26, సెప్టెంబర్ 2014, శుక్రవారం

నిషిద్ధాక్షరి - 11

అనుస్వారాన్ని ఉపయోగించకుండా
పెండ్లి విందును గురించి
మీకు నచ్చిన ఛందంలో పద్యం వ్రాయండి.

34 కామెంట్‌లు:

 1. తప్పదు భుక్తాయాసము
  ఘుప్పుమని సువాసనలట ఘుమఘుమ లాడన్
  దప్పళము గారె పాయస
  మప్పడములనెల్ల తినిన మనుజుల కెల్లన్

  రిప్లయితొలగించండి
 2. వైవాహిక భోజనమున
  నావడులను బెరుగు తోడ నాహార ముగన్
  వేవడిగ వేయు కతనన
  పావని తిన నోపదయ్యె బవన కుమారా !

  రిప్లయితొలగించండి
 3. గురువు గారికి నమస్కారములు అను స్వరము లేవి?
  krkr

  రిప్లయితొలగించండి
 4. చంద్రమౌళి సూర్యనారాయణ గారూ,
  మీ పూరణ బాగున్నది. అభినందనలు.
  *
  సుబ్బారావు గారూ,
  మీ పూరణ బాగున్నది. అభినందనలు.
  *
  రాధాకృష్ణ రావు గారూ,
  అనుస్వరము కాదు... అనుస్వారము అంటే పూర్ణబిందువు (సున్న).

  రిప్లయితొలగించండి
 5. స్వారస్యముగల్గి, యను
  స్వారాకారమును బోలు చక్కని గారెల్
  భారీ యల్లపు పచ్చడి
  నోరూర తినదగు వేయి నూర్లై ననుబో!

  రిప్లయితొలగించండి
 6. మాస్టారూ, మరచాను యతి స్థానంలో ద్విత్వాక్షరం వేస్తే నాలుగు పాదాలలోనూ ద్విత్వాక్షరం ఉండాలా?

  రిప్లయితొలగించండి
 7. చంద్రశేఖర్ గారూ,
  ‘అనుస్వారాకారపు గారెల’తో మీ పద్యం రుచికరంగా ఉంది. అభినందనలు.
  మీ ప్రశ్న అర్థం కాలేదు. ఆ నియమం కేవలం ప్రాస, ప్రాసయతులకే.

  రిప్లయితొలగించండి
 8. సరి మనువున భోజనమిది
  యరిటాకుల లోనవేడి యన్నము పప్పున్
  మరి గాచిననేయి, వడలు
  నరిసెలునప్పడములు గల నారగు రసముల్.

  రిప్లయితొలగించండి
 9. ఒక బ్రాహ్మణుడు తన కొడుకుతో పెండ్లిభోజనములో..........

  తీయని బొబ్బట్లకు మరి
  సాయముగా నేతి వడలు చల్లని పెరు గో
  హోయనుచు నావకాయ మ
  రీయద్భుతభోజనమున కేమి కొదవరా!!

  రిప్లయితొలగించండి
 10. అందరికీ వందనములు !
  అందరి పూరణలూ అలరింప నున్నవి !

  పెళ్ళివేడుక-విందుభోజనం-వేగమె రారండి :

  01)
  _____________________________________

  వడలు బొబ్బట్లు పూర్ణము - లడిగినన్ని
  తీపి వస్తువు లవిగూడ - తినిన యన్ని
  మేటి కూరలవెన్నియో - మెచ్చినన్ని
  కొత్త యన్నము లవి జూడ - కోరినన్ని
  వివిధ పచ్చళ్ళు పులుసుల - జవిగొనగను
  వేగ పరిణయ వేడుకన్ - విసర రారె !
  _____________________________________

  రిప్లయితొలగించండి
 11. కలవారి వివాహమునను
  పలుశాకములన్ రుచియగు భక్ష్యమ్ములతో
  కలలోనఁగనని భోజ్య
  మ్ములతో నిడినట్టి బోనము ముదముఁ గూర్చెన్

  రిప్లయితొలగించండి
 12. మల్లెల వారి పూరణలు

  వియ్యాల వారి బోనము
  న య్యాశాకములనువుగ, నరిసెలు, పూర్ణాల్
  క్రొయ్యూరుగాయ, పులుసును
  కొయ్యన్ వీలగు పెరుగును కూడును మిగులన్

  బూరెలు, పులిహోర, లరిసె
  లారయ శాకములవి పలు, లాలిత పులుసుల్
  క్షీరాన్నము, లడ్వములను.
  చేరుచు వైవాహ బోన చెలువము గనమే!

  రిప్లయితొలగించండి
 13. విరిసిన మమతల తోడన్
  మురియుచు నావడలు, బూరె, పులిహోరలతో
  యరిసెలు మరి పాయసముల
  పరిణయ భోజనము తినగ ప్రమదము గాదే!

  రిప్లయితొలగించండి
 14. పరిణయ భోజన వాసనలను గొన్న కడుపులో నెలుకలు కలియదిరుగు
  పప్పు దప్పళములు పలువిధ శాకముల్ -పులిహోర పాయసములకు తోడు
  గారెలు లడ్డులు బూరెలు నరిసెలు - నేతి సువాసన నిగుడజేయ
  నప్పడములు వడియముల కరకరలు - గడ్డ పెరుగు తోడ కమ్మగాను
  నేటి పెళ్ళిళ్ళ నైస్క్రీము వాటమయ్యె
  దమ్ము బిర్యాని జేయక తప్పదుమరి
  మధురమైనిష్టముగ దిను మాన్యులెల్ల
  యాకు వక్క గొని యరుగు నాఖరికిని

  రిప్లయితొలగించండి
 15. వరుస భోజనము లుపోయి పళ్లెము లను బట్టుచున్
  మురిసి తినగ నొక్కమారె ముచ్చెమటలు బట్టునే
  పరిణయమున భోజనములు ఫాస్ట్ ఫుడ్డు బోలగన్
  వెరసి జూడ మొక్కుబడి గ వేడుకయ్యె నేడుగా!

  రిప్లయితొలగించండి
 16. పూజ్యులు గురుదేవులు శంకరయ్య గారికి వందనములు హరిబువ్వములో తినుటకు
  నరిసెలు బొబ్బట్లు,లడ్లు నప్పమ్ములతో
  తిరువీసము తైతిలములు
  పెరుగువడలు,నూరుగాయ పెరుగన్నముయున్
  సూపము.నేతులు శాకము
  వేపుడుయున్ ముక్కపులుసు వేడిగ చారుల్
  తీపి హిమ శరము లొసగిరి
  నాపయి కిళ్ళీలు నిచ్చిరతిథులు మెచ్చన్

  రిప్లయితొలగించండి
 17. మల్లెలవారిపూరణ
  కళ్యాణ మయ్యేటి కమనీయ వేళలో
  నరటి యాకులలోన నన్నమిడుచు
  పనసకూరయు నాది పదునుగా నిడుచును
  ముద్దపప్పు నిడి మొదలు గాను
  ముదురు పులుసు నెయ్యి ముదముగానిడుచును
  బూరెలు పులిహోర పొల్పు లడ్లు
  జీడిపప్పు కిసిమిసీపాయసమ్ములు
  గడ్డ పెరుగుపోసి కనగ తృప్తి
  నాగవల్లి దళము పూగఫలమ్ముల
  భోజనాలు ముగియ పుష్టినిచ్చి
  పెద్దవారి మ్రొక్కి తద్దయ పొందిన
  పరమ సుఖము గల్గు పరిణయమున

  రిప్లయితొలగించండి
 18. శ్రీగురుభ్యోనమ:

  అప్పడములు వడియములును
  పప్పన్నము పాయసములు పలు భక్ష్యములున్
  ముప్పొదుల భోజనములు
  గొప్పగ పెళ్ళిళ్లలోన కుడుచగవచ్చున్.

  రిప్లయితొలగించండి
 19. కె. ఈశ్వరప్ప గారి పూరణ
  కనులుజూడని వెన్నియో వినగ చెవులు
  ముక్కువాసనతో పట్ట పక్కజేరె
  నాల్కలెరుగని రుచులన్ని నలిగె నోట
  భోజనాలిక పెళ్ళిలో రోజు గడచె

  రిప్లయితొలగించండి
 20. పరమాన్నము పులిహోరయు
  బిరియానీ శనగ పొడియు విరివిగ దొరుకన్
  నరిసెలు బూరెలు వడలున్
  సరియగు మృష్టాన్నరుచుల చక్కగతీర్చున్

  రిప్లయితొలగించండి
 21. కె యెస్ గురుమూర్తి ఆచారి గారి పూరణ
  వడలును నేతిగారెలును పాయసమున్ పులిహోర కూర వే
  పుడుచిగురాకు పచ్చడియు మున్గ రసమ్ముయునిచ్చె జిహ్వకున్
  కడు రుచి,వాటికన్నరుచిగా నతి తీయని దైన పెళ్ళివా
  రిడిన మహాదరమ్ము మది నెన్నడు వీడక నిల్చుగా నికన్

  రిప్లయితొలగించండి
 22. మిత్రులందఱకు నమస్కారములు.

  శ్రీ శంకరయ్యగారు గ్రామాంతరమునకుఁ జనుటచే నేఁడు వ్యాఖ్యలఁ బరిశీలింప వీలగుటలేదని దూరభాషణము ద్వారమునఁ దెలిపియున్నారు. గమనించఁగలరు.

  నేఁటి నిషిద్ధాక్షరికి నా పూరణము:

  తే.గీ.
  కనఁగ నేఁటి వివాహ బోజన నియమము
  లన్ని గతకాల వైరుద్ధ్య మాయె నయ్య!
  యేవియో "బఫే సిస్టమ్ము" లెన్నికఁ గొని,
  శానిగాఁ దినుచున్నారు జనులు మిగుల!!

  (కంది శంకరయ్యగా రొక వ్యాఖ్యలో ననుస్వారమనఁగాఁ బూర్ణ బిందువు{సున్న}నే తెలిపినారు. అర్ధ బిందువునుఁ బ్రస్తావింపకపోవుటచే నే నర్ధానుస్వారములను వాడితినని గ్రహింపఁగలరు)

  రిప్లయితొలగించండి
 23. గోలి హనుమమచ్ఛాస్త్రిగారూ, మీ పద్య మాఱగు రుచులతో నోరూరించుచున్నది. అభినందనలు.
  *
  సంపత్ కుమార్ శాస్త్రిగారూ, మీ పద్యమున మరీ యద్భుతమైన భోజనమును రుచిచూపితిరి. అభినందనలు.
  *
  వసంత్ కిశోర్‍గారూ, మీ పద్యమున
  భోక్తలు అడిగినన్ని, తినినయన్ని, మెచ్చినన్ని, కోరినన్నివడ్డింపఁజేసి, తినిపించినారు. అభినందనలు.
  *
  అన్నపరెడ్డి సత్యనారాయణ‍రెడ్డిగారూ, మీ పద్యమున కలవారియిండ్లలోఁ బెండ్లివిం దెటుల నుండునో తేఁటతెల్లముఁ గావించితిరి. అభినందనలు.
  *
  మల్లెలవారూ, మీరు తెలిపిన వియ్యాలవారి విందుభోజనముం గూర్చిన రెండు పద్యములు బాగున్నవి. అభినందనలు. కాని, "లాలిత పులుసుల్", "వైవాహ బోన చెలువము" ప్రయోగములు సాధువు లనిపించుటలేదు. పరిశీలించఁగలరు.
  *
  శైలజగారూ, మీ కందము మాకందమై వివాహభోజనముచే నలరింపఁజేయుచున్నది.

  ఉత్సాహపద్యము జనుల భోజనోత్సాహము నతిశయింపఁ జేయుచున్నది. అభినందనలు.
  *
  చంద్రమౌళి సూర్యనారాయణగారూ, తమరి పెండ్లిభోజనమున శాకములతో పాటైసుక్రీములు, దమ్ముబిరియానీలను రుచిచూపించితిరి. అభినందనలు.
  *
  కెంబాయి తిమ్మాజీరావుగారూ, తమరు హరిబువ్వమునఁ దినిపించిన వంటలతో బొజ్జనిండినది. అభినందనలు. కాని, పెరుగన్నముయున్, వేపుడుయున్...అను ప్రయోగములందు యడాగమనావశ్యకము. వీనిని...పెరుగన్నమ్మున్, వేపుడులున్..అని సవరింపఁగలరు.
  *
  శ్రీపతి శాస్త్రిగారూ, తమరి పద్యమునఁ బెండ్లివిందెటు లారఁగించవచ్చునో తెలిసినది. అభినందనలు. కాని, చిన్నసవరణము లవసరము. కంద తృతీయపాదము "ముప్పొదుల భోజనములు"నందు గణభంగమైనది. దీనిని "ముప్పొద్దుల భోజనములు" అని సవరించినచో సరిపోవునని నా యభిప్రాయము. చతుర్థపాదమున "గొప్పగ పెళ్ళిళ్లలోన కుడుచగవచ్చున్" అనుచోట...పెళ్ళిళ్ళు...వ్యావహారికము..."కళ్యాణములను" అని సవరింపఁగలరు. అటులనే...కుడుచగ..సాధువుకాదు. దీనిని "కుడువఁగ" నని సవరింపఁగలరు.
  *
  కె. ఈశ్వరప్పగారూ, మీ పద్యమునఁ బంచజ్ఞానేంద్రియముల కవసరమగు రుచులన్నియుఁ దెలిపితిరి. అభినందనలు.
  *
  రెండుచింతల రామకృష్ణమూర్తిగారూ, మీ పద్యమున మృష్టాన్నరుచుల తీరుతెన్నులనుఁ బరిచయముఁ గావించితిరి. అభినందనలు.
  *
  కె.యస్.గురుమూర్తి ఆచారిగారూ, తమరి చంపకమం దన్ని వంటకములఁ బంపకముఁజేసితిరి. అభినందనలు. కాని, చిన్నసవరణము...ద్వితీయపాదమున "రసమ్ముయు నిచ్చె"ననుచోట "రసమ్మునునిచ్చె"నని సవరింపఁగలరు.
  *
  స్వస్తి.

  రిప్లయితొలగించండి
 24. మల్లెల‍వారూ, నేను మీ మలిపూరణమైన సీసపద్యముం బరిశీలింపకయే ముందునకుం బోయితిని. మన్నింపఁగలరు. ఇందలి..."కళ్యాణ మయ్యేటి" యను ప్రయోగము సాధువు కాదు. దీనిని..."కళ్యాణ మగునట్టి"యని సవరింపఁగలరు. అటులే..సీసపద్యద్వితీయపాదోత్తరార్ధము "ముద్దపప్పు నిడి మొదలు గాను"నందు గణభంగమైనది. దీనిని "ముద్దపప్పును నిడి"గా మార్చఁగలరు. మఱియుఁ జిన్నచిన్న సవరణము లవసరపడినను మొత్తమునకుం బద్యము బాగుగనున్నది. అభినందనలు.

  స్వస్తి.

  రిప్లయితొలగించండి
 25. మొన్నటి దత్తపది :
  విరులమరిన లతలల్లిన
  పరిమళముల పూల తోట వనితల కందన్
  తరియించెడు తలపులతో
  కరివరదున కిడగ మాల కలతల బాపున్!
  నేటి నిసిద్ధాక్షరి:
  ఎవరేది మెత్తురోయని
  వివిధములగు 'తీపి,కార' వేడుక జేయున్
  వివరము దెలియక జేయు న
  నవసర శాకమ్ము లెల్ల నాపిన మేలౌ!

  రిప్లయితొలగించండి
 26. మిత్రులు గుండా వేంకట సుబ్బ సహ దేవుఁడుగారూ, మొన్నటి మీ దత్తపది చాల చక్కఁగ నున్నది. అభినందనలు.

  నేఁటి పద్యమునఁ "దీపి, కార వేడుక"యను ప్రయోగము సాధువుగ ననిపించుటలేదు. "తీపికార"కు..."ములు" చేర్చిన పదప, వేడుక....పదమునుఁ బ్రయోగింపవలెను కదా. ఇటులఁ బ్రయోగించినచో గణభంగమగుఁ గానఁ బద్యమును మఱియొక విధముగ సవరింపఁగలరు. స్వస్తి.

  రిప్లయితొలగించండి
 27. శ్రీ మధుసూధన్ గారికి నమస్సులు.
  3 వ పాదమున టైపాటు కలిగినది.
  మీ సూచనలననుసరించి సవరించిన పద్యము.


  అప్పడములు వడియములును
  పప్పన్నము పాయసములు పలు భక్ష్యములున్
  ముప్పొద్దుల భోజనములు
  గొప్పగ కళ్యాణములను కుడువఁగ వచ్చున్ .

  ధన్యవాదములు.

  రిప్లయితొలగించండి
 28. శ్రీపతిశాస్త్రిగారూ,

  చతుర్థపాదమున విడివిడిగా సవరణములు సూచించుటవల్ల చిన్న పొరపాటు జరిగినది.

  దానిని "గొప్పగఁ గళ్యాణములనుఁ గుడువఁగవచ్చున్"అని సవరించవలెను.

  విసంధిగా నున్నవాటిని సంధిచేయుటవలన కొలఁది మార్పులు జరిగినవి. పరిశీలింపఁగలరు. అన్యథా భావింపవలదు.

  స్వస్తి.

  రిప్లయితొలగించండి
 29. సంపత్ కుమార్ శాస్త్రి గారూ (సెప్టెంబర్ 26) మీ పద్యం రుచికరంగా ఉంది గాని పద్యం ముందు వాక్యంతో కలిపి చూస్తే మంచి భోజనాన్ని ఆస్వాదించడానికి కులభేదం ఉందా అనిపిస్తుంది.

  రిప్లయితొలగించండి
 30. మిత్రులు శ్రీ గుండు మధుసూధన్ గారికి ధన్యవాదములు. నవరించిన విందు పద్యం.
  ఎవరేది మెత్తురోయని
  వివిధములగు రుచులమరుచు వేడుక జేయున్
  వివరము దెలియక జేయు య
  నవసర శాకమ్ము లెల్ల నాపిన మేలౌ!

  రిప్లయితొలగించండి