7, సెప్టెంబర్ 2014, ఆదివారం

పద్యరచన - 669 (గోడమీది పిల్లి)

కవిమిత్రులారా,
ఈనాటి పద్యరచనకు అంశము...
“గోడమీది పిల్లి”

13 కామెంట్‌లు:

  1. గోడమీది పిల్లి గుట్టుగ తానుండి
    మంచితరుణమునకు పొంచియుండు
    యెలుకఁ గాంచినంత నేమాత్రమాగక
    దూకునద్దరికిన్ దాని దొరకఁబట్టు

    రిప్లయితొలగించండి
  2. చంద్రమౌళి సూర్యనారాయణ గారూ,
    మీ పద్యం బాగుంది. అభినందనలు.
    మూడు పాదాలు ఆటవెలది, చివరిపాదం తేటగీతి అయింది. అర్ధరాత్రి వరకు నిద్రపోకుండా కవిత లల్లితే ఇలాగే ఉంటుంది. మీ సమస్యాపూరణలో చెప్పినట్లు కార్యాలయంలో పని ఎగ్గొట్టి కవిత లల్లడమే మంచిదేమో!
    చివరి పాదాన్ని ఇలా సవరిద్దాం...
    ‘దూకు నద్దరికిని దొరకఁబట్ట’

    రిప్లయితొలగించండి
  3. గోడకు నటునొక బల్లియు
    గోడకునిటు యెలుక కదలకున్నది హయ్యో !
    చూడగ నెటు దూకవలెన్
    గోడకు పైనున్న పిల్లి గోడును కనరే !



    రిప్లయితొలగించండి
  4. నాగరాజు రవీందర్ గారూ,
    మీ పద్యం బాగున్నది. అభినందనలు.
    *
    గోలి హనుమచ్ఛాస్త్రి గారూ,
    మీ పద్యం బాగున్నది. అభినందనలు.

    రిప్లయితొలగించండి
  5. హహహ ... మాస్టారూ ... నిజమే ... అర్ధరాత్రి మహత్యం .... సవరణకు ధన్యవాదములు .....

    రిప్లయితొలగించండి
  6. శ్రీగురుభ్యోనమ:

    బ్రతుకు పథము నందు పలు సమస్యలనైన
    మంచి చెడ్డ లెంచి మసలవలయు
    గోడమీది పిల్లి కూనలకైనను
    రెండు విధములుండు లెక్క జూడ

    రిప్లయితొలగించండి
  7. శ్రీపతి శాస్త్రి గారూ,
    మీ పద్యం బాగున్నది. అభినందనలు.

    రిప్లయితొలగించండి
  8. అవనియందున నవినీతి యధికమయ్యె
    స్వార్థపరులు నాయకులుగా సాగు చుండ్రి
    దినమున కొక పార్టీలోన తిరిగి తిరిగి
    గోడమీది పిల్లులటుల నాడు చుండ్రి

    రిప్లయితొలగించండి
  9. అన్నపరెడ్డి సత్యనారాయణ రెడ్డి గారూ,
    మీ పద్యం బాగున్నది. అభినందనలు.

    రిప్లయితొలగించండి
  10. పూజ్యులు గురుదెవులు శంకరయ్య గారికి వందనములు
    పద్యరచనగోడ మీది పిల్లి
    గోడ మీది పిల్లి గొంతుక విప్పడు
    తప్పదనగ వచ్చి చెప్పు సాక్ష్య
    మైన,కప్పదాటు గానుమెప్పును గోరి
    నొప్పి కలుగ నీక తప్పు కొనును

    రిప్లయితొలగించండి
  11. పూజ్యులు గురుపూజ్యులు గురుదెవులు శంకరయ్య గారికి కె .ఈశ్వరప్పగారిపద్యము తెలుగు యా౦గ్ల మనుచు వెలిగెడి మనుజుల
    వెలుగు వీడి మసలు వేడుకట్లు
    గోడ మీది పిల్లికోర్కెలరీతిగా
    తెలుగు ఎగురుటాయె వెలుగు లేక

    రిప్లయితొలగించండి
  12. కెంబాయి తిమ్మాజీ రావు గారూ,
    మీ పద్యం బాగున్నవి. అభినందనలు.
    *
    కె. ఈశ్వరప్ప గారూ,
    మీ పద్యం బాగున్నది. అభినందనలు.

    రిప్లయితొలగించండి
  13. తమరి సమర్థత నెరుగక
    సమరంబున నెవరి వైపు సాగిన జయమో?
    భ్రమయో? యను సంశయమున
    విమర్శలవి గోడ మీద పిల్లుల జేయున్
    (సమరము=ఎన్నికలు)

    రిప్లయితొలగించండి