13, సెప్టెంబర్ 2014, శనివారం

నిర్వచన భారత గర్భ రామాయణము – 81


రావిపాటి లక్ష్మినారాయణ

రామాయణము-
సీ.      లీల వినాశకాలే విపరీతబు
ద్ధియనుచు దాశరథియును నీలు
(వరబలయుతు నాహవధృతు ధృష్టద్యుమ్ను
వీరుని నిజసైన్యవిభుని జేసె,)
కొంకక వానరు ల్లంక కెగఁబడ న
సురధవాజ్జనుఁ బ్రహస్తుండు మెండు
(దండియగు యుధిష్ఠిరుండు భీష్ముండు దా
నురవడి నడపించె గురుబలంబు)
గీ.      దనుజసేన; నదియు వాలితనయు గవయ
శరభకేసరిసుగ్రీవజాంబవన్న
లగజమైందసుషేణనీలద్వివిదశ
తబలివాయుజముఖ్యులఁ దారసిల్లె. (౯౬)

భారతము-
ఆ.      వరబలయుతు నాహవధృతు ధృష్టద్యుమ్ను
వీరుని నిజసైన్యవిభుని జేసె
దండియగు యుధిష్ఠిరుండు భీష్ముండు దా
నురవడి నడపించె గురుబలంబు. (౯౬)

టీక- (రా) ధృష్ట = దట్టమైన, ద్యుమ్నుని = సత్త్వముగలవానిని; యుధిష్ఠిరుండు = యుద్ధమందు స్థిరమగువాఁడు; భీష్ముఁడు = ఘోరమగువాఁడు; గురుబలంబు = గొప్పసేన; (భా) కురుబలంబు = కౌరవసేన; ఆహవకృతి = యుద్ధమునందు నేర్పరి; ఉరవడి = శౌర్యముతో.

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి