3, సెప్టెంబర్ 2014, బుధవారం

పద్యరచన - 666 (విషజ్వరములు)

కవిమిత్రులారా,
ఈనాటి పద్యరచనకు అంశము...
“విషజ్వరములు”

9 కామెంట్‌లు:

 1. అందరికీ వందనములు !
  అందరి పూరణలూ అలరింప నున్నవి !

  ఋతుసంక్రమణమప్పుడు
  యమదంష్ట్రలు బయటికొస్తాయట !
  అవే విషజ్వరాలుగా మారునేమో గదా :

  01)
  ______________________________

  గ్రీష్మము తదుపరి వర్షము !
  చష్మలు నిండిన, విరివిగ ♦ జ్వరముల్లెగయన్
  సుష్మము చేకొని యమనుడు
  యుష్మద్దాయుష్షు దీయ ♦ యోచన జేయున్ !
  ______________________________
  గ్రీష్మము = గ్రీష్మఋతువు
  వర్షము = వర్షఋతువు
  చష్మ = చెలమ
  సుష్మము = పాశము
  యుష్మత్ = నీ యొక్క(విషజ్వరము సోకిన వారియొక్క)

  రిప్లయితొలగించండి
 2. పందులు కుక్కలు తిరుగుచు
  నెందున జూసినను పారు నెప్పుడు మురుగే
  సందున నైనను దోమలు
  మంది విషజ్వరము లబ్బి మడయుచునుండెన్

  రిప్లయితొలగించండి
 3. వర్షము లెక్కువ పడుటన
  హర్షము మది గలిగె మాకు ననుదిన మునున్
  వర్షము వలనన మురుగై
  విష పూరిత జ్వరము లవియ బిట్టున వచ్చున్

  రిప్లయితొలగించండి
 4. వసంత కిశోర్ గారూ,
  మీ పద్యం బాగున్నది. అభినందనలు.
  ‘జ్వరములు + ఎగయున్’... ద్విత్వం ఎక్కడినుంచి వచ్చింది? ‘జ్వరము లెగయుగా’ అందామా?
  *
  చంద్రమౌళి సూర్యనారాయణ గారూ,
  మీ పద్యం బాగున్నది. అభినందనలు.
  *
  సుబ్బారావు గారూ,
  మీ పద్యం బాగున్నది. అభినందనలు.
  రెండవ పాదం చివర గణదోషం. ‘మాకు ననుదిన మైనన్’ అందామా?

  రిప్లయితొలగించండి
 5. కలుగును విషజ్వరమ్ములు
  కలుషిత జలములఁ గొనినను, కాచక నీటిన్
  కలరా రోగము తోడను
  పలు రాష్త్రాల ప్రజలిడుమలుఁ బడుటను కనమే?

  రిప్లయితొలగించండి
 6. అన్నపరెడ్డి సత్యనారాయణ రెడ్డి గారూ,
  మీ పద్యం బాగున్నది. అభినందనలు.

  రిప్లయితొలగించండి
 7. దోమలె విషజ్వరములకు
  సామూహిక కారణమ్ము సత్యము నిదియే!
  భూమిని మానవ నాశము
  దోమల తోనే కలదని తోచును నాకున్!

  రిప్లయితొలగించండి
 8. గుండా వేంకట సుబ్బ సహదేవుడు గారూ,
  మీ పద్యం బాగున్నది. అభినందనలు.

  రిప్లయితొలగించండి
 9. పూజ్య గురుదేవులు కంది శంకరయ్యగారికి నమస్సులు. చివరిపాదములో రెండుతప్పులు దొర్లినవి. నాలుగవ పాదాన్ని సవరించి పంపుచున్నాను.
  “పలు రాష్ట్రాల ప్రజ బాధ పడుటను కనమే?”

  రిప్లయితొలగించండి