27, సెప్టెంబర్ 2014, శనివారం

పద్యరచన - 689

కవిమిత్రులారా,

పైచిత్రాన్ని పరిశీలించి తగిన పద్యము(ల)ను వ్రాయండి.

26 కామెంట్‌లు:

 1. వామ భాగపు చెవి దుద్దు వదులు కతన
  పెట్టు కొనసాగె జూ డుడు బిగువు గాను
  ముద్దు లొలికించు నందాల మోముతోడ
  కుందనపు బొమ్మ వలె యుండి యంద గించె

  రిప్లయితొలగించు
 2. సుభగి తనుమద్య మదిరాక్షి సుందరాంగి
  సిద్ధ మౌచుండె గృహమున చెన్నుగాను
  పోగులను ధరించు చునుండె ముదముతోడ
  పెనిమిటి గురించు తలచుచు పెండ్లికేగ

  రిప్లయితొలగించు
 3. అద్దము తానే నిన్నిక
  వద్దని పోపొమ్మననుచు పలుకకముందే
  ముద్దుల పతియే పిలువగ
  నొద్దికగా వెడలుమమ్మ నొప్పింపకయే.

  రిప్లయితొలగించు
 4. సుబ్బారావుగారూ, మీ పద్యము బాగుగనున్నది. అభినందనలు.
  ***
  అన్నపరెడ్డి సత్యనారాయణరెడ్డిగారూ, మీ పద్య మందముగ నున్నది. అభినందనలు.తను”ధ్య’, గురిం’చి’ టైపాటులచే "ద్య", "చు" యైనవి. గమనించఁగలరు.
  ***
  గోలి హనుమచ్ఛాస్త్రిగారూ, మీ పద్యము బాగుగనున్నది. అభినందనలు. "పొమ్మననుచు" రూపము సాధువుగ ననిపించుటలేదు. దానిని "పొమ్మటంచు"ననికాని, "పొమ్మనియని"యనికాని సవరింపఁగలరు.
  ***
  స్వస్తి.

  రిప్లయితొలగించు
 5. చంద్రమౌళి సూర్యనారాయణగారూ, తొలఁగించిన మీ పూరణనుఁ గాంచి, పొరపాటున వ్యాఖ్యానించుట మఱచితిని. మన్నింపఁగలరు.
  మీ కందపద్య మందముగ నున్నది. అభినందనలు. కాని, యిది అసంపూర్ణముగ నున్నదనియు, మఱొక పద్య మవసరమనియు ననిపించుచున్నది. పరిశీలింపుఁడు. స్వస్తి.

  రిప్లయితొలగించు
 6. గుండు మధుసూదన్ గారికి - గురువుగారి బాధ్యతలను మీబోటి పెద్దలు (కవిత్వంలో)పంచు కోవటం ముదావహం. మీ సవరణలకు సలహాలకు ధన్యవాదములు.

  రిప్లయితొలగించు
 7. దుద్దులు బెట్టుచు చెవులకు
  నద్దములో జూచుకొనుచు నాహ్లాదముగా!
  దిద్దిన తొడవు ల తళుకులు
  ముద్దుల మోమున మెరియగ ముదితయె మురిసెన్!

  రిప్లయితొలగించు
 8. శైలజ గారూ,
  మురిపాల ముదితను వర్ణిస్తూ చక్కని పద్యం చెప్పారు. అభినందనలు.

  రిప్లయితొలగించు
 9. సింగారించుచు జెవులకు
  బంగారపుటాభరణము వయ్యారముగన్
  చెంగావి రంగు దుస్తుల
  మంగళకరమైన మోము మనముల దోచెన్

  రిప్లయితొలగించు
 10. మధుసూదన్ గారూ ! చక్కని సవరణ సూచించిన మీకు ధన్యవాదములు..
  సవరణతో...


  అద్దము తానే నిన్నిక
  వద్దని పోపొమ్మటంచు పలుకకముందే
  ముద్దుల పతియే పిలువగ
  నొద్దికగా వెడలుమమ్మ నొప్పింపకయే.

  రిప్లయితొలగించు
 11. చంద్రమౌళి సూర్యనారాయణ గారూ,
  మీ పద్యం బాగున్నది. అభినందనలు.
  *
  గోలి హనుమచ్ఛాస్త్రి గారూ,
  సవరించిన మీ పద్యం బాగున్నది. అభినందనలు.

  రిప్లయితొలగించు
 12. బొట్టు పెట్టఁ జూడ!పూలు ముడవఁ జూడ!
  చెరఁగు జారు వేళ సిగ్గు జూడ!
  చెవికి కమ్మలనిడు సింగారమది జూడ!
  చెదర దెవరి మనము కుదురు లేక!

  రిప్లయితొలగించు
 13. mixpad-crack
  is one of the best end platforms for producing music with more attractive sound quality. However, it does provide the basics for controlling and tuning the pitch and the most natural way to use sound effects, including distortion, chorus, etc.
  freeprokeys

  రిప్లయితొలగించు
 14. adobe-photoshop-cc-crackcan be a program manufactured and made with it. This is greater to carry out the purposes of the processing of all the pictures and images. It comprises features that produce photo images.
  new crack

  రిప్లయితొలగించు
 15. I really enjoy reading your post about this Posting. This sort of clever work and coverage! Keep up the wonderful works guys, thanks for sharing Spyhunter Crack

  రిప్లయితొలగించు