17, జూన్ 2012, ఆదివారం

రవీంద్రుని గీతాంజలి - 46

రవీంద్రుని గీతాంజలి

తెనుఁగు సేత

శ్రీమాన్ చిలుకమఱ్ఱి రామానుజాచార్యులు

46

I KNOW not from what distant time
thou art ever coming nearer to meet
me. Thy sun and stars can never
keep thee hidden from me for aye.

In many a morning and eve thy
footsteps have been heard and thy
messenger has come within my heart
and called me in secret.

I know not why to-day my life is all
astir, and a feeling of tremulous joy is
passing through my heart.

It is as if the time were come to
wind up my work, and I feel in the air
a faint smell of thy sweet presence. 


చిలుకమఱ్ఱి రామానుజాచార్యుల అనువాదము.....

ఏ యనాదికాలమ్ముగ నీవు నన్ను
గలిసికొనుటకుఁ బయనము కట్టినావొ?
స్వామి! *నీ సూర్యచంద్రులు తాము నిన్ను
కప్పిపెట్టఁగ లేరు నా కన్నుబ్రామి ||

చాలతడవలు తొలిమలు సందెలందు
నీదు పాదాల సవ్వడి నేను వింటి
వచ్చి నీదూత నామనోభ్యంతరమ్ముఁ
జేరి నీపిల్పు మెల్లగఁ జెప్పి పోయె ||

ఏ నెరుంగను *తెరువరీ యేల నేడు
నిదుర విడి ప్రాణమెల్ల క్రక్కదలఁ దొడఁగె?
పలుకు లందని యానందభర మిదేల
నిలిచి నిల్చి యెడంద స్పందిత మొనర్చె? ||

*వచ్చెనా నేడు పయనింప వలయు వేళ
తీరెనా నాదు కర్తవ్యభార మెల్ల!
మేను మరపింపఁజాలు నీమేని తావి
కమ్మఁదన మూని గంధవహమ్ము నేడు
హెచ్చరించు నీ వెదుటికి వచ్చి తంచు ||

3 కామెంట్‌లు:

  1. శ్రీపతిశాస్త్రిఆదివారం, జూన్ 17, 2012 9:15:00 PM

    The woods are lovely, dark and deep.
    But I have promises to keep,
    And miles to go before I sleep,
    And miles to go before I sleep


    *వచ్చెనా నేడు పయనింప వలయు వేళ
    తీరెనా నాదు కర్తవ్యభార మెల్ల!

    Robert Frost ku,రవీద్రనాథ్ ఠాగూర్ కు, చిలుకమఱ్ఱి రామానుజాచార్యులకు నా నమస్సుమాంజలులు

    రిప్లయితొలగించండి
  2. శ్రీపతిశాస్త్రిఆదివారం, జూన్ 17, 2012 9:21:00 PM

    Robert Frost ku,రవీంద్రనాథ్ ఠాగూర్ కు, చిలుకమఱ్ఱి రామానుజాచార్యులకు నా నమస్సుమాంజలులు

    రిప్లయితొలగించండి
  3. శ్రీపతిశాస్త్రిఆదివారం, జూన్ 17, 2012 10:05:00 PM

    శ్రీగురుభ్యోనమ:

    *వచ్చెనా నేడు పయనింప వలయు వేళ
    తీరెనా నాదు కర్తవ్యభార మెల్ల!
    మేను మరపింపఁజాలు నీమేని తావి
    కమ్మఁదన మూని గంధవహమ్ము నేడు
    హెచ్చరించు నీ వెదుటికి వచ్చి తంచు ||

    ఈ పాదములు చదువునపుడు నాలో ఏదో అనిర్వచనీయమైన మధురానుభూతి కలుగుచున్నది. శ్రీ దేవులపల్లి కృష్ణశాస్త్రిగారి "ముందు తెలిసెనా ప్రభూ" అనే పాట గుర్తుకు వస్తున్నది. ఆ పాట విన్నప్పుడు కూడా ఇటువంటి అనుభూతే కలుగుతుంది. ఆ అనుభూతి వర్ణనాతీతము, ఊహలకే సాధ్యము.

    రిప్లయితొలగించండి