30, సెప్టెంబర్ 2014, మంగళవారం

పద్యరచన - 692

కవిమిత్రులారా,

పైచిత్రాన్ని పరిశీలించి తగిన పద్యము(ల)ను వ్రాయండి.

11 కామెంట్‌లు:

  1. కనకపు రాశుల తన కర
    మున నిడుకొని కనక దుర్గ ముంగిట నిలిచెన్
    నినదము కాలింగ్ బెల్లుది
    వినిపించగ యది కలయని విదితంబయ్యెన్

    రిప్లయితొలగించండి
  2. కనకపు పళ్ళె ము తోడను
    కను విందుగ బిలుచు చుండె కంటిరె దుర్గ
    న్ననువగు నొక యుడయంబది
    తనరగ నా యింటివారు ధన్యా త్ములుగా

    రిప్లయితొలగించండి
  3. చంద్రమౌళి సూర్యనారాయణ గారూ,
    మీ పద్యం బాగున్నది. అభినందనలు.
    ‘వినిపించగ నది’ అనండి.
    *
    సుబ్బారావు గారూ,
    మీ పద్యం బాగున్నది. అభినందనలు.
    ‘ఉదయం’ టైపాటువల్ల ‘ఉడయం’ అయింది.

    రిప్లయితొలగించండి
  4. అందరికీ వందనములు !
    అందరి పూరణలూ అలరింప నున్నవి !

    వెళ్ళిపోక ముందే తలుపు తీస్తే :

    01)
    ____________________________________

    గర్గర నందెల మోతల
    దుర్గమ్మగ వచ్చె ఝాన్సి - దుడ్డుల నీయన్
    స్వర్గమ్మే యమరును గద
    నిర్గమనము గాక మునుపు - నిలచిన నెదుటన్ !
    ____________________________________
    గర్గర = Tinkling ornaments: bells on the anklets. పెండెము.
    Anklet = అందె మొ. పాదభూషణము.
    నిర్గమనము = నిష్క్రమణము

    రిప్లయితొలగించండి
  5. చూడ " గుడ్డు టీవి " చూపుచునుండెను
    " నాల్గు తిట్టు నీవు నగలు పట్టు "
    నిందు గెలువ మీకు నెన్నియో నగలని
    దక్కు ననుచు మీకు తలుపు తట్టి

    రిప్లయితొలగించండి
  6. ధనలక్ష్మీ రావమ్మా
    యను నాటల నాడవచ్చె నతివ యొకతి, నే
    ర్పున గెలిచినచో నివి ద
    క్కుననుచు పందెములనాడ కోమలులందున్.

    రిప్లయితొలగించండి
  7. మనిషి రూపాన చనుదెంచి మమత యడర
    తలుపుఁదట్టెను దుర్గమ్మ ధనము తోడ
    నమ్మ యాశీసులన్ శీఘ్ర మందుకొనగ
    వేగ రావమ్మ యిల్లాల వేల్పు కడకు

    రిప్లయితొలగించండి
  8. వసంత కిశోర్ గారూ,
    మీ పద్యం బాగున్నది. అభినందనలు.
    *
    గోలి హనుమచ్ఛాస్త్రి గారూ,
    మీ పద్యం బాగున్నది. అభినందనలు.
    *
    లక్ష్మీదేవి గారూ,
    మీ పద్యం బాగున్నది. అభినందనలు.
    *
    అన్నపరెడ్డి సత్యనారాయణ రెడ్డి గారూ,
    మీ పద్యం బాగున్నది. అభినందనలు.

    రిప్లయితొలగించండి
  9. ముచ్చటగ బెల్లు గొట్టుచు
    వచ్చెనుగద సిరులతల్లి వరములనీయన్
    ఖచ్చితమగు పైడి ధనము
    తెచ్చెను పళ్ళెమ్ము లోన దీయరె తలుపున్!

    రిప్లయితొలగించండి
  10. కలిమి కరమ్ముననిడి మీ
    తలుపున విద్యుత్తు గంట తాకెర దుర్గే!
    కలయో? నిజమో? వలయో?
    కలిమిన్ దోచెడు నవీన ఘాతుకమదియో?

    రిప్లయితొలగించండి
  11. శైలజ గారూ,
    మీ పద్యం బాగున్నది. అభినందనలు.
    *
    గుండా వేంకట సుబ్బ సహదేవుడు గారూ,
    మీ పద్యం బాగున్నది. అభినందనలు.

    రిప్లయితొలగించండి