1, జూన్ 2012, శుక్రవారం

సమస్యాపూరణం - 722 (రాలను రువ్వు జనులకు)

కవిమిత్రులారా...

ఈరోజు పూరించవలససిన సమస్య ఇది...

రాలను రువ్వు జనులకు వరాల నొసంగున్.

ఈ సమస్యను సూచించిన

కవిమిత్రునకు

ధన్యవాదాలు

26 కామెంట్‌లు:

  1. శ్రీ సరస్వత్యై నమః :
    ఈ రోజు సమస్య శ్రీ శంకర భగవత్పాదులు రచించిన శ్రీ శివానందలహరిలోని యొక శ్లోకమును ఉదహరించుటకు దోహదపడినది. చూడండి:

    నతిభిర్ నుతిభిర్ త్వమీశ పూజా
    విధిభిర్ ధ్యాన సమాధిభిర్ నతుష్టః
    ధనుషా ముసలేన చాశ్మభిర్వా
    వద తే ప్రీతికరం తథా కరోమి

    తాత్పర్యము: ఓ ఈశ్వరా! నీకు నమస్కారములతో, స్తోత్రములతో, ధ్యాన రీతులతో సంతోషము కలుగుటలేదు. మరి వింటి దెబ్బలతోనా, రోకటి దెబ్బల చేతా లేక రాళ్ళ దెబ్బలతోనా దేని వలన సంతోషము కలుగునో చెప్పుము. నేను ఆలాగుననే చేస్తాను.

    కిరాతార్జునీయములో అర్జునుడు గాండీవముతో శివుని కొట్టేడు కదా. ఆలాగుననే ఒక భక్తురాలు శివునికి రోకటితో దెబ్బలు వేసేను. మరొక లీలలో విశ్వుడు అనే ఒక భక్తుడు రాళ్ళనే పూవులుగా భావించి శివుని పూజించెను. శివుడు ప్రీతుడయ్యెను. ఇవన్నీ శివ లీలలే.

    శ్రీ మహావిష్ణువు లక్ష్మీ దేవితో శివ లీలను చెప్పుచున్నాడు:

    శ్రీలలనా! వినుమా శివ
    లీలలు విశ్వుండు భక్తి రీతుల గొలిచెన్
    రాలే విరులుగ, శివుడా
    రాలను రువ్వు జనులకు వరాల నొసంగున్

    స్వస్తి.

    రిప్లయితొలగించండి
  2. వేలూ లక్షలు జనమే
    గోలలు లేకుండ 'మక్క ' కూడలి అల్లా
    మేలిమ్మని సైతాన్ పై
    రాలను రువ్వు జనులకు వరాల నొసంగున్.

    రిప్లయితొలగించండి
  3. గుండు మధుసూదన్ గారి పూరణ.....

    లీలం బిల్లలు చేరి ర
    సాలముపై రాలు విసరఁ జక్కని ఫలముల్
    చాలఁగ నిడు; దైవ మటులె
    రాలను రువ్వు జనులకు వరాల నొసంగున్.

    రిప్లయితొలగించండి
  4. కైలాసపతికి మందా
    రాలు మిగుల ప్రీతిగొలుపు, క్రాలెడు భక్తిన్
    శూలి, తనపైని మందా
    రాలను రువ్వు జనులకు వరాల నొసంగున్

    రిప్లయితొలగించండి
  5. రాలను రువ్వగ భక్తులు
    రాలనె పూ మాల దలచి రంజితు డ య్యీ
    బోలా శంకరు డ య్యెడ
    రాలను రువ్వు జనులకు వరాల నొసంగున్ .

    రిప్లయితొలగించండి
  6. బాలేందుమౌళి సకల క
    ళాలోలుడు స్తోత్రచయములం దాదృతితో
    మేలగు సరస చమత్కా
    రాలను రువ్వు జనులకు వరాలనొసంగున్

    రిప్లయితొలగించండి
  7. guvugAriki namaskAramulu
    my problems are not yet solved because of exams.so I am typing in english
    Bharat baMd,petrol price reduction.
    -----
    vElU lakShalu dini, kera
    TAlanu janulapayi neTTu Takkari doMgal
    vElunu viruvaga kaMkara
    rAlanu ruvva,janulaku varAla nosaMgun
    Elina vAralu, nikkamu
    gOlalu jEya dorakunule gOviMdhunakun
    bAlu cheluvamulu, goMchemu
    jAlini jUpini galugunu sarvAriShTamul.

    (keraTAlanu = kaShTalanu)

    రిప్లయితొలగించండి
  8. శ్రీలక్ష్మీధవు డా హరి/శ్రీలలితా జగదంబిక
    వాలిన విశ్వాసముంచి భక్త్యర్ణవముం
    దేలుచు తనపై మందా
    రాలను రువ్వు జనులకు వరాల నొసంగున్.

    రిప్లయితొలగించండి
  9. గురువర్యులిరువుర అభినందనా పూర్వక ఆశీస్సులే మమ్ములను ముందుకు నడిపించుగాక.
    ప్రణామాలు.
    గురువు గారు,
    కన్నడ సమస్యాపూరణము బ్లాగ్ లంకె ఇది.
    http://kaavya-kutuhala.blogspot.in/

    రిప్లయితొలగించండి
  10. మాలలఁ గట్టుచు పూలను,
    కేలను వడివడిగ నేరి కెందామరలన్
    శ్రీలక్ష్మికిని కుసుమ హా
    రాలను రువ్వు జనులకు వరాల నొసంగున్.

    రిప్లయితొలగించండి
  11. ఈలోకం నయభాషణ
    కాలంబం మార్కెటింగు కళయై పెరిగన్
    లీలగ, మాటల హసిత శ-
    రాలను రువ్వు జనులకు వరాల నొసంగున్

    రిప్లయితొలగించండి
  12. పూలే లేవని యలుగడు
    పాలేలేకనభిషేకమడుగడుశివుడా
    లీలలుపాడినమస్కా
    రాలనురువ్వుజనులకువరాలనొసంగున్!

    రిప్లయితొలగించండి
  13. పూజ్యశ్రీ గురుదేవులకు
    విహితానేకప్రణామములతో,

    ఒక సామాన్యమైన లౌకికీసమస్య మీరు ప్రమాణీకరించిన శ్రీ శాంకరీయశ్లోకం వల్ల, తద్విశేషవివరణ మూలాన అలౌకికమైన శోభను, అపురూపమైన అర్థవత్తను సంతరించుకొన్నది. ప్రసన్నసరస్వతీకమైన మీ పూరణలలోని భక్తిమయవాతావరణం ఏనాటికానాడు కవితలకొక నిండుతనాన్ని, పరిపూర్ణతను చేకూరుస్తుండటం అభినందనీయం.

    నవ్వులైనా, పువ్వులైనా భగవంతునిపై “ఱువ్వటం” (“రువ్వు” సాధురేఫయుక్తంగానూ ప్రసిద్ధమే) ఉంటుందా? అదే ఈనాటి సమస్యలోని క్లిష్టత కాబోలు. తెలుగునాట వేదవిద్యార్థులు ఘనలు, పనసలు చెప్పుకొంటూ ఋక్కులను “ఱువ్వటం” జరుగుతుందంటారు. ఆ లెక్కను ఎవరైనా ఈ రోజుకూడా పరమేశ్వరునిపై ఏకాదశరుద్రాలను ఱువ్వి వరాలను చూఱగొంటారేమో చూద్దాము!

    పూరయితలందరికీ అభివాదనం.

    యుష్మన్నిరంతరాశీరర్థి,
    ఏల్చూరి మురళీధరరావు

    రిప్లయితొలగించండి
  14. మురళీధర! నీ స్పందన
    సరసము, సముచితమునగుచు స్వాంతంబునకున్
    పరితోషమ్మును గూర్చెను
    వరమతి దీవనలివే శుభమ్ముల గనుమా!

    రిప్లయితొలగించండి
  15. ఈ లత్తుకోరధిపతుల్
    రాలను రువ్వు జనులకు వరాల నొసంగున్.
    పాలుగొని విగ్రహాలను
    కూలద్రోయించెదరట ఘోరంబాడన్!

    రిప్లయితొలగించండి
  16. డా. ఏల్చూరి వారి సూచన మేరకు:

    ఆలింపుమా శివా మము
    పాలింపుమటంచు భక్తి భావమలరన్
    ఫాలాక్షుపై నిగమ మం
    త్రాలను రువ్వు జనులకు వరాల నొసంగున్

    రిప్లయితొలగించండి
  17. 2వ పాదములో వచ్చిన టైపు పొరపాటునకు సవరణతో :
    డా. ఏల్చూరి వారి సూచన మేరకు:

    ఆలింపుమా శివా మము
    పాలింపుమటంచు భక్తి భావమ్మలరన్
    ఫాలాక్షుపై నిగమ మం
    త్రాలను రువ్వు జనులకు వరాల నొసంగున్

    రిప్లయితొలగించండి
  18. ఆర్యా ! మురళీధర రావు గారూ! నిజమే! మీరు చెప్పినట్లు భగవంతుని విషయంలో "రువ్వుట" అనేపదం వాడకూడదనే సంశయము తోనే నేను పై విధముగా పూరించాను.

    రిప్లయితొలగించండి
  19. లోలాక్షి పదము లందున
    నీలోత్పలములు విరియగ నీరాజనముల్ !
    లాలిత్యము కురిపించు మందా
    రాలను రువ్వు జనులకు వరాల నొసంగున్ !

    రిప్లయితొలగించండి
  20. శ్రీ సరస్వత్యై నమః:
    మిత్రులందరికి శుభాభినందనలు.
    ఈ నాటి సమస్య బాగున్నది, దాని పూరణలలో మంచి వైవిధ్యము కనిపించినది.

    తొలి పూరణలో శ్రీమఛ్ఛంకర భగవత్ పాదకృతమైన శివానందలహరి శుభంకరమైన దర్శనమిచ్చినది.

    1. శ్రీ గోలి హనుమఛ్ఛాస్త్రి గారు తమ పద్యములో మక్కా కూడలిలో భక్తులు అల్లాను ప్రార్ధిస్తూ సైతానుపై రాలు రువ్వుటను ప్రస్తావించేరు. భావము చాల బాగున్నది.

    2. శ్రీ గుండు మధుసూదన్ గారు ఉపమాలంకారమును వేస్తూ భగవంతుని కరుణను కల్పవృక్షముతో పోల్చేరు. చాలా బాగున్నది.

    3. శ్రీ సుబ్బారావు గారు: మీ పద్యములోని 2వ పాదమును ఇలాగ మార్చితే బాగుంటుంది:
    "రాలనె పూమాలలగ దలంచి కరుణతో". భావము బాగున్నది.

    4. శ్రీ వరప్రసాద్ గారు: రాజకీయాలలో పలుకుబడిగల టక్కరి దొంగలు, కంకర రాళ్ళు, మొదలైన విషయాలు ప్రస్తావించేరు. ప్రస్తుత సాంఘిక విషయాలు కావున చాల బాగున్నది.

    5. శ్రీ హరి వెంకట సత్యనారాయణ మూర్తి గారు : భక్త మందారుని పై మందారాలను రువ్వేరు. చాలా బాగున్నది.

    6. శ్రీమతి లక్ష్మీదేవి గారు : శ్రీ లక్ష్మికిచ్చే కెందామర హారాలను వర్ణించేరు. చాల బాగున్నది.

    7. శ్రీ చంద్రమౌళి గారు: మార్కెటింగులో నవ్వుల శరాల ప్రభావమును వర్ణించేరు. వైవిధ్యముతో అలరారుచున్నది.

    8. శ్రీ సహదేవుడు గారు: నమస్కారాలనే రువ్వేరు. మంచి భావము. చాల బాగున్నది.

    9. డా. ఏల్చూరి వారు: రువ్వుట అనే ప్రయోగమును చక్కగా సమర్థించేరు. శత రుద్ర మంత్రాలను గూర్చి ఎవరైన వర్ణిస్తారేమోనని ఆశించేరు. చాల బాగున్నది.

    10. శ్రీ చంద్రశేఖర్ గారు కూడా అధునాతన సాంఘిక విషయాలనే ఎత్తుకొన్నారు. చాల బాగున్నది.

    అందరికీ మరొక మారు అభినందనలు. స్వస్తి.

    రిప్లయితొలగించండి
  21. కవిమిత్రులకు వందనాలు.
    పూరణలు పంపిన మిత్రులందరికీ అభినందనలు, ధన్యవాదాలు.
    శారీరకంగానూ, మానసికంగానూ ఆరోగ్యం బాగులేక ఈనాటి పూరణలను విశ్లేషించ వలసిందిగా శ్రీ నేమాని వారిని అభ్యర్థించాను. వారు దయతొ ఆ బాధ్యతను స్వీకరించి చక్కని విశ్లేషణనిచ్చారు. వారికి ప్రత్యేక ధన్యవాదాలు.

    రిప్లయితొలగించండి
  22. హాలాహలమును గ్రోలిన
    శూలాయుధు వేడగలుగు శుభములు వేలున్
    నాలుక నొవ్వగ ఓoకా
    రాలను రువ్వు జనులకు వరాల నొసంగున్ !

    రిప్లయితొలగించండి
  23. శ్రీలలితాంగివిభుడు,జగత్
    పాలకుడు, దయామయుండు,భవ్యగుణుడు శా
    పాలకు,స్తుతులకతీతుడు,
    రాలను రువ్వు జనులకు వరాలనొసంగున్.

    రిప్లయితొలగించండి
  24. పాలుం దేనియ పళ్ళ ర-
    సాలను కొబ్బరిని దెచ్చి శక్తి కొలదిగన్
    శూలికి నేకాదశ రు-
    ద్రాలను రువ్వు జనులకు వరాలనొసంగున్

    రిప్లయితొలగించండి
  25. మంద పీతాంబర్ గారూ,
    ‘ఓంకారాలను’ రువ్విన మీ పూరణ బాగుంది అభినందనలు.
    *
    కమనీయం గారూ,
    చక్కని పూరణ. అభినందనలు.
    మొదటి పాదంలో గణదోషం.. ‘శ్రీలలనావిభుడు, జగత్’ అంటే సరి!
    *
    మిస్సన్న గారూ,
    మీ పూరణ చాలా బాగుంది. అభినందనలు.

    రిప్లయితొలగించండి
  26. పోలీసు దండయాత్రల
    కూలగ కాశ్మీరునందు గూఢాచారుల్
    మేలుగ పాకీ నేతలు
    రాలను రువ్వు జనులకు వరాల నొసంగున్

    రిప్లయితొలగించండి