితొలగించండి
 16. నమస్కారములు
  నేను చూసి అనుకున్నాను. కానీ ఏమనుకుంటారో అని చెప్పలేదు.
  " గూగుల్ లో అన్నీ సరిగా రావు .లేఖినిలో చిన్నా పెద్దా అక్షరాలను [ అవుసరాన్ని బట్టి .అంటే దీర్ఘాలున్నప్పు డూ ] , డ...కీ , ద ...కీ ...అల్లాగే ....ట ...కీ , త ....కీ ] మార్చు కుంటూ ఉండాలి . ఇక " రాము@m డు అన్నప్పుడు అరసున్నా అలా టైప్ చేస్తే వస్తుంది. ఇది గూగుల్ లో రాదు . [ స్పేస్ ఇవ్వకుండా టైప్ చేయాలి ] నేను మేధావి నని కాదు సరదాగా వ్రాసాను. మన్నించ గలరు సెలవు

  రిప్లయితొలగించండి
 17. అక్కటా, నా పలుకు చెవి కెక్క కుండ ,
  సీత విడుమన్న విడువవు చెరుపు చాల
  దెచ్చు మనకెల్లరకు నీవ దినకులవరు
  నకుసమర్పించు మామనవి నమ్ము నిజము.

  రిప్లయితొలగించండి
 18. నైపుణ్యంతో సమర్థవంతంగా దత్తపదిని పూరించిన కవిమిత్రులు
  హరి వేంకట సత్యనారాయణ మూర్తి గారికి,
  మిస్సన్న గారికి,
  గోలి హనుమచ్ఛాస్త్రి గారికి,
  లక్ష్మీదేవి గారికి,
  గుండు మధుసూదన్ గారికి,
  సుబ్బారావు గారికి,
  ‘మనతెలుగు’ చంద్రశేఖర్ గారికి,
  రవి గారికి,
  రాజేశ్వరి అక్కయ్య గారికి,
  సహదేవుడు గారికి,
  చింతా రామకృష్ణారావు గారికి,
  కమనీయం గారికి
  ............. అభినందనలు, ధన్యవాదాలు.

  రిప్లయితొలగించండి
 19. http://te.newikis.com/source_%E0%B0%86_%E0%B0%AD%E0%B0%BE_7_2_211_to_7_2_240.html

  గురువు గారు,
  వెతికితే పై లంకెలో ఈ పద్యం దొరికింది.
  అచ్చు తప్పులేమైనా ఉన్నాయేమో తెలీదండి.

  అక్కట మందభాగ్యునకు నట్టి సూభవరత్న మెవ్విధిన్
  డక్కు విధాత నిర్దయుఁ డొడంబడునే కడు మేలి వస్తువుల్
  పెక్కుదినంబు లున్కి యరి బృందము పిల్చినఁ బోటు బంట నై
  యక్కడ కేల పోయితి మహాగుణ భూషణుఁ గోలు పోయితిన్.

  రిప్లయితొలగించండి