కవిమిత్రులారా...
ఈరోజు పూరించవలససిన సమస్య ఇది...
కనులు లేనివాఁడు కన్ను గొట్టె.
ఈ సమస్యను పంపిన పోచిరాజు సుబ్బారావు గారికి ధన్యవాదాలు.
కవిమిత్రుల పూరణలు
నడచి వెడలుచుండ నళినాక్షి యొక్కతె
చాల గాలి వీచి జారె పైట
బుద్ధియున్న వాడు మూసెను తన రెండు
కనులు, లేనివాఁడు కన్ను గొట్టె.
ఈరోజు పూరించవలససిన సమస్య ఇది...
కనులు లేనివాఁడు కన్ను గొట్టె.
ఈ సమస్యను పంపిన పోచిరాజు సుబ్బారావు గారికి ధన్యవాదాలు.
కవిమిత్రుల పూరణలు
౧. గోలి హనుమచ్ఛాస్త్రి
నడచి వెడలుచుండ నళినాక్షి యొక్కతె
చాల గాలి వీచి జారె పైట
బుద్ధియున్న వాడు మూసెను తన రెండు
కనులు, లేనివాఁడు కన్ను గొట్టె.
* * * * *
౨. కంది శంకరయ్య
తల్లి రీతి నక్కసెల్లెండ్రవలె పర
సతులఁ జూచునట్టి సంప్రదాయ
మలరు సంస్కృతి మన దనియెడి జ్ఞానంపు
కనులు లేనివాఁడు కన్ను గొట్టె.
తల్లి రీతి నక్కసెల్లెండ్రవలె పర
సతులఁ జూచునట్టి సంప్రదాయ
మలరు సంస్కృతి మన దనియెడి జ్ఞానంపు
కనులు లేనివాఁడు కన్ను గొట్టె.
* * * * *
౩. సుబ్బారావు
చూడ లేడు సరిగ నాడ లేడు గదమ్మ !
కనులు లేని వాడు , కన్ను గొట్టె
పైత్య మెక్కు వయ్యి పడతుల జూచి యం
చనగ తగునె యంధు డైనవాని.
* * * * *
౪. హరి వేంకట సత్యనారాయణ మూర్తి
తిరుమలేశుమహిమ లరయుడో జనులార!
మూక మాటలాడె ముదముతోడ
పంగు వద్భుతముగ పరుగులు దీసెను
కనులు లేనివాడు కన్ను గొట్టె.
* * * * *
౫. పండిత నేమాని రామజోగి సన్యాసి రావు
కనులు లేని వాడు కన్నుగొట్టె నటంచు
మూగ పిల్ల యొకతె బొంకులాడె
వాదనలను రెండు పక్షాలలో విని
చెవిటివాడు తీర్పు చెప్పె బళిర!
* * * * *
౬. ‘మన తెలుగు’ చంద్రశేఖర్
అన్నకున్న దొక్క కన్నట, కనరెండు
కనులు లేనివాఁడు, కన్ను గొట్టె
చెంప పగుల గొట్టె చిరుబురు చతురాక్షి
ఉన్న ఒక్క కన్ను ఊడి పోయె!
* * * * *
౭. చంద్రమౌళి
లోన ఖిన్న మైన తానాడురెప్పలు
కన్ను గొట్టి నట్టు కదలి బెదరి
దారి తప్పి వసతి దరిరాక భయమొంద
కనులు లేనివాఁడు కన్ను గొట్టె.
* * * * *
౮. గుండు మధుసూదన్
కలికి కానుపించఁ గామాంధుఁ డయ్యు నా
కనులు లేనివాఁడు కన్ను గొట్టె!
కని, భరించలేక కలికి కాళిక వోలె
వచ్చి, వాని చెంప వాయఁగొట్టె.
* * * * *
౯. రాజేశ్వరి నేదునూరి
మాట పలుకలేడు మదినిండ భావాలు
సొగసు లొలుకు తరుణి సోయగమ్ము
కలలు కనగ మెండు కలవరపడినంత
కనులు లేని వాఁడు కన్ను గొట్టె !
* * * * *
౧౦.సహదేవుడు
దృష్టినొసగెఁ జక్రి ధృతరాష్ట్రు డడుగంగ
విశ్వరూప మదియె వింతగొల్ప
దివ్యమైన తేజతీక్షణ ధాటికి
కనులు లేనివాడు కన్నుగొట్టె.
(తీక్షణ మైన వెలుగుచూడలేక కన్నార్పాడన్న అర్థంతో వ్రాసాను)
కనులు లేని వాడు , కన్ను గొట్టె
పైత్య మెక్కు వయ్యి పడతుల జూచి యం
చనగ తగునె యంధు డైనవాని.
* * * * *
౪. హరి వేంకట సత్యనారాయణ మూర్తి
తిరుమలేశుమహిమ లరయుడో జనులార!
మూక మాటలాడె ముదముతోడ
పంగు వద్భుతముగ పరుగులు దీసెను
కనులు లేనివాడు కన్ను గొట్టె.
* * * * *
౫. పండిత నేమాని రామజోగి సన్యాసి రావు
కనులు లేని వాడు కన్నుగొట్టె నటంచు
మూగ పిల్ల యొకతె బొంకులాడె
వాదనలను రెండు పక్షాలలో విని
చెవిటివాడు తీర్పు చెప్పె బళిర!
* * * * *
౬. ‘మన తెలుగు’ చంద్రశేఖర్
అన్నకున్న దొక్క కన్నట, కనరెండు
కనులు లేనివాఁడు, కన్ను గొట్టె
చెంప పగుల గొట్టె చిరుబురు చతురాక్షి
ఉన్న ఒక్క కన్ను ఊడి పోయె!
* * * * *
౭. చంద్రమౌళి
లోన ఖిన్న మైన తానాడురెప్పలు
కన్ను గొట్టి నట్టు కదలి బెదరి
దారి తప్పి వసతి దరిరాక భయమొంద
కనులు లేనివాఁడు కన్ను గొట్టె.
* * * * *
౮. గుండు మధుసూదన్
కలికి కానుపించఁ గామాంధుఁ డయ్యు నా
కనులు లేనివాఁడు కన్ను గొట్టె!
కని, భరించలేక కలికి కాళిక వోలె
వచ్చి, వాని చెంప వాయఁగొట్టె.
* * * * *
౯. రాజేశ్వరి నేదునూరి
మాట పలుకలేడు మదినిండ భావాలు
సొగసు లొలుకు తరుణి సోయగమ్ము
కలలు కనగ మెండు కలవరపడినంత
కనులు లేని వాఁడు కన్ను గొట్టె !
* * * * *
౧౦.సహదేవుడు
దృష్టినొసగెఁ జక్రి ధృతరాష్ట్రు డడుగంగ
విశ్వరూప మదియె వింతగొల్ప
దివ్యమైన తేజతీక్షణ ధాటికి
కనులు లేనివాడు కన్నుగొట్టె.
(తీక్షణ మైన వెలుగుచూడలేక కన్నార్పాడన్న అర్థంతో వ్రాసాను)
నడచి వెడలుచుండ నళినాక్షి యొక్కతె
రిప్లయితొలగించండిచాల గాలి వీచి జారె పైట
బుద్ధియున్న వాడు మూసెను తన రెండు
కనులు, లేనివాఁడు కన్ను గొట్టె.
నా పూరణ....
రిప్లయితొలగించండితల్లి రీతి నక్కసెల్లెండ్రవలె పర
సతులఁ జూచునట్టి సంప్రదాయ
మలరు సంస్కృతి మన దనియెడి జ్ఞానంపు
కనులు లేనివాఁడు కన్ను గొట్టె.
చూడ లేడు సరిగ నాడ లేడు గదమ్మ !
రిప్లయితొలగించండికనులు లేని వాడు , కన్ను గొట్టె
పైత్య మెక్కు వయ్యి పడతుల జూడగ
తగిన శిక్ష వే య దగును నపుడు
గోలి హనుమచ్ఛాస్త్రి గారూ,
రిప్లయితొలగించండిఅద్భుతంగా ఉంది మీ పూరణ. అభినందనలు.
*
సుబ్బారావు గారూ,
మీ పూరణ బాగుంది. అభినందనలు.
మీ పూరణలో దోషం ఏమీ లేకున్నాఔచిత్యం కోసం కొద్దిగా సవరించాను. మీ అనుమతి లేకుండా మార్చినందుకు మన్నించాలి. నా సవరణను ప్రధాన టపాలో చూడండి.
వాని మొగము చూడ వంకర కనరెండు
రిప్లయితొలగించండికనులు లేనివాఁడు కన్ను గొట్టె
చెంప పగుల గొట్టె చిరుబురు చతురాక్షి
ఉన్న ఒక్క కన్ను ఊడి పోయె!
చంద్రశేఖర్ గారూ,
రిప్లయితొలగించండిమీ పూరణలో అన్వయమో, మరేదో లోపించినట్లు తోస్తున్నది. కొద్దిగా వివరిస్తారా?
లోన ఖిన్న మైన తానాడురెప్పలు
రిప్లయితొలగించండికన్ను గొట్టి నట్టు కనుప డించు
దారి తప్పి వసతి దరిరాక భయమొంద
కనులు లేనివాఁడు, కన్ను గొట్టె.
గోలి హనుమచ్ఛాస్త్రి గారూ మీ పూరణ బాగుంది.
రిప్లయితొలగించండి"నడచి వెడలుచుండ నళినాక్షి యొక్కతె"
చాల గాలి వీచి జారె పైట
బుద్ధియున్న వాడు మూసెను తన రెండు
కనులు, లేనివాఁడు కన్ను గొట్టె.
నేను "బుద్ధియున్న వాడు మూసె కనులు రెండు" అని చదువు కుంటున్నాను.
తిరుమలేశుమహిమ లిలను జూడగవచ్చు
రిప్లయితొలగించండిమూక మాటలాడె ముదముతోడ
పంగు వద్భుతముగ పరుగులు దీసెను
కనులు లేనివాడు కన్ను గొట్టె.
ఆర్యా!
రిప్లయితొలగించండినమస్కారం.
మొదటి పాదాన్ని ఇలా సవరించ వలసినదిగా ప్రార్థన.
"తిరుమలేశుమహిమ లరయుడో జనులార!"
కనులు లేని వాడు కన్నుగొట్టె నటంచు
రిప్లయితొలగించండిమూగ పిల్ల యొకతె బొంకులాడె
వాదనలను రెండు పక్షాలలో విని
చెవిటివాడు తీర్పు చెప్పె బళిర!
చంద్రమౌళి గారూ,
రిప్లయితొలగించండిపూరణ బాగుంది. అభినందనలు.
కానీ...‘కనుప డించు..’ ?
అన్నకున్న దొక్క కన్నట, కనరెండు
రిప్లయితొలగించండికనులు లేనివాఁడు, కన్ను గొట్టె
చెంప పగుల గొట్టె చిరుబురు చతురాక్షి
ఉన్న ఒక్క కన్ను ఊడి పోయె!
శ్రీ శంకరయ్యరారూ, అలాగే సవరించాను. ధన్యవాదము.
రిప్లయితొలగించండిలోన ఖిన్న మైన తానాడురెప్పలు
కన్ను గొట్టి నట్టు కదలి బెదరి
దారి తప్పి వసతి దరిరాక భయమొంద
కనులు లేనివాఁడు కన్ను గొట్టె.
మాట పలుక లేడు మదినిండ భావాలు
రిప్లయితొలగించండిసొగసు లొలుకు తరుణి సోయ గమ్ము
కలలు కనగ మెండు కలవర పడినంత
కనులు లేని వాఁడు కన్ను గొట్టె !
శ్రీపండితనేమాని గురువర్యులకు నమస్సులు. హాశ్యరసం మేళవించిన మీ పద్యము చాలా బాగున్నది.
రిప్లయితొలగించండిదృష్టినొసగెఁజక్రిధృతరాష్ట్రుడడుగంగ
రిప్లయితొలగించండివిశ్వరూపమదియెవింతగొల్ప
దివ్యమైనతేజతీక్షణధాటికి
కనులులేనివాడుకన్నుగొట్టె
(తీక్షణ మైన వెలుగుచూడలేక కన్నార్పాడన్న అర్థంతో వ్రాశాను.తప్పులున్న తెలియజేయప్రార్థన)
శ్రీ శ్రీపతి శాస్త్రి గారూ!
రిప్లయితొలగించండిశుభాశీస్సులు. స్వస్తి.
పండిత నేమాని వారూ,
రిప్లయితొలగించండిచిన్నప్పుడెప్పుడో విన్న ఏదో తత్త్వగీతం విన్నట్టుంది మీ పూరణ చదివితే... చాలా బాగుంది. అభినందనలు.
*
లక్కరాజు వారూ,
ధన్యవాదాలు.
*
రాజేశ్వరి అక్కయ్యా,
మీ పూరణ బాగుంది. అభినందనలు.
*
సహదేవుడు గారూ,
బాగుంది మీ పూరణ. అభినందనలు.
శంకరార్యా! ధన్యవాదములు.
రిప్లయితొలగించండిలక్కరాజు గారూ! ధన్యవాదములు.