కన్నవారును గాని కన్న బిడ్డలు గాని సహధర్మచారిణౌ సతియు గాని మిత్రులైననుగాని శత్రులైననుగాని యాప్తులౌ బంధువులైనగాని యాస్తి పాస్తులుగాని యైశ్వర్యములుగాని దాచిపెట్టినయట్టి ధనము గాని వస్తు వాహనములు పసిడిభూషణములు కోరికతోకొనుక్కొనిన గాని చచ్చి పోయినపుడు స్మశానమందున కట్టె పాడి మీద కాలునపుడు వెంటనేమిరావు యొంటిగ పోవలె నట్టి వాటి మీదనాశయేల
చంద్రమౌళి సూర్యనారాయణగారి పద్యం కన్నవారును గాని ..... సహధర్మచారిణౌ: సహధర్మచారిణి + ఔ అన్నచోట యడాగమం వస్తుంది. కాబట్టి సహధర్మచారిణియౌ అవుతున్నది. అందుచేత గణాలకోసం మరికొంత సవరించి సహధర్మచరి యైన సతియు గాని అనండి. కోరికతోకొనుక్కొనిన: ఇది గ్రంథభాషలో బాగుండదు. కోరికోరి విలుచుకొనిన గాని అనండి. ఈ విలుచుకొను అనే ప్రయోగం మీద కొంత సందిగ్థత ఉంది. అందుచేత కోరి సొమ్ములు పోసి కొన్న గాని అనండి సుఖంగా. స్మశానము కాదండి శ్మశానము. అదటుంచి ఈ జగణం అనేది ఇంద్రగణం కాదు గనుక ప్రయోగించలేము. ఈ పాదాన్ని చచ్చినంతనె శ్మశానవాటికయందు అని మార్చండి. వెంట నేమి రావు అన్నది మీరనుకొన్న అర్థానికి వ్యతిరేకమైన భావాన్నిస్తుంది. వెంటన్ ఏమి రావు? (అన్నీ వచ్చును అని). నిజానికి మీరు వెంట నేమియు రావు అనాలి కాని గణాలు కుదరవు మరి. అందుకని, వెంట నేమి వచ్చు నొంటిగ పోవలె అని పాదాన్ని సరిచేయండి. పద్యాంతంలో ఆశయేల అనటంకన్నా ఈపద్య ధోరణికి ఆశ విడచి అంటే మరింతగా అతుకుతుంది.
జిగురు సత్యనారాయణగారి పద్యం చనిపోయెనని వార్త ... అగునే యధికమౌ యశ్రుధార అన్నది సవరించి ఆగబో దధికమమౌ నశ్రుధార అనండి. యడాగమం సరికాదు. ఖంగుమనెడు వేళ అన్నది బాగానే ఉంది కాని పేలిపోయెడు వేళ అంటే మరింత బాగుంటుందేమో. ఖంగు అనేది లోహాలవిషయంలోనే వాడుతాము కదా. యిక మరలి పోవు అన్నది అన్వయం కాదు. ముందుగా నమ్మలేరు అన్నాం గద. అందుచేత ఐతే ఆశ మరలిపోవు అంటే అగుంటుంది. ఎత్తుగీతిలో మొదట బదులు కొంచెం గంభీరంగా తొలుత అని బంధువర్గమ్ము నకు తొల్త బాధతొలగు(తగ్గు) అనండి. మాయజాలం అన్నది పొసగదండి మాయాజాలం అనకతప్పదు. కాబట్టి సవరించి కాలగతి చూపు నొక యింద్ర జాలమిదియు అనండి. సవరణలటుంచి పద్యం అధ్బుతంగా ఉంది. హరిశ్చంద్రనాటకానికి తగిలించవచ్చును.
లక్ష్మీదేవిగారి పద్యం మరణవార్తను వినినంత.. చక్కగా ఉంది.
చంద్రమౌళి సూర్యనారాయణగారి పద్యం పగిలిన గుండెలన్... తాకుచుండగా కన్నా తాకునట్లుగా అంటే మరింతగా ఒప్పుతుంది. బాగుంది. చంపకమాలను శ్మశానంలో వేసారు!
గుండా సహదేవుడుగారి పద్యం మరణించిన తనవారిని.... బాగుంది సూటిగా. కాని ఇక్కడ అటులే అంటే ఎటులే? కాబట్టి అరకొర వైరాగ్య మొలుకు నటులాడరటే అనండి గొడవలేదు.
అన్నపురెడ్డి సత్యనారాయణగారి పద్యం బంధుమిత్రులు..... శాశ్వితము కాదండి శాశ్వతము. ఐదవ పాదం అర్థం కాలేదు.
శైలజగారి పద్యం జీవితమొక.. తృతీయపాదారంభం సరిగాదు నుగాగమంతో. రెండవ పాదాన్ని నకారంపొల్లుతో ముగించాం కదా. అందుకని, బంధువు మృతి తా అని ఆ పాదాన్ని ముగించి, మూడవదాన్ని నా వైరాగ్యము అని ప్రారంబించండి. చివరిపాదంకూడా మార్చాలి, గడుపు చుండు జీవుడు ధరలో అని. అప్పుడంతా సరిపోతుంది. లేకుంటే మొదట పద్యవిషయమైన శ్మశానవైరాగ్యం చూపటం లేదు.
శ్యామలీయం గారికి చాల చాలా ధన్యవాదములు. పద్యరచనలో తప్పటడుగులు వేస్తున్న నన్ను మీలాంటి వారు చిటికెన వేలునందించి నడిపిస్తున్నారు. మీ సహనానికి కృతజ్ఞుడిని.
కవిమిత్రులకు నమస్కృతులు. మిత్రుని అంత్యకర్మకు వెళ్ళి రావడం వల్ల ఈరోజు కూడా మీ పద్యాలను సమీక్షించలేకపోయను. మన్నించండి. పద్యా లందించిన మిత్రులందరికీ అభినందనలు. * శ్యామలరావు గారూ, శ్రమ తీసుకొని, సమయం కేటాయించి మిత్రుల పద్యాలను సమీక్షించి ఉచితసవరణలను సూచించిన మీ ఆంద్రపద్యకవిత్వాభిమానానికి జోహార్లు. ధన్యవాదాలు.
కన్నవారును గాని కన్న బిడ్డలు గాని
రిప్లయితొలగించండిసహధర్మచారిణౌ సతియు గాని
మిత్రులైననుగాని శత్రులైననుగాని
యాప్తులౌ బంధువులైనగాని
యాస్తి పాస్తులుగాని యైశ్వర్యములుగాని
దాచిపెట్టినయట్టి ధనము గాని
వస్తు వాహనములు పసిడిభూషణములు
కోరికతోకొనుక్కొనిన గాని
చచ్చి పోయినపుడు స్మశానమందున
కట్టె పాడి మీద కాలునపుడు
వెంటనేమిరావు యొంటిగ పోవలె
నట్టి వాటి మీదనాశయేల
చనిపోయెనను వార్త వినినట్టి వేళలో
రిప్లయితొలగించండి*****గమ్మున దానిని నమ్మ లేరు
చివరి స్నానంబును చేయించు వేళలో
*****కన్నీటి స్నానంబె గలుగు చుండు
నూకలు కొద్దిగ నోట పోసెడి వేళ
*****చివరి చూపిదియని చింత గలుగు
పాడెపై శవమును పండ బెట్టిన వేళ
*****బ్రతుకింతె యనిపించి బాధ గలుగు
నలుగురు మోయుచు నడిచెడి వేళలో
*****కన్నీరు కాలువై కారుచుండు
దింపుడు కళ్ళము తీర్చెడి వేళలో
*****లేదు నమ్మకమిక లేశమైన
కట్టెలపై బెట్టి కాల్చెడి వేళలో
*****ఆగునే యధికమౌ యశ్రుధార
కాలి కపాలమ్ము ఖంగుమనెడి వేళ
*****మరలి రాడని యిక మరలి పోవు
చుట్టు ప్రక్కల వారికి పట్టకుండు
బంధు వర్గమ్ముకు మొదట బాధ తగ్గు
పిదప వాని కుటుంబము కుదుట పడును
కాలము జరుపు ఘన మాయజాలమిదియె!!
బ్లాగుల్లో టపాల చౌర్యము
రిప్లయితొలగించండికౌపీన చోర కళా నైపుణ్యము
మనంబున నిర్లిప్తతా నిర్వేదము
'శ్మాష్'యాన వైరాగ్యము !!!
శుభోదయం
జిలేబి
మరణవార్తను వినినంత మానవులకు
రిప్లయితొలగించండిబ్రతుకలేమంచుఁ దోచును, బాధకలుగు.
చనెడు వారితో మనమును చనగలేమ
టంచు వైరాగ్యము విడుతురటు పిదపను.
పగిలిన గుండెలన్ నిలువ భార్యయు బిడ్డలు బంధుమిత్రులున్
రిప్లయితొలగించండిరగులును చిచ్చు కట్టెలకు రవ్వలు నింగిని తాకుచుండగా
వగచుచు నింటికే గెదరు భారముగా తమకంటనీటితో
తగలబడున్ శరీరమిక దాటును జీవుడు భూమియెల్లలన్
మరణించిన తనవారిని
రిప్లయితొలగించండిమరుభూమికిఁ జేర్చు వేళ మహిలో మనుజుల్
స్మరియించుచు పరమాత్మను
యరకొర వైరాగ్యపు మాట లాడుదు రటులే!
బంధు మిత్రులు మరణించ కందు తోడ
రిప్లయితొలగించండిజీవిత మశాశ్వితమనెడి చింతగలుగు
శుద్ధమగు జీవితముపైన శ్రద్ధగలుగు
పీనుగను పంపిన పిదప వెల్లివిరయు
స్వార్థము కడువే పెక్కురు జనులయందు
పుట్టు మనుజుడు తప్పక గిట్టు కత న
రిప్లయితొలగించండిచింత గూడదు దానికై సుంతయైన
జన్మ లుండును వ్యామోహ మున్న యెడల
జన్మ లేదాయె యుత్తమ జన్ము నకిల .
జీవిత మొక బుద్బుదమని
రిప్లయితొలగించండిభావమ్మును కలుగ జేయు పరమాత్మ మదిన్
నీవైరాగ్యము తొలగిన
జీవనమును గడుపు గాదె జీవులు ధరలో !!!
చంద్రమౌళి సూర్యనారాయణగారి పద్యం కన్నవారును గాని .....
రిప్లయితొలగించండిసహధర్మచారిణౌ: సహధర్మచారిణి + ఔ అన్నచోట యడాగమం వస్తుంది. కాబట్టి సహధర్మచారిణియౌ అవుతున్నది. అందుచేత గణాలకోసం మరికొంత సవరించి సహధర్మచరి యైన సతియు గాని అనండి.
కోరికతోకొనుక్కొనిన: ఇది గ్రంథభాషలో బాగుండదు. కోరికోరి విలుచుకొనిన గాని అనండి. ఈ విలుచుకొను అనే ప్రయోగం మీద కొంత సందిగ్థత ఉంది. అందుచేత కోరి సొమ్ములు పోసి కొన్న గాని అనండి సుఖంగా.
స్మశానము కాదండి శ్మశానము. అదటుంచి ఈ జగణం అనేది ఇంద్రగణం కాదు గనుక ప్రయోగించలేము. ఈ పాదాన్ని చచ్చినంతనె శ్మశానవాటికయందు అని మార్చండి.
వెంట నేమి రావు అన్నది మీరనుకొన్న అర్థానికి వ్యతిరేకమైన భావాన్నిస్తుంది. వెంటన్ ఏమి రావు? (అన్నీ వచ్చును అని). నిజానికి మీరు వెంట నేమియు రావు అనాలి కాని గణాలు కుదరవు మరి. అందుకని, వెంట నేమి వచ్చు నొంటిగ పోవలె అని పాదాన్ని సరిచేయండి.
పద్యాంతంలో ఆశయేల అనటంకన్నా ఈపద్య ధోరణికి ఆశ విడచి అంటే మరింతగా అతుకుతుంది.
జిగురు సత్యనారాయణగారి పద్యం చనిపోయెనని వార్త ...
అగునే యధికమౌ యశ్రుధార అన్నది సవరించి ఆగబో దధికమమౌ నశ్రుధార అనండి. యడాగమం సరికాదు.
ఖంగుమనెడు వేళ అన్నది బాగానే ఉంది కాని పేలిపోయెడు వేళ అంటే మరింత బాగుంటుందేమో. ఖంగు అనేది లోహాలవిషయంలోనే వాడుతాము కదా.
యిక మరలి పోవు అన్నది అన్వయం కాదు. ముందుగా నమ్మలేరు అన్నాం గద. అందుచేత ఐతే ఆశ మరలిపోవు అంటే అగుంటుంది.
ఎత్తుగీతిలో మొదట బదులు కొంచెం గంభీరంగా తొలుత అని బంధువర్గమ్ము నకు తొల్త బాధతొలగు(తగ్గు) అనండి.
మాయజాలం అన్నది పొసగదండి మాయాజాలం అనకతప్పదు. కాబట్టి సవరించి కాలగతి చూపు నొక యింద్ర జాలమిదియు అనండి.
సవరణలటుంచి పద్యం అధ్బుతంగా ఉంది. హరిశ్చంద్రనాటకానికి తగిలించవచ్చును.
లక్ష్మీదేవిగారి పద్యం మరణవార్తను వినినంత..
చక్కగా ఉంది.
చంద్రమౌళి సూర్యనారాయణగారి పద్యం పగిలిన గుండెలన్...
తాకుచుండగా కన్నా తాకునట్లుగా అంటే మరింతగా ఒప్పుతుంది.
బాగుంది. చంపకమాలను శ్మశానంలో వేసారు!
గుండా సహదేవుడుగారి పద్యం మరణించిన తనవారిని....
బాగుంది సూటిగా. కాని ఇక్కడ అటులే అంటే ఎటులే? కాబట్టి అరకొర వైరాగ్య మొలుకు నటులాడరటే అనండి గొడవలేదు.
అన్నపురెడ్డి సత్యనారాయణగారి పద్యం బంధుమిత్రులు.....
శాశ్వితము కాదండి శాశ్వతము. ఐదవ పాదం అర్థం కాలేదు.
సుబ్బారావుగారి పద్యం పుట్టు మనుజుడు...
సుంతయేని యనండి గంభీరంగా. మూడవపాదంలో ప్రాసయతి సరిగాలేదు. వ్యామోహజాడ్యమున్న అనండి సుబ్బరంగా.
శైలజగారి పద్యం జీవితమొక..
తృతీయపాదారంభం సరిగాదు నుగాగమంతో. రెండవ పాదాన్ని నకారంపొల్లుతో ముగించాం కదా. అందుకని, బంధువు మృతి తా అని ఆ పాదాన్ని ముగించి, మూడవదాన్ని నా వైరాగ్యము అని ప్రారంబించండి. చివరిపాదంకూడా మార్చాలి, గడుపు చుండు జీవుడు ధరలో అని. అప్పుడంతా సరిపోతుంది. లేకుంటే మొదట పద్యవిషయమైన శ్మశానవైరాగ్యం చూపటం లేదు.
గౌ.శ్రీ శ్యామలీయం గారికి ధన్యవాదాలు. సవరించిన పద్యం :
రిప్లయితొలగించండిమరణించిన తనవారిని
మరుభూమికిఁ జేర్చు వేళ మహిలో మనుజుల్
స్మరియించుచు పరమాత్మను
యరకొర వైరాగ్యమొలుకు నటులాడరటే!
శ్యామలీయం గారికి చాల చాలా ధన్యవాదములు. పద్యరచనలో తప్పటడుగులు వేస్తున్న నన్ను మీలాంటి వారు చిటికెన వేలునందించి నడిపిస్తున్నారు. మీ సహనానికి కృతజ్ఞుడిని.
రిప్లయితొలగించండిశ్యామలీయం గారి సవరణకు ధన్యవాదములు.
రిప్లయితొలగించండిఐదవ పాదం
వెల్లివిరియు/
స్వార్థము కడు వే(వేగముగను)పెక్కురు జనుల యందు
ఇప్పుడు చివరి పాదం యిలా మార్చాను.
వెల్లివిరియు/
స్వార్థము కడు వేగముగను జనులయందు
శ్యామలీయం గారు!
రిప్లయితొలగించండిధన్యవాదములు
రెప్ప పాటున ముగియుచు కప్ప బడును
రిప్లయితొలగించండియెట్టి ప్ర్ర్రాణుల జీవితాల్ మట్టి యందు
చెలగి నీటి బుడగలయి చితికి పోయి
పంచ భూతాల కలయు సమంచితముగ
నైన యాపేక్ష వదలునా మానవుండు!
కవిమిత్రులకు నమస్కృతులు.
రిప్లయితొలగించండిమిత్రుని అంత్యకర్మకు వెళ్ళి రావడం వల్ల ఈరోజు కూడా మీ పద్యాలను సమీక్షించలేకపోయను. మన్నించండి. పద్యా లందించిన మిత్రులందరికీ అభినందనలు.
*
శ్యామలరావు గారూ,
శ్రమ తీసుకొని, సమయం కేటాయించి మిత్రుల పద్యాలను సమీక్షించి ఉచితసవరణలను సూచించిన మీ ఆంద్రపద్యకవిత్వాభిమానానికి జోహార్లు. ధన్యవాదాలు.
మిత్రులు శంకరయ్యగారూ,
రిప్లయితొలగించండినాకు ఈ విషయంలో శ్రమ యేమీ లేదండీ. సమయం దొరకటమే కొంచెం ఇబ్బంది అవుతున్నది.