13, జూన్ 2012, బుధవారం

సమస్యాపూరణం - 734 (గడ్డము గీచుకొ మ్మనుచు)

కవిమిత్రులారా...

ఈరోజు పూరించవలససిన సమస్య ఇది...

గడ్డము గీచుకొ మ్మనుచు కాంతుఁడు భార్యకుఁ జెప్పెఁ బ్రీతితోన్.

కన్నడ బ్లాగు ‘పద్యపాన’ సౌజన్యంతో....

ಗಡ್ಡಂ ಬೋಳಿಸಿಕೊಳ್ ! ಎನುತ್ತೆ ನುಡಿದಂ ಪ್ರೇಯಂ ನಿಜಪ್ರೀತೆಗಂ

23 కామెంట్‌లు:

 1. గురువు గారు,
  పద్యపాన వాళ్ళేమి, మనమూ పూరణలు చేశాము ఈ సమస్యకు. ఒక్క సారి ఇటు చూడండి.

  http://kandishankaraiah.blogspot.in/2011/04/318.html

  రిప్లయితొలగించండి
 2. ఆర్యా!
  ఈ సమస్యను గతంలో పూరించినట్లు లక్ష్మీదేవిగారు దాఖలాలు చూపించారు. చూచాను. ఐతే అప్పట్లో నేను పూరించలేదు. కనుక ప్రస్తుతం పూరిస్తున్నాను.

  అడ్డము, నిల్వుగీతలవి యందముగా రచియించి యాటలన్
  దొడ్డగు "దాడి"యాటనిదె తొయ్యలి! యాడెద మింక రమ్ము నే
  నొడ్డిగ కొన్నిరేఖలనిటుంచితి వాటిని యంది నీవు సా
  గడ్డము గీచుకొమ్మనుచు కాంతుడు భార్యకుఁ జెప్పెఁ బ్రీతితోన్.

  రిప్లయితొలగించండి
 3. సత్యనారాయణ మూర్తిగారు,
  ఆ పూరణలో చేసికొమ్మనుచు ను కొంగడ్డము చేసికొమ్మనుచు అని పూరించగలిగాను. ఇప్పుడు గీచుకోవటం అంటే కష్టమే కానీ మీరు చేశారు. కానీ సాగడ్డము అంటే?

  రిప్లయితొలగించండి
 4. శ్రీపతిశాస్త్రిబుధవారం, జూన్ 13, 2012 8:04:00 AM

  శ్రీగురుభ్యోనమ:

  రెడ్డిని పెండ్లియాడె నొక లేమ కడుంకడు ప్రేమ మీర తా
  నడ్డము చెప్పకుండె నతనాడెడు మాటకు నవ్వుమోమునన్
  విడ్డురమేమొ చూతుమని వింతగ కోరెను వెక్కిరించుచూ
  గడ్డము గీచుకొ మ్మనుచు కాంతుఁడు భార్యకుఁ జెప్పెఁ బ్రీతితోన్.

  రిప్లయితొలగించండి
 5. శ్రీపతిశాస్త్రిబుధవారం, జూన్ 13, 2012 8:14:00 AM

  గురువర్యులు శ్రీశంకరయ్యగారికి ఆయురారోగ్యములను ప్రసాదించవలసినదిగా శ్రీ సూర్యనారాయాణస్వామివారిని, అశ్వినీదేవతలను ప్రార్థిస్తున్నాను.

  రిప్లయితొలగించండి
 6. లక్ష్మీదేవి గారూ!
  నమస్కారములు.
  "సాగడ్డము" అనేచోట "వాటినియంది నీవు సాగు+అడ్డము గీచుకొమ్ము" అని నా భావన. ఇందులో గడ్డము లేదు.
  ధన్యవాదములు.

  రిప్లయితొలగించండి
 7. బిడ్డడి ముద్దుచేష్టలను బ్రీతిగఁ గాంచెడు భార్యతో " మరే
  సొడ్డులు జెప్పినన్ వినను, చొక్కపు చిత్రము వ్రాసి యివ్వ నీ
  కడ్డమదేమి, చెప్పుమిక నా పని పూర్తిగఁ జేసి మోమునన్
  గడ్డము గీచుకొ" మ్మనుచు, కాంతుఁడు భార్యకుఁ జెప్పెఁ బ్రీతితోన్.

  మూడవ పాదంలో చెప్పుమికన్+ఆ పని

  నా చిత్తరువు గీయటం నీవు పూర్తి చేయలేదు, ఏ సాకు చెప్పక ఇప్పుడు చిత్తరువులో నా మోమున గడ్డము గీసి పూర్తి చేయమని భర్త భార్యను అడుగుట.

  రిప్లయితొలగించండి
 8. కవిమిత్రులకు నమస్కృతులు.
  లక్ష్మీదేవి గారు చెప్పేదాకా గతంలో ఈ సమస్యను ఇచ్చిన విషయం గుర్తుకు రాలేదు.
  రోజురోజుకు మతిమరుపు ఎక్కువవుతున్నది. అందులోనూ అనారోగ్యం.
  ఈ సమస్యను ‘శంకరాభరణం’నుండి ‘పద్యపాన’ బ్లాగు స్వీకరిస్తే, దానినే వారి సౌజన్యంతో నేను మళ్ళీ ప్రకటించాను.
  జరిగిన పొరపాటుకు మన్నించండి. గతంలోనూ కొన్ని సమస్యలు నా మతిమరుపు వల్ల పునరావృతమయ్యాయి. ఇకనుండి ‘ఒళ్ళు దగ్గర పెట్టుకొని’ సమస్యలు ఇస్తూ ఉంటాను. స్వస్తి!

  రిప్లయితొలగించండి
 9. గురువు గారు,
  భలేవారే , ఇందులో తప్పేముంది? నిజంగానే చేసుకోవటానికి, గీసుకోవటానికి ఉండే భేదం వల్ల ఇది భిన్నమే.
  కొంగడ్డం చేసుకోవడం లాగా వ్రాయలేను కదా!
  మీ ఆరోగ్యం గురించి శ్రద్ధ తీసుకోండి. ఆ శంకరుడు మీకు ఆరోగ్యాన్ని ప్రసాదించాలని నా ప్రార్థన.
  మతి మరుపంటారా, అది మాకే ఇప్పుడే వచ్చేస్తున్నది. అది ఈ కాలంలో అందరికీ ఎక్కువ అయింది. ఎందుకో మరి. ఏకాగ్రత తగ్గి నానా గందరగోళాలనూ తలలోకెక్కించుకోవలసి రావడం వల్లనేమో.

  రిప్లయితొలగించండి
 10. బిడ్డడు పెద్దవాడగుచు పేర్మినిఁ గూర్పఁగ నేర్చినంత, నే
  యడ్డము లేక నచ్చెరువునందుచు దామిక మెచ్చుకొందురీ
  గడ్డను; సంప్రదాయమిది కాదని, దూరము బోయి వాని నా
  గడ్డము జేసుకొ"మ్మనుచు గాంతుడు భార్యకుఁ జెప్పెఁ బ్రీతితోన్.

  మంచి అలవాట్లు నేర్చుకుంటే పెద్దలు మెచ్చుకుంటారని, నట్టింట్లో కాక దూరము వెళ్ళి చేసుకోమని నీ బిడ్డకు చెప్పమని తండ్రి, తల్లితో చెపుతున్నాడు.

  రిప్లయితొలగించండి
 11. గువుగారికి , నేమాని గారికి ధన్యవాదము దెలుపుతూ
  అడ్డ మైన గడ్డి తినిన వారికీ అవాంచిత రోమములు వచ్చునని చదివితిని అది మూలముగా
  -----------------
  గడ్డిని ప్రేమతో దినగ గడ్డము వచ్చెలె నొక్క నారికిన్
  గుడ్డిగ రాజు యిష్టపడి కోమలి హస్తము బట్టె వేగమున్
  గడ్డము గాంచె నడ్డముగ, కౌగిట బంధన గాంచి గోముగా
  గడ్డము గీచుకొమ్మనుచు కాంతుడు భార్యకుఁ జెప్పెఁ బ్రీతితోన్.

  రిప్లయితొలగించండి
 12. శ్రీగురుభ్యోనమః
  గురువుగారల ఆరోగ్యము కుదుట పడాలని,ఆ భద్రాచలరామున్ని ప్రార్థిస్తూ,ఈనాటి సమస్యకు పూరణ:

  బిడ్డకుఁబెండ్లిఁజేయగనుమేలిమిచీరలఁదెచ్చి,పట్టుదౌ
  గుడ్డకురంగులన్గలిపికొంగునకద్దగ సంప్రతించగన్
  దొడ్డగురూపమున్వెలయుఁదూలికఁబట్టుకునిట్టులెర్ర రం
  గడ్డము గీచుకొమ్మనుచుకాంతుఁడుభార్యకుఁజెప్పెఁబ్రీతితోన్.

  రిప్లయితొలగించండి
 13. గుండు మధుసూదన్ గారి పూరణ.....

  (అమెరికాలో క్షౌరశాలను ప్రారంభిస్తున్న ఒక వనితకు, ఆమె భర్తకు మధ్య సంభాషణ.....)

  “బిడ్డకు లేదు గడ్డ మది పెంచగ నాకును లేదు; నాకు మీ
  రడ్డము రాకయున్న మరియాదకు శిక్షణ పొందగాను, నా
  దొడ్డగు క్షౌరశాల నెటు తొందరగా నిటఁ గూర్తు” నన్న, “నా
  గడ్డము గీచుకొ” మ్మనుచు కాంతుఁడు భార్యకుఁ జెప్పెఁ బ్రీతితోన్.

  రిప్లయితొలగించండి
 14. ఆర్యా!
  నమస్కారములు.
  గురుతుల్యులు శ్రీశంకరయ్య గారిని ఆరోగ్యవంతులనుగా చేయవలసిందిగా ఆ పరమేశ్వరుణ్ణి ప్రార్థిస్తున్నాను.

  **పూరణ
  భార్య గర్భవతిగా ఉన్నప్పుడు క్షురకర్మను మాని గడ్డం పెంచుకోవడం సంప్రదాయంగా చూస్తుంటాం. అలా గడ్డం పెంచుకున్న భర్త మరియు అతని భార్యల మధ్య ప్రసవానంతంరం జరిగిన సంభాషణ ఇలా ఉంది.

  బిడ్డనుఁ జూపి పల్కె సతి "విజ్ఞుడ! నీవిటు గర్భరక్షకై
  గడ్డము పెంచినావు, సుతుగాంచుము, దీక్షను మానుమింక నీ
  గడ్డము గీచుకొమ్మనుచు", కాంతుడు భార్యకుఁ జెప్పెఁ బ్రీతితో
  "నడ్డము చెప్పబోను సఖి! యట్టులె చేతు"నటంచు వేగమున్.

  రిప్లయితొలగించండి
 15. అడ్డము లేదు నీకనుచు నానతి నీయగ వేడ్కతో సుతున్
  దొడ్డగు సంతసంబునను దోసము లెంచక వేగమే చనన్
  బిడ్డను ప్రోత్స హించుమనె భీషణ మేమియు లేదు వానికిన్
  గడ్డము గీచు కొమ్మనుచు కాంతుడు భార్యకు జెప్పే బ్రీతితోన్ !

  రిప్లయితొలగించండి
 16. అన్యభాషాపదాలు దొర్లినవి. అయినా హాయిగా నవ్వుకోవటానికే!
  గుడ్డలు షోకులెట్లు భళి గుట్టది గుర్తెరు గన్గలేమురా
  అడ్డమువచ్చె నంచడగ కన్నియు బ్లీచుత్రెడింగు నాటులన్
  దుడ్డులు ఖర్చువెట్టు సతి దూరగ నేడ్వను లేక “బాధగా” (మనసులో)
  గడ్డము గీచుకొ మ్మనుచు కాంతుఁడు భార్యకుఁ జెప్పెఁ బ్రీతితోన్.

  రిప్లయితొలగించండి
 17. గడ్డము సేయువారు కనగా మగవారని యెంచ బోకు మీ
  గడ్డను బుట్టి బిడ్డలను గావగ జానెడు పొట్ట కోసమై
  అడ్డము గాదు స్త్రీత్వమని యమ్మడు వృత్తిని బట్టె నీమెయే
  'గడ్డము గీచు కొమ్మ ' నుచు కాంతుడు భార్యకు జెప్పె ప్రీతితో.

  రిప్లయితొలగించండి
 18. కుటుంబ పోషణకై కుల వృత్తియగు క్షురకర్మను చేపట్టిన ఒక ' కొమ్మ ' (వనిత) గురించి టీవీలో కొంత కాలం క్రితం చూచాను.

  రిప్లయితొలగించండి
 19. గోలి హనుమచ్ఛాస్త్రి గారూ వివరించాల్సిన అవుసరం లేదు.
  "కుటుంబ పోషణకై కుల వృత్తియగు క్షురకర్మను చేపట్టిన ఒక ' కొమ్మ ' (వనిత) గురించి టీవీలో కొంత కాలం క్రితం చూచాను."
  ---------------------------------
  అమెరికాలో కూడా మీ పూరణ వర్తిస్తుంది నూటికి తొంభై మంది వాళ్ళే. కాకపోతే గడ్డము గీస్తే ఎక్కువ డబ్బులు వస్తాయి. అందుకని (ఇంకొకళ్ళ)
  'గడ్డము గీచు కొమ్మ ' నుచు కాంతుడు భార్యకు జెప్పె ప్రీతితో.
  చాలా బాగా వర్తిస్తుంది.

  రిప్లయితొలగించండి
 20. కవిమిత్రులకు నమస్కృతులు....
  గతంలో ఇచ్చిన సమస్య అయినా ఉత్సాహంతో పూరణలు పంపిన
  సత్యనారాయణ మూర్తి గారికి,
  శ్రీపతి శాస్త్రి గారికి,
  లక్ష్మీదేవి గారికి,
  వరప్రసాద్ గారికి,
  గుండు మధుసూదన్ గారికి,
  నేదునూరి రాజేశ్వరి అక్కయ్య గారికి,
  చంద్రశేఖర్ గారికి,
  గోలి హనుమచ్చాస్త్రి గారికి,
  అభినందనలు, ధన్యవాదాలు.
  జ్వరం వల్ల నా ఆరోగ్య పరిస్థితి మరింత దిగజారి, ఓపిక ఏమాత్రం లేని కారణంగా మీమీ పూరణలను విడివిడిగా ప్రస్తావించలేక పోతున్నాను. మన్నించండి...

  రిప్లయితొలగించండి
 21. శంకరార్యులకు, శ్రీ లక్కరాజు గారికి ధన్యవాదములు.

  రిప్లయితొలగించండి
 22. చెడ్డగ బంధువుల్ చనుచు చెన్నుగ రాగను భోజనంబుకున్
  గడ్డము క్రింద గోకుటకు కట్టుకు పోవగ రెండు చేతులున్
  వడ్డన జేయగా దురద పట్టగజాలవ! తెడ్డుతోడనున్
  గడ్డము గీచుకొమ్మనుచు కాంతుఁడు భార్యకుఁ జెప్పెఁ బ్రీతితోన్

  రిప్లయితొలగించండి