21, జూన్ 2012, గురువారం

పద్య రచన - 28


కవిమిత్రులారా,

పై చిత్రాన్ని పరిశీలించి తగిన పద్యా(లను)న్ని వ్రాయండి.

24 కామెంట్‌లు:

  1. వినుమా మదీయ మనవిన్ వినిపింతు నేడే
    కనుమా ప్రియమ్ములొలికే కలహంసమా! నా
    మనమందు ఱేని తలపుల్ మధురోహలై నే
    డు నిజమ్ములయ్యె; తినరండు మృణాళవిందుల్.

    రిప్లయితొలగించండి
  2. వినుమా మదీయ మనవిన్ వినిపింతు నేడే
    కనుమా ప్రియమ్ములొలికే కలహంసమా! నా
    మనమందు ఱేని తలపుల్ మధురోహలై నే
    డు నిజమ్ములయ్యె; తినరండు మృణాళవిందుల్.

    రిప్లయితొలగించండి
  3. అమ్మా! శ్రీమతి లక్ష్మీదేవి గారూ! శుభాశీస్సులు.
    మీ సరసాంకము చాల బాగున్నది. మంచి ప్రయత్నము. మొదటి పాదములో మాదీయ మనవి అనేది దుష్ట సమాసము అవుతుంది. కాబట్టి ఇలా మార్చుదాము: వినవయ్య నాదు మనవిన్ వినిపింతు నేడే -- స్వస్తి.

    రిప్లయితొలగించండి
  4. మంచి సవరణ.ధన్యవాదములు.

    వినుమోయి నాదు మనవిన్ వినిపింతు నేడే
    కనుమా ప్రియమ్ములొలికే కలహంసమా! నా
    మనమందు ఱేని తలపుల్ మధురోహలై నే
    డు నిజమ్ములయ్యె; తినరండు మృణాళవిందుల్.

    రిప్లయితొలగించండి
  5. విరహము నొందితి వినుమా !
    సరగున నా నా ధు జేరి సరసపు బలుకుల్
    నరమరిక లేక జెప్పుము
    కలహంసా ! నీ వె శరణు కలుపుము మమ్మున్ .

    రిప్లయితొలగించండి
  6. ఓ కలహంసమా! వినుమ, ఒప్పుగ నేడు మహోపకారమున్
    నాకు నొనర్చినావుగద, నన్ను సఖీమణిగా మనంబునన్
    జేకొని, నాదు సమ్మతిని చేర్చు నరేంద్రుని కిప్పుడే తగన్
    నీకొనరింతు వందనము నీవికఁ జూపుము మాకు సంగతిన్.

    ఆ రమణీయరూపసుగుణాన్వితు నా యసమానవిక్రమున్
    గోరితి నాథుగా నికను కోరిక దీర్చుము, రాజశేఖరున్
    చేరగ బంపు మిచ్చటకు శీఘ్రమె, నాకు స్వయంవరంబు తా
    కూరిమి నిండ తండ్రియిదె గూర్చును, రాదగు దానికాతడున్.

    రిప్లయితొలగించండి
  7. సుబ్బారావు గారు,
    చివరి పాదములో ప్రాస మఱిచారు.

    వంశస్థము
    పదమ్ము పాడంగ విపంచి మ్రోగగా
    కదమ్ము త్రొక్కంగ సుఖమ్ము కల్గగా
    మదీయ సౌందర్య కుమార హంసమా!
    సదా విలాసమ్ముగ సంచరింపుమా!

    రిప్లయితొలగించండి
  8. అమితోత్సాహము గూర్చితీవు ద్విజవర్యా! నీ వచశ్శుద్ధి శ్రే
    యములన్ గూర్చును సత్వరమ్ము నల భూపాగ్రేసరున్ మద్ధృద
    బ్జమునన్ నిల్పితి తన్మహావిభవమే సౌభాగ్య సంధాయియౌ
    ప్రమదం బొప్పగ సమ్మతిన్ దెలుపుమా భవ్యాత్మ! వాగ్వైభవా!

    రిప్లయితొలగించండి
  9. అమ్మ! శ్రీమతి లక్ష్మీదేవి గారూ!
    మరొక్క పొరపాటు కూడా ఇప్పుడే చూచేను మీ పద్యములో:
    మృణాళ విందుల్ కి బదులుగా మృణాల రాజిన్ అంటే బాగుంటుందేమో.

    శ్రీ హ.వె.స.నా.మూర్తి గారు:
    మీ పద్యములో చిన్న సవరణ:
    ఒనర్చినావు కద కంటే ఒనర్చితీవు కద అంటే వ్యాకరణ శుద్ధముగా ఉంటుంది.
    స్వస్తి.

    రిప్లయితొలగించండి
  10. ఆర్యా!
    ధన్యవాదములు.
    అలాగే "ఒనర్చితీవు"గా సవరిస్తున్నాను.

    రిప్లయితొలగించండి
  11. అమ్మ! శ్రీమతి లక్ష్మీదేవి గారూ!
    మరొక్క సూచన. మీ వంశస్థ వృత్తములో "మదీయ సౌందర్య కుమార హంసమా" కి బదులుగా మదీయ శ్రేయఃప్రద మంజుభాషణా అంటే బాగుంటుందేమో.
    స్వస్తి.

    రిప్లయితొలగించండి
  12. ఓదమయంతి నీ సొగసు లుత్తమమౌ భవదీయ శీలమున్
    మోదము గూర్చు నెల్లరకు భూతలమందున నీకు సాటియౌ
    మేదిని నేలుచున్ బుధులు మెచ్చెడి ధీనిధి ధీరతేజుడున్
    కాదె నలుండు తథ్యమిది కామిని యంచనె నంచ యత్తరిన్.

    నీ పలుకుల్ ద్విజాగ్రమణి నీ దగు వాక్సుధ లెన్న నిత్తరిన్
    చూపెను నా యెడంద కొక చూపుల కింపగు రాకుమారునిన్
    కోపము బూనకియ్యెడను కూరిమి వేగమె పోయి వానికిన్
    నాపయి ప్రేమలూరు గతి నర్మముగా ననుగూర్చి చెప్పవే.

    రిప్లయితొలగించండి
  13. అయ్యా,
    ఉత్తమమైన సవరణలు సూచించారు.
    ఆ విధముగా సవరించి వ్రాసిన పద్యములు ఇంకా శోభిస్తాయి.
    ధన్యవాదములండి.

    రిప్లయితొలగించండి
  14. లక్ష్మీదేవి గారూ,
    నేమాని వారి సూచనలతో సవరించి, చక్కని పద్యం చెప్పారు. మీ రెండవ పద్యం మనోహరంగా ఉంది. అభినందనలు.
    *
    సుబ్బారావు గారూ,
    మంచి భావంతో పద్యం చెప్పారు. అభినందనలు.
    చివరిపాదంలో ప్రాస తిప్పింది కదా! దానిని ‘శరణము నీవే కలుపుము సరగున మమ్మున్’ అని సవరిస్తే ఎలా ఉంటుందంటారు?
    *
    సత్యనారాయణ మూర్తి గారూ,
    మీ రెండు పద్యాలు మనోజ్ఞంగా ఉన్నాయి. అభినందనలు.
    *
    పండిత నేమాని వారూ,
    వచశ్శుద్ధీ, వాగ్వైభవం గల్గిన పద్యాన్ని ఉత్తమంగా చెప్పారు. అభినందనలు, ధన్యవాదాలు.
    *
    మిస్సన్న గారూ,

    అర్మిలితో మధురోక్తుల
    మర్మంబు నెఱింగి రససమంచిత రీతిన్
    నర్మోక్తుల పద్యమ్ముల
    నిర్మించెద వని నుతింతు నిను మిస్సన్నా!

    రిప్లయితొలగించండి
  15. మరొక ప్రయత్నము

    తెల్లటి ఱెక్కలన్ గలిగి తీయగఁ బల్కెడు రాజహంసమా!
    యెల్లరి మానసమ్మలర యిచ్చటికిప్పుడు వచ్చినావటే!
    వెల్లువ లయ్యె నా మదిని వింతగ సంతసమో మరాళమా!
    యుల్లము పాడె, నా సఖుని యొద్దకు చేరుచు మానసమ్మిదే!

    రిప్లయితొలగించండి
  16. లక్ష్మీదేవి గారూ,

    ఎల్లరు మెచ్చఁగ వృత్తము
    నల్లన నలవోక వ్రాసి యానందమ్మున్
    వెల్లువగా నొసఁగితి విక
    తెల్లమయెన్ నీదు ప్రతిభ ధీశాలి వనన్.

    రిప్లయితొలగించండి
  17. గురువు గారు,
    అనేకానేక ధన్యవాదములు. ఎంతో సంతోషముగా నున్నది.

    రిప్లయితొలగించండి
  18. నల్లని వానిని మనసున
    నల్లన ప్రేమించినాను నా మాటల నే
    నల్లిన విధముగ దెలుపుచు
    తెల్లము జేయుము విషయము తెలి హంసమ్మా!

    రిప్లయితొలగించండి
  19. గోలి హనుమచ్ఛాస్త్రి గారూ,
    మీ పద్యం బాగుంది. అభినందనలు.
    ‘మనసున’ అనరాదు కదా! ‘మనమున’ అంటే సరి!

    రిప్లయితొలగించండి
  20. మధురోక్తులాడుచును శత
    విధముల మము ప్రోత్సహించి వినుతింతురులే
    మధియింపగ మా మేధల
    బుధజననుత శంకరాఖ్య భూరి యశస్వీ!

    రిప్లయితొలగించండి
  21. 1.హంససందేశమను కథ నందమైన
    పటము జూడగ రవివర్మ ,ప్రముఖ చిత్ర
    కారు కళావిలాసాన గలుగుచుండు
    నమిత హర్షాతిరేకమ్ము యనవరతము.

    2.నాదు మనోహరుండు నలనామ నరేంద్రుని రూపసంపదల్
    స్వాదు వచోమృతమ్మునను జక్కగ దెల్పితివీవు ,నీకు నే
    నేది బహూకృతిన్ దనర నీయగజాలెద నంచు బల్కుచున్
    నా దమయంతి లాలనగ నంచను ముద్దుగ జేర దీసెడిన్

    రిప్లయితొలగించండి
  22. విరహము నొందితి వినుమా !
    సరగున నా నా ధు జేరి సరసపు బలుకుల్
    నరమరిక లేక జెప్పుము
    సరళ ముగా హంస తల్లి ! సాకను నన్నున్ .

    రిప్లయితొలగించండి