7, జూన్ 2012, గురువారం

రవీంద్రుని గీతాంజలి - 36

రవీంద్రుని గీతాంజలి

తెనుఁగు సేత

శ్రీమాన్ చిలుకమఱ్ఱి రామానుజాచార్యులు

36

THIS is my prayer to thee, my lord-
strike, strike at the root of penury in
my heart.

Give me the strength lightly to bear
my joys and sorrows.

Give me the strength to make my
love fruitful in service.

Give me the strength never to disown
the poor or bend my knees before
insolent might.

Give me the strength to raise my
mind high above daily trifles.

And give me the strength to surrender
my strength to thy will with love.


చిలుకమఱ్ఱి రామానుజాచార్యుల అనువాదము.....

ఇదియె ప్రార్థన స్వామి! నా హృదయదైన్య
మూలముం బట్టి మొత్తుము మొత్తు మీవు ||

సుఖమయిన దుఃఖమైనను సులభగతిని
సైచి నిలువఁగఁ జాలెడి శక్తి యిమ్ము ||

స్వీయమౌ ప్రేమమెల్ల నీ సేవలోన
సఫల మొనరించుకొనఁగల శక్తి యిమ్ము ||

పేదలన్ పరులంచు భావించకుండ
గర్వితుల బల్మి ముందు మోకరిలకుండ
సతత మొకరీతి సాగెడి శక్తి యిమ్ము ||

దినదినము గాంచు కొంచెఁపు దినుసు లేని
యుత్తమోత్తమ మనెడి యుదాత్త భావ
సరణిలో మది నిల్పెడి శక్తి యిమ్ము ||

కలబలంబు త్వదీయసంకల్పమునకుఁ
జనవుతో వశపరచెడి శక్తి యిమ్ము ||

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి