8, సెప్టెంబర్ 2014, సోమవారం

పద్యరచన - 670 (నిమజ్జనము)

కవిమిత్రులారా,
ఈనాటి పద్యరచనకు అంశము...

“నిమజ్జనము”

13 కామెంట్‌లు:

  1. బొజ్జగణపయ్య తరలు ని
    మజ్జన సమయంబునందు మనమున భక్తిన్
    సజ్జనులు చేసె నచ్చట
    గుజ్జు విరాట్టుని గొలువగ కోలాహలమున్

    రిప్లయితొలగించండి
  2. అంతా భ్రాంతియేనా
    ఈ జీవితానా బ్రతుకింతే నా !
    నాలుగు రోజుల బప్పా ముగిసేనా
    ఇక మోరీ నిమజ్జన గతియేనా !!

    జిలేబి

    రిప్లయితొలగించండి
  3. మట్టిలోనుండి పుట్టగ మహిమజూపి
    పూజలందిన కడు పుణ్య పురుషుడైన
    కడకు ప్రకృతిని తప్పక కలియుననుచు
    జనమునకు జెప్పు నీ నిమజ్జనము జూడ

    రిప్లయితొలగించండి
  4. యింట వెలసిన స్వామికి నెల్ల పత్రి
    పూజల సలిపి పండుగ భోజనమ్ముఁ
    బెట్టి మ్రొక్కులిడిరి భక్తి ప్రీతినికను
    గడప దాటనుత్సవమిది గణపతికిని.

    రిప్లయితొలగించండి
  5. చంద్రమౌళి సూర్యనారాయణ గారూ,
    మీ పద్యం బాగున్నది. అభినందనలు.
    ‘సజ్జనులు చేసి రచ్చట’ అనండి.
    *
    జిలేబీ గారూ,
    _/\_
    *
    గోలి హనుమచ్ఛాస్త్రి గారూ,
    చక్కని పద్యాన్ని రచించారు. అభినందనలు.
    *
    లక్ష్మీదేవి గారూ,
    మీ పద్యం బాగుంది. అభినందలు.
    పద్యాన్ని యడాగమంతో ప్రారంభించారు!

    రిప్లయితొలగించండి
  6. పరశుధరుని గీర్తించుచు
    జరిపెదరు నిమజ్జనమ్ము సంబరములతో
    శరణంచును సకల జనులు
    సురవందిత! నిన్ను గొలువ చూడుము దయతో!

    రిప్లయితొలగించండి
  7. శైలజ గారూ,
    మీ పద్యం బాగున్నది. అభినందనలు.

    రిప్లయితొలగించండి
  8. ఓం శ్రీ ద్వైమాత్రేయాయ నమః

    సుతుడవు కమ్మని కోరిన
    మతిమంతుడవైన నీవు మన్నన తోడన్
    గతమున గంగకు వరమిడు
    నతులే ధరణిని నిమజ్జన మహోత్సవముల్!

    రిప్లయితొలగించండి
  9. పదివేల రూపాల పార్వతీ తనయుండు
    శ్రీగణ నాధుండు శివము తాను
    పదివేల నామాలు పదివేల భావాలు
    శ్రీ బ్రహ్మ సృష్టి యై శివము తాను
    ఏ నామ మైన నూ ఏ భావ మైన నూ
    శ్రీ విష్ణు తేజమై శివము తాను
    నియమంబు పాటించి నిత్య పూజలు జేసి
    గణ నాధ నిను మేము గంగ జేర్చ
    సర్వ జనులకు శాంతము సత్య మగుచు
    దాని వలనను సౌ ఖ్యము ధర్మ పథము
    దాని వలనను రక్షణ దండి గాను
    మొదమోనరించు పూజలు మోక్ష పథము
    కొరుప్రోలు రాధ కృష్ణ రావు

    రిప్లయితొలగించండి
  10. గుండా వేంకట సుబ్బ సహదేవుడు గారూ,
    మీ పద్యం బాగున్నది. అభినందనలు.
    *
    కొరుప్రోలు రాధాకృష్ణ రావు గారూ,
    మీ పద్యం బాగున్నది. అభినందనలు.
    టైపు పొరపాట్లు దొర్లుతున్నయి. ఐననూ అని వ్యావహారికాన్ని ప్రయోగించారు. అక్కడ ‘ఐనను’ అంటే సరిపోతుంది.

    రిప్లయితొలగించండి
  11. శ్రీగురుభ్యోనమ:

    నోరార జయజయధ్వని
    లురూరా మారు మ్రోగ నుత్సాహమునన్
    గౌరీతనయు నిమజ్జన
    మౌరా యనిపించె జూడ నాంధ్రావనిలోన్

    రిప్లయితొలగించండి