19, సెప్టెంబర్ 2014, శుక్రవారం

సమస్యా పూరణం – 1520 (గుడి కేగుట మేలు)

కవిమిత్రులారా,
ఈరోజు పూరించవలసిన సమస్య ఇది...
గుడి కేగుట మేలు కల్లు గొని భక్తులకున్.

28 కామెంట్‌లు:

  1. విడుచుట కొరకై త్రాగుడు
    గుడి కేగుట మేలు, కల్లు గొని భక్తులకున్
    హడలెత్తించక జక్కని
    నడవడి తోడ భగవానునర్ధించవలెన్

    రిప్లయితొలగించండి
  2. విడువక వామాచారము
    నడచిన జాతరకు కల్లు నైవేద్యంబౌ
    ముడుపులు మ్రొక్కులు తీర్చగ
    గుడి కేగుట మేలు కల్లు గొని భక్తులకున్!!

    రిప్లయితొలగించండి
  3. కడుగొని ప్రతి దిన మందున
    గుడి కేగుట మేలు, కల్లు కొని భక్తులకున్
    గుడి కేగుట నేరము గద
    మడికట్టుకు నేగ శుభము మనుజుల కెపుడున్

    రిప్లయితొలగించండి
  4. పూజ్యులు గురుదేవులు శంకరయ్య గారికి వందనములు

    ఇడుమలు దీరగ, స్వాస్థ్యము
    చెడి పోవక ,జనులు చిరము జేవి౦ప౦ గన్
    మడి గాను కాల భైరవు
    గుడి కేగుట మేలు కల్లు గొని భక్తులకున్

    రిప్లయితొలగించండి
  5. చంద్రమౌళి సూర్యనారాయణ గారూ,
    మీ పూరణ బాగున్నది. అభినందనలు
    *
    జిగురు సత్యనారాయణ గారూ,
    వామాచారుల జాతరను గూర్చిన మీ పూరణ బాగున్నది. అభినందనలు.
    *
    సుబ్బారావు గారూ,
    మీ పూరణ బాగున్నది. అభినందనలు.
    *
    కెంబాయి తిమ్మాజీ రావు గారూ,
    మీ కాలభైరవుని గుడి పూరణ బాగుంది. అభినందనలు.

    రిప్లయితొలగించండి
  6. ఇడుములు తొలగంగ జనులు
    గుడి కేగుట మేలు;కల్లు గొని భక్తులకున్
    దుడుకుగ దిరిగిన పాపము
    చెడు నడతను వీడి గొలువ చింతలు దీరున్

    రిప్లయితొలగించండి
  7. మల్లెల వారి పూరణలు

    కడు 'కాదంబరి ప్రియ'యని
    వడి నామాలను పలుకుచు, పావన మంబన్
    గుడ మన్నము నిడఁ గొనుచును,
    గుడి కేగుట మేలు కల్లుఁ గొని భక్తులకున్

    గుడులందు నమ్మ వారికి
    కుడువగ నీరె, గిరిజనులు గొప్పగ కల్లున్,
    కడు చలువని యెంచుచు,వే
    గుడి కేగుట మేలు కల్లుఁ గొని భక్తులకున్

    గుడులందు జంతు బలులవి
    ఎడనెడ సాగుచు నునుండె, నేర్పడ నపుడే
    తడయక కల్లిడు దురుగా
    గుడి కేగుట మేలు కల్లుఁ గొని భక్తులకున్

    వడిశాక్తేయులు నంబకు
    గుడిలో కల్లిడి కొలుతురు. గొప్పగ నామే
    తడాయక వశమౌ నంచును
    గుడి కేగుట మేలు కల్లుఁ గొని, భక్తులకున్

    కడు మూర్ఖంబుగ జనులల
    తడయక కోళ్లును మొదలుగ తలలను తెంచే
    యిడుదురు పూజను, తలపరె
    గుడి కేగుట మేలు కల్లుఁ గొని భక్తులకున్

    రిప్లయితొలగించండి
  8. కడునిష్టతోడ శుచియై
    గుడికేగుట మేలు, కల్లుగొని భక్తులకు
    న్నిడుములఁగలిగించతగదు
    పడవలదు నరకమునందు ప్రభు దూషణతో!

    రిప్లయితొలగించండి
  9. కె.యెస్.గురుమూర్తి ఆచారి గారి పూరణ
    కడు భక్తీ తోడ నెల్లమ
    గుడి కేగుట మేలు కల్లుగొని; భక్తులకున్
    కుడువగ క్రొవ్విన మేకను
    కడవలతో తాటి కల్లు కావలె సుమ్మీ

    రిప్లయితొలగించండి
  10. .కె.ఈశ్వరప్పగారి పూరణ
    అడవిని వెలసిన దేవత
    కడుగడుగున నాటవికులు నాన౦దముతో
    గడిపెడి జాతర యందున
    గుడి కేగుట మేలు కల్లు గొని భక్తులకున్.

    రిప్లయితొలగించండి
  11. శ్రీగురుభ్యోనమ:

    విడచుచు ధర్మపథమ్మును
    సడలించుచు చట్టములను స్వార్థము తోడన్
    నడవడి చెడునటు తగునా
    గుడికేగుట? మేలు కల్లు గొని, భక్తులకున్.

    రిప్లయితొలగించండి
  12. పడి చచ్చెడు మందు ప్రియులు
    గుడిఁగీసిరి మందుఁ గొట్ట గోవా బీచిన్
    యెడమేటికి సడి జేయక
    గుడికేగుట మేలు కల్లు గొని 'భక్తులకున్'!
    (గుడి=వలయాకారపు రేఖ)

    రిప్లయితొలగించండి
  13. నడక కెచటి కేగ వలయు ?
    చెడిపోయిన కారణంబు చెప్పుము యనగా,
    వడి గా దర్శ న మెవరికి?
    గుడి కేగుట మేలు, కల్లుగొని , భక్తులకున్
    కొరుప్రోలు రాధా కృష్ణ రావు

    రిప్లయితొలగించండి
  14. అందరికీ వందనములు !
    అందరి పూరణలూ అలరింపు చున్నవి !

    తప్పతాగి అల్లరి చెయ్యడానికా గుడికి-తప్పుతప్పు :

    01)
    ________________________________

    కడు భక్తిని సేవింపగ
    గుడి కేగుట మేలు; కల్లు - గొని భక్తులకున్
    సుడి గలిగెడు రీతి నచట
    సడిసేయగ రాదు సుమ్ము - సహవాసులతో !
    ________________________________

    రిప్లయితొలగించండి
  15. మల్లెల సోమనాథ శాస్త్రి గారూ,
    మీ ఐదు పూరణలు బాగున్నవి. అభినందనలు.
    అక్కడక్కడ టైపు దోషాలున్నాయి.
    *
    అన్నపరెడ్డి సత్యనారాయణ రెడ్డి గారూ,
    మీ పూరణ బాగున్నది. అభినందనలు.
    *
    కె.యస్. గురుమూర్తి ఆచారి గారూ,
    మీ పూరణ బాగున్నది. అభినందనలు.
    *
    కె. ఈశ్వరప్ప గారూ,
    మీ పూరణ బాగున్నది. అభినందనలు.
    *
    శ్రీపతి శాస్త్రి గారూ,
    మీ పూరణ బాగున్నది. అభినందనలు.
    *
    గుండా వేంకట సుబ్బ సహదేవుడు గారూ,
    మీ పూరణ వైవిధ్యంగా బాగున్నది. అభినందనలు.
    *
    కొరుప్రోలు రాధాకృష్ణ రావు గారూ,
    క్రమాలంకార పద్ధతిలో మీ పూరణ బాగున్నది. అభినందనలు.

    రిప్లయితొలగించండి
  16. వసంత కిశోర్ గారూ,
    మీ పూరణ బాగున్నది. అభినందనలు.

    రిప్లయితొలగించండి
  17. కవిమిత్రులందఱకును వందనములు.

    మడితో నెట కేగుట మేల్?
    వెడ శుక్రుం డేమి గొనియుఁ బ్రీతుం డగునో?
    వడి వేల్పెవరికి వరమిడు?
    గుడి కేగుట మేలు; కల్లుఁగొని; భక్తులకున్!!

    రిప్లయితొలగించండి
  18. గుండు మధుసూదన్ గారూ,
    క్రమాలంకార పద్ధతిలో మీ పూరణ బాగున్నది. అభినందనలు.

    రిప్లయితొలగించండి
  19. నా రెండవ పూరణము:

    ఒడిదొడుకు లిడక వరముల
    నిడు పోచమతల్లిఁ గొలుచు నేమముతోడన్
    విడువక సాకనుఁ బోయఁగ
    గుడికేగుట మేలు కల్లుఁగొని భక్తులకున్!!

    రిప్లయితొలగించండి
  20. గుండు మధుసూదన్ గారూ,
    పోచమ్మకు సాక (గ్రామదేవతలకు పోసే కల్లు)ప్రస్తావనతో మీ రెండవ పూరణ బాగున్నది. అభినందనలు.

    రిప్లయితొలగించండి
  21. నా మూఁడవ పూరణము:

    జడముడిజంగముఁ గొలువఁగ
    గుడి కేగుట మేలు కల్లుఁ ♦ గొని? భక్తులకున్,
    మృడున కపచార మిడకయ
    వడిగా నిలు సేర మేలు ♦ పాయికి మిగులన్!!

    రిప్లయితొలగించండి
  22. నా మూఁడవ పూరణమును (కొలఁది మార్పులతో) మరలఁ బ్రకటించుచుంటిని. పరిశీలింపఁగలరు.

    జడదారిఁ గొలువ భక్తుఁడు
    గుడి కేగుట మేలు! కల్లుఁ ♦ గొని్ భక్తులకున్,
    మృడున కపచార మిడకయ
    వడిగా నిలు సేర మేలు ♦ పాయికి మిగులన్!!

    రిప్లయితొలగించండి
  23. వడివేలు చెప్పె త్రాగుచు
    నడిరాత్రికి పోవలెనుగ నా గుడి క్లబ్బే
    తడిజేయ నోరు ఫ్రెండ్సుకు
    గుడికేగుట మేలు కల్లుఁగొని భక్తులకున్

    రిప్లయితొలగించండి
  24. గుండు మధుసూదన్ గారూ,
    విరుపుతో మీ మూడవ పూరణ బాగున్నది. అభినందనలు.
    *
    గోలి హనుమచ్ఛాస్తి గారూ,
    మీ పూరణ బాగున్నది. అభినందనలు.

    రిప్లయితొలగించండి
  25. పత్రం పుష్పం ఫలం తోయం...

    కడు ముదముతోడ పల్లెత
    మడి గట్టిన కట్టకున్న మరియాదలతో
    కడవల పులిసిన వెంటనె
    గుడి కేగుట మేలు కల్లు గొని భక్తులకున్

    రిప్లయితొలగించండి
  26. అడుగడుగున వోటులకై
    మడిగట్టుకు మందమతులు మందును విడుచున్
    పడిగాపులు పడి రాగా
    గుడి కేగుట మేలు కల్లు గొని భక్తులకున్

    రిప్లయితొలగించండి