8, సెప్టెంబర్ 2014, సోమవారం

నిర్వచన భారత గర్భ రామాయణము – 77


రావిపాటి లక్ష్మినారాయణ

రామాయణము-
ఆ.        (నేత, విడుము కుమతిని, విను సీతాజన
నంబు లంక చేటునకె సుమీ) సు
(నీతి వదల కిమ్ము నియతిచేతఁ, దగదు
నీకు మారు చెడుపని ధరలో)న. (౯౨)

భారతము-
కం.       నేత, విడుము కుమతిని, విను
సీతాజననంబు లంక చేటునకె సుమీ
నీతి వదల కిమ్ము నియతి
చేతఁ, దగదు నీకుమారు చెడుపని ధరలో. (౯౨)

టీక- కుమతి = (రా) దుష్టబుద్ధి, (భా) దుష్టబుద్ధియగు దుర్యోధనుని; నీకుమారు చెడుపని- (రా) నీకు, మారు = మన్మథుని, చెడుపని, (భా) నీ, కుమారుని = పుత్రుని, చెడుపని; సీతాజననంబు లంక చేటునకే = (భా) సామెత. అనఁగా దుర్యోధనుని జన్మము నీవంశనాశనమునకే యని ధ్వని; నేత = ప్రభూ.

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి