1, జూన్ 2012, శుక్రవారం

రవీంద్రుని గీతాంజలి - 30

రవీంద్రుని గీతాంజలి

తెనుఁగు సేత


శ్రీమాన్ చిలుకమఱ్ఱి రామానుజాచార్యులు


30

I CAME out alone on my way to my
tryst. But who is this that follows me
in the silent dark ?

I move aside to avoid his presence
but I escape him not.

He makes the dust rise from the
earth with his swagger; he adds his
loud voice to every word that I utter.

He is my own little self, my lord,
he knows no shame ; but I am ashamed
to come to thy door in his company.


చిలుకమఱ్ఱి రామానుజాచార్యుల అనువాదం...

స్వామి! నీ ప్రేమసంకేతసీమ జేర
నొంటిగా వెలి కేతెంచి యుంటి నోయి
కాని నిశ్శబ్ద మీ యంధకారమందు
నన్ను వెన్నంటి తిరుగుచున్నాఁ డెవండొ? ||

ప్రక్కపక్కల కొదిగి దూరమ్ము తొలఁగి
వానిఁ దప్పించుకొనుటకుఁ బాటు పడితి,
*నెడదకుం దోచె గండము గడచెనంచుఁ
గాని తోడ్తోన పొడసూపు వాని రూపు ||

పుడమిపై దుమ్ము లేపుచుఁ గడుబడాయి
జూపు విషమంపుఁ జలనము దోప వాఁడు
తనదు పెనుగొంతు పలుకు పల్కునకు గలుపు ||

ప్రభువ! నా తుచ్ఛమౌ నహంభావ మతఁడు
సిగ్గు రవ్వంత వాని స్పృశింప దెపుడు,
వాఁడు వెన్నాఁడుచుండ నీ ద్వారసీమ
జేరుకొనుటకె నేను లజ్జింతు నోయి! ||

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి