26, సెప్టెంబర్ 2014, శుక్రవారం

పద్యరచన - 688

కవిమిత్రులారా,

పైచిత్రాన్ని పరిశీలించి తగిన పద్యము(ల)ను వ్రాయండి.

13 కామెంట్‌లు:

  1. పుడమిని క్షీరదములలో
    గడు సుందరమైనజీవి క్ష్మాజమ్ములపై
    వడివడి తిరుగాడుచునీ
    యుడుతలు చేసెడి సడి మదినుల్లాసమగున్

    రిప్లయితొలగించండి
  2. ఉడుతలు చిన్నవి యైనను
    కడువేగము కలిగి యుండు గమనము లోనన్
    వడిదిరుగుచు గొమ్మలపై
    కడుసుందర మొప్పు బ్రజల కళ్ళకు నెపుడున్

    రిప్లయితొలగించండి
  3. ఎక్కడి భూగో ళంబిది?
    ఎక్కడ అంగారకుండు?ఎక్కడ జలధుల్?
    అక్కడ జీవంబు గలదె?
    అక్కడ నీకేది హక్కు అచ్చుల యుడతా!
    కొరుప్రోలు రాధా కృష్ణ రావు

    రిప్లయితొలగించండి
  4. చంద్రమౌళి సూర్యనారాయణ గారూ,
    మీ పద్యం బాగున్నది. అభినందనలు.
    *
    సుబ్బారావు గారూ,
    మీ పద్యం బాగున్నది. అభినందనలు.
    *
    కొరుప్రోలు రాధాకృష్ణ రావు గారూ,
    మీ పద్యం బాగుంది. అభినందనలు.
    పద్యంలో (గ్రాంధిక వచనంలోను) అచ్చులను విసంధిగా ప్రయోగించడం మన సంప్రదాయం కాదు. మీ పద్యాన్ని అచ్చులు లేకుండా వ్రాయాలంటే...


    ఎక్కడి భూగోళం బిది?
    యెక్కడి యంగారకుడు? మఱెక్కడి సంద్రా?
    లక్కడ జీవంబు గలదె?
    యక్కడ నీ హక్కు గలదె యచ్చుల యుడతా!

    రిప్లయితొలగించండి
  5. ఏ ముని పొందును భువిలో
    నేమరకను జపముజేసి నీ వైభవమే
    రాముని ప్రేమకు గుర్తుల
    నే మరకలు వీపుపైన నిలచిన యుడుతా !

    రిప్లయితొలగించండి
  6. కడలికి వారధి గట్టగ
    వడివడిగా నీవు రాళ్ళు వార్ధిని వేయన్
    నొడలున రాముని గురుతులు
    కడు ప్రేమగ నీకు దక్కె ఘనమగు నుడతా!

    రిప్లయితొలగించండి
  7. అందరికీ వందనములు !
    అందరి పూరణలూ అలరింప నున్నవి !

    ఉడుత సాయము :

    01)
    _________________________________

    ఉడుత సాయమునకు మెచ్చి- యుద్ధరింప
    రామచంద్రుడు నిమిరినన్ - రమ్యమైన
    మూడు చారలవి యమరె - ముచ్చటగను !
    ఉడుత భాగ్యమది జనుల - కెటుల యబ్బు ?
    _________________________________

    రిప్లయితొలగించండి
  8. చెంగు చెంగున దుముకుచు చెట్లపైన
    పండ్లఁగాయల భుజియించి బ్రతుకు చుండు
    చూడ ముచ్చటఁ గొల్పుచుఁ జూపఱులకు
    నుల్లసము కలిగించు నా యుడత లెప్డు

    రిప్లయితొలగించండి
  9. సుందరమగు రూపమ్మున
    విందును కలిగించు మంచి వేగము తోడన్
    సందడిగా తిరుగు నుడుత
    పొందికగా తినుట చూడ ముచ్చట గొల్పున్!

    రిప్లయితొలగించండి
  10. శంకరయ్యగారూ
    రాధాకృష్ణారావుగారి పద్యాన్ని అంతగ మార్చకుండగనే,

    కం. ఎక్కడి భూగోళం బిది
    యెక్కడ నంగారకుండు నెక్కడ సంద్రా
    లక్కడ జీవము గలదే
    యక్కడ నీకేవి హక్కు లచ్చుల యుడతా!

    అని నా తిరుగవ్రాత. రకరకాలుగా ఒక పద్యంలో చిన్నచిన్నమార్పులు సుసాధ్యం అని కవిమిత్రుల గమనిక కోసమే వ్రాసాను గాని మరేమీ‌లేదు

    రిప్లయితొలగించండి
  11. మొన్నటి పద్య రచన:
    పోరునకు సిద్ధ మనగాఁ
    దీరినదీ కుక్కుటమ్ము ధీరత్వముతోన్
    నేరుగ పందెమ్మున నీ
    పౌరుషమే నుర్వి జనుల పాఠము సుమ్మా!
    నిన్నటి పద్య రచన :
    పావురములరావమ్ముల
    నీవవలోకించ నెంచ నేర్పరి వమ్మా!
    యావంత తిండి బెట్టిన
    సేవక విశ్వాసముంచి సేవించునవే!
    నేటి పద్యరచన :
    శాకాహారమె దినుచును
    శాఖలపై సంచరించు చక్కని యుడుతా!
    సాకారమయ్యె వీపున
    శ్రీకరు వేళ్ల గురుతులవె సేవలు మెచ్చన్!

    రిప్లయితొలగించండి