కోతి కొమ్మచ్చి తదితర - కుర్రతనపు యాటపాటలు తలపున - నాడె నేడు మధుర భావన లందున - మనసు మునిగె ! మరల యాడుద మన్నట్టి - మధురమైన చిలిపి కోరిక తలయెత్తి - సలుపుచుండె ! ______________________________
సుబ్బారావు గారూ, మీ పద్యం బాగున్నది. అభినందనలు. * శైలజ గారూ, మీ పద్యం బాగున్నది. అభినందనలు. ‘ఊగుచూ’ అని వ్యావహారికాన్ని ప్రయోగించారు. ‘ఊగుచు’ అంటే సరి. * అన్నపరెడ్డి సత్యనారాయణ రెడ్డి గారూ, మీ పద్యం బాగున్నది. అభినందనలు.
గుండా వేంకట సుబ్బ సహదేవుడు గారూ, మీ రెండు పద్యాలు బాగున్నవి. అభినందనలు. ‘బాపు’ గురించిన పద్యం రెండవ పాదాన్ని ‘నవని’ అని మొదలుపెట్టారు. ‘నీవు + అవని = నీ వవని’ అవుతుంది. నుగాగమం రాదు కదా! ‘కుంచెఁ గదిపినాఁడ వంచితముగ/ నవని...’ అనండి. * మిస్సన్న గారూ, బాపు, రమణల కోతికొమ్మచ్చి గురించి ఎవరూ వ్రాయలేదని నిరుత్సాహపడుతున్న నాకు మీ సీసపద్యం ఆనందాన్ని కలిగించింది. చక్కని పద్యం. అభినందనలు. * చంద్రమౌళి సూర్యనారాయణ గారూ, మీ పద్యం బాగున్నది. అభినందనలు.
అందరికీ వందనములు !
రిప్లయితొలగించండిఅందరి పూరణలూ అలరింప నున్నవి !
చిన్ననాటి తలపులు-చిత్రమైన చేష్టలు :
01)
______________________________
కోతి కొమ్మచ్చి తదితర - కుర్రతనపు
యాటపాటలు తలపున - నాడె నేడు
మధుర భావన లందున - మనసు మునిగె !
మరల యాడుద మన్నట్టి - మధురమైన
చిలిపి కోరిక తలయెత్తి - సలుపుచుండె !
______________________________
వసంత కిశోర్ గారూ,
రిప్లయితొలగించండిమీ చిలిపికోరికల పద్యం బాగున్నది. అభినందనలు.
‘కుర్రతనపు/ టాటపాటలు...’ అనండి.
శ్రీగురుభ్యోనమ:
రిప్లయితొలగించండికోతికొమ్మచ్చులాటలు కొండనెక్కె
కబడియును జూడ కరువాయె గ్రామమందు
వీడియోగేంసు వ్యాధిలా విస్తరించె
క్రికెటు మాత్రమె జగతిన క్రీడ నేడు
శ్రీపతి శాస్త్రి గారూ,
రిప్లయితొలగించండిమీ పద్యం బాగున్నది. అభినందనలు.
కోతికొమ్మచ్చి యాటను గుఱ్ఱ కారు
రిప్లయితొలగించండిఆడు చుందురు గ్రామాల నాఱు బయట
పెరుగు వృక్షాల కొమ్మలు పిడికి లించి
కొనుచు నూగుచు చిరుపిల్ల కోతివోలె
కొమ్మ బట్టుకు నూగుచూ కూనలంత
రిప్లయితొలగించండికోతి కొమ్మచ్చి నాడును ప్రీతిగాను
కాలగతిలోన నేడిది గానరాక
మనము నందున దాగెను మధుర స్మృతిగ!
చిన్న పిల్లలు పల్లెలన్ సెలవు లందు
రిప్లయితొలగించండికోతి కొమ్మచ్చి యాటలు కూర్మి తోడ
నాడు చుండిరి గతమున నఱచి యఱచి
కాంచ లేమట్టి యాటల గ్రామములను
సుబ్బారావు గారూ,
రిప్లయితొలగించండిమీ పద్యం బాగున్నది. అభినందనలు.
*
శైలజ గారూ,
మీ పద్యం బాగున్నది. అభినందనలు.
‘ఊగుచూ’ అని వ్యావహారికాన్ని ప్రయోగించారు. ‘ఊగుచు’ అంటే సరి.
*
అన్నపరెడ్డి సత్యనారాయణ రెడ్డి గారూ,
మీ పద్యం బాగున్నది. అభినందనలు.
ఈ కామెంట్‌ను రచయిత తీసివేశారు.
రిప్లయితొలగించండినిన్నటి పద్య రచన :
రిప్లయితొలగించండిగీత గీత లోనగిలిగింతలఁ గలిపి
కుంచెఁ గదిపి నావు మించి నీవు!
" నవని ' బాపు బొమ్మ ' నవరస భరితమ్ము "
తెలియు గొంతుక లిదె పలుకు నయ్య!
నేటి పద్యరచన :
చిరువయసున నాటలలో
మెరయగ జీవన గమనము మెలకువ లబ్బున్
సరితూగెడు కొమ్మేదో?
గురుతెరుగగ వచ్చు ' కోతి కొమ్మచ్చా'డన్!
ఇది కోతికొమ్మచ్చి యెటు లోర్తు రని చెప్పి
రిప్లయితొలగించండి....... యింపుగా మొదలిడె నిట్టె నితడు!
ఇంకోతి కొమ్మచ్చి యేమను కోకని
....... ముందుకు నడిపించె ముద్దుగాను!
ముక్కోతి కొమ్మచ్చి ముగియింతు ననిచెప్పి
....... పాఠకులకు ముందు పరచె మనసు!
ఈ కోతికొమ్మచ్చి లెన్ని మార్లాడిన
....... నలసట రాదని యభయ మిచ్చె!
ముళ్ళపూడి రమణ ముదుముద్దుగా జెప్పు
నవ్వ జేసి మనసు నొవ్వ జేసి
కథను గాని యాత్మ కథనైన సొంపుగా
బాపు బొమ్మ వోలె బాపురె! భళ!
చిన్న తనమున హాయిగ చెట్ల నెక్కి
రిప్లయితొలగించండికోఁతికొమ్మచ్చి లాడుచు గోల చేసి
ఎన్ని చీవాట్లు తింటిమొ నాన్న చేత
మధుర జ్ఞాపకములనెట్లు మరువగలము!
గుండా వేంకట సుబ్బ సహదేవుడు గారూ,
రిప్లయితొలగించండిమీ రెండు పద్యాలు బాగున్నవి. అభినందనలు.
‘బాపు’ గురించిన పద్యం రెండవ పాదాన్ని ‘నవని’ అని మొదలుపెట్టారు. ‘నీవు + అవని = నీ వవని’ అవుతుంది. నుగాగమం రాదు కదా! ‘కుంచెఁ గదిపినాఁడ వంచితముగ/ నవని...’ అనండి.
*
మిస్సన్న గారూ,
బాపు, రమణల కోతికొమ్మచ్చి గురించి ఎవరూ వ్రాయలేదని నిరుత్సాహపడుతున్న నాకు మీ సీసపద్యం ఆనందాన్ని కలిగించింది. చక్కని పద్యం. అభినందనలు.
*
చంద్రమౌళి సూర్యనారాయణ గారూ,
మీ పద్యం బాగున్నది. అభినందనలు.
మిస్సన్న గారి పద్యము హృద్యముగావున్నది
రిప్లయితొలగించండిగురుదేవులకు ధన్యవాదాలు. సవరించిన పద్యం :
రిప్లయితొలగించండిగీత గీత లోనగిలిగింతలఁ గలిపి
కుంచెఁ గదిపి నాడ వంచితముగ!
"నవని 'బాపు బొమ్మ' నవరస భరితమ్ము"
తెలియు గొంతుక లిదె పలుకు నయ్య!
గురువుగారికీ, చంద్రమౌళి సూర్యనారాయణ గారికీ ధన్యవాదములు.
రిప్లయితొలగించండి