కవిమిత్రులారా,
పై చిత్రాన్ని పరిశీలించి తగిన పద్యా(లను)న్ని వ్రాయండి.
కవిమిత్రుల పద్యములు
పై చిత్రాన్ని పరిశీలించి తగిన పద్యా(లను)న్ని వ్రాయండి.
కవిమిత్రుల పద్యములు
౧. సుబ్బారావు
చంటి పిల్లగ కూర్చుని చాపి చేయి
చందమామను బిలిచెను చక్కగాను
చూడ ముచ్చట గొలుపును చూపరులకు
దిష్టి కొట్టక యీయుడు దీవనలను.
* * * * *
౨. గుండు మధుసూదన్
సిరి కలుగు నింతి పుట్టిన,
సిరి రూపము తానె, గిరిజ రూపము తానే,
తరుణియె క్షమాస్వరూపిణి,
మరియాదకు మాఱుపేరు మహిళయె కాదా !
“ఆఁడపిల్ల యేనాఁడును నాడ పిల్ల,
యీడ పిల్లయె కా” దంచు నెగురు వార
‘లాఁడపిల్ల మహాలక్ష్మి’ యనెడు మాట
వినఁగ లేదొక్కొ లోకాన వీను లలర !
కట్న మీయంగ లేమని, కసిని బూని
బాలికను గర్భమునఁ జంపఁ బాప మనెడు
త్రాసమే లేక తెగటార్చ ధర్మ మగునె?
రూపుమాపుఁడు మీరు స్త్రీ భ్రూణ హత్య !
* * * * *
౩. రవి
అమ్మా! అదుగో అక్కడ
కొమ్మల పై నాకసమున కూర్చున్నాడే,
తమ్మిచెలిమి కాడు,తనని
రమ్మనవా, నా గవునుకు రంగుల పూసై?
* * * * *
౪. పండిత నేమాని
మాయల నెరుగని యీ లే
బ్రాయపు బసికూన యెదిగి భరతావనిలో
నే యంతస్తున జేరునొ?
హాయిగ జీవించు గాక! యబ్ద శతంబుల్.
* * * * *
౫. హరి వేంకట సత్యనారాయణ మూర్తి
బాల్యదశ యన్న బహుమూల్యఫలము గాదె
పాలు గారెడి బుగ్గలు, పలుకు లెపుడు
దివ్యమాధుర్య భరములై తేజరిల్లు
బ్రహ్మవాక్యంబులో యన భవ్యములయి,
బాల్యదశ యన్న బహుమూల్యఫలము గాదె. (1)
చింత యొకయింత యేనియు సిరులగూర్చి
అంటగాబోదు నిత్యంబు హర్షమొదవు
కష్ట సుఖముల యూసెందు కలుగ బోదు
బాల్యదశ యన్న బహుమూల్య ఫలము గాదె. (2)
కులము, మతములు, గోత్రాలు కోట్లకొలది
సంప్రదాయంబు లాచారసంతతులును
తెలియవలసిన పనిలేదు భళిర! చూడ
బాల్యదశ యన్న బహుమూల్య ఫలము గాదె. (3)
కలిమిలేములు సమములై కలుగు తృప్తి
యఘము పుణ్యంబు లవియెందు నంటబోవు
దైవరూపంబు పసిబిడ్డ ధరణిలోన
బాల్యదశ యన్న బహుమూల్య ఫలము గాదె. (4)
చందమామను గాంచిన క్షణమునందు
చేతులనుఁ జూపి రమ్మని జీరుచుండు
తన్మయత్వంబు నందుచు ధరణి కెపుడు
బాల్యదశ యన్న బహుమూల్య ఫలము గాదె. (5)
కోపమే భూషణంబయి కోరికలను
దీర్చు చుండును వాత్సల్యదీప్తు లొసగు,
రోదనంబిక బలమౌను మేదినిపయి
బాల్యదశ యన్న బహుమూల్య ఫలము గాదె. (6)
తల్లిదండ్రులు, బంధువు, లెల్లవార
లరుసమును జెంది రాజశేఖరులు గూడ
సేవలందింతు రెల్లప్పు డేవలేక
బాల్యదశ యన్న బహుమూల్య ఫలము గాదె. (7)
ఆటపాటలఁ దేలుచు ననవరతము
ఘనత నందుచు కాలంబు గడుపుచుండు
భాగ్యమున కర్హు లిలలోన బాలు రవుర!
బాల్యదశ యన్న బహుమూల్య ఫలము గాదె. (8)
ఏడ్పు విన్నంత జననితా నెందు నున్న
శీఘ్రముగఁ జేరి ముద్దాడి చెంత నిలిచి
పాటలను బాడి యలరించి పలుకరించు
బాల్యదశ యన్న బహుమూల్య ఫలము గాదె. (9)
కోరినంతనె జనకుండు కూర్మితోడ
వస్తుజాలంబు నందించ వలయు ననుచు
యత్న మొనరించు బిడ్డకై యహరహమ్ము
బాల్యదశ యన్న బహుమూల్య ఫలము గాదె. (10)
* * * * *
౬ మిస్సన్న
“అమ్మ- అరటి - ఆవు” అని పల్కవే పాప
తెలుగు లింట నున్న వెలుగు వీవు
సన్ను మూను వద్దు చంద మామే ముద్దు
వమ్ము చేయ బోకు నమ్మకమ్ము.
* * * * *
౭. శ్రీపతిశాస్త్రి
అద్భుతమ్ముగనున్నదీ యాకసంబు
ఆకసంబంత యెతైన ఆశయంబు
పంచభూతమ్ములను జూచి పరవశించి
పట్ట నెంచితివేమమ్మ పగటి విభుని
ప్రకృతి లోనున్న వింతలు ప్రతిది మనదె
యనుచు తలబోయు ప్రాయమ్ము హాయి నొసగు
చీకు చింతలు లేనట్టి జీవితమున
నాటలాడుము నాతల్లి హర్ష మెసగ.
* * * * *
చేత జిక్కించు కొనగోరి చేయి జూపి
గగన మందున్న చంద్రుడు కలత పడెను
చిన్ని పాపను తానెట్లు చేర గలడు ?
* * * * *
౯. గోలి హనుమచ్ఛాస్త్రి
అమ్మా యీలోకమ్మున
నమ్మాయిగ బుట్టి నావు అమ్మయ్యా మీ
యమ్మకు జేజేలిత్తును
అమ్మాయీ యందుకొనుము, హాయ్ హాయ్ తల్లీ!
చంటి పిల్లగ కూర్చుని చాపి చేయి
చందమామను బిలిచెను చక్కగాను
చూడ ముచ్చట గొలుపును చూపరులకు
దిష్టి కొట్టక యీయుడు దీవనలను.
* * * * *
౨. గుండు మధుసూదన్
సిరి కలుగు నింతి పుట్టిన,
సిరి రూపము తానె, గిరిజ రూపము తానే,
తరుణియె క్షమాస్వరూపిణి,
మరియాదకు మాఱుపేరు మహిళయె కాదా !
“ఆఁడపిల్ల యేనాఁడును నాడ పిల్ల,
యీడ పిల్లయె కా” దంచు నెగురు వార
‘లాఁడపిల్ల మహాలక్ష్మి’ యనెడు మాట
వినఁగ లేదొక్కొ లోకాన వీను లలర !
కట్న మీయంగ లేమని, కసిని బూని
బాలికను గర్భమునఁ జంపఁ బాప మనెడు
త్రాసమే లేక తెగటార్చ ధర్మ మగునె?
రూపుమాపుఁడు మీరు స్త్రీ భ్రూణ హత్య !
* * * * *
౩. రవి
అమ్మా! అదుగో అక్కడ
కొమ్మల పై నాకసమున కూర్చున్నాడే,
తమ్మిచెలిమి కాడు,తనని
రమ్మనవా, నా గవునుకు రంగుల పూసై?
* * * * *
౪. పండిత నేమాని
మాయల నెరుగని యీ లే
బ్రాయపు బసికూన యెదిగి భరతావనిలో
నే యంతస్తున జేరునొ?
హాయిగ జీవించు గాక! యబ్ద శతంబుల్.
* * * * *
౫. హరి వేంకట సత్యనారాయణ మూర్తి
బాల్యదశ యన్న బహుమూల్యఫలము గాదె
పాలు గారెడి బుగ్గలు, పలుకు లెపుడు
దివ్యమాధుర్య భరములై తేజరిల్లు
బ్రహ్మవాక్యంబులో యన భవ్యములయి,
బాల్యదశ యన్న బహుమూల్యఫలము గాదె. (1)
చింత యొకయింత యేనియు సిరులగూర్చి
అంటగాబోదు నిత్యంబు హర్షమొదవు
కష్ట సుఖముల యూసెందు కలుగ బోదు
బాల్యదశ యన్న బహుమూల్య ఫలము గాదె. (2)
కులము, మతములు, గోత్రాలు కోట్లకొలది
సంప్రదాయంబు లాచారసంతతులును
తెలియవలసిన పనిలేదు భళిర! చూడ
బాల్యదశ యన్న బహుమూల్య ఫలము గాదె. (3)
కలిమిలేములు సమములై కలుగు తృప్తి
యఘము పుణ్యంబు లవియెందు నంటబోవు
దైవరూపంబు పసిబిడ్డ ధరణిలోన
బాల్యదశ యన్న బహుమూల్య ఫలము గాదె. (4)
చందమామను గాంచిన క్షణమునందు
చేతులనుఁ జూపి రమ్మని జీరుచుండు
తన్మయత్వంబు నందుచు ధరణి కెపుడు
బాల్యదశ యన్న బహుమూల్య ఫలము గాదె. (5)
కోపమే భూషణంబయి కోరికలను
దీర్చు చుండును వాత్సల్యదీప్తు లొసగు,
రోదనంబిక బలమౌను మేదినిపయి
బాల్యదశ యన్న బహుమూల్య ఫలము గాదె. (6)
తల్లిదండ్రులు, బంధువు, లెల్లవార
లరుసమును జెంది రాజశేఖరులు గూడ
సేవలందింతు రెల్లప్పు డేవలేక
బాల్యదశ యన్న బహుమూల్య ఫలము గాదె. (7)
ఆటపాటలఁ దేలుచు ననవరతము
ఘనత నందుచు కాలంబు గడుపుచుండు
భాగ్యమున కర్హు లిలలోన బాలు రవుర!
బాల్యదశ యన్న బహుమూల్య ఫలము గాదె. (8)
ఏడ్పు విన్నంత జననితా నెందు నున్న
శీఘ్రముగఁ జేరి ముద్దాడి చెంత నిలిచి
పాటలను బాడి యలరించి పలుకరించు
బాల్యదశ యన్న బహుమూల్య ఫలము గాదె. (9)
కోరినంతనె జనకుండు కూర్మితోడ
వస్తుజాలంబు నందించ వలయు ననుచు
యత్న మొనరించు బిడ్డకై యహరహమ్ము
బాల్యదశ యన్న బహుమూల్య ఫలము గాదె. (10)
* * * * *
౬ మిస్సన్న
“అమ్మ- అరటి - ఆవు” అని పల్కవే పాప
తెలుగు లింట నున్న వెలుగు వీవు
సన్ను మూను వద్దు చంద మామే ముద్దు
వమ్ము చేయ బోకు నమ్మకమ్ము.
* * * * *
౭. శ్రీపతిశాస్త్రి
అద్భుతమ్ముగనున్నదీ యాకసంబు
ఆకసంబంత యెతైన ఆశయంబు
పంచభూతమ్ములను జూచి పరవశించి
పట్ట నెంచితివేమమ్మ పగటి విభుని
ప్రకృతి లోనున్న వింతలు ప్రతిది మనదె
యనుచు తలబోయు ప్రాయమ్ము హాయి నొసగు
చీకు చింతలు లేనట్టి జీవితమున
నాటలాడుము నాతల్లి హర్ష మెసగ.
* * * * *
౮. రాజేశ్వరి నేదునూరి
చంద మామను బిలిచెను సంత సమున చేత జిక్కించు కొనగోరి చేయి జూపి
గగన మందున్న చంద్రుడు కలత పడెను
చిన్ని పాపను తానెట్లు చేర గలడు ?
* * * * *
౯. గోలి హనుమచ్ఛాస్త్రి
అమ్మా యీలోకమ్మున
నమ్మాయిగ బుట్టి నావు అమ్మయ్యా మీ
యమ్మకు జేజేలిత్తును
అమ్మాయీ యందుకొనుము, హాయ్ హాయ్ తల్లీ!
చంటి పిల్ల గ కూ ర్చుని చాపి చేయి
రిప్లయితొలగించండిచంద మామను బిలు చుండె చక్క గాను
చూడ ముచ్చట గొలుపును చూప రులకు
దిష్టి కొట్టక యీ యుడు దీ వన లను .
గుండు మధుసూదన్ గారి పద్యములు.....
రిప్లయితొలగించండిసిరి కలుగు నింతి పుట్టిన,
సిరి రూపము తానె, గిరిజ రూపము తానే,
తరుణియె క్షమాస్వరూపిణి,
మరియాదకు మాఱుపేరు మహిళయె కాదా !
“ఆఁడపిల్ల యేనాఁడును నాడ పిల్ల,
యీడ పిల్లయె కా” దంచు నెగురు వార
‘లాఁడపిల్ల మహాలక్ష్మి’ యనెడు మాట
వినఁగ లేదొక్కొ లోకాన వీను లలర !
కట్న మీయంగ లేమని, కసిని బూని
బాలికను గర్భమునఁ జంపఁ బాప మనెడు
త్రాసమే లేక తెగటార్చ ధర్మ మగునె?
రూపుమాపుఁడు మీరు స్త్రీ భ్రూణ హత్య !
అమ్మా! అదుగో అక్కడ
రిప్లయితొలగించండికొమ్మల పై నాకసమున కూర్చున్నాడే,
తమ్మిచెలిమి కాడు,తనని
రమ్మనవా, నా గవునుకు రంగుల పూసై?
మాయల నెరుగని యీ లే
రిప్లయితొలగించండిబ్రాయపు బసికూన యెదిగి భరతావనిలో
నే యంతస్తున జేరునొ?
హాయిగ జీవించు గాక! యబ్ద శతంబుల్
బాల్యం
రిప్లయితొలగించండిపాలు గారెడి బుగ్గలు, పలుకు లెపుడు
దివ్యమాధుర్య భరములై తేజరిల్లు
బ్రహ్మవాక్యంబులో యన భవ్యములయి,
బాల్యదశ యన్న బహుమూల్యఫలము గాదె. 1.
చింత యొకయింత యేనియు సిరులగూర్చి
అంటగాబోదు నిత్యంబు హర్షమొదవు
కష్ట సుఖముల యూసెందు కలుగ బోదు
బాల్యదశ యన్న బహుమూల్య ఫలము గాదె. 2.
కులము, మతములు, గోత్రాలు కోట్లకొలది
సంప్రదాయంబు లాచారసంతతులును
తెలియవలసిన పనిలేదు భళిర! చూడ
బాల్యదశ యన్న బహుమూల్య ఫలము గాదె. 3.
కలిమిలేములు సమములై కలుగు తృప్తి
యఘము పుణ్యంబు లవియెందు నంటబోవు
దైవరూపంబు పసిబిడ్డ ధరణిలోన
బాల్యదశ యన్న బహుమూల్య ఫలము గాదె. 4.
చందమామను గాంచిన క్షణమునందు
చేతులనుఁ జూపి రమ్మని జీరుచుండు
తన్మయత్వంబు నందుచు ధరణి కెపుడు
బాల్యదశ యన్న బహుమూల్య ఫలము గాదె. 5.
కోపమే భూషణంబయి కోరికలను
దీర్చు చుండును వాత్సల్యదీప్తు లొసగు,
రోదనంబిక బలమౌను మేదినిపయి
బాల్యదశ యన్న బహుమూల్య ఫలము గాదె. 6.
తల్లిదండ్రులు, బంధువు, లెల్లవార
లరుసమును జెంది రాజశేఖరులు గూడ
సేవలందింతు రెల్లప్పు డేవలేక
బాల్యదశ యన్న బహుమూల్య ఫలము గాదె. 7.
ఆటపాటలఁ దేలుచు ననవరతము
ఘనత నందుచు కాలంబు గడుపుచుండు
భాగ్యమున కర్హు లిలలోన బాలు రవుర!
బాల్యదశ యన్న బహుమూల్య ఫలము గాదె. 8.
ఏడ్పు విన్నంత జననితా నెందు నున్న
శీఘ్రముగఁ జేరి ముద్దాడి చెంత నిలిచి
పాటలను బాడి యలరించి పలుకరించు
బాల్యదశ యన్న బహుమూల్య ఫలము గాదె. 9.
కోరినంతనె జనకుండు కూర్మితోడ
వస్తుజాలంబు నందించ వలయు ననుచు
యత్న మొనరించు బిడ్డకై యహరహమ్ము
బాల్యదశ యన్న బహుమూల్య ఫలము గాదె. 10.
కవిమిత్రులకు మనవి...
రిప్లయితొలగించండిరేపు ప్రకటించబోయే ‘రవీంద్రుని గీతాంజలి - 60’ని తప్పక చూడండి. దీని చలం గారి అనువాదం 10వ తరగతి తెలుగు పాఠ్యపుస్తకంలో ఉంది.
బాల్యదశ గూర్చి యెనిమిది పద్యములను
రిప్లయితొలగించండిచక్కగా విరచించిన సత్కవీశ!
హరివరాన్వయ చంద్ర! నిన్నభినుతింతు
బాల్యదశ వినిర్మలము నమూల్యము కద
ఆర్యా!
రిప్లయితొలగించండిధన్యోస్మి.
నమస్కారములు.
అమ్మ అరటి ఆవు అని పల్కవే పాప
రిప్లయితొలగించండితెలుగు లింట నున్న వెలుగు వీవు
సన్ను మూను వద్దు చంద మామే ముద్దు
వమ్ము చేయ బోకు నమ్మకమ్ము.
మిస్సన్న గారూ పద్యం చాలా బావుందండీ..
రిప్లయితొలగించండిశ్రీగురుభ్యోనమ:
రిప్లయితొలగించండిఅద్భుతమ్ముగనున్నదీ యాకసంబు
ఆకసంబంత యెతైన ఆశయంబు
పంచభూతమ్ములను జూచి పరవశించి
పట్ట నెంచితివేమమ్మ పగటి విభుని
ప్రకృతి లోనున్న వింతలు ప్రతిది మనదె
యనుచు తలబోయు ప్రాయమ్ము హాయియి నొసగు
చీకు చింతలు లేనట్టి జీవితమున
యాటలాడుము నాతల్లి హర్షమొసగ
రవిగారూ మీపద్యము హృద్యముగా నున్నది. అభినందనలు.
రిప్లయితొలగించండిచంద మామను బిలిచెను సంత సమున
రిప్లయితొలగించండిచేత జిక్కించు కొనగోరి చేయి జూపి
గగన మందున్న చంద్రుడు కలత పడెను
చిన్ని పాపను తానెట్లు చేర గలడు ?
అమ్మా జ్యోతిర్మయీ సంతోషం.
రిప్లయితొలగించండిమీ బ్లాగు చాలా ఆసక్తికరమైన అంశాలతో అలరిస్తోంది. అభినందనలు.
ఆడపిల్లను కనుటకు వెనుకాడుతున్న తల్లులున్న ఈ రోజుల్లో అమ్మాయిని కన్న "అమ్మ"ను అభినందించవలసినదే....
రిప్లయితొలగించండిఅమ్మా యీలోకమ్మున
నమ్మాయిగ బుట్టి నావు అమ్మయ్యా మీ
యమ్మకు జేజేలిత్తును
అమ్మాయీ యందుకొనుము, హాయ్ హాయ్ తల్లీ!