24, జూన్ 2012, ఆదివారం

పద్య రచన - 31


కవిమిత్రులారా,

పై చిత్రాన్ని పరిశీలించి తగిన పద్యా(లను)న్ని వ్రాయండి.

17 కామెంట్‌లు:

  1. కనె నాకాశమునన్ సువర్ణరుచితో కన్విందు గావించు సూ
    ర్యుని బాల్యమ్మున నంజనాతనయు డోహో పెద్ద పండంచు భా
    వన వెల్గన్ దిననెంచె తత్ఫలము నభ్రంబందు వేవేగ తా
    జనుచుండెన్ గనకాచలాభుడు మహోత్సాహంబుతో నయ్యెడన్

    రిప్లయితొలగించండి
  2. శ్రీహనుమద్వైభవము

    శ్రీమదంజనా హృదబ్ధి శీతలాంశు శోభితా!
    రామభక్త శేఖరా! విరాజమాన విక్రమా!
    ధీమతాం వరేణ్య! మాన్య! ధీవికాసకారకా!
    స్వామి భక్తచందనా! ప్రసన్న! వాయునందనా!

    హేమశైల సన్నిభా! మహేశ్వరాంశ సంభవా!
    కామరూప! రాక్షసాంతకా! మహాబలాన్వితా!
    క్షేమదాయకా! కపీశ! చిన్మయా! బలప్రదా!
    స్వామి భక్తచందనా! ప్రసన్న! వాయునందనా!

    భీమరూప! సర్వవైరి వీరలోక భీకరా!
    భూమిజాప్రశస్త వాగ్విభూషణా! యశోధనా!
    శ్రీమదంబుజాత మిత్ర శిష్య! వేదవిత్తమా!
    స్వామి భక్తచందనా! ప్రసన్న! వాయునందనా!

    హేమభూధరాభ ధీర! హీరగాత్రవైభవా!
    రామచంద్ర కార్యతత్పరా! సుమిత్రజాస్తుతా!
    కామితార్థదా! దశాస్య గర్వ సర్వనాశకా!
    స్వామి భక్తచందనా! ప్రసన్న! వాయునందనా!

    కామితాఖిలార్థదాయకా! సమాదరాన నీ
    నామ మంత్ర ముచ్చరింప నాశమౌ భయమ్ము సం
    గ్రామ భీమ! వీరవర్య! రాక్షస ప్రణాశకా!
    స్వామి భక్తచందనా! ప్రసన్న! వాయునందనా!

    నీ మహత్వమున్ దలంచి నెమ్మనమ్మునందు నీ
    నామమున్ జపించినంత నాశమౌను రోగముల్
    లేములెల్ల చెల్లు నీదు లీలలన్ పఠించుచో
    స్వామి భక్తచందనా! ప్రసన్న! వాయునందనా!

    నీ మహత్వ మద్భుతమ్ము నిన్ స్తుతించినంత జే
    రామ! యంచు వేగ సాగరమ్ము నే తరించి తీ
    వో మహాత్మ! చెల్లు జాడ్య మొప్పుగా మదాత్మలో
    స్వామి భక్తచందనా! ప్రసన్న! వాయునందనా!

    మోమునందు వేద శాస్త్రముల్ సమస్త మొప్పు ను
    ద్దామవైభవా! వచోనిధాన! వాక్పటుత్వమున్
    మా మనమ్ములందు నింపుమా యటంచు వేడుదున్
    స్వామి భక్తచందనా! ప్రసన్న! వాయునందనా!

    రిప్లయితొలగించండి
  3. ఉదయభానుని ఫలమని మదిదలంచి
    చేరి దానిని భక్షింప గోరి యపుడు
    వాయు వేగాన నేగెడు బాలుడైన
    అంజనాసుతు నెల్లప్పు డంజలింతు.

    రిప్లయితొలగించండి
  4. గురుతుల్యులు శ్రీ నేమాని వారికి,
    ఆర్యా!
    నమస్కారములు.
    భక్తచందనుడైన వాయునందనుని స్తుతించిన "హనుమద్వైభవం" అత్యద్భుతంగా భక్తిరసభరితంగా ఉంది. ధన్యులం.
    మరోమారు నమస్కారములతో,
    ఆశీర్వచనాభిలాషి,
    మూర్తి.

    రిప్లయితొలగించండి
  5. హరివంశోధధి పూర్ణచంద్రనిభ తేజా! సత్యనారాయణా!
    పరమాదర్శము నీ గుణోన్నతి సదా వాణీ పదాబ్జార్చనా
    నిరతా! సర్వ సుఖమ్ములన్ గనుచు సందీపించుమా నూరు వ
    త్సరముల్ నీ యిలవేల్పు నీ కొసగుతన్ సౌభాగ్య పర్వమ్ములన్

    రిప్లయితొలగించండి
  6. పండు భ్రాంతిని సూర్యుని పట్ట బోవ
    కాలి నీ మూతి యెర్రగ కం దిపోయె
    అంత సా హ సం బ ది యే ల ? యౌర! నీ కు
    అంజ లింతు ను సతతము హనుమ ! నీ కు .

    రిప్లయితొలగించండి
  7. నేమాని పండితార్యా నమోన్నమ: ధన్యులం.

    రిప్లయితొలగించండి
  8. శ్రీమద్దువ్వూర్యన్వయ
    సోమా! వేంకట నృసింహ సుబ్బారాయా!
    ప్రేముడి నిను దీవింతును
    కామిత సకలార్థ సిద్ధి కల్గుత నీకున్

    రిప్లయితొలగించండి
  9. ఆర్యా!
    ధన్యోస్మి, నమస్కారములు.

    ***

    శ్రీయాంజనేయా! ప్రభూ! వాయుపుత్రా! మహద్దివ్యచారిత్ర! వీరాధివీరా! శుభాకార! శ్రీరామభక్తాగ్రగణ్యా! దశగ్రీవవంశాంతకా!లోక పూజ్యా! మహాత్మా! పరాకేలనయ్యా! మొరాలించవయ్యా! సమస్తాఘసంఘంబులంద్రుంచి శీఘ్రంబె కావంగ రావయ్య! నీయద్భుతంబైన చారిత్రమున్ భక్తితో బాడగా సర్వసౌభాగ్యముల్ గల్గు సందేహ మొక్కింత లేదయ్య! నిన్భక్తితో గొల్చు భాగ్యంబు గల్గించి రక్షించుచుం, దల్లివై ప్రేమనందించుచుం, దండ్రివై గాచుచున్, మిత్రరూపంబునం జేరి సన్మార్గముం జూపుచున్, భ్రాతవై ధైర్యముం బెంచి కాపాడవయ్యా! సదా నిన్ను ధ్యానింతు, పూజింతునయ్యా! కథాలాపముల్ జేతునయ్యా! మదీయాంతరంగంబు నందున్న దుర్బుద్ధులన్ ద్రుంచి, సద్భావసంపత్తులం జేర్చుమా, సాధుసంగంబులం గూర్చుమా, సర్వదా నీపదాబ్జాతముం దాకి యర్చించు సౌఖ్యంబు గల్పించి, నీయందు సద్భక్తి గల్గించవయ్యా! సదా సర్వదు:ఖాపహారీ! మహాకాయ! శ్రీయాంజనేయా! నమస్తే నమస్తే నమస్తే నమ:|

    రిప్లయితొలగించండి
  10. అయ్యా! శ్రీ మూర్తి గారూ! శుభాభినందనలు. మీ దండకము బాగున్నది. శ్రీ ఆంజనేయా! అని సంధి చేయకుండా ఉంచండి, లేదా యణాదేశ సంధి చెయ్యవలసి యుంటుంది, అప్పుడు శ్రీ + ఆ = శ్ర్యా అనే రూపము వస్తుంది. మరొకలాగ చెయ్యాలి అనుకుంటే శ్రీ రామ భక్తాంజనేయా అనండి. స్వస్తి.

    రిప్లయితొలగించండి
  11. ఆర్యా!
    ధన్యవాదములు.
    ప్రారంభంలో "శ్రీవాయుపుత్రా! ప్రభూ! ఆంజనేయా!" అనియు చివరలో మీరు చెప్పినవిధంగా "శ్రీరామభక్తాంజనేయా" అని మారుస్తున్నాను.
    నమస్కారములు.

    రిప్లయితొలగించండి
  12. హనుమద్వైభవమును మీ
    రనుపమగతి బల్కినార, లానందముగా
    ప్రణతిశతం బొనరింతును
    ఘనచరితా! పండితార్య! గైకొనుడు కృపన్.

    రిప్లయితొలగించండి
  13. మండు సూర్యుని గని పండని భ్రమియించి
    మ్రింగ నెగిరినట్టి మేటి తేజ
    భావి స్రష్ట రామ భక్తాగ్రగణ్యమా
    వందనములు గొనుమ వాయుపుత్ర.

    రిప్లయితొలగించండి
  14. ఆకసపు మావి చెట్టున
    ఆ కాసిన పండు జూడ నాకలి పుట్టెన్
    తోకను యూపుచు తేజము
    తో కపివరు డెగిరె భాను తొడిమను ద్రుంచన్.

    రిప్లయితొలగించండి
  15. సూర్య బింబము గనినంత శౌర్య శాలి
    పండుగా నెంచి తినగోరె బ్రమసి యతడు
    కొట్టె నింద్రుడు వజ్రము బెట్టి గాన
    చొట్ట బోయెను దవడన చోద్య మయ్యె !

    వజ్రము = వజ్రాయుధము

    రిప్లయితొలగించండి
  16. పండిత నేమాని వారూ,
    చిత్రానికి తగిన పద్యాన్ని వ్రాసి, అనుబంధంగా మీరు ప్రసాదించిన ‘హనుమద్వైభవము’ నిత్యపఠనీయమై శోభిల్లుతున్నది. ధన్యవాదాలు.
    *
    సత్యనారాయణ మూర్తి గారూ,
    చక్కని పద్యాన్ని వ్రాసి అనుబంధంగా ‘హనుమద్దండకము’ నిచ్చి మమ్మల్ని అలరించారు. మనోహరంగా ఉంది. అభినందనలు, ధన్యవాదాలు.
    *
    సుబ్బారావు గారూ,
    మంచి పద్యాన్ని వ్రాసారు. అభినందనలు.
    3,4వ పాదాల్లో ‘నీకు’ రెండు సార్లు వచ్చింది. ‘భక్తి/ నంజలింతును....’ అంటే సరి!
    *
    మిస్సన్న గారూ,
    అద్భుతమైన పద్యం మీది.
    నేమాని వారి ఆశీఃపద్యాన్ని పొందిన మీరు ధన్యులు. అభినందనలు.
    *
    గోలి హనుమచ్ఛాస్త్రి గారూ,
    చక్కని భావన. పద్యం బాగుంది. అభినందనలు.
    ‘తోకను + ఊపుచు’ అన్నప్పుడు యడాగమం రాదు. ‘తోకనె యూపుచు’ అందాం...
    *
    రాజేశ్వరి అక్కయ్యా,
    చాలా బాగుంది మీ పద్యం. అభినందనలు.

    రిప్లయితొలగించండి